< ဣဗြိဏး 2 >
1 အတော ဝယံ ယဒ် ဘြမသြောတသာ နာပနီယာမဟေ တဒရ္ထမသ္မာဘိ ရျဒျဒ် အၑြာဝိ တသ္မိန် မနာံသိ နိဓာတဝျာနိ၊
౧అందుచేత మనం విన్న సంగతుల నుండి కొట్టుకుని పోకుండా వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టాలి.
2 ယတော ဟေတော ဒူတဲး ကထိတံ ဝါကျံ ယဒျမောဃမ် အဘဝဒ် ယဒိ စ တလ္လင်္ဃနကာရိဏေ တသျာဂြာဟကာယ စ သရွွသ္မဲ သမုစိတံ ဒဏ္ဍမ် အဒီယတ,
౨ఎందుకంటే దేవదూతలు పలికిన సందేశం నమ్మదగినదైతే, ప్రతి అతిక్రమానికీ అవిధేయతకూ న్యాయమైన శిక్ష కలిగితే,
3 တရှျသ္မာဘိသ္တာဒၖၑံ မဟာပရိတြာဏမ် အဝဇ္ဉာယ ကထံ ရက္ၐာ ပြာပ္သျတေ, ယတ် ပြထမတး ပြဘုနာ ပြောက္တံ တတော'သ္မာန် ယာဝတ် တသျ ၑြောတၖဘိး သ္ထိရီကၖတံ,
౩ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసి ఎలా తప్పించుకుంటాం? ఆ రక్షణను మొదటిగా ప్రభువే ప్రకటించాడు, దాన్ని విన్న వారి ద్వారా అది మనకు రుజువు అయింది.
4 အပရံ လက္ၐဏဲရဒ္ဘုတကရ္မ္မဘိ ရွိဝိဓၑက္တိပြကာၑေန နိဇေစ္ဆာတး ပဝိတြသျာတ္မနော ဝိဘာဂေန စ ယဒ် ဤၑွရေဏ ပြမာဏီကၖတမ် အဘူတ်၊
౪దేవుడు తన సూచకక్రియలు, అద్భుతాలు, అనేక రకాల గొప్ప గొప్ప కార్యాలు చేయడం ద్వారానూ, తన ఇష్ట ప్రకారం పంచి ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల ద్వారానూ దాన్ని నిర్ధారణ చేశాడు.
5 ဝယံ တု ယသျ ဘာဝိရာဇျသျ ကထာံ ကထယာမး, တတ် တေန် ဒိဝျဒူတာနာမ် အဓီနီကၖတမိတိ နဟိ၊
౫మేము మాట్లాడుతున్న ఆ రాబోయే లోకాన్ని దేవుడు దేవదూతల ఆధీనంలో ఉంచలేదు.
6 ကိန္တု ကုတြာပိ ကၑ္စိတ် ပြမာဏမ် ဤဒၖၑံ ဒတ္တဝါန်, ယထာ, "ကိံ ဝသ္တု မာနဝေါ ယတ် သ နိတျံ သံသ္မရျျတေ တွယာ၊ ကိံ ဝါ မာနဝသန္တာနော ယတ် သ အာလောစျတေ တွယာ၊
౬దీనికి ప్రతిగా ఒక వ్యక్తి ఒక చోట సాక్షమిస్తూ ఇలా అన్నాడు. “నువ్వు తలచుకోడానికి నరుడు ఎంతటి వాడు? నువ్వు పట్టించుకోడానికి నరపుత్రుడెవడు?
7 ဒိဝျဒတဂဏေဘျး သ ကိဉ္စိန် နျူနး ကၖတသ္တွယာ၊ တေဇောဂေါ်ရဝရူပေဏ ကိရီဋေန ဝိဘူၐိတး၊ သၖၐ္ဋံ ယတ် တေ ကရာဘျာံ သ တတ္ပြဘုတွေ နိယောဇိတး၊
౭నువ్వు అతణ్ణి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశావు. ఘనతా యశస్సులతో అతనికి కిరీటం పెట్టావు.
8 စရဏာဓၑ္စ တသျဲဝ တွယာ သရွွံ ဝၑီကၖတံ။ " တေန သရွွံ ယသျ ဝၑီကၖတံ တသျာဝၑီဘူတံ ကိမပိ နာဝၑေၐိတံ ကိန္တွဓုနာပိ ဝယံ သရွွာဏိ တသျ ဝၑီဘူတာနိ န ပၑျာမး၊
౮నువ్వు సమస్తాన్నీ అతనికి లోబరచి అతని పాదాల కింద ఉంచావు.” ఆయన సమస్తాన్నీ మానవాళి వశం చేశాడు. అతనికి వశం చేయకుండా దేన్నీ విడిచిపెట్టలేదు. కానీ ఇప్పుడు అన్నీ పూర్తిగా అతనికి వశం కావడం మనం ఇంకా చూడలేదు.
9 တထာပိ ဒိဝျဒူတဂဏေဘျော ယး ကိဉ္စိန် နျူနီကၖတော'ဘဝတ် တံ ယီၑုံ မၖတျုဘောဂဟေတောသ္တေဇောဂေါ်ရဝရူပေဏ ကိရီဋေန ဝိဘူၐိတံ ပၑျာမး, ယတ ဤၑွရသျာနုဂြဟာတ် သ သရွွေၐာံ ကၖတေ မၖတျုမ် အသွဒတ၊
౯అయితే దేవదూతలకంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసును చూస్తున్నాం. ఆయన తాను పొందిన హింసల ద్వారా మరణం ద్వారా ఘనతా యశస్సులతో కిరీటం పొందాడు. కాబట్టి ఇప్పుడు యేసు దేవుని కృప వలన ప్రతి మనిషి కోసమూ మరణాన్ని రుచి చూశాడు.
10 အပရဉ္စ ယသ္မဲ ယေန စ ကၖတ္သ္နံ ဝသ္တု သၖၐ္ဋံ ဝိဒျတေ ဗဟုသန္တာနာနာံ ဝိဘဝါယာနယနကာလေ တေၐာံ ပရိတြာဏာဂြသရသျ ဒုးခဘောဂေန သိဒ္ဓီကရဏမပိ တသျောပယုက္တမ် အဘဝတ်၊
౧౦ఎందుకంటే ఎవరి కోసం అన్నీ ఉనికిలో ఉన్నాయో, ఎవరి వలన సమస్తమూ కలుగుతున్నాయో ఆయన అనేకమంది కుమారులను మహిమకు తీసుకురావడం కోసం వారి రక్షణ కర్తను తాను పొందే బాధల ద్వారా సంపూర్ణుణ్ణి చేయడం దేవునికి సమంజసమే.
11 ယတး ပါဝကး ပူယမာနာၑ္စ သရွွေ ဧကသ္မာဒေဝေါတ္ပန္နာ ဘဝန္တိ, ဣတိ ဟေတေား သ တာန် ဘြာတၖန် ဝဒိတုံ န လဇ္ဇတေ၊
౧౧పరిశుద్ధులుగా అయ్యేవారికీ, వారిని పరిశుద్ధపరిచే వానికీ దేవుడే మూలం. కాబట్టి పరిశుద్ధ పరిచేవాడు తాను పరిశుద్ధపరిచే వారిని సోదరులని పిలవడానికి సంకోచించడు.
12 တေန သ ဥက္တဝါန်, ယထာ, "ဒျောတယိၐျာမိ တေ နာမ ဘြာတၖဏာံ မဓျတော မမ၊ ပရန္တု သမိတေ ရ္မဓျေ ကရိၐျေ တေ ပြၑံသနံ။ "
౧౨ఆయన, “నీ నామాన్ని నా సోదరులకు ప్రకటిస్తాను. సమాజం మధ్యలో నీ గురించి గానం చేస్తాను” అన్నాడు.
13 ပုနရပိ, ယထာ, "တသ္မိန် ဝိၑွသျ သ္ထာတာဟံ၊ " ပုနရပိ, ယထာ, "ပၑျာဟမ် အပတျာနိ စ ဒတ္တာနိ မဟျမ် ဤၑွရာတ်၊ "
౧౩ఇంకా, “నేను ఆయనలో నమ్మకముంచుతాను” అన్నాడు. ఇంకా “చూడు. నేనూ, దేవుడు నాకిచ్చిన పిల్లలూ” అనీ అన్నాడు.
14 တေၐာမ် အပတျာနာံ ရုဓိရပလလဝိၑိၐ္ဋတွာတ် သော'ပိ တဒွတ် တဒွိၑိၐ္ဋော'ဘူတ် တသျာဘိပြာယော'ယံ ယတ် သ မၖတျုဗလာဓိကာရိဏံ ၑယတာနံ မၖတျုနာ ဗလဟီနံ ကုရျျာတ္
౧౪కనుక దేవుని పిల్లలందరూ రక్తమాంసాలున్న వారు కాబట్టి యేసు కూడా ఆ రక్తమాంసాలు పంచుకున్నాడు. తద్వారా తన మరణం మూలంగా మరణ బలం ఉన్నవాణ్ణి అంటే సాతానును శక్తిహీనుడుగా చేసాడు.
15 ယေ စ မၖတျုဘယာဒ် ယာဝဇ္ဇီဝနံ ဒါသတွသျ နိဃ္နာ အာသန် တာန် ဥဒ္ဓါရယေတ်၊
౧౫మరణ భయంతో జీవిత కాలమంతా బానిసత్వంలో జీవిస్తున్న వారిని విడిపించడానికి ఆయన ఆ విధంగా చేశాడు.
16 သ ဒူတာနာမ် ဥပကာရီ န ဘဝတိ ကိန္တွိဗြာဟီမော ဝံၑသျဲဝေါပကာရီ ဘဝတီ၊
౧౬ఆయన కచ్చితంగా దేవదూతలకు సహాయం చేయడం లేదు. అబ్రాహాము సంతతి వారికే ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు.
17 အတော ဟေတေား သ ယထာ ကၖပါဝါန် ပြဇာနာံ ပါပၑောဓနာရ္ထမ် ဤၑွရောဒ္ဒေၑျဝိၐယေ ဝိၑွာသျော မဟာယာဇကော ဘဝေတ် တဒရ္ထံ သရွွဝိၐယေ သွဘြာတၖဏာံ သဒၖၑီဘဝနံ တသျောစိတမ် အာသီတ်၊
౧౭దైవ సంబంధమైన విషయాలపై నమ్మకమైన, కరుణ కలిగిన ప్రధాన యాజకుడిగా ఉండడానికీ, ప్రజల పాపాలకు క్షమాపణ సాధించడానికీ ఆయన తన సోదరుల్లో ఒకడిగా కావాల్సిన అవసరం వచ్చింది.
18 ယတး သ သွယံ ပရီက္ၐာံ ဂတွာ ယံ ဒုးခဘောဂမ် အဝဂတသ္တေန ပရီက္ၐာကြာန္တာန် ဥပကရ္တ္တုံ ၑက္နောတိ၊
౧౮ఆయన తానే బాధలు పొంది, శోధనల గుండా వెళ్ళాడు కాబట్టి శోధనలనెదుర్కొంటున్న వారికి సహాయం చేయడానికి సామర్ధ్యం కలిగి ఉన్నాడు.