< ကလသိနး 4 >
1 အပရဉ္စ ဟေ အဓိပတယး, ယူယံ ဒါသာန် ပြတိ နျာယျံ ယထာရ္ထဉ္စာစရဏံ ကုရုဓွံ ယုၐ္မာကမပျေကော'ဓိပတိး သွရ္ဂေ ဝိဒျတ ဣတိ ဇာနီတ၊
౧యజమానులారా, పరలోకంలో మీకు ఒక యజమాని ఉన్నాడని తెలుసుకోండి. మీ దాసుల పట్ల న్యాయమైన, సరైన దానిని చేయండి.
2 ယူယံ ပြာရ္ထနာယာံ နိတျံ ပြဝရ္တ္တဓွံ ဓနျဝါဒံ ကုရွွန္တသ္တတြ ပြဗုဒ္ဓါသ္တိၐ္ဌတ စ၊
౨ప్రార్థనలో నిలిచి ఉండండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ మెలకువగా ఉండండి.
3 ပြာရ္ထနာကာလေ မမာပိ ကၖတေ ပြာရ္ထနာံ ကုရုဓွံ,
౩దేవుని వాక్కు అయిన క్రీస్తు మర్మాన్ని బోధించడానికి దేవుడు నాకు పరిస్థితులను అనుకూలపరచాలని ప్రార్ధించండి. ఈ వాక్కు కారణంగానే నేను సంకెళ్ళ పాలయ్యాను.
4 ဖလတး ခြီၐ္ဋသျ ယန္နိဂူဎဝါကျကာရဏာဒ် အဟံ ဗဒ္ဓေါ'ဘဝံ တတ္ပြကာၑာယေၑွရော ယတ် မဒရ္ထံ ဝါဂ္ဒွါရံ ကုရျျာတ်, အဟဉ္စ ယထောစိတံ တတ် ပြကာၑယိတုံ ၑက္နုယာမ် ဧတတ် ပြာရ္ထယဓွံ၊
౪నేను బోధించాల్సిన విధంగా, స్పష్టంగా బోధించాలని నా కోసం ప్రార్ధించండి.
5 ယူယံ သမယံ ဗဟုမူလျံ ဇ္ဉာတွာ ဗဟိးသ္ထာန် လောကာန် ပြတိ ဇ္ဉာနာစာရံ ကုရုဓွံ၊
౫సంఘానికి బయట ఉన్నవారి విషయంలో జ్ఞానంతో మెలగండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.
6 ယုၐ္မာကမ် အာလာပး သရွွဒါနုဂြဟသူစကော လဝဏေန သုသွာဒုၑ္စ ဘဝတု ယသ္မဲ ယဒုတ္တရံ ဒါတဝျံ တဒ် ယုၐ္မာဘိရဝဂမျတာံ၊
౬మీ మాటలు ఎప్పుడూ కృపాసహితంగా ఉండాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండేలా చూసుకోండి. ఆ విధంగా మీరు ఎవరికి ఎలా జవాబివ్వాలో తెలుసుకోగలుగుతారు.
7 မမ ယာ ဒၑာက္တိ တာံ တုခိကနာမာ ပြဘော် ပြိယော မမ ဘြာတာ ဝိၑွသနီယး ပရိစာရကး သဟဒါသၑ္စ ယုၐ္မာန် ဇ္ဉာပယိၐျတိ၊
౭ప్రియమైన సోదరుడూ నమ్మకమైన సేవకుడూ ప్రభువులో నా సహదాసుడూ అయిన తుకికు నా సంగతులన్నీ మీకు చెబుతాడు.
8 သ ယဒ် ယုၐ္မာကံ ဒၑာံ ဇာနီယာတ် ယုၐ္မာကံ မနာံသိ သာန္တွယေစ္စ တဒရ္ထမေဝါဟံ
౮ప్రత్యేకించి మీకు మా విషయాలు తెలియజేయడానికీ మీ హృదయాలను ప్రోత్సహించడానికీ ఇతణ్ణి పంపిస్తున్నాను.
9 တမ် ဩနီၐိမနာမာနဉ္စ ယုၐ္မဒ္ဒေၑီယံ ဝိၑွသ္တံ ပြိယဉ္စ ဘြာတရံ ပြေၐိတဝါန် တော် ယုၐ္မာန် အတြတျာံ သရွွဝါရ္တ္တာံ ဇ္ဉာပယိၐျတး၊
౯ఇతనితో కూడా మీ ఊరివాడు, నమ్మకమైన ప్రియ సోదరుడు ఒనేసిమును మీ దగ్గరికి పంపుతున్నాను. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియపరుస్తారు.
10 အာရိၐ္ဋာရ္ခနာမာ မမ သဟဗန္ဒီ ဗရ္ဏဗ္ဗာ ဘာဂိနေယော မာရ္ကော ယုၐ္ဋနာမ္နာ ဝိချာတော ယီၑုၑ္စဲတေ ဆိန္နတွစော ဘြာတရော ယုၐ္မာန် နမသ္ကာရံ ဇ္ဉာပယန္တိ, တေၐာံ မဓျေ မာရ္ကမဓိ ယူယံ ပူရွွမ် အာဇ္ဉာပိတား သ ယဒိ ယုၐ္မတ္သမီပမ် ဥပတိၐ္ဌေတ် တရှိ ယုၐ္မာဘိ ရ္ဂၖဟျတာံ၊
౧౦నాతో కూడా చెరసాల్లో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు దగ్గర బంధువైన మార్కు మీకు అభివందనాలు చెబుతున్నారు. ఈ మార్కు “మీ దగ్గరికి వచ్చినప్పుడు చేర్చుకోండి” అని మిమ్మల్ని గతంలోనే ఆదేశించాను గదా.
11 ကေဝလမေတ ဤၑွရရာဇျေ မမ သာန္တွနာဇနကား သဟကာရိဏော'ဘဝန်၊
౧౧ఇంకా యూస్తు అనే పేరున్న యేసు కూడా మీకు అభివందనాలు చెబుతున్నాడు. వీరంతా సున్నతి పొందిన వర్గంలో ఉన్నవారు. వీరే దేవుని రాజ్యం కోసం నాకు జత పనివారు. వీరు నాకు ఆదరణగా ఉన్నారు.
12 ခြီၐ္ဋသျ ဒါသော ယော ယုၐ္မဒ္ဒေၑီယ ဣပဖြား သ ယုၐ္မာန် နမသ္ကာရံ ဇ္ဉာပယတိ ယူယဉ္စေၑွရသျ သရွွသ္မိန် မနော'ဘိလာၐေ ယတ် သိဒ္ဓါး ပူရ္ဏာၑ္စ ဘဝေတ တဒရ္ထံ သ နိတျံ ပြာရ္ထနယာ ယုၐ္မာကံ ကၖတေ ယတတေ၊
౧౨మీలో ఒకడూ క్రీస్తు యేసు సేవకుడూ అయిన ఎపఫ్రా మీకు అభివందనాలు చెబుతున్నాడు. దేవుని సంకల్పమంతటిలో మీరు సంపూర్ణులుగానూ నిశ్చయతగలిగి నిలకడగానూ ఉండాలని ఇతడు ఎప్పుడూ మీ కోసం తన ప్రార్థనలో పోరాటం చేస్తున్నాడు.
13 ယုၐ္မာကံ လာယဒိကေယာသ္ထိတာနာံ ဟိယရာပလိသ္ထိတာနာဉ္စ ဘြာတၖဏာံ ဟိတာယ သော'တီဝ စေၐ္ဋတ ဣတျသ္မိန် အဟံ တသျ သာက္ၐီ ဘဝါမိ၊
౧౩ఇతడు మీకోసం, లవొదికయ వారి కోసం, హియెరాపొలి వారి కోసం ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఇది ఇతని గూర్చి నా సాక్ష్యం.
14 လူကနာမာ ပြိယၑ္စိကိတ္သကော ဒီမာၑ္စ ယုၐ္မဘျံ နမသ္ကုရွွာတေ၊
౧౪ప్రియ వైద్యుడు లూకా, దేమా మీకు అభివందనాలు చెబుతున్నారు.
15 ယူယံ လာယဒိကေယာသ္ထာန် ဘြာတၖန် နုမ္ဖာံ တဒ္ဂၖဟသ္ထိတာံ သမိတိဉ္စ မမ နမသ္ကာရံ ဇ္ဉာပယတ၊
౧౫లవొదికయలో ఉన్న సోదరులకూ, నుంఫాకూ, ఆమె ఇంట్లో ఉన్న సంఘానికీ అభివందనాలు తెలియజేయండి.
16 အပရံ ယုၐ္မတ္သန္နိဓော် ပတြသျာသျ ပါဌေ ကၖတေ လာယဒိကေယာသ္ထသမိတာဝပိ တသျ ပါဌော ယထာ ဘဝေတ် လာယဒိကေယာဉ္စ ယတ် ပတြံ မယာ ပြဟိတံ တဒ် ယထာ ယုၐ္မာဘိရပိ ပဌျေတ တထာ စေၐ္ဋဓွံ၊
౧౬ఈ పత్రిక మీరు చదివాక లవొదికయలోని సంఘంలో చదివించండి. అలాగే నేను లవొదికయ సంఘానికి రాసి పంపిన పత్రికను మీరు తెప్పించుకుని చదవండి.
17 အပရမ် အာရ္ခိပ္ပံ ဝဒတ ပြဘော ရျတ် ပရိစရျျာပဒံ တွယာပြာပိ တတ္သာဓနာယ သာဝဓာနော ဘဝ၊
౧౭అలాగే, “ప్రభువులో నీకు అప్పగించిన సేవను నెరవేర్చడానికి జాగ్రతపడు” అని అర్ఖిప్పుతో చెప్పండి.
18 အဟံ ပေါ်လး သွဟသ္တာက္ၐရေဏ ယုၐ္မာန် နမသ္ကာရံ ဇ္ဉာပယာမိ ယူယံ မမ ဗန္ဓနံ သ္မရတ၊ ယုၐ္မာန် ပြတျနုဂြဟော ဘူယာတ်၊ အာမေန၊
౧౮పౌలు అనే నేను ఇక్కడ నా చేతి రాతతో మీకు అభివందనాలు తెలియజేస్తున్నాను. నా సంకెళ్ళను జ్ఞాపకం చేసుకోండి. కృప మీకు తోడై ఉండుగాక.