< ၁ တီမထိယး 6 >
1 ယာဝန္တော လောကာ ယုဂဓာရိဏော ဒါသား သန္တိ တေ သွသွသွာမိနံ ပူရ္ဏသမာဒရယောဂျံ မနျန္တာံ နော စေဒ် ဤၑွရသျ နာမ္န ဥပဒေၑသျ စ နိန္ဒာ သမ္ဘဝိၐျတိ၊
౧బానిసలుగా పని చేస్తున్న విశ్వాసులు వారి యజమానులను పూర్తి గౌరవానికి తగినవారుగా ఎంచాలి. ఆ విధంగా చేయడం వలన దేవుని నామమూ ఆయన బోధా దూషణకు గురి కాకుండా ఉంటాయి.
2 ယေၐာဉ္စ သွာမိနော ဝိၑွာသိနး ဘဝန္တိ တဲသ္တေ ဘြာတၖတွာတ် နာဝဇ္ဉေယား ကိန္တု တေ ကရ္မ္မဖလဘောဂိနော ဝိၑွာသိနး ပြိယာၑ္စ ဘဝန္တီတိ ဟေတေား သေဝနီယာ ဧဝ, တွမ် ဧတာနိ ၑိက္ၐယ သမုပဒိၑ စ၊
౨విశ్వాసులైన యజమానులు గల బానిసలైతే ఆ యజమానులు తమ సోదరులే కదా అని వారిని చిన్న చూపు చూడక, తాము సేవించేది తమ ప్రేమ పాత్రులైన విశ్వాసులనే అని ఇంకా బాగా వారికి సేవ చేయాలి. ఈ సంగతులు బోధిస్తూ వారిని హెచ్చరించు.
3 ယး ကၑ္စိဒ် ဣတရၑိက္ၐာံ ကရောတိ, အသ္မာကံ ပြဘော ရျီၑုခြီၐ္ဋသျ ဟိတဝါကျာနီၑွရဘက္တေ ရျောဂျာံ ၑိက္ၐာဉ္စ န သွီကရောတိ
౩ఎవరైనా మన ప్రభువైన యేసు క్రీస్తు ఆరోగ్యకరమైన ఉపదేశానికీ, దైవభక్తికి అనుగుణమైన బోధకూ సమ్మతించకుండా, దానికి భిన్నంగా బోధిస్తే
4 သ ဒရ္ပဓ္မာတး သရွွထာ ဇ္ဉာနဟီနၑ္စ ဝိဝါဒဲ ရွာဂျုဒ္ဓဲၑ္စ ရောဂယုက္တၑ္စ ဘဝတိ၊
౪వాడు గర్విష్టి. వాడికి ఏమీ తెలియదన్నమాట. వాడు తర్కాల్లో వాగ్వాదాల్లో నిమగ్నమై ఉంటాడు. ఫలితంగా అసూయ, కలహం, దూషణలు, అపోహలు కలుగుతాయి.
5 တာဒၖၑာဒ် ဘာဝါဒ် ဤရ္ၐျာဝိရောဓာပဝါဒဒုၐ္ဋာသူယာ ဘြၐ္ဋမနသာံ သတျဇ္ဉာနဟီနာနာမ် ဤၑွရဘက္တိံ လာဘောပါယမ် ဣဝ မနျမာနာနာံ လောကာနာံ ဝိဝါဒါၑ္စ ဇာယန္တေ တာဒၖၑေဘျော လောကေဘျသ္တွံ ပၖထက် တိၐ္ဌ၊
౫ఇంకా చెడిపోయిన మనసుతో అలాటి వారు సత్యం నుండి తొలగిపోయి దైవభక్తి ధనసంపాదన మార్గం అనుకుంటారు.
6 သံယတေစ္ဆယာ ယုက္တာ ယေၑွရဘက္တိး သာ မဟာလာဘောပါယော ဘဝတီတိ သတျံ၊
౬అయితే సంతృప్తితో కూడిన దైవభక్తి ఎంతో లాభకరం.
7 ဧတဇ္ဇဂတ္ပြဝေၑနကာလေ'သ္မာဘိး ကိမပိ နာနာယိ တတ္တယဇနကာလေ'ပိ ကိမပိ နေတုံ န ၑက္ၐျတ ဣတိ နိၑ္စိတံ၊
౭మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకు పోలేము.
8 အတဧဝ ခါဒျာနျာစ္ဆာဒနာနိ စ ပြာပျာသ္မာဘိး သန္တုၐ္ဋဲ ရ္ဘဝိတဝျံ၊
౮కాబట్టి అవసరమైన అన్నవస్త్రాలు కలిగి వాటితో తృప్తిగా ఉందాం.
9 ယေ တု ဓနိနော ဘဝိတုံ စေၐ္ဋန္တေ တေ ပရီက္ၐာယာမ် ဥန္မာထေ ပတန္တိ ယေ စာဘိလာၐာ မာနဝါန် ဝိနာၑေ နရကေ စ မဇ္ဇယန္တိ တာဒၖၑေၐွဇ္ဉာနာဟိတာဘိလာၐေၐွပိ ပတန္တိ၊
౯ధనవంతులు కావాలని ఆశించేవారు శోధనలో, ఉచ్చులో, బుద్ధిహీనమైన, హానికరమైన అనేక దురాశల్లో పడిపోతారు. అలాంటివి మనుషులను సంపూర్ణ పతనానికి నాశనానికీ గురిచేస్తాయి.
10 ယတော'ရ္ထသ္ပၖဟာ သရွွေၐာံ ဒုရိတာနာံ မူလံ ဘဝတိ တာမဝလမ္ဗျ ကေစိဒ် ဝိၑွာသာဒ် အဘြံၑန္တ နာနာက္လေၑဲၑ္စ သွာန် အဝိဓျန်၊
౧౦ఎందుకంటే ధనాశ అన్ని కీడులకూ మూలం. కొందరు డబ్బునాశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమపైకి తామే నానాబాధలు కుని తెచ్చుకున్నారు.
11 ဟေ ဤၑွရသျ လောက တွမ် ဧတေဘျး ပလာယျ ဓရ္မ္မ ဤၑွရဘက္တိ ရွိၑွာသး ပြေမ သဟိၐ္ဏုတာ က္ၐာန္တိၑ္စဲတာနျာစရ၊
౧౧దేవుని మనిషీ, నువ్వు మాత్రం వీటి నుండి పారిపో. నీతినీ, భక్తినీ, విశ్వాసాన్నీ, ప్రేమనూ, ఓర్పునూ, సాత్వీకాన్నీ సంపాదించుకోడానికి ప్రయాసపడు.
12 ဝိၑွာသရူပမ် ဥတ္တမယုဒ္ဓံ ကုရု, အနန္တဇီဝနမ် အာလမ္ဗသွ ယတသ္တဒရ္ထံ တွမ် အာဟူတော 'ဘဝး, ဗဟုသာက္ၐိဏာံ သမက္ၐဉ္စောတ္တမာံ ပြတိဇ္ဉာံ သွီကၖတဝါန်၊ (aiōnios )
౧౨విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడి, దేవుడు దేనిని పొందడానికి నిన్ను పిలిచాడో ఆ నిత్యజీవాన్ని చేపట్టు. దాని విషయంలో నువ్వు అనేకమంది ముందు మంచి సాక్ష్యం ఇచ్చావు. (aiōnios )
13 အပရံ သရွွေၐာံ ဇီဝယိတုရီၑွရသျ သာက္ၐာဒ် ယၑ္စ ခြီၐ္ဋော ယီၑုး ပန္တီယပီလာတသျ သမက္ၐမ် ဥတ္တမာံ ပြတိဇ္ဉာံ သွီကၖတဝါန် တသျ သာက္ၐာဒ် အဟံ တွာမ် ဣဒမ် အာဇ္ဉာပယာမိ၊
౧౩అంతటికీ జీవాధారమైన దేవుని ఎదుటా పొంతి పిలాతు ముందు సత్యాన్ని గూర్చి ధైర్యంగా సాక్షమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటా
14 ဤၑွရေဏ သွသမယေ ပြကာၑိတဝျမ် အသ္မာကံ ပြဘော ရျီၑုခြီၐ္ဋသျာဂမနံ ယာဝတ် တွယာ နိၐ္ကလင်္ကတွေန နိရ္ဒ္ဒေါၐတွေန စ ဝိဓီ ရက္ၐျတာံ၊
౧౪నువ్వు నిష్కళంకంగా, నిందారహితుడిగా ఈ ఆజ్ఞను గైకొనాలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు దీన్ని మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడలో ప్రత్యక్షమయ్యే వరకూ చేస్తుండాలి.
15 သ ဤၑွရး သစ္စိဒါနန္ဒး, အဒွိတီယသမြာဋ်, ရာဇ္ဉာံ ရာဇာ, ပြဘူနာံ ပြဘုး,
౧౫భాగ్యవంతుడు, ఎకైక శక్తిశాలి అయిన దేవుడు తగిన కాలంలో ఆ ప్రత్యక్షతను కనుపరుస్తాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు.
16 အမရတာယာ အဒွိတီယ အာကရး, အဂမျတေဇောနိဝါသီ, မရ္တ္တျာနာံ ကေနာပိ န ဒၖၐ္ဋး ကေနာပိ န ဒၖၑျၑ္စ၊ တသျ ဂေါ်ရဝပရာကြမော် သဒါတနော် ဘူယာသ္တာံ၊ အာမေန်၊ (aiōnios )
౧౬ఆయన మాత్రమే అమరత్వం కలిగి సమీపింప శక్యం గాని తేజస్సులో నివసిస్తున్నాడు. మనుషుల్లో ఎవరూ ఆయనను చూడలేదు, ఎవరూ చూడలేరు. ఆయనకు ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగు గాక. ఆమేన్. (aiōnios )
17 ဣဟလောကေ ယေ ဓနိနသ္တေ စိတ္တသမုန္နတိံ စပလေ ဓနေ ဝိၑွာသဉ္စ န ကုရွွတာံ ကိန္တု ဘောဂါရ္ထမ် အသ္မဘျံ ပြစုရတွေန သရွွဒါတာ (aiōn )
౧౭ఈ లోకంలోని ధనవంతులు గర్విష్టులు కాకూడదని ఆజ్ఞాపించు. వారు అస్థిరమైన ధనంపై నమ్మకం పెట్టుకోకుండా, అనుభవించడానికి సమస్తాన్నీ ధారాళంగా దయచేసే దేవునిలోనే నమ్మకం పెట్టుకోవాలని ఆజ్ఞాపించు. (aiōn )
18 ယော'မရ ဤၑွရသ္တသ္မိန် ဝိၑွသန္တု သဒါစာရံ ကုရွွန္တု သတ္ကရ္မ္မဓနေန ဓနိနော သုကလာ ဒါတာရၑ္စ ဘဝန္တု,
౧౮వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకుంటూ, రాబోయే కాలానికి తమ కోసం మంచి పునాది వేసుకోవాలనీ,
19 ယထာ စ သတျံ ဇီဝနံ ပါပ္နုယုသ္တထာ ပါရတြိကာမ် ဥတ္တမသမ္ပဒံ သဉ္စိနွန္တွေတိ တွယာဒိၑျန္တာံ၊
౧౯మేలు చేసేవారూ, మంచి పనులు అనే ధనం గలవారూ, ఔదార్యం గలవారూ, తమ ధనాన్ని ఇతరులతో పంచుకొనేవారుగా ఉండాలని వారికి ఆజ్ఞాపించు.
20 ဟေ တီမထိယ, တွမ် ဥပနိဓိံ ဂေါပယ ကာလ္ပနိကဝိဒျာယာ အပဝိတြံ ပြလာပံ ဝိရောဓောက္တိဉ္စ တျဇ စ,
౨౦తిమోతీ, ప్రభువు నీకు అప్పగించిన దాన్ని కాపాడుకుంటూ భక్తిలేని మాటలకూ, మూర్ఖపు వాదాలకూ దూరంగా ఉండు. కొందరు వాటిని జ్ఞానం అనుకుంటారు
21 ယတး ကတိပယာ လောကာသ္တာံ ဝိဒျာမဝလမ္ဗျ ဝိၑွာသာဒ် ဘြၐ္ဋာ အဘဝန၊ ပြသာဒသ္တဝ သဟာယော ဘူယာတ်၊ အာမေန်၊
౨౧కొందరు వాటిని మనఃపూర్వకంగా విశ్వసించి విశ్వాసం విషయంలో తప్పిపోయారు. కృప మీకు తోడై ఉండు గాక.