< ၁ တီမထိယး 4 >
1 ပဝိတြ အာတ္မာ သ္ပၐ္ဋမ် ဣဒံ ဝါကျံ ဝဒတိ စရမကာလေ ကတိပယလောကာ ဝဟ္နိနာင်္ကိတတွာတ္
౧పరిశుద్ధాత్మ స్పష్టంగా ఏమి చెబుతున్నాడంటే, చివరి రోజుల్లో కొంతమంది మోసగించే ఆత్మలనూ దయ్యాల బోధలనూ అనుసరించి విశ్వాసాన్ని వదిలేస్తారు.
2 ကဌောရမနသာံ ကာပဋျာဒ် အနၖတဝါဒိနာံ ဝိဝါဟနိၐေဓကာနာံ ဘက္ၐျဝိၑေၐနိၐေဓကာနာဉ္စ
౨ఈ మోసగాళ్ళు అబద్ధాలు చెపుతారు. వారికి వాత వేసిన మనస్సాక్షి ఉంది.
3 ဘူတသွရူပါဏာံ ၑိက္ၐာယာံ ဘြမကာတ္မနာံ ဝါကျေၐု စ မနာံသိ နိဝေၑျ ဓရ္မ္မာဒ် ဘြံၑိၐျန္တေ၊ တာနိ တု ဘက္ၐျာဏိ ဝိၑွာသိနာံ သွီကၖတသတျဓရ္မ္မာဏာဉ္စ ဓနျဝါဒသဟိတာယ ဘောဂါယေၑွရေဏ သသၖဇိရေ၊
౩వీరు వివాహాన్ని నిషేధిస్తారు. సత్యాన్ని తెలుసుకున్న విశ్వాసులు కృతజ్ఞతతో పుచ్చుకొనేలా దేవుడు సృష్టించిన ఆహార పదార్ధాల్లో కొన్ని తినకూడదని వీరు అంటారు.
4 ယတ ဤၑွရေဏ ယဒျတ် သၖၐ္ဋံ တတ် သရွွမ် ဥတ္တမံ ယဒိ စ ဓနျဝါဒေန ဘုဇျတေ တရှိ တသျ ကိမပိ နာဂြာဟျံ ဘဝတိ,
౪దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిదే. కృతజ్ఞతతో పుచ్చుకొన్నది ఏదీ నిషేధం కాదు.
5 ယတ ဤၑွရသျ ဝါကျေန ပြာရ္ထနယာ စ တတ် ပဝိတြီဘဝတိ၊
౫ఎందుకంటే దేవుని వాక్యమూ ప్రార్థనా దాన్ని పవిత్ర పరుస్తాయి.
6 ဧတာနိ ဝါကျာနိ ယဒိ တွံ ဘြာတၖန် ဇ္ဉာပယေသ္တရှိ ယီၑုခြီၐ္ဋသျောတ္တမ္း ပရိစာရကော ဘဝိၐျသိ ယော ဝိၑွာသော ဟိတောပဒေၑၑ္စ တွယာ ဂၖဟီတသ္တဒီယဝါကျဲရာပျာယိၐျသေ စ၊
౬ఈ సంగతులను సోదరులకు వివరించడం ద్వారా నీవు అనుసరించే విశ్వాస వాక్యాలతో మంచి ఉపదేశంతో ఎదుగుతూ క్రీస్తు యేసుకు మంచి సేవకుడివి అనిపించుకుంటావు.
7 ယာနျုပါချာနာနိ ဒုရ္ဘာဝါနိ ဝၖဒ္ဓယောၐိတာမေဝ ယောဂျာနိ စ တာနိ တွယာ ဝိသၖဇျန္တာမ် ဤၑွရဘက္တယေ ယတ္နး ကြိယတာဉ္စ၊
౭అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు వదిలేసి, దైవభక్తి విషయంలో నీకు నీవే సాధన చేసుకో.
8 ယတး ၑာရီရိကော ယတ္နး သွလ္ပဖလဒေါ ဘဝတိ ကိန္တွီၑွရဘက္တိရဲဟိကပါရတြိကဇီဝနယေား ပြတိဇ္ဉာယုက္တာ သတီ သရွွတြ ဖလဒါ ဘဝတိ၊
౮శరీర సాధనలో కొంత ప్రయోజనం ఉంది. కాని దైవభక్తిలో ప్రస్తుత జీవితానికీ రాబోయే జీవితానికీ కావలసిన వాగ్దానం ఉన్నందున అన్ని విషయాల్లో అది ఉపయోగకరంగా ఉంటుంది.
9 ဝါကျမေတဒ် ဝိၑွသနီယံ သရွွဲ ရ္ဂြဟဏီယဉ္စ ဝယဉ္စ တဒရ္ထမေဝ ၑြာမျာမော နိန္ဒာံ ဘုံဇ္မဟေ စ၊
౯ఈ సందేశం విశ్వసనీయమైనదీ పూర్తిగా అంగీకరించదగినదీ.
10 ယတော ဟေတေား သရွွမာနဝါနာံ ဝိၑေၐတော ဝိၑွာသိနာံ တြာတာ ယော'မရ ဤၑွရသ္တသ္မိန် ဝယံ ဝိၑွသာမး၊
౧౦మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసులకు ముక్తిప్రదాత అయిన సజీవ దేవుని మీదే మనం నిరీక్షణ పెట్టుకున్నాము. కాబట్టి చెమటోడ్చి పాటుపడుతున్నాం.
11 တွမ် ဧတာနိ ဝါကျာနိ ပြစာရယ သမုပဒိၑ စ၊
౧౧ఈ సంగతులు ఆదేశించి నేర్పు.
12 အလ္ပဝယၐ္ကတွာတ် ကေနာပျဝဇ္ဉေယော န ဘဝ ကိန္တွာလာပေနာစရဏေန ပြေမ္နာ သဒါတ္မတွေန ဝိၑွာသေန ၑုစိတွေန စ ဝိၑွာသိနာမ် အာဒရ္ၑော ဘဝ၊
౧౨నీ యౌవనాన్ని బట్టి ఎవరూ నిన్ను చులకన చేయనియ్యకు. మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో, విశ్వాసులకు ఆదర్శంగా ఉండు.
13 ယာဝန္နာဟမ် အာဂမိၐျာမိ တာဝတ် တွ ပါဌေ စေတယနေ ဥပဒေၑေ စ မနော နိဓတ္သွ၊
౧౩నేను వచ్చే వరకూ లేఖనాలను బహిరంగంగా చదవడంలో, హెచ్చరించడంలో, బోధించడంలో శ్రద్ధ వహించు.
14 ပြာစီနဂဏဟသ္တာရ္ပဏသဟိတေန ဘဝိၐျဒွါကျေန ယဒ္ဒါနံ တုဘျံ ဝိၑြာဏိတံ တဝါန္တးသ္ထေ တသ္မိန် ဒါနေ ၑိထိလမနာ မာ ဘဝ၊
౧౪పెద్దలు నీ మీద చేతులుంచినపుడు ప్రవచనం ద్వారా నీవు పొందిన ఆత్మ వరాన్ని నిర్లక్షం చేయవద్దు.
15 ဧတေၐု မနော နိဝေၑယ, ဧတေၐု ဝရ္တ္တသွ, ဣတ္ထဉ္စ သရွွဝိၐယေ တဝ ဂုဏဝၖဒ္ဓိး ပြကာၑတာံ၊
౧౫నీ అభివృద్ధి అందరికీ కనబడేలా వీటి మీద మనసు ఉంచి, వీటిని సాధన చెయ్యి.
16 သွသ္မိန် ဥပဒေၑေ စ သာဝဓာနော ဘူတွာဝတိၐ္ဌသွ တတ် ကၖတွာ တွယာတ္မပရိတြာဏံ ၑြောတၖဏာဉ္စ ပရိတြာဏံ သာဓယိၐျတေ၊
౧౬నీ గురించీ ఉపదేశం గురించీ జాగ్రత్త వహించు. వీటిలో నిలకడగా ఉండు. నీవు అలా చేసినప్పుడు నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు.