< প্রকাশিতং 4 >

1 ততঃ পরং মযা দৃষ্টিপাতং কৃৎৱা স্ৱর্গে মুক্তং দ্ৱারম্ একং দৃষ্টং মযা সহভাষমাণস্য চ যস্য তূরীৱাদ্যতুল্যো রৱঃ পূর্ৱ্ৱং শ্রুতঃ স মাম্ অৱোচৎ স্থানমেতদ্ আরোহয, ইতঃ পরং যেন যেন ভৱিতৱ্যং তদহং ৎৱাং দর্শযিষ্যে|
ఇదంతా జరిగాక నేను చూస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకంలో ఒక తలుపు తెరుచుకుని ఉంది. నేను ఇంతకు ముందు విన్న స్వరం భేరీ నాదంలా నాతో మాట్లాడుతుంటే విన్నాను. ఆ స్వరం, “పైకి రా. తరువాత జరగాల్సినవి నీకు చూపిస్తాను” అని పలికింది.
2 তেনাহং তৎক্ষণাদ্ আত্মাৱিষ্টো ভূৎৱা ঽপশ্যং স্ৱর্গে সিংহাসনমেকং স্থাপিতং তত্র সিংহাসনে একো জন উপৱিষ্টো ঽস্তি|
వెంటనే నేను ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళాను. అప్పుడు పరలోకంలో ఉన్న ఒక సింహాసనాన్నీ, ఆ సింహాసనంపై కూర్చున్న ఒక వ్యక్తినీ చూశాను.
3 সিংহাসনে উপৱিষ্টস্য তস্য জনস্য রূপং সূর্য্যকান্তমণেঃ প্রৱালস্য চ তুল্যং তৎ সিংহাসনঞ্চ মরকতমণিৱদ্রূপৱিশিষ্টেন মেঘধনুষা ৱেষ্টিতং|
అలా కూర్చున్న వ్యక్తి చూడడానికి సూర్యకాంత మణిలాగా కెంపులాగా ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ మరకతంలా ప్రకాశిస్తూ ఒక ఇంద్రధనుస్సు ఆవరించి ఉంది.
4 তস্য সিংহাসনে চতুর্দিক্ষু চতুর্ৱিংশতিসিংহাসনানি তিষ্ঠন্তি তেষু সিংহাসনেষু চতুর্ৱিংশতি প্রাচীনলোকা উপৱিষ্টাস্তে শুভ্রৱাসঃপরিহিতাস্তেষাং শিরাংসি চ সুৱর্ণকিরীটৈ র্ভূষিতানি|
ఆ సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు వేరే సింహాసనాలున్నాయి. వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వీరంతా తెల్లటి బట్టలు కట్టుకుని ఉన్నారు. వారి తలలపై బంగారు కిరీటాలున్నాయి.
5 তস্য সিংহাসনস্য মধ্যাৎ তডিতো রৱাঃ স্তনিতানি চ নির্গচ্ছন্তি সিংহাসনস্যান্তিকে চ সপ্ত দীপা জ্ৱলন্তি ত ঈশ্ৱরস্য সপ্তাত্মানঃ|
ఆ సింహాసనం నుండి మెరుపులు, శబ్దాలు, ఉరుములు వస్తున్నాయి. సింహాసనం ముందు ఏడు దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.
6 অপরং সিংহাসনস্যান্তিকে স্ফটিকতুল্যঃ কাচমযো জলাশযো ৱিদ্যতে, অপরম্ অগ্রতঃ পশ্চাচ্চ বহুচক্ষুষ্মন্তশ্চৎৱারঃ প্রাণিনঃ সিংহসনস্য মধ্যে চতুর্দিক্ষু চ ৱিদ্যন্তে|
ఆ సింహాసనం ఎదురుగా స్ఫటికంలాటి సముద్రంలాటిది ఉంది. ముందూ వెనకా కళ్ళు ఉన్న నాలుగు ప్రాణులు సింహాసనం చుట్టూ ఉన్నాయి.
7 তেষাং প্রথমঃ প্রাণী সিংহাকারো দ্ৱিতীযঃ প্রাণী গোৱাৎসাকারস্তৃতীযঃ প্রাণী মনুষ্যৱদ্ৱদনৱিশিষ্টশ্চতুর্থশ্চ প্রাণী উড্ডীযমানকুররোপমঃ|
మొదటి ప్రాణి సింహంలా ఉంది. రెండవది దూడలా ఉంది. మూడవ ప్రాణికి మనిషి ముఖంలాటి ముఖం ఉంది. నాలుగవ ప్రాణి ఎగురుతూ ఉన్న డేగలా ఉంది.
8 তেষাং চতুর্ণাম্ একৈকস্য প্রাণিনঃ ষট্ পক্ষাঃ সন্তি তে চ সর্ৱ্ৱাঙ্গেষ্ৱভ্যন্তরে চ বহুচক্ষুর্ৱিশিষ্টাঃ, তে দিৱানিশং ন ৱিশ্রাম্য গদন্তি পৱিত্রঃ পৱিত্রঃ পৱিত্রঃ সর্ৱ্ৱশক্তিমান্ ৱর্ত্তমানো ভূতো ভৱিষ্যংশ্চ প্রভুঃ পরমেশ্ৱরঃ|
ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”
9 ইত্থং তৈঃ প্রাণিভিস্তস্যানন্তজীৱিনঃ সিংহাসনোপৱিষ্টস্য জনস্য প্রভাৱে গৌরৱে ধন্যৱাদে চ প্রকীর্ত্তিতে (aiōn g165)
ఆ ప్రాణులు సింహాసనంపై కూర్చుని శాశ్వతంగా జీవిస్తున్న వాడికి ఘనత, కీర్తి, కృతజ్ఞతలూ సమర్పిస్తూ ఉన్నప్పుడు (aiōn g165)
10 ১০ তে চতুর্ৱিংশতিপ্রাচীনা অপি তস্য সিংহাসনোপৱিষ্টস্যান্তিকে প্রণিনত্য তম্ অনন্তজীৱিনং প্রণমন্তি স্ৱীযকিরীটাংশ্চ সিংহাসনস্যান্তিকে নিক্ষিপ্য ৱদন্তি, (aiōn g165)
౧౦ఆ ఇరవై నలుగురు పెద్దలూ సింహాసనంపై కూర్చున్న వాడి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేశారు. వారు శాశ్వతంగా జీవిస్తున్న వాడికి మొక్కి, (aiōn g165)
11 ১১ হে প্রভো ঈশ্ৱরাস্মাকং প্রভাৱং গৌরৱং বলং| ৎৱমেৱার্হসি সম্প্রাপ্তুং যৎ সর্ৱ্ৱং সসৃজে ৎৱযা| তৱাভিলাষতশ্চৈৱ সর্ৱ্ৱং সম্ভূয নির্ম্মমে||
౧౧“మా ప్రభూ, మా దేవా, నువ్వు ఘనత, కీర్తి, ప్రభావాలు పొందడానికి అర్హుడివి. ఎందుకంటే నువ్వు సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో ఉన్నాయి” అని చెబుతూ తమ కిరీటాలను ఆ సింహాసనం ముందు వేశారు.

< প্রকাশিতং 4 >