< ফিলিপিনঃ 3 >

1 হে ভ্রাতরঃ, শেষে ৱদামি যূযং প্রভাৱানন্দত| পুনঃ পুনরেকস্য ৱচো লেখনং মম ক্লেশদং নহি যুষ্মদর্থঞ্চ ভ্রমনাশকং ভৱতি|
చివరిగా, నా సోదరులారా, ప్రభువులో ఆనందించండి. ఈ విషయాలనే మీకు మరలా రాయడం నాకేమీ సమస్య కాదు. మీకది క్షేమకరం.
2 যূযং কুক্কুরেভ্যঃ সাৱধানা ভৱত দুষ্কর্ম্মকারিভ্যঃ সাৱধানা ভৱত ছিন্নমূলেভ্যো লোকেভ্যশ্চ সাৱধানা ভৱত|
కుక్కల విషయం జాగ్రత్త. చెడు పనులు చేసే వారి విషయం జాగ్రత్త. ఛేదించే ఆచారం పాటించే వారి విషయం జాగ్రత్త.
3 ৱযমেৱ ছিন্নৎৱচো লোকা যতো ৱযম্ আত্মনেশ্ৱরং সেৱামহে খ্রীষ্টেন যীশুনা শ্লাঘামহে শরীরেণ চ প্রগল্ভতাং ন কুর্ৱ্ৱামহে|
ఎందుకంటే, మనం దేవుని ఆత్మతో ఆరాధిస్తూ శరీరం మీద నమ్మకం పెట్టుకోకుండా క్రీస్తు యేసులో అతిశయిస్తున్నాము. మనమే అసలైన సున్నతి పొందిన వాళ్ళం.
4 কিন্তু শরীরে মম প্রগল্ভতাযাঃ কারণং ৱিদ্যতে, কশ্চিদ্ যদি শরীরেণ প্রগল্ভতাং চিকীর্ষতি তর্হি তস্মাদ্ অপি মম প্রগল্ভতাযা গুরুতরং কারণং ৱিদ্যতে|
చెప్పాలంటే, వాస్తవంగా నేనే శరీరాన్ని ఆధారం చేసుకోగలను. ఎవరైనా శరీరాన్ని ఆధారం చేసుకోవాలనుకుంటే నేను మరి ఎక్కువగా చేసుకోగలను.
5 যতোঽহম্ অষ্টমদিৱসে ৎৱক্ছেদপ্রাপ্ত ইস্রাযেল্ৱংশীযো বিন্যামীনগোষ্ঠীয ইব্রিকুলজাত ইব্রিযো ৱ্যৱস্থাচরণে ফিরূশী
ఎనిమిదవ రోజున సున్నతి పొందాను. ఇశ్రాయేలు జాతిలో పుట్టాను. బెన్యామీను గోత్రానికి చెందిన వాణ్ణి. హెబ్రీయుల్లో హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రం విషయంలో పరిసయ్యుణ్ణి.
6 ধর্ম্মোৎসাহকারণাৎ সমিতেরুপদ্রৱকারী ৱ্যৱস্থাতো লভ্যে পুণ্যে চানিন্দনীযঃ|
క్రైస్తవ సంఘాన్ని తీవ్రంగా హింసించాను. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో నిందారహితుడిని.
7 কিন্তু মম যদ্যৎ লভ্যম্ আসীৎ তৎ সর্ৱ্ৱম্ অহং খ্রীষ্টস্যানুরোধাৎ ক্ষতিম্ অমন্যে|
అయినా ఏవేవి నాకు లాభంగా ఉండేవో వాటిని క్రీస్తు కోసం పనికిరానివిగా ఎంచాను.
8 কিঞ্চাধুনাপ্যহং মৎপ্রভোঃ খ্রীষ্টস্য যীশো র্জ্ঞানস্যোৎকৃষ্টতাং বুদ্ধ্ৱা তৎ সর্ৱ্ৱং ক্ষতিং মন্যে|
వాస్తవంగా ఇప్పుడు మిగతా వాటన్నిటినీ నష్టంగా ఎంచుతున్నాను ఎందుకంటే నా ప్రభువైన యేసు క్రీస్తును ఎరగడమే ఎంతో శ్రేష్ఠమైన విషయం. ఆయనను బట్టి మిగతా వాటన్నిటినీ ఇష్టపూర్వకంగా తిరస్కరించాను. క్రీస్తును సంపాదించటానికి వాటిని చెత్తతో సమానంగా ఎంచాను.
9 যতো হেতোরহং যৎ খ্রীষ্টং লভেয ৱ্যৱস্থাতো জাতং স্ৱকীযপুণ্যঞ্চ ন ধারযন্ কিন্তু খ্রীষ্টে ৱিশ্ৱসনাৎ লভ্যং যৎ পুণ্যম্ ঈশ্ৱরেণ ৱিশ্ৱাসং দৃষ্ট্ৱা দীযতে তদেৱ ধারযন্ যৎ খ্রীষ্টে ৱিদ্যেয তদর্থং তস্যানুরোধাৎ সর্ৱ্ৱেষাং ক্ষতিং স্ৱীকৃত্য তানি সর্ৱ্ৱাণ্যৱকরানিৱ মন্যে|
ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.
10 ১০ যতো হেতোরহং খ্রীষ্টং তস্য পুনরুত্থিতে র্গুণং তস্য দুঃখানাং ভাগিৎৱঞ্চ জ্ঞাৎৱা তস্য মৃত্যোরাকৃতিঞ্চ গৃহীৎৱা
౧౦ఆయనను ఎరగడం అనే నీతిన్యాయాలు, ఆయన పునరుత్థాన శక్తి, ఆయన పొందిన హింసల్లో సహానుభవం, క్రీస్తు మూలంగా ఆయన మరణం పోలికలోకి మార్పు చెందడం కోసం, ఏ విధంగానైనా చనిపోయిన వారిలో నుండి నాకు పునరుత్థానం కలగాలని, కోరుతున్నాను.
11 ১১ যেন কেনচিৎ প্রকারেণ মৃতানাং পুনরুত্থিতিং প্রাপ্তুং যতে|
౧౧
12 ১২ মযা তৎ সর্ৱ্ৱম্ অধুনা প্রাপি সিদ্ধতা ৱালম্ভি তন্নহি কিন্তু যদর্থম্ অহং খ্রীষ্টেন ধারিতস্তদ্ ধারযিতুং ধাৱামি|
౧౨వీటన్నిటినీ ఇంకా నేను పొందలేదు కాబట్టి నేనింకా సంపూర్ణుణ్ణి కాదు. క్రీస్తు నన్ను దేనికోసమైతే పట్టుకున్నాడో దాన్ని నేను కూడా సొంతం చేసుకోవాలని నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను.
13 ১৩ হে ভ্রাতরঃ, মযা তদ্ ধারিতম্ ইতি ন মন্যতে কিন্ত্ৱেতদৈকমাত্রং ৱদামি যানি পশ্চাৎ স্থিতানি তানি ৱিস্মৃত্যাহম্ অগ্রস্থিতান্যুদ্দিশ্য
౧౩సోదరులారా, దాన్ని నేను ఇప్పటికే సాధించానని అనడం లేదు. అయితే ఒకటి మాత్రం చేస్తున్నాను. గతంలో జరిగిన దాన్ని మరచిపోయి, ముందున్న వాటి కోసం ప్రయాస పడుతున్నాను.
14 ১৪ পূর্ণযত্নেন লক্ষ্যং প্রতি ধাৱন্ খ্রীষ্টযীশুনোর্দ্ধ্ৱাৎ মাম্ আহ্ৱযত ঈশ্ৱরাৎ জেতৃপণং প্রাপ্তুং চেষ্টে|
౧౪క్రీస్తు యేసులో దేవుని ఉన్నతమైన పిలుపుకు సంబంధించిన బహుమతి కోసం గురి దగ్గరకే పరుగెత్తుతూ ఉన్నాను.
15 ১৫ অস্মাকং মধ্যে যে সিদ্ধাস্তৈঃ সর্ৱ্ৱৈস্তদেৱ ভাৱ্যতাং, যদি চ কঞ্চন ৱিষযম্ অধি যুষ্মাকম্ অপরো ভাৱো ভৱতি তর্হীশ্ৱরস্তমপি যুষ্মাকং প্রতি প্রকাশযিষ্যতি|
౧౫కాబట్టి విశ్వాసంలో దృఢంగా ఉన్న విశ్వాసులమైన మనం, అలానే ఆలోచించాలని ప్రోత్సహిస్తున్నాను. మరి ఏ విషయం గురించి అయినా, మీరు వేరొక విధంగా ఆలోచిస్తుంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.
16 ১৬ কিন্তু ৱযং যদ্যদ্ অৱগতা আস্মস্তত্রাস্মাভিরেকো ৱিধিরাচরিতৱ্য একভাৱৈ র্ভৱিতৱ্যঞ্চ|
౧౬ఏమైనా సరే, మనం ఇప్పటికే పొందిన అదే సత్యానికి అనుగుణంగా మనమంతా నడుచుకొందాము.
17 ১৭ হে ভ্রাতরঃ, যূযং মমানুগামিনো ভৱত ৱযঞ্চ যাদৃগাচরণস্য নিদর্শনস্ৱরূপা ভৱামস্তাদৃগাচারিণো লোকান্ আলোকযধ্ৱং|
౧౭సోదరులారా, మీరు నన్ను పోలి ప్రవర్తించండి. మమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నడుచుకునే వారిని జాగ్రత్తగా గమనించండి.
18 ১৮ যতোঽনেকে ৱিপথে চরন্তি তে চ খ্রীষ্টস্য ক্রুশস্য শত্রৱ ইতি পুরা মযা পুনঃ পুনঃ কথিতম্ অধুনাপি রুদতা মযা কথ্যতে|
౧౮చాలా మంది క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు కూడా దుఃఖంతో చెబుతున్నాను.
19 ১৯ তেষাং শেষদশা সর্ৱ্ৱনাশ উদরশ্চেশ্ৱরো লজ্জা চ শ্লাঘা পৃথিৱ্যাঞ্চ লগ্নং মনঃ|
౧౯నాశనమే వారి అంతం. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన వాటినే గొప్పగా చెప్పుకుంటున్నారు. లౌకిక విషయాల మీదే వారు మనసు ఉంచుతారు.
20 ২০ কিন্ত্ৱস্মাকং জনপদঃ স্ৱর্গে ৱিদ্যতে তস্মাচ্চাগমিষ্যন্তং ত্রাতারং প্রভুং যীশুখ্রীষ্টং ৱযং প্রতীক্ষামহে|
౨౦ఎందుకంటే మనం అయితే పరలోక పౌరులం. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు అక్కడ నుండే భూమి మీదికి వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నాం.
21 ২১ স চ যযা শক্ত্যা সর্ৱ্ৱাণ্যেৱ স্ৱস্য ৱশীকর্ত্তুং পারযতি তযাস্মাকম্ অধমং শরীরং রূপান্তরীকৃত্য স্ৱকীযতেজোমযশরীরস্য সমাকারং করিষ্যতি|
౨౧సమస్తాన్నీ ఏ శక్తితో ఆయన నియంత్రిస్తున్నాడో అదే శక్తితో మన బలహీనమైన దేహాలను తన మహిమగల దేహంలాగా మార్చి వేస్తాడు.

< ফিলিপিনঃ 3 >