< যাকূবঃ 3 >

1 হে মম ভ্রাতরঃ, শিক্ষকৈরস্মাভি র্গুরুতরদণ্ডো লপ্স্যত ইতি জ্ঞাৎৱা যূযম্ অনেকে শিক্ষকা মা ভৱত|
నా సోదరులారా, ఉపదేశకులమైన మనకు కఠినమైన తీర్పు ఉందని ఎరిగి మీలో ఎక్కువమంది ఉపదేశం చేసేవారుగా ఉండకండి.
2 যতঃ সর্ৱ্ৱে ৱযং বহুৱিষযেষু স্খলামঃ, যঃ কশ্চিদ্ ৱাক্যে ন স্খলতি স সিদ্ধপুরুষঃ কৃৎস্নং ৱশীকর্ত্তুং সমর্থশ্চাস্তি|
మనమందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తన మాటలలో తప్పిపోని వాడు లోపం లేనివాడుగా ఉండి తన శరీరాన్ని కూడా అదుపులో పెట్టుకోగలుగుతాడు.
3 পশ্যত ৱযম্ অশ্ৱান্ ৱশীকর্ত্তুং তেষাং ৱক্ত্রেষু খলীনান্ নিধায তেষাং কৃৎস্নং শরীরম্ অনুৱর্ত্তযামঃ|
గుర్రాలు మనకు లోబడడానికి దాని నోటికి కళ్ళెం పెట్టి, దాని శరీరం అంతా మనకు లోబడేలా చేస్తాం కదా!
4 পশ্যত যে পোতা অতীৱ বৃহদাকারাঃ প্রচণ্ডৱাতৈশ্চ চালিতাস্তেঽপি কর্ণধারস্য মনোঽভিমতাদ্ অতিক্ষুদ্রেণ কর্ণেন ৱাঞ্ছিতং স্থানং প্রত্যনুৱর্ত্তন্তে|
ఓడలు పెద్దవిగా ఉన్నా, బలమైన గాలులతో ముందుకు సాగుతున్నా, ఆ ఓడ నడిపేవాడు చిన్న చుక్కానితో దాన్ని తిప్పగలుగుతాడు.
5 তদ্ৱদ্ রসনাপি ক্ষুদ্রতরাঙ্গং সন্তী দর্পৱাক্যানি ভাষতে| পশ্য কীদৃঙ্মহারণ্যং দহ্যতে ঽল্পেন ৱহ্নিনা|
అలాగే, నాలుక శరీరంలో చిన్న భాగమే అయినా, ప్రగల్భాలు పలుకుతుంది. చిన్న నిప్పు రవ్వ ఎంత పెద్ద అడవిని తగల బెడుతుందో గమనించండి!
6 রসনাপি ভৱেদ্ ৱহ্নিরধর্ম্মরূপপিষ্টপে| অস্মদঙ্গেষু রসনা তাদৃশং সন্তিষ্ঠতি সা কৃৎস্নং দেহং কলঙ্কযতি সৃষ্টিরথস্য চক্রং প্রজ্ৱলযতি নরকানলেন জ্ৱলতি চ| (Geenna g1067)
నాలుక కూడా ఒక అగ్ని. పాప ప్రపంచం మన శరీరంలో అమర్చి ఉన్నట్టు అది ఉండి, శరీరమంతటినీ మలినం చేసి, జీవన మార్గాన్ని తగలబెడుతుంది. తరవాత నరకాగ్నికి గురై కాలిపోతుంది. (Geenna g1067)
7 পশুপক্ষ্যুরোগজলচরাণাং সর্ৱ্ৱেষাং স্ৱভাৱো দমযিতুং শক্যতে মানুষিকস্ৱভাৱেন দমযাঞ্চক্রে চ|
అన్ని రకాల అడవి మృగాలను, పక్షులను, పాకే ప్రాణులను, సముద్ర జీవులను మానవుడు తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు, తెచ్చుకున్నాడు కూడా.
8 কিন্তু মানৱানাং কেনাপি জিহ্ৱা দমযিতুং ন শক্যতে সা ন নিৱার্য্যম্ অনিষ্টং হলাহলৱিষেণ পূর্ণা চ|
కాని, మనుషుల్లో ఏ ఒక్కరూ నాలుకను ఆధీనంలో ఉంచుకోలేక పోతున్నారు. అది ఎడతెగని దుష్టత్వం. అది మరణం కలిగించే విషంతో నిండి ఉంది.
9 তযা ৱযং পিতরম্ ঈশ্ৱরং ধন্যং ৱদামঃ, তযা চেশ্ৱরস্য সাদৃশ্যে সৃষ্টান্ মানৱান্ শপামঃ|
నాలుకతో మన ప్రభువైన తండ్రిని స్తుతిస్తాం. అదే నాలుకతో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తాం.
10 ১০ একস্মাদ্ ৱদনাদ্ ধন্যৱাদশাপৌ নির্গচ্ছতঃ| হে মম ভ্রাতরঃ, এতাদৃশং ন কর্ত্তৱ্যং|
౧౦ఒకే నోటినుంచి స్తుతి, శాపం రెండూ బయటకు వస్తాయి. నా సోదరులారా, ఇలా ఉండకూడదు.
11 ১১ প্রস্রৱণঃ কিম্ একস্মাৎ ছিদ্রাৎ মিষ্টং তিক্তঞ্চ তোযং নির্গমযতি?
౧౧ఒకే ఊటలోనుంచి మంచి నీళ్ళు, చేదు నీళ్ళు, రెండూ ఊరుతాయా?
12 ১২ হে মম ভ্রাতরঃ, উডুম্বরতরুঃ কিং জিতফলানি দ্রাক্ষালতা ৱা কিম্ উডুম্বরফলানি ফলিতুং শক্নোতি? তদ্ৱদ্ একঃ প্রস্রৱণো লৱণমিষ্টে তোযে নির্গমযিতুং ন শক্নোতি|
౧౨నా సోదరులారా, అంజూరపు చెట్టుకు ఒలీవ పళ్ళు, ద్రాక్ష తీగెలకు అంజూరుపళ్ళు కాస్తాయా? అదేవిధంగా, ఉప్పునీటి ఊట నుంచి మంచి నీళ్ళు రావు.
13 ১৩ যুষ্মাকং মধ্যে জ্ঞানী সুবোধশ্চ ক আস্তে? তস্য কর্ম্মাণি জ্ঞানমূলকমৃদুতাযুক্তানীতি সদাচারাৎ স প্রমাণযতু|
౧౩మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి.
14 ১৪ কিন্তু যুষ্মদন্তঃকরণমধ্যে যদি তিক্তের্ষ্যা ৱিৱাদেচ্ছা চ ৱিদ্যতে তর্হি সত্যমতস্য ৱিরুদ্ধং ন শ্লাঘধ্ৱং নচানৃতং কথযত|
౧౪కాని, మీ హృదయంలో తీవ్రమైన అసూయ, శత్రుభావం ఉంటే, ప్రగల్భాలు పలుకుతూ సత్యానికి విరుద్ధంగా అబద్ధం ఆడకండి.
15 ১৫ তাদৃশং জ্ঞানম্ ঊর্দ্ধ্ৱাদ্ আগতং নহি কিন্তু পার্থিৱং শরীরি ভৌতিকঞ্চ|
౧౫ఇలాంటి జ్ఞానం పైనుంచి వచ్చింది కాదు. ఇది భూలోక సంబంధమైనది, ఆధ్యాత్మికం కానిది, సైతానుకు చెందింది.
16 ১৬ যতো হেতোরীর্ষ্যা ৱিৱাদেচ্ছা চ যত্র ৱেদ্যেতে তত্রৈৱ কলহঃ সর্ৱ্ৱং দুষ্কৃতঞ্চ ৱিদ্যতে|
౧౬ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి.
17 ১৭ কিন্তূর্দ্ধ্ৱাদ্ আগতং যৎ জ্ঞানং তৎ প্রথমং শুচি ততঃ পরং শান্তং ক্ষান্তম্ আশুসন্ধেযং দযাদিসৎফলৈঃ পরিপূর্ণম্ অসন্দিগ্ধং নিষ্কপটঞ্চ ভৱতি|
౧౭అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.
18 ১৮ শান্ত্যাচারিভিঃ শান্ত্যা ধর্ম্মফলং রোপ্যতে|
౧౮శాంతిని చేకూర్చేవారు శాంతితో విత్తనాలు చల్లినందువల్ల నీతి ఫలం దొరుకుతుంది.

< যাকূবঃ 3 >