< Осия 5 >
1 Слушайте это, священники, и внимайте, дом Израилев, и приклоните ухо, дом царя; ибо вам будет суд, потому что вы были западнею в Массифе и сетью, раскинутою на Фаворе.
౧యాజకులారా, నామాట వినండి. ఇశ్రాయేలు వంశమా, శ్రద్ధగా విను. రాజ వంశమా, విను. మీరు మిస్పా మీద ఉరిగా, తాబోరు మీద వలగా ఉన్నారు. కాబట్టి మీ అందరిపైకీ తీర్పు రాబోతున్నది.
2 Глубоко погрязли они в распутстве; но Я накажу всех их.
౨తిరుగుబాటుదారులు తీవ్రంగా వధ జరిగించారు. కాబట్టి నేను వారందరినీ శిక్షిస్తాను.
3 Ефрема Я знаю, и Израиль не сокрыт от Меня; ибо ты блудодействуешь, Ефрем, и Израиль осквернился.
౩ఎఫ్రాయిమును నేనెరుగుదును. ఇశ్రాయేలువారు నాకు తెలియని వారు కారు. ఎఫ్రాయిమూ, నీవు ఇప్పుడే వేశ్యవయ్యావు. ఇశ్రాయేలువారు మైలబడి పోయారు.
4 Дела их не допускают их обратиться к Богу своему, ибо дух блуда внутри них, и Господа они не познали.
౪వారు నా దగ్గరికి రాకుండా వారి క్రియలు అడ్డుపడుతున్నాయి. వారిలో వ్యభిచార మనసుంది. నన్ను, అంటే యెహోవాను వారు ఎరుగరు.
5 И гордость Израиля унижена в глазах их; и Израиль и Ефрем падут от нечестия своего; падет и Иуда с ними.
౫ఇశ్రాయేలు వారి గర్వం వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తున్నది. ఇశ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు తమ దోషంలో చిక్కుకుపోయి తొట్రుపడుతున్నారు. వారితోబాటు యూదావారు కూడా తొట్రిల్లుతున్నారు.
6 С овцами своими и волами своими пойдут искать Господа и не найдут Его: Он удалился от них.
౬వారు గొర్రెలను, ఎడ్లను తీసుకుని యెహోవాను వెదకబోతారు గాని, ఆయన వారికి కనబడడు. ఎందుకంటే ఆయన తనను మరుగు చేసుకున్నాడు.
7 Господу они изменили, потому что родили чужих детей; ныне новый месяц поест их с их имуществом.
౭వారు యెహోవాకు విశ్వాసఘాతకులయ్యారు. అక్రమ సంతానాన్ని కన్నారు. ఇక ఇప్పుడు వారి అమావాస్య పర్వదినాలు వారి పొలాలతో సహా వారిని మింగేస్తాయి.
8 Вострубите рогом в Гиве, трубою в Раме; возглашайте в Беф-Авене: за тобою, Вениамин!
౮గిబియాలో బాకా ఊదండి. రమాలో భేరీనాదం చెయ్యండి. “బెన్యామీనూ, మేము మీతో వస్తున్నాం” అని బేతావెనులో కేకలు పెట్టండి.
9 Ефрем сделается пустынею в день наказания; между коленами Израилевыми Я возвестил это.
౯శిక్షదినాన ఎఫ్రాయిము శిథిలమై పోతుంది. తప్పనిసరిగా జరగబోయే దాన్ని ఇశ్రాయేలీయుల గోత్రాల వారికి నేను తెలియజేస్తున్నాను.
10 Вожди Иудины стали подобны передвигающим межи: изолью на них гнев Мой, как воду.
౧౦యూదా వారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసేసే వారిలా ఉన్నారు. నీళ్లు ప్రవహించినట్టు నేను వారిపై నా ఉగ్రత కుమ్మరిస్తాను.
11 Угнетен Ефрем, поражен судом; ибо захотел ходить вслед суетных.
౧౧ఎఫ్రాయిమీయులు నలిగి పచ్చడైపోయారు. తీర్పు వల్ల వారు సమూల నాశనమయ్యారు. ఎందుకంటే వారు విగ్రహాలకు వంగి నమస్కరిస్తూ నడుచుకుంటున్నారు.
12 И буду как моль для Ефрема и как червь для дома Иудина.
౧౨ఎఫ్రాయిమీయుల పాలిట చెద పురుగులాగా, యూదావారికి కుళ్లిపోజేసే వ్యాధి లాగా నేను ఉంటాను.
13 И увидел Ефрем болезнь свою, и Иуда - свою рану, и пошел Ефрем к Ассуру, и послал к царю Иареву; но он не может исцелить вас и не излечит вас от раны.
౧౩తన వ్యాధిని ఎఫ్రాయిము చూశాడు. తన పుండును యూదా చూశాడు. ఎఫ్రాయిము అష్షూరీయుల దగ్గరికి వెళ్ళాడు. ఆ గొప్ప రాజు దగ్గరికి రాయబారులను పంపాడు. అయితే అతడు నిన్ను బాగు చేయలేకపోయాడు. నీ పుండు నయం చేయలేకపోయాడు.
14 Ибо Я как лев для Ефрема и как скимен для дома Иудина; Я, Я растерзаю и уйду; унесу, и никто не спасет.
౧౪ఎందుకంటే నేను ఎఫ్రాయిమీయులకు సింహం లాగా ఉంటాను. యూదావారికి కొదమ సింహం వలే ఉంటాను. నేనే వారిని చీల్చేసి వెళ్ళిపోతాను. నేనే వారిని తీసుకుపోతాను. వారిని విడిపించే వాడొక్కడు కూడా ఉండడు.
15 Пойду, возвращусь в Мое место, доколе они не признают себя виновными и не взыщут лица Моего.
౧౫వారు తమ దోషాన్ని ఒప్పుకుని నన్ను వెదికే వరకూ నేను నా చోటికి తిరిగి వెళ్ళను. తమ దురవస్థలో వారు నన్ను మనస్ఫూర్తిగా వెదికే సమయం దాకా నేను వదిలిపెట్టను.