< 1 Кроничь 14 >

1 Хирам, ымпэратул Тирулуй, а тримис соль луй Давид ши лемн де чедру ши чоплиторь де пятрэ ши тымпларь, сэ-й зидяскэ о касэ.
తూరు రాజు హీరాము దావీదు దగ్గరికి మనుషులను పంపాడు. దేవదారు మానులను, వడ్రంగి వాళ్ళను, తాపీ పనివారిని పంపాడు. వారు అతనికి ఒక ఇల్లు కట్టారు.
2 Давид а куноскут кэ Домнул ыл ынтэря ка ымпэрат ал луй Исраел ши кэ ымпэрэция луй с-а ынэлцат фоарте мулт дин причина попорулуй Сэу Исраел.
తన ప్రజలైన ఇశ్రాయేలీయుల కోసం యెహోవా అతని రాజ్యాన్ని ఉన్నత స్థితికి తెచ్చాడనీ, ఆయన తనను ఇశ్రాయేలీయుల మీద రాజుగా స్థిరపరిచాడనీ దావీదు గ్రహించాడు.
3 Давид а май луат невесте ши ла Иерусалим ши а май нэскут фий ши фийче.
తరువాత, యెరూషలేములో దావీదు మరి కొంతమంది స్త్రీలను పెళ్లి చేసుకుని ఇంకా కొడుకులనూ కూతుళ్ళనూ కన్నాడు.
4 Ятэ нумеле челор че и с-ау нэскут ла Иерусалим; Шамуа, Шобаб, Натан, Соломон,
యెరూషలేములో అతనికి పుట్టిన కొడుకుల పేర్లు, షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను,
5 Ибхар, Елишуа, Елфелет,
ఇభారు, ఏలీషూవ, ఎల్పాలెటు,
6 Нога, Нефег, Иафиа,
నోగహు, నెపెగు, యాఫీయ,
7 Елишама, Беелиада ши Елифелет.
ఎలీషామా, బెయెల్యెదా, ఎలీపేలెటు.
8 Филистений ау аузит кэ Давид фусесе унс ымпэрат песте тот Исраелул ши с-ау суит ку тоций сэ-л кауте. Давид а фост ынштиинцат де ачест лукру ши ле-а ешит ынаинте.
దావీదుకు ఇశ్రాయేలీయులందరి మీద రాజుగా అభిషేకం అయ్యిందని విని, ఫిలిష్తీయులందరూ దావీదును వెతికి పట్టుకోడానికి బయలుదేరారు. దావీదు ఆ సంగతి విని, వాళ్ళని ఎదుర్కోడానికి వెళ్ళాడు.
9 Филистений ау венит ши с-ау рэспындит ын валя рефаимицилор.
ఫిలిష్తీయులు వచ్చి రెఫాయీముల లోయలో ఉన్న ప్రజల మీద దాడి చేశారు.
10 Давид а ынтребат пе Думнезеу зикынд: „Сэ мэ суй ымпотрива филистенилор, ши ый вей да ын мыниле меле?” Ши Домнул й-а зис: „Суе-те ши-й вой да ын мыниле тале.”
౧౦“ఫిలిష్తీయుల మీద నేను దాడి చేస్తే నువ్వు వాళ్ళ మీద నాకు జయం ఇస్తావా?” అని దావీదు దేవుణ్ణి అడిగాడు. యెహోవా “వెళ్ళు, నేను వాళ్ళను నీకు అప్పగిస్తాను” అన్నాడు.
11 С-ау суит ла Баал-Перацим, унде Давид й-а бэтут. Апой а зис: „Думнезеу а рисипит пе врэжмаший мей прин мына мя ка пе ниште апе каре се скург.” Де ачея с-а дат локулуй ачестуя нумеле Баал-Перацим.
౧౧వాళ్ళు బయల్పెరాజీముకు వచ్చినప్పుడు దావీదు అక్కడ వాళ్ళను హతం చేసి “ఉధృతమైన వరద ప్రవాహపు తాకిడిలా దేవుడు నాచేత నా శత్రువులను నాశనం చేయించాడు” అన్నాడు. దాన్నిబట్టి ఆ స్థలానికి బయల్పెరాజీము అనే పేరు వచ్చింది.
12 Ей шь-ау лэсат аколо думнезеий, каре ау фост аршь ын фок, дупэ порунка луй Давид.
౧౨ఫిలిష్తీయులు తమ దేవుళ్ళను అక్కడే విడిచి పారిపోయారు. వాటన్నిటినీ తగలబెట్టమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
13 Филистений с-ау рэспындит дин ноу ын вале.
౧౩ఫిలిష్తీయులు మరొకసారి ఆ లోయ మీదికి దాడి చేశారు.
14 Давид а ынтребат ярэшь пе Думнезеу. Ши Думнезеу й-а зис: „Сэ ну те суй дупэ ей; ынтоарче-те де ла ей ши мерӂь асупра лор прин фаца дузилор.
౧౪దావీదు మళ్ళీ దేవుని దగ్గర మనవి చేశాడు. అందుకు దేవుడు “నువ్వు ముందు నుంచి కాకుండా, వెనుక నుంచి వాళ్ళ చుట్టూ తిరిగి వెళ్లి, కంబళిచెట్లకు ఎదురుగా ఉండు.
15 Кынд вей аузи ун вует де пашь ын вырфуриле дузилор, атунч сэ ешь ла луптэ, кэч Думнезеу мерӂе ынаинтя та, ка сэ батэ оастя филистенилор.”
౧౫కంబళి చెట్ల చిటారు కొమ్మల్లో కాళ్ళ చప్పుడు నీకు వినిపించగానే బయలుదేరి వాళ్ళ మీద దాడి చెయ్యి. ఆ చప్పుడు వినిపించినప్పుడు ఫిలిష్తీయుల సేనను హతం చెయ్యడానికి దేవుడు నీకు ముందుగా బయలుదేరి వెళ్ళాడని తెలుసుకో” అని చెప్పాడు.
16 Давид а фэкут кум ый порунчисе Думнезеу, ши оастя филистенилор а фост бэтутэ де ла Габаон пынэ ла Гезер.
౧౬దేవుడు తనకు చెప్పినట్టే దావీదు చేశాడు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల సైన్యాన్ని గిబియోను మొదలుకుని గెజెరు వరకూ తరిమి హతం చేశారు.
17 Файма луй Давид с-а рэспындит ын тоатэ цара ши Домнул л-а фэкут де темут пентру тоате нямуриле.
౧౭కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలీయుల ప్రాంతాలన్నిట్లో ప్రసిద్ధి అయింది. యెహోవా అన్యజనులందరికీ అతడంటే భయం కలిగించాడు.

< 1 Кроничь 14 >