< Psalmii 49 >

1 Mai marelui muzician, un psalm pentru fiii lui Core. Ascultați aceasta toate popoarele; deschideți urechea toți locuitorii lumii,
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
2 Deopotrivă cei de rând și cei înălțați, bogați și săraci împreună.
అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
3 Gura mea va vorbi despre înțelepciune și meditația inimii mele va fi cu pricepere.
నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
4 Îmi voi apleca urechea la parabolă, voi deschide vorba mea adâncă pe harpă.
ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
5 Pentru ce m-aș teme în zilele răului, când nelegiuirea călcâielor mele mă va înconjura?
నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
6 Cei ce se încred în averea lor și se fălesc cu mulțimea bogățiilor lor;
వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
7 Nimeni nu poate în niciun fel răscumpăra pe fratele său, nici să dea lui Dumnezeu răscumpărare pentru el,
వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
8 (Fiindcă răscumpărarea sufletului lor este prețioasă și încetează pentru totdeauna),
ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
9 Ca totuși să trăiască pentru totdeauna și să nu vadă putrezire.
ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
10 Pentru că el vede că oameni înțelepți mor, la fel prostul și neghiobul pier și își lasă averea altora.
౧౦వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
11 Gândul lor lăuntric este că le vor dăinui casele pentru totdeauna și locuințele lor din generație în generație; își numesc pământurile după numele lor.
౧౧వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
12 Cu toate acestea omul onorat nu dăinuiește, este ca animalele care pier.
౧౨కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
13 Această cale a lor este nebunia lor, totuși posteritatea lor le aprobă spusele. (Selah)
౧౩ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.
14 Sunt puși în mormânt ca oile; moartea se va hrăni din ei; și cei integri vor domni asupra lor dimineața; și frumusețea lor se va mistui în mormântul care este locuința lor. (Sheol h7585)
౧౪వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది. (Sheol h7585)
15 Dar Dumnezeu va răscumpăra sufletul meu din puterea mormântului, căci el mă va primi. (Selah) (Sheol h7585)
౧౫అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు. (Sheol h7585)
16 Nu te teme când cineva se îmbogățește, când crește gloria casei sale;
౧౬ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.
17 Căci nu va duce nimic cu el când moare, gloria sa nu va coborî după el.
౧౭ఎందుకంటే వాడు చనిపోయేటప్పుడు దేన్నీ తీసుకువెళ్ళడు. వాడి ప్రభావం వాడి వెంట దిగిపోదు.
18 Deși în timp ce a trăit și-a binecuvântat sufletul, și oamenii te vor lăuda când îți faci bine,
౧౮మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
19 El va merge la generația părinților săi; ei nu vor vedea niciodată lumină.
౧౯అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు.
20 Omul în onoare și fără înțelegere este ca animalele care pier.
౨౦ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు.

< Psalmii 49 >