< Luca 3 >
1 Și în anul al cincisprezecelea al domniei lui Tiberiu Cezar, Pontius Pilat fiind guvernator al Iudeii și Irod fiind tetrarh al Galileii și Filip, fratele lui, tetrarh al Ituriei și al regiunii Trachonitis și Lisanias, tetrarh al Abilenei,
౧సీజరు తిబెరియస్ పాలించిన పదిహేనవ సంవత్సరంలో పొంతి పిలాతు యూదయకు గవర్నర్. హేరోదు గలిలయకు చతుర్థాధికారి. అతని సోదరుడు ఫిలిప్పు ఇతూరయకూ, త్రకోనీతి ప్రాంతాలకూ పాలకుడు. లుసానియ అబిలేనే పరగణాకు రాష్ట్రాధికారి.
2 Ana și Caiafa fiind înalții preoți, cuvântul lui Dumnezeu a venit la Ioan, fiul lui Zaharia, în pustie.
౨అన్న, కయప ముఖ్య యాజకులు. అప్పుడు అరణ్యంలో ఉన్న జెకర్యా కుమారుడు యోహాను దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది.
3 Și a venit în tot ținutul din jurul Iordanului, predicând botezul pocăinței pentru iertarea păcatelor;
౩అతడు యొర్దాను నదీ ప్రాంతమంతా తిరుగుతూ పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపాన్ని సూచించే బాప్తిసాన్ని ప్రకటించాడు.
4 Așa cum este scris în cartea cuvintelor lui Isaia, profetul, spunând: Vocea unuia strigând în pustie: Pregătiți calea Domnului, faceți-i cărările drepte.
౪యెషయా ప్రవక్త వాక్కుల గ్రంథంలో ఇలా రాసి ఉంది, “అరణ్యంలో ఒక కేక వినిపిస్తున్నది. ప్రభువు కోసం దారి సిద్ధం చేయండి. ఆయన బాటలు తిన్నగా చేయండి.
5 Fiecare vale va fi umplută și fiecare munte și deal va fi coborât; și cea strâmbă va fi îndreptată și căile colțuroase vor fi netezite;
౫ప్రతి లోయనూ పూడ్చాలి. ప్రతి పర్వతాన్నీ, మెరకనూ పల్లం చేయాలి. వంకర దారులు సరి అవుతాయి. గరుకు బాటలు నునుపు అవుతాయి.
6 Și toată făptura va vedea salvarea lui Dumnezeu.
౬ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.”
7 Atunci a spus mulțimilor care ieșeau să fie botezate de el: Pui de vipere, cine v-a avertizat să fugiți de furia care vine?
౭అతడు తన దగ్గర బాప్తిసం పొందడానికి గుంపులు గుంపులుగా వచ్చిన వారితో, “సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత తప్పించుకొమ్మని మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు?
8 Faceți de aceea roade cuvenite de pocăință și nu începeți să spuneți în voi înșivă: Avem ca tată pe Avraam; fiindcă vă spun că Dumnezeu este în stare să ridice copii lui Avraam din aceste pietre.
౮పశ్చాత్తాపానికి తగిన ఫలాలు ఫలించండి. అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు. దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్తున్నాను.
9 Iar acum, securea chiar este înfiptă la rădăcina pomilor; de aceea fiecare pom care nu face rod bun este tăiat și aruncat în foc.
౯ఇప్పటికే చెట్ల వేరుకు గొడ్డలి ఆనించి ఉంది. కాబట్టి మంచి పళ్ళు కాయని ప్రతి చెట్టునూ నరికి మంటల్లో వేస్తాడు” అని చెప్పాడు.
10 Și mulțimea l-a întrebat, spunând: Atunci ce să facem?
౧౦అప్పుడు గుంపులో కొంతమంది, “అయితే మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
11 El a răspuns și le-a zis: Cel ce are două haine, să împartă celui ce nu are; și cel ce are mâncare, să facă la fel.
౧౧అతడు, “రెండు అంగీలు ఉన్నవాడు అసలు లేని వాడికి ఒకటి ఇవ్వాలి, భోజనం ఉన్నవాడు కూడా ఆలాగే చేయాలి” అని చెప్పాడు.
12 Atunci au venit și [niște] vameși să fie botezați și i-au spus: Învățătorule, ce să facem?
౧౨పన్ను వసూలు చేసే వారు కూడా బాప్తిసం పొందడానికి వచ్చి, “బోధకా, మేమేం చేయాలి?” అని అతన్ని అడిగారు.
13 Și le-a spus: Să nu stoarceți mai mult decât vă este rânduit.
౧౩అతడు, “మీరు వసూలు చేయాల్సిన దాని కంటే ఎక్కువ తీసుకోవద్దు” అని వారితో చెప్పాడు.
14 Și soldații la fel îl întrebau, spunând: Și noi ce să facem? Și le-a spus: Nu asupriți pe nimeni, nici să nu acuzați pe nedrept; și să fiți mulțumiți cu plățile voastre.
౧౪“మా సంగతేంటి? మేమేం చేయాలి?” అని కొంతమంది సైనికులు కూడా అడిగారు. “ఎవరి దగ్గర నుంచీ అక్రమంగా డబ్బు తీసుకోవద్దు. అన్యాయంగా ఎవరి మీదా నేరం మోపవద్దు. మీ జీతంతో తృప్తిపడండి” అని అతడు వారితో చెప్పాడు.
15 Și pe când poporul era în așteptare și toți cugetau în inimile lor despre Ioan, dacă este sau nu este el Cristosul,
౧౫క్రీస్తు కోసం ప్రజలు ఆశతో ఎదురు చూస్తూ, యోహానే క్రీస్తు అయి ఉంటాడని అని అందరూ లోలోపల అనుకుంటున్నారు.
16 Ioan a răspuns, zicând, tuturor: Eu într-adevăr vă botez cu apă; dar vine unul mai puternic decât mine, căruia nu sunt demn să îi dezleg cureaua sandalelor; el vă va boteza cu Duhul Sfânt și cu foc.
౧౬వారందరికీ యోహాను ఇలా జవాబిచ్చాడు, “నేను నీళ్లలో మీకు బాప్తిసమిస్తున్నాను, అయితే నాకన్నా శక్తి గలవాడు వస్తున్నాడు. ఆయన చెప్పులు విప్పడానికి కూడా నేను తగను. ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిసమిస్తాడు.
17 A cărui furcă este în mâna lui și își va curăța în întregime aria și va aduna grâul în grânarul său; dar pleava o va arde cu foc de nestins.
౧౭తన కళ్ళం బాగు చేయడానికి తూర్పారబట్టే ఆయన చేట ఆయన చేతిలో ఉంది. తన గిడ్డంగిలో గోదుమలు పోసి, పొట్టును ఆరిపోని మంటల్లో కాల్చివేస్తాడు.”
18 Și predica poporului multe alte lucruri, îndemnându-i.
౧౮అతడు ఇంకా చాలా మాటలు చెప్పి ప్రజలను హెచ్చరిస్తూ సువార్త ప్రకటించాడు.
19 Dar Irod, tetrarhul, fiind mustrat de el pentru Irodiada, soția fratelui său Filip și pentru toate relele pe care Irod le făcuse,
౧౯అయితే రాష్ట్రాధికారి హేరోదు చేసిన చెడు పనులన్నిటి విషయం, అతని సోదరుని భార్య హేరోదియ విషయం యోహాను అతన్ని మందలించాడు.
20 A mai adăugat peste toate și pe aceasta, că a închis pe Ioan în închisoare.
౨౦హేరోదు అంతవరకూ తాను చేసిన చెడ్డ పనులు చాలవన్నట్టు యోహానును బంధించి చెరసాలలో పెట్టాడు.
21 Și, după ce toți oamenii au fost botezați, s-a întâmplat că și Isus a fost botezat și rugându-se, cerul a fost deschis;
౨౧ప్రజలంతా బాప్తిసం పొందుతూ ఉన్నప్పుడు యేసు కూడా బాప్తిసం పొందాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నపుడు ఆకాశం తెరుచుకుంది.
22 Și Duhul Sfânt a coborât în chip trupesc ca un porumbel peste el și o voce a venit din cer, spunând: Tu ești Fiul meu preaiubit; în tine îmi găsesc toată plăcerea.
౨౨పరిశుద్ధాత్మ పావురం రూపంలో ఆయన మీదికి దిగి వచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినిపించింది. “నీవు నా ప్రియ కుమారుడివి. నీవంటే నాకెంతో ఆనందం.”
23 Și Isus începuse a fi cam de treizeci de ani când și-a început lucrarea, fiind (cum se presupunea) fiul lui Iosif, care era al lui Eli,
౨౩యేసు తన పని మొదలుపెట్టినప్పుడు ఆయన వయస్సు సుమారు ముప్ఫై సంవత్సరాలు. ఆయన యోసేపు కొడుకు (అని ప్రజలు ఎంచారు). యోసేపు హేలీ కొడుకు.
24 Care era al lui Matat, care era al lui Levi, care era al lui Melhi, care era al lui Iana, care era al lui Iosif,
౨౪హేలీ మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు. లేవి మెల్కీ కొడుకు.
25 Care era al lui Matatia, care era al lui Amos, care era al lui Naum, care era al lui Esli, care era al lui Nagai,
౨౫మెల్కీ యన్న కొడుకు. యన్న యోసేపు కొడుకు. యోసేపు మత్తతీయ కొడుకు. మత్తతీయ ఆమోసు కొడుకు. ఆమోసు నాహోము కొడుకు. నాహోము ఎస్లి కొడుకు. ఎస్లి నగ్గయి కొడుకు.
26 Care era al lui Maat, care era al lui Matatia, care era al lui Semei, care era al lui Iosif, care era al lui Iuda,
౨౬నగ్గయి మయతు కొడుకు. మయతు మత్తతీయ కొడుకు. మత్తతీయ సిమియ కొడుకు. సిమియ యోశేఖు కొడుకు. యోశేఖు యోదా కొడుకు.
27 Care era al lui Ioanan, care era al lui Resa, care era al lui Zorobabel, care era al lui Salatiel, care era al lui Neri,
౨౭యోదా యోహన్న కొడుకు. యోహన్న రేసా కొడుకు. రేసా జెరుబ్బాబెలు కొడుకు. జెరుబ్బాబెలు షయల్తీయేలు కొడుకు. షయల్తీయేలు నేరి కొడుకు.
28 Care era al lui Melhi, care era al lui Adi, care era al lui Cosam, care era al lui Elmodam, care era al lui Er,
౨౮నేరి మెల్కీ కొడుకు. మెల్కీ అద్ది కొడుకు. అద్ది కోసాము కొడుకు. కోసాము ఎల్మదాము కొడుకు. ఎల్మదాము ఏరు కొడుకు.
29 Care era al lui Iose, care era al lui Eliezer, care era al lui Iorim, care era al lui Matat, care era al lui Levi,
౨౯ఏరు యెహోషువ కొడుకు. యెహోషువ ఎలీయెజెరు కొడుకు. ఎలీయెజెరు యోరీము కొడుకు. యోరీము మత్తతు కొడుకు. మత్తతు లేవి కొడుకు.
30 Care era al lui Simeon, care era al lui Iuda, care era al lui Iosif, care era al lui Ionan, care era al lui Eliachim,
౩౦లేవి షిమ్యోను కొడుకు. షిమ్యోను యూదా కొడుకు. యూదా యోసేపు కొడుకు. యోసేపు యోనాము కొడుకు. యోనాము ఎల్యాకీము కొడుకు.
31 Care era al lui Melea, care era al lui Mena, care era al lui Matata, care era al lui Natan, care era al lui David,
౩౧ఎల్యాకీము మెలెయా కొడుకు. మెలెయా మెన్నా కొడుకు. మెన్నా మత్తతా కొడుకు. మత్తతా నాతాను కొడుకు. నాతాను దావీదు కొడుకు.
32 Care era al lui Isai, care era al lui Obed, care era al lui Boaz, care era al lui Salmon, care era al lui Naason,
౩౨దావీదు యెష్షయి కొడుకు. యెష్షయి ఓబేదు కొడుకు. ఓబేదు బోయజు కొడుకు. బోయజు శల్మాను కొడుకు. శల్మాను నయస్సోను కొడుకు.
33 Care era al lui Aminadab, care era al lui Aram, care era al lui Esrom, care era al lui Fares, care era al lui Iuda,
౩౩నయస్సోను అమ్మీనాదాబు కొడుకు. అమ్మీనాదాబు అద్మిను కొడుకు. అద్మిను అర్నీ కొడుకు. అర్నీ ఎస్రోము కొడుకు, ఎస్రోము పెరెసు కొడుకు. పెరెసు యూదా కొడుకు.
34 Care era al lui Iacob, care era al lui Isaac, care era al lui Avraam, care era al lui Tara, care era al lui Nahor,
౩౪యూదా యాకోబు కొడుకు. యాకోబు ఇస్సాకు కొడుకు. ఇస్సాకు అబ్రాహాము కొడుకు. అబ్రాహాము తెరహు కొడుకు. తెరహు నాహోరు కొడుకు.
35 Care era al lui Saruh, care era al lui Ragau, care era al lui Falec, care era al lui Eber, care era al lui Sala,
౩౫నాహోరు సెరూగు కొడుకు. సెరూగు రయూ కొడుకు. రయూ పెలెగు కొడుకు. పెలెగు హెబెరు కొడుకు. హెబెరు షేలహు కొడుకు.
36 Care era al lui Cainan, care era al lui Arpacșad, care era al lui Sem, care era al lui Noe, care era al lui Lameh,
౩౬షేలహు కేయినాను కొడుకు. కేయినాను అర్పక్షదు కొడుకు. అర్పక్షదు షేము కొడుకు. షేము నోవహు కొడుకు. నోవహు లెమెకు కొడుకు.
37 Care era al lui Matusala, care era al lui Enoh, care era al lui Iared, care era al lui Maleleel, care era al lui Cainan,
౩౭లెమెకు మెతూషెల కొడుకు. మెతూషెల హనోకు కొడుకు. హనోకు యెరెదు కొడుకు. యెరెదు మహలలేలు కొడుకు. మహలలేలు కేయినాను కొడుకు.
38 Care era al lui Enos, care era al lui Set, care era al lui Adam, care era al lui Dumnezeu.
౩౮కేయినాను ఎనోషు కొడుకు. ఎనోషు షేతు కొడుకు. షేతు ఆదాము కొడుకు. ఆదాము దేవుని కొడుకు.