< Leviticul 8 >
1 Și DOMNUL i-a vorbit lui Moise, spunând:
౧యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
2 Ia pe Aaron și pe fiii săi cu el și veșmintele și untdelemnul ungerii și un taur pentru ofranda pentru păcat și doi berbeci și un coș cu azime;
౨“నువ్వు అహరోనును, అతని కొడుకులను తీసుకు రా. వాళ్ళతో పాటు వాళ్ళ బట్టలూ, అభిషేకం చేయడానికి నూనే, పాపం కోసం బలి అర్పించడానికి ఒక ఎద్దూ, రెండు పొట్టేళ్ళూ, పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన ఒక బుట్టెడు రొట్టెలూ తీసుకు రా.
3 Și adună toată adunarea la ușa tabernacolului întâlnirii.
౩సమాజంలో ప్రజలందర్నీ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి సమకూర్చు.”
4 Și Moise a făcut precum DOMNUL i-a poruncit; și adunarea s-a strâns la ușa tabernacolului întâlnirii.
౪మోషే యెహోవా తనకు ఆదేశించినట్టుగా చేశాడు. సమాజంలో ప్రజలందరూ ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గరికి చేరుకున్నారు.
5 Și Moise a spus adunării: Acesta este lucrul pe care DOMNUL l-a poruncit să fie făcut.
౫అప్పుడు మోషే వాళ్ళందరితో “ఇలా చేయమని యెహోవా ఆజ్ఞాపించాడు” అన్నాడు.
6 Și Moise a adus pe Aaron și pe fiii săi și i-a spălat cu apă.
౬తరువాత మోషే అహరోనునూ, అతని కొడుకులనూ తీసుకు వచ్చి వాళ్లకి స్నానం చేయించాడు.
7 Și a pus tunica pe el și l-a încins cu brâul și l-a îmbrăcat cu mantia și a pus efodul pe el și l-a încins cu brâul efodului, lucrat iscusit, și l-a strâns cu acesta.
౭తరువాత అహరోనుకు చొక్కా తొడిగి, అతనికి నడికట్టు కట్టాడు. అంగీ ధరింపజేసి ఏఫోదుని వేశాడు. అందంగా అల్లిన నడికట్టుని ఏఫోదు పైగా వేసి బిగించి కట్టాడు.
8 Și a pus pieptarul pe el, de asemenea a pus în pieptar pe Urim și Tumim.
౮అతనికి వక్షపతకం కట్టి దానిలో ఊరీమును, తుమ్మీమును ఉంచాడు.
9 Și a pus mitra pe capul lui; de asemenea peste mitră, chiar peste partea ei dinainte, a pus placa din aur, sfânta coroană; precum DOMNUL i-a poruncit lui Moise.
౯అతనికి తలపాగా పెట్టాడు. ఆ పాగా ముందు భాగంలో పరిశుద్ధ కిరీటంలా బంగారు రేకుని ఉంచాడు. యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లుగా మోషే ఇదంతా చేశాడు.
10 Și Moise a luat untdelemnul ungerii și a uns tabernacolul și tot ce era în el și le-a sfințit.
౧౦తరువాత మోషే అభిషేకం చేయడానికి నూనె తీసుకున్నాడు. దానితో మందిరాన్నీ, మందిరంలో ఉన్న సమస్తాన్నీ అభిషేకించి వాటినన్నిటినీ శుద్ధీకరణం చేశాడు.
11 Și a stropit cu acesta de șapte ori peste altar și a uns altarul și toate vasele lui, deopotrivă ligheanul și piedestalul lui, pentru a le sfinți.
౧౧తరువాత ఆ నూనెలో కొంత బలిపీఠంపై ఏడుసార్లు చిలకరించాడు. బలిపీఠం దానికి సంబంధించిన పాత్రలను, గంగాళాన్నీ, దాని పీటనూ శుద్ధీకరణం చేసి వాటిని అభిషేకించాడు.
12 Și a turnat pe capul lui Aaron din untdelemnul ungerii și l-a uns, pentru a-l sfinți.
౧౨తరువాత అతడు ఆ అభిషేకం చేసే నూనెలో కొంత తీసి అహరోనుని ప్రతిష్టించడానికి అతని తల పైన పోసి అభిషేకించాడు.
13 Și Moise a adus pe fiii lui Aaron și a pus tunici pe ei și i-a încins cu brâie și a pus bonete pe ei, precum DOMNUL a poruncit lui Moise.
౧౩తరువాత మోషే యెహోవా తనకు ఆదేశించిన విధంగా అహరోను కొడుకులను తీసుకు వచ్చి వారికి పొడవాటి చొక్కాలు వేశాడు. వారికి నడికట్లు కట్టి, వారి తలల చుట్టూ నార బట్టలు కట్టాడు.
14 Și a adus taurul pentru ofranda pentru păcat; și Aaron și fiii săi și-au pus mâinile pe capul taurului pentru ofranda pentru păcat.
౧౪ఆ తరువాత మోషే పాపం కోసం బలి అర్పణ చేయడానికి ఒక కోడెదూడని తీసుకు వచ్చాడు. అహరోనూ అతని కొడుకులూ పాపం కోసం బలి అర్పణ కాబోతున్న ఆ కోడె దూడ తలపై తమ చేతులుంచారు.
15 Și l-a înjunghiat; și Moise a luat sângele și l-a pus pe coarnele altarului, de jur împrejur, cu degetul său, și a purificat altarul și a turnat sângele la baza altarului și l-a sfințit, pentru a face împăcare pe el.
౧౫మోషే దాన్ని వధించాడు. దాని రక్తాన్ని తీసి తన వేలితో బలిపీఠం కొమ్ములకి పూసి బలిపీఠాన్ని శుద్ధీకరించాడు. మిగిలిన రక్తాన్ని బలిపీఠం అడుగు భాగంలో కుమ్మరించాడు. మోషే దాని కోసం పరిహారం చేసి దాన్ని ప్రతిష్టించాడు.
16 Și a luat toată grăsimea care era pe măruntaie și lobul de pe ficat și cei doi rinichi și grăsimea lor și Moise le-a ars pe altar.
౧౬అప్పుడు మోషే దాని లోపలి భాగాలపై ఉన్న కొవ్వునంతా తీసి వేరు చేశాడు. కాలేయం పైనున్న కొవ్వును తీశాడు. మూత్రపిండాలనూ వాటిపైని కొవ్వునూ తీసి అంతా బలిపీఠంపై దహించాడు.
17 Dar taurul și pielea lui, carnea lui și balega lui, le-a ars cu foc în afara taberei; precum DOMNUL a poruncit lui Moise.
౧౭అయితే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టుగా మోషే ఆ కోడె దూడనూ, దాని చర్మాన్నీ, మాంసాన్నీ, పేడనూ శిబిరం బయట పూర్తిగా కాల్చివేశాడు.
18 Și a adus berbecul pentru ofranda arsă, și Aaron și fiii săi, și-au pus mâinile pe capul berbecului.
౧౮ఆ తరువాత మోషే దహనబలిగా ఒక పొట్టేలును తీసుకు వచ్చాడు. అహరోనూ, అతని కొడుకులూ ఆ పొట్టేలు తలపైన తమ చేతులుంచారు.
19 Iar el l-a înjunghiat; și Moise a stropit sângele peste altar, de jur împrejur.
౧౯అప్పుడు మోషే దాన్ని వధించిన తరువాత దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాడు.
20 Și a tăiat berbecul în bucăți; și Moise a ars capul și bucățile și grăsimea.
౨౦అతడు ఆ పొట్టేలును ముక్కలుగా చేసాడు. దాని తలనూ, ఆ ముక్కలనూ, కొవ్వునూ దహించాడు.
21 Și a spălat măruntaiele și picioarele în apă; și Moise a ars întregul berbec pe altar, acesta a fost un sacrificiu ars ca aromă dulce și ofrandă făcută prin foc DOMNULUI; precum DOMNUL a poruncit lui Moise.
౨౧అతడు దాని లోపలి భాగాలనూ, కాళ్ళనూ నీళ్ళతో కడిగి ఆ మొత్తం పొట్టేలును బలిపీఠంపై దహించాడు. అది దహనబలి. కమ్మటి సువాసనను అది కలగజేసింది. అది యెహోవా మోషేకి ఆజ్ఞాపించినట్టు అగ్నితో యెహోవాకు చేసిన బలి.
22 Și a adus celălalt berbec, berbecul consacrării, și Aaron și fiii săi și-au pus mâinile pe capul berbecului.
౨౨ఆ తరువాత మోషే రెండో పొట్టేలుని తీసుకు వచ్చాడు. ఇది అహరోనుని సేవకై ప్రతిష్టించడం కోసం. ప్రతిష్ట కోసమైన ఈ పొట్టేలు తల పైన అహరోనూ, అతని కొడుకులూ తమ చేతులుంచారు.
23 Iar el l-a înjunghiat; și Moise a luat din sângele acestuia și a pus pe vârful urechii drepte a lui Aaron și pe degetul mare de la mâna lui dreaptă și pe degetul mare de la piciorul lui drept.
౨౩మోషే దాన్ని వధించి దాని రక్తంలో కొంత తీసి, అహరోను కుడి చెవి తమ్మె పైనా, కుడిచేతి బొటన వేలి పైనా, కుడికాలి బొటన వేలి పైనా పూశాడు.
24 Și a adus pe fiii lui Aaron și Moise a pus din sânge pe vârful urechii lor drepte și pe degetul mare al mâinii lor drepte și pe degetul mare al piciorului lor drept; și Moise a stropit sângele peste altar, de jur împrejur.
౨౪మోషే అహరోను కొడుకులను కూడా తీసుకు వచ్చి కొంత రక్తాన్ని వారి కుడి చెవి తమ్మెల పైనా, కుడి చేతుల బొటనవేళ్ళ పైనా, కుడి కాళ్ళ బొటన వేళ్ళ పైనా పూసాడు. తరువాత మిగిలిన రక్తాన్ని బలిపీఠంకి అన్ని వైపులా చిమ్మాడు.
25 Și a luat grăsimea și noada și toată grăsimea care era pe măruntaie și lobul de pe ficat și cei doi rinichi și grăsimea lor și spata dreaptă;
౨౫తరువాత మోషే దాని కొవ్వునూ, కొవ్వు పట్టిన దాని తోకనూ, దాని అంతర్భాగాల పైని కొవ్వునూ, కాలేయం పైని కొవ్వునూ, రెండు మూత్ర పిండాలనూ, వాటి పైని కొవ్వునూ, కుడి తొడ భాగాన్నీ వేరు చేశాడు.
26 Și din coșul cu azime, care era înaintea DOMNULUI, a luat o turtă nedospită și o turtă unsă cu untdelemn și un biscuit, și le-a pus pe grăsime și pe spata dreaptă;
౨౬యెహోవా సమక్షంలో పొంగజేసే పదార్ధం లేకుండా చేసిన రొట్టెలతో ఉన్న బుట్టలో నుండి ఒక రొట్టెనూ, నూనె రాసి చేసిన ఒక రొట్టెనూ, ఒక అప్పడాన్నీ తీసి వాటిని కొవ్వు పైనా, కుడి తొడ భాగం పైనా పెట్టాడు.
27 Și el a pus toate pe mâinile lui Aaron și pe mâinile fiilor săi și le-a legănat ca ofrandă legănată înaintea DOMNULUI.
౨౭వాటిని అహరోను చేతుల్లోనూ, అతని కొడుకుల చేతుల్లోనూ ఉంచి వాటిని యెహోవా సన్నిధిలో అర్పణగా పైకి ఎత్తి అటూఇటూ కదిలించి చూపాడు.
28 Și Moise le-a luat de pe mâinile lor și le-a ars pe altar peste ofranda arsă, ele au fost consacrări ca aromă dulce, aceasta este ofrandă făcută prin foc DOMNULUI.
౨౮తరువాత మోషే వాటిని వాళ్ళ చేతుల నుంచి తీసుకుని దహనబలిగా బలిపీఠం పైన దహించాడు. అవి ప్రతిష్టార్పణలు. అవి కమ్మటి సువాసన కలుగజేసాయి. అది యెహోవాకు అర్పించిన దహనబలి.
29 Și Moise a luat pieptul și l-a legănat ca ofrandă legănată înaintea DOMNULUI, căci din berbecul consacrării pieptul era partea lui Moise, precum DOMNUL a poruncit lui Moise.
౨౯తరువాత మోషే దాని రొమ్ము భాగాన్ని తీసుకుని దాన్ని కదలిక అర్పణగా యెహోవా సమక్షంలో పైకెత్తి కదిలించాడు. యాజకుణ్ణి ప్రతిష్టించే పనిలో యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు పొట్టేలులో అది మోషే వంతు.
30 Și Moise a luat din untdelemnul ungerii și din sângele care era pe altar, și l-a stropit pe Aaron și pe veșmintele lui și pe fiii săi și pe veșmintele fiilor săi, împreună cu el; și a sfințit pe Aaron și veșmintele lui, și pe fiii săi și veșmintele lor, împreună cu el.
౩౦తరువాత మోషే అభిషేకానికి ఉపయోగించే నూనెలో కొంత, బలిపీఠం పైని రక్తంలో కొంత తీసుకుని వాటిని అహరోను పైనా అతని బట్టల పైనా, అతని కొడుకుల పైనా, వాళ్ళ బట్టల పైనా చిలకరించాడు. ఆ విధంగా మోషే అహరోనునూ, అతని బట్టలనూ, అతని కొడుకులనూ, వాళ్ళ బట్టలనూ అభిషేకించాడు.
31 Și Moise le-a spus lui Aaron și fiilor săi: Fierbeți carnea la ușa tabernacolului întâlnirii; și acolo mâncați-o cu pâinea ce este în coșul consacrării, precum am poruncit eu, spunând: Aaron și fiii să o mănânce.
౩౧ఆ తరువాత మోషే అహరోనుతోనూ, అతని కొడుకులతోనూ ఇలా చెప్పాడు. “ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం దగ్గర ఆ మాంసాన్ని వండండి. దాన్నీ, బుట్టలో సేవా ప్రతిష్ట కోసం ఉంచిన రొట్టెనూ మీరు తినాలి. అహరోనూ, అతని కొడుకులూ దాన్ని తినాలి అని నేను ఆజ్ఞాపించినట్టు మీరు వాటిని తినాలి.
32 Și ceea ce rămâne din carne și din pâine să o ardeți cu foc.
౩౨మీరు తినగా మిగిలిన మాంసాన్నీ, రొట్టెనూ కాల్చివేయాలి.
33 Și să nu ieșiți pe ușa tabernacolului întâlnirii în cele șapte zile, până ce zilele consacrării voastre ajung la sfârșit, pentru că în șapte zile el vă va consacra.
౩౩మీ ప్రతిష్ఠ రోజులు ముగిసే వరకూ అంటే ఏడు రోజులు మీరు ప్రత్యక్ష గుడారం ప్రవేశ ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. ఆ ఏడు రోజులూ యెహోవా మిమ్మల్ని ప్రతిష్ట చేస్తాడు.
34 Precum a făcut el astăzi, astfel a poruncit DOMNUL să facem, pentru a face ispășire pentru voi.
౩౪ఈ రోజు ఎలా జరిగిందో మీ కోసం పరిహారం చేయడానికి అలాగే జరగాలని యెహోవా ఆజ్ఞాపించాడు.
35 De aceea să locuiți la ușa tabernacolului întâlnirii zi și noapte, șapte zile, și să păziți însărcinarea DOMNULUI, ca să nu muriți, pentru că așa îmi este poruncit.
౩౫మీరు ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు నిలిచి యెహోవా ఆజ్ఞలను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే యెహోవా నాకు అలా ఆజ్ఞ ఇచ్చాడు.”
36 Astfel Aaron și fiii săi au împlinit toate lucrurile pe care DOMNUL le-a poruncit prin mâna lui Moise.
౩౬కాబట్టి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినవన్నీ అహరోనూ, అతని కొడుకులూ చేశారు.