< Judecătorii 15 >
1 Dar s-a întâmplat după un timp, în zilele secerișului grâului, că Samson a vizitat-o pe soția sa cu un ied și a spus: Voi intra la soția mea în cameră. Dar tatăl ei nu i-a permis să intre.
౧కొన్ని రోజులైన తరువాత గోదుమ పంట కోత సమయంలో సంసోను ఒక మేకపిల్లను తీసుకుని తన భార్యను చూడటానికి వెళ్ళాడు. “నా భార్యను చూడటానికి ఆమె గదిలోకి వెళ్తాను” అనుకున్నాడు. కాని ఆమె తండ్రి అతణ్ణి లోపలికి వెళ్ళనివ్వలేదు.
2 Și tatăl ei a spus: Gândeam negreșit că o urăști de tot; de aceea am dat-o însoțitorului tău; nu este sora ei mai mică mai frumoasă decât ea? Te rog, ia-o pe ea în locul ei.
౨ఆమె తండ్రి “నువ్వు ఆమెను నిజంగా ద్వేషిస్తున్నావని అనుకున్నాను. అందుకే నీ స్నేహితునికి ఆమెను ఇచ్చాను. ఆమె చెల్లి ఆమె కంటే అందకత్తె గదా. ఆమెకు బదులుగా ఆమె చెల్లిని తీసుకో” అన్నాడు.
3 Și Samson a spus referitor la ei: Acum voi fi nevinovat față de filisteni, deși le voi face rău.
౩అప్పుడు సంసోను వారితో “ఈ సారి నేను ఫిలిష్తీయులకు కీడు చేసినా నిర్దోషి గానే ఉంటాను” అన్నాడు.
4 Și Samson a mers și a prins trei sute de vulpi și a luat tăciuni și le-a legat coadă de coadă și a pus un tăciune la mijloc între cele două cozi.
౪సంసోను అక్కడి నుంచి వెళ్లి మూడు వందల నక్కలను పట్టుకున్నాడు. రెండేసి నక్కల తోకలను ముడి పెట్టాడు. ఆ తోకల మధ్యలో ఒక్కో కాగడా కట్టి ఉంచాడు.
5 Și după ce a aprins cu foc tăciunii, le-a dat drumul în holdele filistenilor și a ars deopotrivă snopii și de asemenea grâul care stătea în picioare, împreună cu viile și măslinii.
౫ఆ కాగడాలను మండించి అవి మండుతుండగా ఆ నక్కలను ఫిలిష్తీయుల గోదుమ పొలాల్లోకి తరిమాడు. అవి ధాన్యం కుప్పలనూ, పైరునీ, ద్రాక్ష, ఒలీవ తోటలనూ తగులబెట్టాయి.
6 Atunci filistenii au spus: Cine a făcut aceasta? Și li s-a răspuns: Samson, ginerele timneanului, pentru că i-a luat soția și a dat-o însoțitorului său. Și filistenii s-au urcat și au ars-o cu foc pe ea și pe tatăl ei.
౬ఫిలిష్తీయులు “ఎవడు చేసాడిలా” అన్నారు. “తిమ్నాతు వాడి అల్లుడైన సంసోను చేశాడు. ఎందుకంటే సంసోను భార్యను ఆ తిమ్నాతు వాడు అతని స్నేహితుడికిచ్చాడు” అనే జవాబు వచ్చింది. అప్పుడు ఫిలిష్తీయులు వెళ్లి ఆమెనూ ఆమె తండ్రినీ సజీవ దహనం చేశారు.
7 Și Samson le-a spus: Pentru că ați făcut aceasta mă voi răzbuna față de voi și după aceea voi înceta.
౭అప్పుడు సంసోను “మీరు ఇలా చేశారు గనక, నేనూ మీ మీద పగ తీర్చుకునే దాకా ఊరుకోను” అని చెప్పాడు.
8 Și i-a lovit la șold și la coapse cu un mare măcel; și a coborât și a locuit în vârful stâncii Etam.
౮అతడు వారి తొడలనూ తుంటి ఎముకలనూ విరగగొట్టి ముక్కలు చేసి అనేకమందిని చంపేశాడు. ఆ తరువాత వెళ్లి ఏతాము బండ సందుల్లోని ఒక గుహలో నివసించాడు.
9 Atunci filistenii s-au urcat și au așezat tabăra în Iuda și s-au răspândit în Lehi.
౯అప్పుడు ఫిలిష్తీయులు యూదా దేశంపై యుద్ధం చేయడానికై లేహి అనే ప్రాంతంలో సైన్యాన్ని సమకూర్చారు.
10 Și bărbații din Iuda au spus: Pentru ce v-ați urcat împotriva noastră? Iar ei au răspuns: Ne-am urcat să îl legăm pe Samson, să îi facem cum ne-a făcut și el.
౧౦యూదాప్రజలు వారిని “మీరెందుకు మాపై యుద్ధం చేస్తున్నారు?” అని అడిగారు. దానికి ఫిలిష్తీయులు “సంసోనును పట్టుకోడానికే యుద్ధం చేస్తున్నాం. అతడు మాకు చేసినదానికి మేమూ బదులు తీర్చుకోవాలి” అన్నారు.
11 Atunci trei mii de bărbați din Iuda au mers pe vârful stâncii Etam și i-au spus lui Samson: Nu știi că filistenii sunt stăpâni peste noi? Ce este aceasta ce ne-ai făcut? Iar el le-a spus: Cum mi-au făcut ei mie, astfel le-am făcut și eu lor.
౧౧అప్పుడు యూదా వారిలో మూడువేలమంది ఏతాము బండ సందుల్లోని గుహ దగ్గరికి వెళ్లి సంసోనుతో ఇలా అన్నారు “ఫిలిష్తీయులు మన పాలకులని తెలీదా? మా మీదికి ఏం తెచ్చిపెట్టావో చూడు” అన్నారు. దానికి సంసోను “వాళ్ళు నాకేం చేసారో నేనూ వాళ్ళకూ అదే చేసాను” అన్నాడు.
12 Iar ei i-au spus: Am venit să te legăm, ca să te dăm în mâna filistenilor. Și Samson le-a spus: Jurați-mi că nu veți cădea voi înșivă asupra mea.
౧౨దానికి వారంతా “మేము నిన్ను కట్టి పడేసి ఫిలిష్తీయులకు అప్పగించడానికి వచ్చాం” అన్నారు. అందుకు సంసోను “మీరు మాత్రం నన్ను చంపం అని ప్రమాణం చేయండి” అన్నాడు.
13 Și i-au vorbit, spunând: Nu, ci te vom lega strâns și te vom da în mâna lor; dar cu siguranță nu te vom ucide. Și l-au legat cu două funii noi și l-au scos din stâncă.
౧౩అందుకు వారు “మేము నిన్ను చంపం. కేవలం తాళ్ళతో బంధించి వాళ్లకి అప్పగిస్తాం” అన్నారు. ఇలా చెప్పి వారు అతణ్ణి కొత్తగా పేనిన తాళ్ళతో బలంగా బంధించి తీసుకుని వచ్చారు.
14 Și când a venit la Lehi, filistenii au strigat împotriva lui; și Duhul DOMNULUI a venit cu putere peste el și funiile care erau pe brațele lui au devenit ca niște in ars cu foc, și legăturile lui s-au dezlegat de pe mâinile sale.
౧౪అతడు లేహీకి వచ్చేసరికి ఫిలిష్తీయులు అతణ్ణి ఎదుర్కోడానికి వెళ్లి పెద్దగా కేకలు వేశారు. అప్పుడు దేవుని ఆత్మ అతన్ని బలంగా ఆవహించాడు. అతని చేతులను బంధించిన తాళ్ళు కాలిపోయిన జనపనారలాగా అయ్యాయి. వేసిన సంకెళ్ళు ఊడి పడ్డాయి.
15 Și el a găsit o falcă de măgar neuscată și și-a întins mâna și a luat-o și a ucis cu ea o mie de bărbați.
౧౫అతనికి ఒక పచ్చి గాడిద దవడ దొరికింది. దాన్ని పట్టుకుని దానితో వెయ్యి మందిని కొట్టి చంపాడు.
16 Și Samson a spus: Cu o falcă de măgar, grămezi peste grămezi, cu o falcă de măgar am ucis o mie de bărbați.
౧౬అప్పుడు సంసోను ఇలా అన్నాడు, “నేను గాడిద దవడ ఎముకతో కుప్పలు కుప్పలుగా, గాడిద దవడ ఎముకతో వెయ్యి మంది మనుషులను చంపాను.”
17 Și s-a întâmplat, când a terminat de vorbit, că a aruncat falca din mâna lui și a numit acel loc Ramat-Lehi.
౧౭అతడు ఇలా చెప్పిన తరువాత ఆ దవడ ఎముకను పారవేసి ఆ స్థలానికి “రామత్లేహి” అనే పేరు పెట్టాడు.
18 Și îi era foarte sete și a chemat pe DOMNUL și a spus: Tu ai dat prin mâna servitorului tău această mare eliberare; și acum să mor de sete și să cad în mâna celor necircumciși?
౧౮అప్పుడు అతనికి విపరీతమైన దాహం వేసి యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు. “నీ సేవకునికి గొప్ప విజయం అనుగ్రహించావు. ఇప్పుడు నేను దాహంతో మరణిస్తే ఈ సున్నతి సంస్కారం లేని మనుషుల చేతిలో పడతాను” అంటూ వేడుకున్నాడు.
19 Dar Dumnezeu a despicat o scobitură în falcă și a ieșit apă din ea; și după ce a băut, duhul i-a revenit și a trăit; de aceea el i-a pus numele En-Hacore, care este în Lehi până în ziua aceasta.
౧౯అప్పుడు దేవుడు లేహీలో పల్లంగా ఉన్న ఒక స్థలాన్ని నెర్రె విచ్చేలా చేశాడు. దానిలోనుండి నీళ్ళు ఉబికి వచ్చాయి. అతడు ఆ నీటిని తాగాడు. అతడి ప్రాణం ఉపశమనం పొంది తేరుకున్నాడు. కాబట్టి ఆ ప్రాంతానికి “ఏన్ హక్కోరే” అనే పేరు వచ్చింది. ఆ ప్రాంతం ఇప్పటికీ లేహీ లో ఉంది.
20 Și el a judecat pe Israel în zilele filistenilor, douăzeci de ani.
౨౦సంసోను ఫిలిష్తీయుల రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు.