< Ezechiel 41 >

1 După aceasta el m-a dus la templu și a măsurat stâlpii, șase coți în lățime pe o parte și șase coți în lățime pe cealaltă parte, [care era] lățimea tabernacolului.
తరువాత అతడు నన్ను మందిరానికి తీసుకుని వచ్చి దాని పరిశుద్ధ స్థలం ప్రవేశానికి రెండు పక్కల ఉన్న స్తంభాలను కొలిచాడు. అవి ఒక్కొక్కటీ 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
2 Și lățimea ușii [era] de zece coți; și laturile ușii [erau] de cinci coți de o parte și de cinci coți de cealaltă parte; și a măsurat lungimea lui, patruzeci de coți; și lățimea, douăzeci de coți.
ప్రవేశ ద్వారం వెడల్పు 5 మీటర్ల 40 సెంటి మీటర్లు. తలుపు రెండు వైపులా 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, దాని పొడవు 22 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
3 Apoi a intrat înăuntru și a măsurat stâlpul ușii, doi coți; și ușa, șase coți; și lățimea ușii, șapte coți.
అతడు లోపలికి పోయి వాకిలి స్తంభాలను కొలిచినప్పుడు అది ఒక్కొక్కటి ఒక మీటరు వెడల్పు ఉన్నాయి. వాకిలి 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, రెండు వైపులా ఉన్న గోడల వెడల్పు 3 మీటర్ల 80 సెంటి మీటర్లు ఉన్నాయి.
4 Astfel a măsurat lungimea lui, douăzeci de coți; și lățimea, douăzeci de coți, înaintea templului; și mi-a spus: Acesta [este locul] preasfânt.
అతడు “ఇది అతి పరిశుద్ధస్థలం” అని చెప్పి దాన్ని కొలిచాడు. దాని పొడవు 11 మీటర్లు, వెడల్పు 11 మీటర్లు.
5 După aceea a măsurat zidul casei, șase coți; și lățimea [fiecărei] camere laterale, patru coți, de jur împrejurul casei de fiecare parte.
తరువాత అతడు మందిరం గోడను కొలిచినప్పుడు అది, 3 మీటర్ల 20 సెంటి మీటర్లు, మందిరం పక్కన ఉన్న మేడ గదులు ఒక్కొక్కటి సుమారు 2 మీటర్లు వెడల్పు ఉన్నాయి.
6 Și camerele laterale [erau] trei, una peste cealaltă și treizeci la rând; și ele intrau în zidul care [era] al casei pentru camerele laterale de jur împrejur, ca să poată avea susținere, dar ele nu aveau susținere în zidul casei.
ఈ మేడగదులు మూడు అంతస్థులు ఉన్నాయి. ఆ విధంగా అవి ఒక్కొక్క అంతస్తుకు 30 గదులు. ఈ గదులు మందిరం గోడ మీద ఆనుకోలేదు. మందిరం చుట్టూ కట్టిన గోడతో కలిసి ఉన్నాయి.
7 Și [era] o lărgire care mergea împrejur, crescând în sus spre camerele laterale, pentru că răsucirea împrejur a casei creștea în sus de jur împrejurul casei; de aceea lățimea casei [creștea] în sus și astfel creștea [de la camera] cea mai de jos până la cea mai de sus prin mijloc.
ఆ గోడ మేడగదులకు ఎక్కిన కొద్దీ వాటి వెడల్పు పెరుగుతూ వచ్చింది. అంటే పైకెక్కిన కొద్దీ మందిరం చుట్టూ ఉన్న మేడగదుల అంతస్థుల వెడల్పు పెరుగుతూ వచ్చింది కాబట్టి మందిరపు పైభాగం వెడల్పు కింది భాగం కంటే ఎక్కువగా ఉంది.
8 Am văzut de asemenea înălțimea casei de jur împrejur, temeliile camerelor laterale [erau] o trestie întreagă de șase coți mari.
ఇంకా నేను చూసినప్పుడు మందిరం చుట్టూ మేడ గదులకు ఎత్తుగా ఉన్న పునాది కనిపించింది. ఆ పునాది ఎత్తు 3 మీటర్ల 20 సెంటి మీటర్లు.
9 Grosimea zidului, care [era] pentru camera laterală din afară, [era] de cinci coți; și [ceea] ce [era] lăsat [era] locul camerelor laterale care [erau] înăuntru.
మేడగదుల బయట ఉన్న గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు. మందిరపు మేడగదుల పక్కన ఖాళీ స్థలం ఉంది.
10 Și între camere [era] lățimea de douăzeci de coți de jur împrejurul casei de fiecare parte.
౧౦గదుల మధ్య మందిరం చుట్టూ నాలుగు వైపులా 11 మీటర్లు వెడల్పున స్థలం విడిచిపెట్టారు.
11 Și ușile camerelor laterale [erau] spre [locul] lăsat, o ușă spre nord și o altă ușă spre sud; și lățimea locului care era lăsat [era] de cinci coți de jur împrejur.
౧౧మేడగదుల గుమ్మాలు ఖాళీగా ఉన్న స్థలం వైపు ఉన్నాయి. ఒక గుమ్మం ఉత్తరపు వైపు, మరొకటి దక్షిణం వైపు ఉన్నాయి. ఖాళీగా ఉన్న స్థలం చుట్టూ 2 మీటర్ల 70 సెంటి మీటర్లు వెడల్పు ఉంది.
12 Și clădirea care [era] înaintea locului despărțit la capăt spre vest, [era] de șaptezeci de coți de lată; și zidul clădirii [era] gros de cinci coți de jur împrejur și lungimea lui era de nouăzeci de coți.
౧౨ఆవరణం ఎదురుగా పడమటి వైపు ఒక కట్టడం ఉంది. దాని వెడల్పు 38 మీటర్లు, దాని గోడ వెడల్పు 2 మీటర్ల 70 సెంటి మీటర్లు, గోడ పొడవు 49 మీటర్లు.
13 Astfel el a măsurat casa, o sută de coți lungime; și locul despărțit și clădirea și zidurile ei, o sută de coți lungime;
౧౩మందిరం పొడవును కొలిచినప్పుడు అది 44 మీటర్లు ఉంది. ఆ కట్టడం, దాని గోడల కొలత 54 మీటర్లు.
14 De asemenea lățimea feței casei și a locului despărțit spre est, o sută de coți.
౧౪తూర్పు వైపు మందిరం పొడవు 54 మీటర్లు.
15 Și a măsurat lungimea clădirii din fața locului despărțit care [era] în spatele ei și galeriile ei de pe o parte și de pe cealaltă parte, o sută de coți, cu templul interior și porticele curții;
౧౫మందిరం వెనక భాగంలోని ఖాళీ స్థలానికి ఎదురుగా ఒక కట్టడం ఉంది. దాని రెండు వైపులా ఉన్న వసారాల పొడవు 54 మీటర్లు.
16 Ușorii ușii și ferestrele înguste și galeriile de jur împrejur pe cele trei rânduri, în fața ușii, căptușiți cu lemn de jur împrejur și de la pământ până la ferestre și ferestrele [erau] acoperite;
౧౬అప్పుడా వ్యక్తి గర్భాలయం, ఆవరణపు మంటపాలు, గడపలు, కమ్ములు ఉన్న కిటికీలను, మూడు అంతస్థుల చుట్టూ ఉన్న వసారాలను కొలిచాడు. గడపలకెదురుగా నేల నుండి కిటికీలు చెక్కతో కప్పి ఉన్నాయి.
17 Până deasupra ușii, chiar până la casa interioară și exterioară și la tot zidul de jur împrejur pe interior și pe exterior, după măsură.
౧౭గుమ్మాలకు పైన మందిరానికి బయట, లోపల ఉన్న గోడంతా, చుట్టూ గోడ పైనా, కెరూబులు, ఖర్జూరపు చెట్టు చెక్కి ఉన్నాయి.
18 Și [era] făcut cu heruvimi și palmieri, astfel încât un palmier [era] între un heruvim și un heruvim; și [fiecare] heruvim avea două fețe;
౧౮రెండు కెరూబుల మధ్య ఖర్జూరపు చెట్లు ఉన్నాయి. ప్రతి కెరూబుకు రెండేసి ముఖాలున్నాయి.
19 Astfel încât fața unui om [era] spre palmierul de pe o parte și fața unui leu tânăr spre palmierul din cealaltă parte; [astfel] s-a făcut pe toată casa de jur împrejur.
౧౯ఇటు ఖర్జూరపు చెట్టు వైపున మనిషి ముఖం, అటు ఖర్జూరపు చెట్టు వైపున సింహం ముఖం ఉన్నాయి. మందిరం అంతా ఆ ప్రకారమే ఉన్నాయి.
20 De la pământ până deasupra ușii [erau] făcuți heruvimi și palmieri și [de asemenea pe] zidul templului.
౨౦నేల మొదలుకుని గుమ్మం పైవరకూ మందిరపు గోడకు కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి.
21 Ușorii templului [erau] pătrați [și] fața sanctuarului [de asemenea]; înfățișarea [unuia era la fel] ca și înfățișarea [celuilalt].
౨౧మందిరపు ద్వారబంధాలు నలు చదరంగా ఉన్నాయి. పరిశుద్ధస్థలపు ద్వారబంధాలు కూడా అలాగే ఉన్నాయి.
22 Altarul din lemn [era] înalt de trei coți și lungimea lui de doi coți; și colțurile lui și lungimea lui și pereții lui [erau] din lemn; și el mi-a spus: Aceasta [este] masa care [este] înaintea DOMNULUI.
౨౨బలిపీఠం చెక్కతో చేశారు. దాని ఎత్తు 1 మీటరు 60 సెంటి మీటర్లు, పొడవు ఒక మీటరు. దాని పీఠం, మూలలు, పక్కలు చెక్కతో చేసినవి. అతడు నాతో “ఇది యెహోవా సముఖంలో ఉండే బల్ల” అని చెప్పాడు.
23 Și templul și sanctuarul aveau două uși.
౨౩మందిరానికి, పరిశుద్ధ స్థలానికి రెండు గుమ్మాలున్నాయి.
24 Și ușile aveau două canate [fiecare], două canate turnante; două [canate] pentru o ușă și două canate pentru cealaltă [ușă].
౨౪ఒక్కొక గుమ్మం రెండేసి మడత రెక్కలతో ఉంది.
25 Și [erau] făcuți pe ele, pe ușile templului, heruvimi și palmieri, precum [erau] făcuți pe ziduri; și [erau] poște groase pe fața porticului pe exterior.
౨౫అంతే కాక గోడల మీద ఉన్నట్టుగా మందిరపు గుమ్మాల మీద కూడా కెరూబులు, ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. బయటి వసారాకి విచిత్రంగా చేసిన చెక్క చూరు ఉంది.
26 Și [erau] ferestre înguste și palmieri pe o parte și pe cealaltă parte pe laturile porticului și [la] camerele laterale ale casei și poște groase.
౨౬మరియు వసారాకి, రెండు వైపులా గోడలకు, మేడగదులకు రెండు వైపులా కమ్ములు వేసిన కిటికీలు, ఖర్జూరపు చెట్ల ఆకారాలు చెక్కి ఉన్నాయి.

< Ezechiel 41 >