< Efeseni 1 >
1 Pavel, apostol al lui Isus Cristos prin voia lui Dumnezeu, sfinților care sunt în Efes și credincioșilor în Cristos Isus,
౧ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు యేసులో విశ్వాసముంచిన వారికి దేవుని సంకల్పం ప్రకారం క్రీస్తు యేసు అపొస్తలుడు పౌలు రాస్తున్న విషయాలు.
2 Har vouă și pace de la Dumnezeu Tatăl nostru și de la Domnul Isus Cristos.
౨మన తండ్రి అయిన దేవుని నుండీ యేసు క్రీస్తు ప్రభువు నుండీ మీకు కృప, శాంతి సమాధానాలు కలుగు గాక.
3 Binecuvântat fie Dumnezeul și Tatăl Domnului nostru Isus Cristos, care ne-a binecuvântat cu toate binecuvântările spirituale în locurile cerești, în Cristos;
౩మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు.
4 După cum ne-a ales în el înainte de întemeierea lumii, ca să fim sfinți și ireproșabili înaintea lui în dragoste,
౪క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు.
5 Predestinându-ne pentru adopția copiilor prin Isus Cristos, pentru el însuși, conform bunei plăceri a voii sale,
౫యేసు క్రీస్తు ద్వారా మనలను తన సొంత కుమారులుగా స్వీకరించడానికి దేవుడు తన ప్రేమతో ముందుగానే నిర్ణయించుకున్నాడు. అలా చేయడం ఆయనకు ఎంతో ఆనందం. ఆయన ఆశించింది అదే.
6 Pentru lauda gloriei harului său în care ne-a făcut acceptați în cel preaiubit.
౬తన దివ్యకృపను బట్టి స్తుతి పొందాలని దేవుడు దాన్ని తన ప్రియ కుమారుడి ద్వారా మనకు ఉచితంగా ప్రసాదించాడు.
7 În care avem răscumpărarea prin sângele lui, iertarea păcatelor, conform bogățiilor harului său,
౭దేవుని అపార కృప వల్లనే, ఆయన ప్రియ పుత్రుడు యేసు రక్తం ద్వారా మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది.
8 În care el a abundat spre noi în toată înțelepciunea și priceperea,
౮ఈ కృపను సమస్త జ్ఞాన వివేకాలతో ఆయన మనకు విస్తారంగా అందించాడు.
9 Făcându-ne cunoscut misterul voii sale, conform bunei sale plăceri, pe care și-a plănuit-o în el însuși;
౯ఆయన క్రీస్తు ద్వారా తన ఇష్ట పూర్తిగా ప్రదర్శించిన పథకం తాలూకు రహస్య సత్యాన్ని మనకు తెలియజేశాడు.
10 Ca în administrarea plinătății timpurilor să adune în unul, toate în Cristos, deopotrivă pe cele în cer și cele pe pământ; în el,
౧౦కాలం సంపూర్ణమైనప్పుడు పరలోకంలోనూ, భూమి మీదా ఉన్న సమస్తాన్నీ క్రీస్తులో ఏకంగా సమకూర్చాలని దేవుడు తనలో తాను నిర్ణయించుకున్నాడు.
11 În care am și obținut o moștenire, fiind predestinați conform cu scopul celui care lucrează toate după sfatul voii sale,
౧౧క్రీస్తును ముందుగా నమ్మిన మనం తన మహిమకు కీర్తి కలగజేయాలని,
12 Pentru lauda gloriei sale, noi, care întâi ne-am încrezut în Cristos.
౧౨దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పాన్ని బట్టి మనలను ఎన్నుకుని, మనకు వారసత్వం ఏర్పరచాడు. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయం ప్రకారం అన్ని కార్యాలనూ జరిగిస్తున్నాడు.
13 În care și voi v-ați încrezut, după ce ați auzit cuvântul adevărului, evanghelia salvării voastre; și în care, după ce ați crezut, ați fost sigilați cu acel Duh sfânt al promisiunii,
౧౩మీరు కూడా సత్య వాక్యాన్ని అంటే రక్షణ సువార్తను విని, క్రీస్తులో విశ్వాసముంచారు. కాబట్టి దేవుడు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ ద్వారా మీమీద ముద్ర పడింది.
14 Care este arvuna moștenirii noastre, până la răscumpărarea posesiunii cumpărate, spre lauda gloriei sale.
౧౪దేవుని మహిమకు కీర్తి కలగడానికి ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలిగే వరకూ ఆత్మ మన వారసత్వానికి హామీగా ఉన్నాడు.
15 Din această cauză și eu, după ce am auzit despre credința voastră în Domnul Isus și dragostea pentru toți sfinții,
౧౫ఈ కారణం చేత ప్రభువైన యేసులో మీ విశ్వాసం గురించీ పరిశుద్ధులందరి పట్ల మీరు చూపిస్తున్న ప్రేమను గురించీ నేను విన్నప్పటి నుంచి,
16 Nu încetez să aduc mulțumiri pentru voi, amintind despre voi în rugăciunile mele,
౧౬మీ విషయంలో మానకుండా నా ప్రార్థనల్లో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాను.
17 Ca Dumnezeul Domnului nostru Isus Cristos, Tatăl gloriei, să vă dea duhul înțelepciunii și al revelației în cunoașterea lui;
౧౭మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
18 Ochii înțelegerii voastre, fiind iluminați, ca voi să cunoașteți care este speranța chemării lui și care sunt bogățiile gloriei moștenirii lui în sfinți,
౧౮మీ మనోనేత్రాలు వెలిగి, మన పిలుపు గురించిన నిరీక్షణ ఎలాంటిదో, పరిశుద్ధుల్లో ఆయన మహిమగల వారసత్వం ఎంత ఐశ్వర్యవంతమో మీరు గ్రహించాలని నా ప్రార్థన.
19 Și care este nemărginita mărime a puterii lui față de noi, care credem, conform cu lucrarea tăriei puterii sale,
౧౯తనను నమ్ముకున్న మనలో తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలని నా ప్రార్థన.
20 Pe care a lucrat-o în Cristos, când l-a înviat dintre morți și l-a așezat la dreapta sa, în locurile cerești,
౨౦దేవుడు ఈ శక్తితో క్రీస్తును తిరిగి బ్రతికించి పరలోకంలో తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు.
21 Mult deasupra fiecărei stăpâniri și autorități și puteri și domnii și a fiecărui nume numit, nu numai în lumea aceasta, ci și în cea care vine; (aiōn )
౨౧సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే ఈ యుగంలోగానీ రాబోయే యుగంలోగానీ పేరు గాంచిన ప్రతి నామం కంటే కూడా ఎంతో పైగా ఆయనను హెచ్చించాడు. (aiōn )
22 Și a pus toate sub picioarele lui și l-a dat să fie capul peste toate lucrurile în biserică,
౨౨దేవుడు సమస్తాన్నీ క్రీస్తు పాదాల కింద ఉంచి, సంఘంలోని అన్నిటి మీదా ఆయనను తలగా నియమించాడు.
23 Care este trupul lui, plinătatea celui care umple toate în toți.
౨౩ఈ సంఘం ఆయన శరీరం, అంతటినీ అన్ని విధాలుగా నింపుతున్న ఆయన సంపూర్ణత.