< Faptele 19 >
1 Și s-a întâmplat că, în timp ce Apolo era în Corint, Pavel, traversând ținuturile de sus, a venit la Efes; și, găsind anumiți discipoli,
౧అపొల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగిందేమంటే, పౌలు మన్య ప్రాంతాల్లో సంచరించి ఎఫెసుకు వచ్చినప్పుడు కొందరు శిష్యులు అతనికి కనిపించారు. వారిని, “మీరు నమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్మను పొందారా?” అని అడిగాడు.
2 Le-a spus: Ați primit Duhul Sfânt de când ați crezut? Iar ei i-au spus: Nici măcar nu am auzit că ar fi vreun Duh Sfânt.
౨వారు, “అసలు పరిశుద్ధాత్మను గురించి మేము వినలేదు” అని చెప్పారు.
3 Iar el le-a spus: Atunci cu ce ați fost botezați? Iar ei au spus: Cu botezul lui Ioan.
౩అప్పుడు పౌలు, “అలాగైతే మీరు ఎలాంటి బాప్తిసం పొందారు?” అని అడగ్గా, వారు, “యోహాను బాప్తిసం” అని చెప్పారు.
4 Atunci Pavel a spus: Ioan într-adevăr a botezat cu botezul pocăinței, spunând poporului că ar trebui să creadă în cel ce vine după el, adică în Cristos Isus.
౪అందుకు పౌలు, “యోహాను తన వెనక వచ్చే వాడిలో, అంటే యేసులో విశ్వాసముంచాలని ప్రజలతో చెబుతూ, పశ్చాత్తాపం విషయమైన బాప్తిసమిచ్చాడు” అని చెప్పాడు.
5 Când au auzit, au fost botezați în numele Domnului Isus.
౫వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారు.
6 Și după ce Pavel și-a pus mâinile peste ei, Duhul Sfânt a venit peste ei; și vorbeau în limbi și profețeau.
౬తరువాత పౌలు వారి మీద చేతులుంచినపుడు పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో మాటలాడటం, ప్రవచించడం మొదలుపెట్టారు.
7 Și erau cam doisprezece bărbați cu totul.
౭వారందరూ సుమారు పన్నెండు మంది పురుషులు.
8 Și a intrat în sinagogă și a vorbit cutezător timp de trei luni, dezbătând și convingând despre cele ale împărăției lui Dumnezeu.
౮తరువాత పౌలు సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రసంగిస్తూ, దేవుని రాజ్యం గూర్చి తర్కిస్తూ, ఒప్పిస్తూ, ధైర్యంగా మాట్లాడుతూ మూడు నెలలు గడిపాడు.
9 Dar când unii s-au împietrit și nu au crezut, ci au vorbit de rău calea aceea înaintea mulțimii, a plecat de la ei și a separat discipolii, dezbătând zilnic în școala unuia, Tiran.
౯అయితే కొందరు తమ హృదయాలను కఠినం చేసుకుని అతనిని తిరస్కరించి, జనసమూహం ఎదుట క్రీస్తు మార్గాన్ని దూషిస్తూ వచ్చారు. కాబట్టి అతడు వారిని విడిచిపెట్టి, శిష్యులను వారి నుండి వేరు చేసి ప్రతిరోజూ తురన్ను అనే అతని బడిలో చర్చిస్తూ వచ్చాడు.
10 Și aceasta a ținut timp de doi ani; așa că toți care locuiau în Asia au auzit cuvântul Domnului Isus, deopotrivă iudei și greci.
౧౦రెండు సంవత్సరాల పాటు ఈ విధంగా జరిగింది. కాబట్టి యూదులు, గ్రీకులు, ఆసియలో నివసించే వారంతా ప్రభువు వాక్కు విన్నారు.
11 Și Dumnezeu lucra miracole nemaipomenite prin mâinile lui Pavel;
౧౧అంతేగాక దేవుడు పౌలు చేత కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతాలను చేయించాడు.
12 Așa că au adus la bolnavi prosoape și șorțuri de pe trupul lui și bolile se depărtau de ei, și duhurile rele ieșeau din ei.
౧౨అతని శరీరానికి తాకిన చేతిగుడ్డలయినా, నడికట్లయినా రోగుల దగ్గరికి తెస్తే వారి రోగాలు పోయాయి, దురాత్మలు కూడా వదలిపోయాయి.
13 Atunci, unii din iudeii pribegi, exorciști, s-au angajat să cheme numele Domnului Isus peste cei ce aveau duhuri rele, spunând: Vă conjurăm prin Isus, pe care îl predică Pavel.
౧౩అప్పుడు దేశసంచారం చేసే యూదు మాంత్రికులు కొందరు తమ స్వలాభం కోసం యేసు నామం ఉపయోగిస్తూ, “పౌలు ప్రకటించే యేసు తోడు, మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను” అని చెప్పి, దురాత్మలు పట్టినవారిపై ప్రభువైన యేసు పేరు ఉచ్ఛరించడానికి పూనుకున్నారు.
14 Și erau șapte fii ai lui Sceva, un iudeu, mai marele preoților, care au făcut astfel.
౧౪స్కెవ అనే ఒక యూదు ప్రధాన యాజకుని కొడుకులు ఏడుగురు కూడా ఆ విధంగా చేస్తున్నారు.
15 Iar duhul rău a răspuns și a zis: Pe Isus îl cunosc și pe Pavel îl știu; dar voi, cine sunteți?
౧౫అందుకు ఆ దురాత్మ, “నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు కూడా తెలుసు గాని, మీరెవరు?” అని వారిని అడిగింది.
16 Și omul în care era duhul rău, a sărit pe ei și i-a dominat și i-a învins, așa că au fugit afară din casă, goi și răniți.
౧౬ఆ దురాత్మ పట్టినవాడు ఎగిరి మీద పడి వారిని లొంగదీసుకోవడంతో ఆ దురాత్మ గెలిచింది. అందుచేత ఆ మంత్రగాళ్ళు గాయాలతో బట్టల్లేకుండా పారిపోయారు.
17 Și aceasta a fost cunoscută deopotrivă tuturor iudeilor și grecilor care locuiau în Efes; și frică a căzut peste ei toți și numele Domnului Isus era preamărit.
౧౭ఈ సంగతి ఎఫెసులో నివసించే యూదులకు, గ్రీకువారికి తెలిసినప్పుడు వారందరికీ భయం వేసింది కాబట్టి ప్రభువైన యేసు నామానికి ఘనత కలిగింది.
18 Și mulți care au crezut, au venit și au mărturisit și și-au arătat faptele.
౧౮విశ్వసించినవారు చాలా మంది వచ్చి, తమ దుర్మార్గ క్రియలను ఒప్పుకున్నారు.
19 Și mulți dintre cei care lucraseră artele magiei, au adus cărțile la un loc și le-au ars înaintea tuturor; și au calculat prețul lor și au găsit că era de cincizeci de mii de arginți.
౧౯అంతేగాక మాంత్రిక విద్య అభ్యసించినవారు చాలా మంది తమ పుస్తకాలను తెచ్చి, అందరూ చూస్తుండగా వాటిని కాల్చివేశారు. లెక్క చూసినప్పుడు వాటి విలువ యాభై వేల వెండి నాణాలు అయింది.
20 Astfel cuvântul lui Dumnezeu a crescut cu putere și a învins.
౨౦అంత ప్రభావ సహితంగా ప్రభువు వాక్కు వ్యాపించింది.
21 După ce s-au terminat acestea, Pavel s-a hotărât în duhul, după ce traversase Macedonia și Ahaia, să meargă la Ierusalim, spunând: După ce voi fi fost acolo, trebuie să văd și Roma.
౨౧పౌలు ఎఫెసులో పరిచర్య ముగించిన తరువాత మాసిదోనియ, అకయ దేశాల మార్గంలో యెరూషలేము వెళ్ళాలని ఆత్మలో ఉద్దేశించి ‘నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమ్ నగరాన్ని కూడా చూడాలి’ అని నిర్ణయించుకున్నాడు.
22 Astfel a trimis în Macedonia pe doi dintre cei ce îl serveau, Timotei și Erast; dar el a stat un timp în Asia.
౨౨అప్పుడు తన పరిచారకుల్లో తిమోతి, ఎరస్తు అనే ఇద్దరిని మాసిదోనియ పంపించి తాను మాత్రం ఆసియలో కొంతకాలం నిలిచిపోయాడు.
23 Și s-a făcut în acel timp nu mică tulburare despre calea aceea.
౨౩ఆ రోజుల్లో క్రీస్తు మార్గం గురించి అక్కడ చాలా అల్లరి చెలరేగింది.
24 Fiindcă unul, numit Demetrie, un argintar, care făcea temple din argint pentru Diana, aducând nu puțin câștig meșterilor,
౨౪ఎలాగంటే, దేమేత్రి అనే ఒక కంసాలి డయానా దేవతకు వెండి విగ్రహాలను చేయిస్తూ అక్కడి పనివారికి మంచి ఆదాయం కల్పించేవాడు.
25 Pe care el i-a chemat împreună cu lucrătorii cu ocupații asemănătoare și a spus: Domnilor, știți că prin această muncă avem bogăția noastră.
౨౫అతడు వారిని, ఆ వృత్తిలో ఉన్న ఇతరులను పోగుచేసి వారితో, “ఈ పని ద్వారా మనకి మంచి ఆదాయం వస్తూ మన జీవనోపాధి బాగా జరుగుతూ ఉందని మీకు తెలుసు.
26 Mai mult, vedeți și auziți că nu numai în Efes, ci aproape în toată Asia, acest Pavel a convins și a abătut mulți oameni, spunând că aceia ce sunt făcuți de mâini nu sunt dumnezei,
౨౬అయితే ఈ పౌలు, చేతులతో చేసిన విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కారని బోధించి, ఎఫెసులో మాత్రమే కాక మొత్తం ఆసియా అంతట చాలామంది ప్రజలను పెడదారి పట్టించాడని మీరు విన్నారు, చూశారు కూడా.
27 Așa că, nu numai această meserie a noastră este în pericol să fie făcută de nimic, dar și templul marii zeițe Diana va fi disprețuit și măreția ei va fi nimicită, ea căreia toată Asia și lumea i se închină.
౨౭పైగా మన వృత్తి మీద శ్రద్ధ తగ్గిపోవడమే కాక, డయానా దేవస్థానం కూడ నిర్లక్షానికి గురై, ఆసియా అంతటా, ఇంకా భూలోకమంతటా పూజలందుకుంటున్న ఈమె ప్రభావం తగ్గిపోతుందేమో అని నాకు భయం వేస్తున్నది” అని వారితో చెప్పాడు.
28 Iar când au auzit acestea s-au umplut de furie și strigau, spunând: Mare este Diana efesenilor.
౨౮వారు అది విని ఉగ్రులైపోయి, “ఎఫెసీయుల డయానా మహాదేవి” అని కేకలు వేశారు.
29 Și întreaga cetate s-a umplut de confuzie; și, prinzând pe Gaiu și Aristarh, bărbați din Macedonia, parteneri de călătorie ai lui Pavel, s-au năpustit într-un gând în teatru.
౨౯దానితో పట్టణం బహు గందరగోళంగా తయారైంది. వెంటనే వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియాకు చెందిన గాయి, అరిస్తార్కులను పట్టుకుని దొమ్మీగా అక్కడి నాటక ప్రదర్శనశాలలోకి ఈడ్చుకు పోయారు.
30 Dar când Pavel a intenționat să intre la popor, discipolii nu l-au lăsat.
౩౦పౌలు ఆ జనసమూహం పోగైన సభ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు గాని, శిష్యులు అతనిని వెళ్ళనియ్యలేదు.
31 Și de asemenea unii din mai marii Asiei, care erau prietenii lui, au trimis la el, implorând să nu se expună el însuși în teatru.
౩౧అంతేగాక ఆసియా దేశాధికారుల్లో అతని స్నేహితులు కొందరు అతనికి కబురు పంపి, “నీవు నాటక ప్రదర్శనశాలలోకి వెళ్ళవద్దు” అని నచ్చజెప్పారు.
32 Așadar unii strigau ceva și alții altceva, fiindcă adunarea era confuză și cei mai mulți nu știau de ce se adunaseră.
౩౨ఆ సభ గందరగోళంగా ఉంది. కొందరు ఒక రకంగా, మరికొందరు మరో రకంగా కేకలు వేస్తున్నారు. అసలు తామెందుకు అక్కడ గుమిగూడామో చాలా మందికి తెలియనే లేదు.
33 Și l-au târât pe Alexandru afară din mulțime, iudeii împingându-l înainte. Și Alexandru, făcând semn cu mâna, a voit să se apere înaintea poporului.
౩౩అప్పుడు యూదులు అలెగ్జాండరును ముందుకు తోసి అతనిని జనం ఎదుటికి తెచ్చారు. అలెగ్జాండర్ చేతితో సైగ చేసి ఆ ప్రజలకు వివరణ ఇవ్వాలని చూశాడు.
34 Dar când și-au dat seama că este iudeu, toți într-o singură voce au strigat aproape două ore: Mare este Diana efesenilor.
౩౪అయితే అతడు యూదుడని వారికి తెలిసి అందరూ మూకుమ్మడిగా రెండు గంటల సేపు ‘ఎఫెసీయుల డయానా మహాదేవి’ అని నినాదాలు చేశారు.
35 Și după ce cancelarul cetății a liniștit mulțimea, a spus: Bărbați efeseni, cine este omul care nu știe că cetatea efesenilor este închinătoare marii zeițe Diana și a chipului care a căzut de la Jupiter?
౩౫అప్పుడు ఊరి కరణం సమూహాన్ని సముదాయించి, “ఎఫెసు వాసులారా, ఎఫెసు పట్టణం డయానా మహాదేవికీ ఆకాశం నుండి పడిన పవిత్ర శిలకూ ధర్మకర్త అని తెలియని వారెవరు?
36 Văzând așadar că acestea nu pot fi negate, voi ar trebui să stați liniștiți și să nu faceți nimic în grabă.
౩౬ఈ సంగతులు తిరుగులేనివి కాబట్టి మీరు శాంతం వహించి ఏ విషయంలోనూ తొందరపడకపోతే మంచిది.
37 Fiindcă ați adus aici pe acești bărbați, care nu sunt nici jefuitori de biserici, nici blasfematori ai zeiței voastre.
౩౭మీరు ఈ వ్యక్తులను తీసికొచ్చారు గదా, వీరు గుడిని దోచుకున్న వారా? మన దేవతను దూషించారా?
38 De aceea dacă Demetrie și meșterii care sunt cu el au ceva împotriva cuiva, judecata este deschisă și sunt proconsuli; să se acuze unul pe altul.
౩౮దేమేత్రికీ అతనితో ఉన్న కంసాలులకూ వీరి మీద ఆరోపణలు ఏవైనా ఉంటే న్యాయసభలు జరుగుతున్నాయి, అధికారులు ఉన్నారు కాబట్టి వారు ఒకరిపై ఒకరు వ్యాజ్యం వేయవచ్చు.
39 Dar dacă cereți ceva referitor la alte lucruri, se va rezolva în adunarea legiuită.
౩౯అయితే మీరు ఇతర సంగతులను గురించి విచారణ చేయాలనుకుంటే అవి క్రమమైన సభలోనే పరిష్కారమవుతాయి.
40 Fiindcă suntem în pericol să fim acuzați pentru tulburarea de azi, nefiind niciun motiv prin care să putem da socoteală despre această îmbulzeală.
౪౦మనం ఈ గందరగోళం గూర్చి చెప్పదగిన కారణం ఏమీ లేదు గనక, ఈ రోజు జరిగిన అల్లరిని గురించి అధికారులు మనపై విచారణ జరుపుతారేమో అని భయంగా ఉంది. ఈ విధంగా గుంపు కూడడానికి తగిన కారణం ఏం చెబుతాం?” అని వారితో అన్నాడు.
41 Și după ce a spus astfel, a dat drumul adunării.
౪౧అతడలా చెప్పి సభను ముగించేశాడు.