< 2 Corinteni 8 >

1 Dar vă facem cunoscut, fraților, despre harul lui Dumnezeu, dăruit bisericilor Macedoniei;
సోదరీ సోదరులారా, మాసిదోనియ ప్రాంతంలోని సంఘాలపై దేవుడు చూపిన కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాం.
2 Că, într-o mare încercare a necazului, abundența bucuriei lor și adânca sărăcie a lor au abundat spre bogățiile generozității lor.
విపరీతమైన బాధలు వారిని పరీక్షిస్తున్నప్పుడు సైతం, వారు అత్యధికంగా సంతోషించారు. వారు నిరుపేదలైనా వారి దాతృత్వం చాలా గొప్పది.
3 Căci conform puterii lor, aduc eu mărturie, și peste puterea lor au dat de bună voie;
వారిని గురించి నా సాక్ష్యం ఏమిటంటే, పరిశుద్ధులకు సేవ చేయడానికి తమకు కూడా భాగం ఇవ్వాలని ఎంతో బతిమాలారు.
4 Rugându-ne cu multă insistență să primim noi darul și să luăm asupra noastră părtășia servirii pentru sfinți.
వారు స్వయంగానే ఇవ్వగలిగినంతా ఇచ్చారు. వాస్తవానికి, దానికంటే ఎక్కువే ఇచ్చారు.
5 Și aceasta au făcut, nu cum am sperat, ci întâi s-au dat pe ei înșiși Domnului și nouă, prin voia lui Dumnezeu.
అంతేకాక వారు మొదట ప్రభువుకూ, తరువాత దేవుని సంకల్పం వలన మాకూ తమను తామే అప్పగించుకున్నారు. ఇలా చేస్తారని మేమెన్నడూ తలంచలేదు.
6 Încât am îndemnat pe Titus, ca așa cum a început, așa să și împlinească în voi același har.
కాబట్టి మీ దగ్గర తీతు ఇప్పటికే మొదలు పెట్టిన ఈ కృపా పరిచర్యను పూర్తి చేయమని మేము అతన్ని ప్రోత్సహించాము.
7 De aceea așa cum abundați în toate, în credință și cuvântare și cunoaștere și în orice sârguință și în dragostea voastră față de noi, vedeți ca și în acest har să abundați.
మీరు ప్రతి విషయంలో అంటే విశ్వాసంలో ఉపదేశంలో జ్ఞానంలో శ్రద్ధ అంతటిలో మీకు మా పట్ల ఉన్న ప్రేమలో ఎలా రాణిస్తున్నారో అలానే మీరు ఈ కృపా పరిచర్యలో కూడా తప్పక రాణించండి.
8 Vorbesc nu printr-o poruncă, ci din cauza sârguinței altora, și să încerc sinceritatea dragostei voastre.
ఆజ్ఞలా మీతో చెప్పడం లేదు. ఇతరుల శ్రద్ధాసక్తులు మీకు తెలియజేసి మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షిస్తున్నాను.
9 Căci cunoașteți harul Domnului nostru Isus Cristos, că deși era bogat, totuși pentru voi s-a făcut sărac, ca voi, prin sărăcia lui, să fiți bogați.
మీకు మన ప్రభు యేసు క్రీస్తు కృప తెలుసు గదా? ఆయన ధనవంతుడై ఉండీ తన పేదరికం వలన మీరు ధనవంతులు కావాలని, మీ కోసం పేదవాడయ్యాడు.
10 Și în aceasta vă dau sfat, fiindcă aceasta vă este de folos, vouă care ați început mai înainte, nu doar a face, ci și a voi de acum un an.
౧౦ఈ విషయంలో మీకు ఉపయోగపడే సలహా ఇస్తాను. ఏడాది క్రితం ఈ పని చేయాలని మొదలు పెట్టారు. అంతే కాదు, తలపెట్టడంలో మొదటి వారు కూడా మీరే.
11 Dar acum și împliniți facerea acesteia; ca așa cum a fost bunăvoința de a voi, așa să fie și împlinirea din ceea ce aveți.
౧౧కాబట్టి మీరిప్పుడు ఆ పని పూర్తి చేయండి. పని చేయాలనే ఆశ, ఉత్సాహం అప్పుడు మీకెలా ఉన్నాయో ఆ విధంగానే మీరిప్పుడు దాన్ని ముగింపుకు తీసుకు రండి.
12 Căci dacă o minte binevoitoare este prezentă, este primit conform cu ce are omul și nu conform cu ce nu are.
౧౨అసలు ఈ పని చేయాలనే శ్రద్ధ ఉంటే అది మంచిదీ, ఆమోదయోగ్యమైనది కూడా. ఈ ఆమోదం ఒక వ్యక్తి, తనకున్న దాన్ని బట్టే గానీ లేని దాన్ని బట్టి కాదు.
13 Fiindcă nu doresc ca alții să fie ușurați, iar voi împovărați,
౧౩ఇతరుల బాధ ఉపశమనం చేసి మీకు భారంగా ఉండాలని ఇలా చెప్పడం కాదు. అందరికీ ఒకే విధంగా ఉండాలనే.
14 Ci să fie egalitate acum în acest timp, ca abundența voastră să fie pentru nevoia lor, pentru ca și abundența lor să fie, la rândul ei, pentru nevoia voastră, ca să fie egalitate,
౧౪“ఎక్కువ ఉన్న వాడికి ఏమీ మిగల్లేదు. తక్కువ ఉన్న వాడికి కొదువ లేదు” అని రాసి ఉంది.
15 Așa cum este scris: Cel ce a strâns mult nu avea în plus; și cel ce a strâns puțin nu ducea lipsă.
౧౫ప్రస్తుతం మీ సమృద్ధి వారి అవసరానికీ మరొకప్పుడు వారి సమృద్ధి మీ అవసరానికీ ఉపయోగపడాలని ఇలా చెబుతున్నాను.
16 Dar mulțumiri fie aduse lui Dumnezeu, care a pus aceeași sârguință în inima lui Titus pentru voi.
౧౬మీ పట్ల నాకున్న ఈ ఆసక్తినే తీతు హృదయంలో పుట్టించిన దేవునికి వందనాలు.
17 Pentru că, într-adevăr, a primit îndemnul, dar, fiind mult mai sârguincios, de bună voie a plecat la voi.
౧౭అతడు మా విన్నపాన్ని అంగీకరించడమే గాక దాని గురించి ఎంతో ఆసక్తితో తన ఇష్టప్రకారమే మీ దగ్గరికి వస్తున్నాడు.
18 Și noi am trimis cu el pe fratele, a cărui laudă este în evanghelie printre toate bisericile.
౧౮క్రీస్తు ప్రభువు సంఘాలన్నిటిలో సువార్త ప్రకటించే పనిలో ప్రసిద్ధి చెందిన సోదరుణ్ణి అతనితో పంపిస్తున్నాం.
19 Și nu numai, dar a și fost ales de biserici să călătorească cu noi cu acest har, care este administrat de noi spre gloria aceluiași Domn și ca o dovadă a minții voastre binevoitoare;
౧౯అంతేకాక మన ప్రభువు మహిమ కోసం, మాకున్న ఆసక్తికి అనుగుణంగా మేము చేస్తున్న ఈ కృపా పరిచర్యలో మాతో కలిసి ప్రయాణం చేయడానికి సంఘాలు అతన్ని నియమించాయి.
20 Evitând aceasta, ca nimeni să nu ne învinovățească în această abundență care este administrată de noi;
౨౦మేము సేకరిస్తున్న ఈ విరాళాల విషయంలో ఎవరూ మమ్మల్ని విమర్శించకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నాం.
21 Îngrijind de cele oneste, nu numai înaintea Domnului, ci și înaintea oamenilor.
౨౧ఎందుకంటే ప్రభువు దృష్టిలోనే కాక మనుషుల దృష్టిలో కూడా గౌరవించదగిన వాటినే చేయాలని మేము జాగ్రత్త పడుతున్నాం.
22 Și am trimis cu ei pe fratele nostru, despre care deseori noi am dovedit că este sârguincios în multe, dar acum se arată mult mai sârguincios datorită marii încrederi pe care o am în voi.
౨౨వారితో కూడా మరొక సోదరుణ్ణి మేము పంపుతున్నాం. అతన్ని చాలా విషయాల్లో చాలా సార్లు పరీక్షించి, ఆసక్తి గలవాడని గ్రహించాం. అతనికి మీమీద నమ్మకం కుదిరింది. అతడిప్పుడు మరింత ఆసక్తితో ఉన్నాడు.
23 Dacă se întreabă cineva despre Titus, el este partenerul meu și conlucrător referitor la voi; sau, dacă se întreabă despre frații noștri, ei sunt mesagerii bisericilor și gloria lui Cristos.
౨౩తీతు విషయంలోనైతే, అతడు నా సేవలో భాగస్థుడు, మీ విషయంలో నా జత పనివాడు. మన సోదరులయితే సంఘ ప్రతినిధులూ క్రీస్తుకు మహిమ తెచ్చేవారు.
24 De aceea arătați pentru ei, și în fața bisericilor, dovada dragostei voastre și a falei noastre referitor la voi.
౨౪కాబట్టి వారికి మీ ప్రేమ చూపించండి. ఇతర సంఘాల్లో మీ గురించి మేము ఎందుకు గొప్పగా చెప్పామో వారికి రుజువు చేయండి.

< 2 Corinteni 8 >