< 1 Samuel 9 >
1 Și era un om din Beniamin al cărui nume era Chiș, fiul lui Abiel, fiul lui Țeror, fiul lui Becorat, fiul lui Afiah, un beniamit, un bărbat puternic și viteaz.
౧బెన్యామీను గోత్రానికి చెందిన కీషు అనే ధనవంతుడు ఉండేవాడు. కీషు తండ్రి అబీయేలు. అబీయేలు తండ్రి సేరోరు. సేరోరు తండ్రి బెకోరతు. బెకోరతు తండ్రి అఫీయా.
2 Și el avea un fiu, al cărui nume era Saul, un tânăr ales și frumos; și nu era printre copiii lui Israel o persoană mai frumoasă decât el; de la umerii săi în sus el era mai înalt decât oricine din popor.
౨కీషుకు సౌలు అనే ఒక కొడుకు ఉన్నాడు. అతడు చాలా అందమైన యువకుడు. ఇశ్రాయేలీయుల్లో అతణ్ణి మించిన అందగాడు లేడు. అతడు భుజాలపై నుండి ఇతరుల కంటే ఎత్తయినవాడు.
3 Și măgărițele lui Chiș, tatăl lui Saul, se pierduseră. Și Chiș i-a spus lui Saul, fiul său: Ia acum cu tine pe unul dintre servitori și ridică-te, du-te să cauți măgărițele.
౩సౌలు తండ్రి కీషుకు చెందిన గాడిదలు తప్పిపోయినపుడు కీషు తన కొడుకు సౌలును పిలిచి “మన పనివాళ్ళలో ఒకణ్ణి వెంటబెట్టుకుని వెళ్ళి గాడిదలను వెదుకు” అని చెప్పాడు.
4 Și el a trecut prin muntele Efraim și a trecut prin țara Șalișa, dar nu le-a găsit; apoi au trecut prin țara Șaalim și nu erau acolo; și a trecut prin țara beniamiților dar nu le-a găsit.
౪అతడు వెళ్ళి ఎఫ్రాయిము కొండలన్నీ తిరిగి షాలిషా దేశంలో వెతికినా అవి కనబడలేదు. తరువాత వారు షయలీము దేశం దాటి తిరిగినప్పటికీ అవి కనబడలేదు. బెన్యామీనీయుల దేశంలో వెతికినప్పటికీ అవి కనబడలేదు.
5 Și când au ajuns în țara Țuf, Saul a spus servitorului său care era cu el: Vino și să ne întoarcem, ca nu cumva tatălui meu să nu îi mai pese de măgărițe și să se îngrijoreze pentru noi.
౫అప్పుడు వారు సూపు దేశానికి వచ్చినప్పుడు “మనం వెనక్కు వెళ్ళిపోదాం, గాడిదలను గూర్చి బాధపడ వద్దు. మా నాన్న మనకోసం ఎదురు చూస్తుంటాడు” అని సౌలు తనతో ఉన్న పనివాడితో అన్నప్పుడు,
6 Și el i-a spus: Iată acum, este în această cetate un om al lui Dumnezeu și el este un bărbat demn de cinste; tot ce spune el se întâmplă; acum să mergem acolo; s-ar putea să ne arate calea pe care să mergem.
౬వాడు “ఈ ఊర్లో దేవుని మనిషి ఒకడు ఉన్నాడు, అతడు చాలా గొప్పవాడు, అతడు ఏది చెపితే అది జరుగుతుంది. మనం ఎటు వెళ్ళాలో ఆ దారి అతడు మనకు చెబుతాడేమో, అతని దగ్గరకి వెళ్ళి అడుగుదాం రండి” అని చెప్పాడు.
7 Atunci Saul a spus servitorului său: Dar, iată, dacă mergem, ce să ducem omului acesta? Pentru că pâinea s-a terminat din sacii noștri și nu este vreun dar de adus omului lui Dumnezeu; ce avem noi?
౭అప్పుడు సౌలు “మనం వెళ్లేటప్పుడు అతనికి ఏమి తీసుకు వెళ్ళాలి? మన దగ్గర ఉన్న భోజన పదార్దాలు అన్నీ అయిపోయాయి. ఆ దేవుని మనిషికి బహుమానంగా ఇవ్వడానికి మన దగ్గర ఏమీ లేదు కదా! మన దగ్గర ఏం ఉన్నాయి?” అని తన పనివాణ్ణి అడిగాడు.
8 Și servitorul a răspuns din nou lui Saul și a zis: Iată, am aici la îndemână a patra parte dintr-un șekel de argint; pe acesta îl voi da omului lui Dumnezeu, ca să ne spună calea.
౮వాడు సౌలుతో “అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని ఆ దైవజనునికి ఇస్తాను” అన్నాడు.
9 (Înainte, în Israel, când un om mergea să îl întrebe pe Dumnezeu, astfel vorbea: Veniți și să mergem la văzător, pentru că cel care este acum numit Profet înainte era numit Văzător.)
౯ఇప్పుడు ప్రవక్తగా ఉన్నవాడిని గతంలో దీర్ఘదర్శి అని పిలిచేవాడు. ఇదివరకూ ఇశ్రాయేలీయులు ఎవరైనా దేవుని నుండి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఆశించి వెళ్లే సమయంలో “మనం దీర్ఘదర్శి దగ్గరకి వెళ్దాం పదండి” అని చెప్పుకోవడం పరిపాటి.
10 Atunci Saul a spus servitorului său: Bine spus; vino, să mergem. Astfel au mers la cetatea unde era omul lui Dumnezeu.
౧౦అప్పుడు సౌలు “నువ్వు చెప్పింది బాగుంది. వెళ్దాం పద” అన్నాడు.
11 Și cum urcau dealul cetății, au găsit niște tinere servitoare ieșind să scoată apă și le-au spus: Este văzătorul aici?
౧౧వారు దైవజనుడు ఉండే ఊరికి బయలుదేరారు. ఊరిలోకి వెళ్తుండగా నీళ్లు తోడుకోవడానికి వచ్చిన యువతులు వారికి ఎదురుపడినప్పుడు “ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా?” అని అడిగారు.
12 Și ele le-au răspuns și au zis: Este, iată, el este înaintea voastră; grăbiți-vă acum, pentru că a venit astăzi în cetate, fiindcă poporul aduce un sacrificiu pe înălțime;
౧౨అందుకు వారు “ఇదిగో అతడు ఈ దగ్గరలోనే ఉన్నాడు. తొందరగా వెళ్ళి కలుసుకోండి. ఈ రోజే అతడు ఊర్లోకి వచ్చాడు. ఈ రోజే ఉన్నత స్థలం లో ప్రజల పక్షంగా బలి అర్పిస్తాడు.
13 Îndată ce veți fi intrat în cetate, îl veți găsi imediat, înainte să se urce la locul înalt să mănânce, pentru că poporul nu va mânca până când nu va veni el, deoarece el binecuvântează sacrificiul; și după aceea mănâncă cei chemați. De aceea acum, urcați-vă, căci pe la acest timp îl veți găsi.
౧౩మీరు ఊర్లోకి వెళ్ళగానే అతడు భోజనం చేయడానికి కొండ ప్రాంతానికి వెళ్లక ముందే మీరు అతణ్ణి కలుసుకోవచ్చు. అతడు వచ్చేంత వరకూ ప్రజలు భోజనం చేయరు, అతడు బలిని ఆశీర్వదించిన తరువాతే పిలిచిన వారు భోజనం చేస్తారు. మీరు త్వరగా వెళ్ళండి, అతణ్ణి కలుసుకోడానికి ఇదే సరైన సమయం.” అని చెప్పారు.
14 Și s-au urcat în cetate; și când au intrat în cetate, iată, Samuel ieșea spre ei, ca să se urce la locul înalt.
౧౪వారు ఊళ్లోకి వెళ్ళగానే కొండ ప్రాంతానికి వెళ్తున్న సమూయేలు వారికి ఎదురయ్యాడు.
15 Și DOMNUL îi spusese la ureche lui Samuel cu o zi înainte ca Saul să vină, zicând:
౧౫సౌలు అక్కడకు రేపు వస్తాడని యెహోవా సమూయేలుకు చెప్పాడు.
16 Mâine, cam pe timpul acesta, voi trimite la tine un om din țara lui Beniamin și tu să îl ungi să fie căpetenie peste poporul meu Israel, ca să salveze pe poporul meu din mâna filistenilor, pentru că am privit la poporul meu, deoarece strigătul lor a ajuns până la mine.
౧౬ఎందుకంటే “నా ప్రజల విన్నపం నాకు చేరింది. నేను వారిని పట్టించుకొంటున్నాను. కాబట్టి ఫిలిష్తీయుల చేతిలోనుండి నా ప్రజలను విడిపించడానికి నా ప్రజలైన ఇశ్రాయేలీయులపై అతణ్ణి రాజుగా అభిషేకించడానికి రేపు ఇదే సమయానికి నేను బెన్యామీను దేశంలో నుండి ఒక వ్యక్తిని నీ దగ్గరికి రప్పిస్తాను.”
17 Și când Samuel l-a văzut pe Saul, DOMNUL i-a spus: Iată, pe omul despre care ți-am vorbit! Acesta va domni peste poporul meu.
౧౭సౌలు సమూయేలుకు కనబడినప్పుడు, యెహోవా “ఇతడే నేను నీతో చెప్పిన వ్యక్తి. ఇతడే నా ప్రజలను పరిపాలిస్తాడు” అని అతనితో చెప్పాడు.
18 Atunci Saul s-a apropiat de Samuel la poartă și a zis: Spune-mi, te rog, unde este casa văzătorului.
౧౮సౌలు పురద్వారంలో సమూయేలును కలుసుకుని “దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ? దయచేసి నాకు చూపించండి” అని అడిగినప్పుడు,
19 Și Samuel i-a răspuns lui Saul și a zis: Eu sunt văzătorul; urcă-te înaintea mea la locul înalt, fiindcă veți mânca astăzi cu mine; și mâine te voi lăsa să pleci și îți voi spune tot ce este în inima ta.
౧౯సమూయేలు సౌలును చూసి “నేనే దీర్ఘదర్శిని. కొండ ప్రాంతానికి వెళ్ళండి, ఈరోజు మీరు నాతో కలసి భోజనం చెయ్యాలి. రేపు నీ సందేహం తీర్చి నేను నిన్ను పంపిస్తాను.
20 Și cât despre măgărițele care s-au pierdut cu trei zile în urmă, nu te mai gândi la ele, pentru că s-au găsit. Și asupra cui este toată dorința lui Israel? Nu este asupra ta și asupra întregii case a tatălui tău?
౨౦మూడు రోజుల క్రితం తప్పిపోయిన నీ గాడిదలను గూర్చి విచారించవద్దు, అవి దొరికాయి. ఇశ్రాయేలీయుల ఇష్టం ఎవరి పైన ఉంది? నీపైనా, నీ తండ్రి సంతానం పైనే కదా” అన్నాడు.
21 Și Saul a răspuns și a zis: Nu sunt eu un beniamit, din cel mai mic dintre triburile lui Israel, și familia mea este cea mai mică dintre toate familiile tribului lui Beniamin? Pentru ce atunci îmi vorbești astfel?
౨౧అప్పుడు సౌలు “నేను బెన్యామీను గోత్రానికి చెందినవాణ్ణి కదా. నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రాల్లో అల్పమైనది కదా. నా కుటుంబం బెన్యామీను గోత్రపు వారందరిలో అల్పులు కదా? నాతో ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నావు?” అన్నాడు.
22 Și Samuel l-a luat pe Saul și pe servitorul său și i-a dus în cameră și i-a pus să șadă în locul cel mai important printre cei chemați, care erau cam treizeci de persoane.
౨౨అయితే సమూయేలు సౌలును, అతని పనివాణ్ణి భోజనపు గదిలోకి వెంటబెట్టుకుని వెళ్ళి తాను పిలిచిన ముప్ఫై మంది ఉన్న మొదటి వరుసలో వారిని కూర్చోబెట్టి
23 Și Samuel a spus bucătarului: Adu porția pe care ți-am dat-o, despre care ți-am spus: Pune-o lângă tine.
౨౩వంటవాణ్ణి చూసి “నేను ఉంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన దాన్ని తీసుకురా” అని చెప్పినప్పుడు,
24 Și bucătarul a ridicat spata și ceea ce era pe ea și a pus-o înaintea lui Saul. Și Samuel a zis: Iată, ceea ce a fost păstrat! Pune-o înaintea ta, mănâncă, pentru că a fost păstrată pentru tine, pentru acest timp, de când am spus: Voi invita poporul. Și Saul a mâncat cu Samuel în acea zi.
౨౪అ వంటవాడు తొడ ఎముకను, దానిపైన ఉన్న మాంసాన్ని తీసుకువచ్చి సౌలుకు వడ్డించాడు. సమూయేలు సౌలుతో ఇలా అన్నాడు. “చూడు, మనం కలుసుకొనే సమయం కోసం దాచిపెట్టిన దాన్ని నీకు వడ్డించాను. పిలిచిన వాళ్ళు వచ్చినప్పటినుంచి దీన్ని ఈ సందర్భానికి నీ కోసం ఉంచాలని నేను వంటవాడితో చెప్పాను” అన్నాడు. ఆ రోజు సౌలు సమూయేలుతో కలసి భోజనం చేశాడు.
25 Și după ce au coborât de pe locul înalt în cetate, Samuel a vorbit îndeaproape cu Saul pe acoperișul casei.
౨౫పట్టణ ప్రజలు కొండపై నుండి కిందికి దిగుతున్న సమయంలో సమూయేలు తన ఇంటిపై సౌలుతో మాట్లాడుతున్నాడు.
26 Și s-au sculat devreme; și s-a întâmplat, pe când se revărsau zorile, că Samuel l-a chemat pe Saul pe acoperișul casei, spunând: Sus, ca să te trimit. Și Saul s-a sculat și au ieșit amândoi, el și Samuel, afară.
౨౬తరువాతి రోజు తెల్లవారుజామున సమూయేలు “నేను నీకు వీడ్కోలు చెప్పడానికి మిద్దెమీదికి రా” అని సౌలును పిలవగా సౌలు లేచాడు. తరువాత వారిద్దరూ బయలుదేరి
27 Și pe când coborau la marginea cetății, Samuel i-a spus lui Saul: Spune servitorului să treacă înaintea noastră (și el a trecut) dar tu stai pe loc un timp, ca să îți arăt cuvântul lui Dumnezeu.
౨౭ఊరి చివరకూ వస్తుండగా సమూయేలు సౌలుతో “నీ పనివాణ్ణి మనకంటే ముందుగా వెళ్ళమని చెప్పు. దేవుడు నీతో చెప్పమన్నది నేను నీకు తెలియజేసేవరకూ నువ్వు ఇక్కడే ఆగిపో” అని చెప్పగా సౌలు పనివాణ్ణి ముందుగా పంపివేశాడు.