< Números 20 >
1 As crianças de Israel, mesmo toda a congregação, entraram no deserto de Zin no primeiro mês. O povo permaneceu em Kadesh. Miriam morreu lá, e foi enterrada lá.
౧మొదటి నెలలో ఇశ్రాయేలీయుల సమాజమంతా సీను అనే నిర్జన బీడు ప్రాంతానికి వెళ్ళారు. వారు కాదేషులో శిబిరం వేసుకున్నారు. అక్కడ మిర్యాము చనిపోయింది. ఆమెను అక్కడ పాతిపెట్టారు.
2 Não havia água para a congregação; e eles se reuniram contra Moisés e contra Aarão.
౨ఆ సమాజానికి నీళ్లు లేనందువల్ల వారు మోషే అహరోనులకు విరోధంగా పోగయ్యారు.
3 O povo discutiu com Moisés e falou, dizendo: “Gostaríamos de ter morrido quando nossos irmãos morreram antes de Yahweh!
౩ప్రజలు మోషేను విమర్శిస్తూ “మా తోటి ఇశ్రాయేలీయులు యెహోవా ముంగిట్లో చనిపోయినప్పుడు మేము కూడా చనిపోతే బాగుండేది!
4 Por que vocês trouxeram a assembléia de Iavé para este deserto, para que morrêssemos lá, nós e nossos animais?
౪మేమూ మా పశువులూ చనిపోడానికి యెహోవా సమాజాన్ని ఈ నిర్జన బీడు ప్రాంతంలోకి ఎందుకు తీసుకొచ్చావు?
5 Por que vocês nos fizeram subir do Egito, para nos trazer para este lugar maligno? Não é lugar de semente, nem de figos, nem de figos, nem de videiras, nem de romãs; também não há água para beber”.
౫ఈ భయంకరమైన ప్రాంతానికి మమ్మల్ని తీసుకు రావడానికి ఐగుప్తులోనుంచి మమ్మల్ని ఎందుకు రప్పించావు? ఈ ప్రాంతంలో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, తాగడానికి నీళ్ళే లేవు” అన్నారు.
6 Moisés e Aaron passaram da presença da assembléia para a porta da Tenda da Reunião, e caíram de cara. A glória de Yahweh apareceu para eles.
౬అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుట నుంచి సన్నిధి గుడారపు ద్వారం లోకి వెళ్లి సాగిలపడినప్పుడు, యెహోవా మహిమ వాళ్లకు కనిపించింది.
7 Yahweh falou a Moisés, dizendo:
౭అప్పుడు యెహోవా మోషేతో,
8 “Pegue a vara, e reúna a congregação, você e Aarão, seu irmão, e fale com a pedra diante dos olhos deles, para que ela derrame sua água. Tirarás água da rocha para eles; assim darás de beber à congregação e ao gado deles”.
౮“నువ్వు నీ కర్ర తీసుకుని, నువ్వూ, నీ సహోదరుడు అహరోను, ఈ సమాజం అంతట్నీటిని చేర్చి, వారి కళ్ళఎదుట ఆ బండతో మాట్లాడి, నీళ్ళు ప్రవహించమని దానికి ఆజ్ఞాపించు. నువ్వు వారి కోసం బండలోనుంచి నీళ్ళు రప్పించి, ఈ సమాజం, వారి పశువులూ తాగడానికి ఇవ్వాలి” అన్నాడు.
9 Moisés tomou a vara de antes de Yahweh, como ele lhe ordenou.
౯యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్టు, మోషే ఆయన సన్నిధిలోనుంచి ఆ కర్ర తీసుకెళ్ళాడు.
10 Moisés e Arão reuniram a assembléia diante da rocha, e ele lhes disse: “Ouçam agora, rebeldes! Devemos tirar água desta rocha para vocês”?
౧౦తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజాన్ని సమకూర్చినప్పుడు అతడు వారితో “తిరుగుబాటు జనాంగమా, వినండి. మేము ఈ బండలోనుంచి మీకోసం నీళ్ళు రప్పించాలా?” అన్నారు.
11 Moisés levantou a mão e bateu duas vezes na rocha com sua vara, e a água saiu abundantemente. A congregação e seu gado beberam.
౧౧అప్పుడు మోషే తన చెయ్యెత్తి రెండుసార్లు తన కర్రతో ఆ బండను కొట్టినప్పుడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి. ఆ సమాజం, పశువులూ తాగాయి.
12 Yahweh disse a Moisés e Aarão: “Porque não acreditastes em mim, para me santificardes aos olhos dos filhos de Israel, portanto não introduzireis esta assembléia na terra que eu lhes dei”.
౧౨అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “మీరు ఇశ్రాయేలీయుల దృష్టిలో నన్ను నమ్మలేదు, నా పవిత్రత నిలబెట్టలేదు గనక, నేను ఈ సమాజానికి ఇచ్చిన దేశంలోకి మీరు వారిని తీసుకెళ్లలేరు” అన్నాడు.
13 Estas são as águas do Meribah; porque as crianças de Israel lutaram com Yahweh, e ele foi santificado nelas.
౧౩ఈ నీళ్ళ ప్రాంతానికి మెరీబా అని పేరు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తన పవిత్రత చూపించుకున్నాడు.
14 Moisés enviou mensageiros de Kadesh para o rei de Edom, dizendo: “Seu irmão Israel diz: Você conhece todo o trabalho que nos aconteceu;
౧౪మోషే కాదేషు నుంచి ఎదోము రాజు దగ్గరికి రాయబారులను పంపించి “నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగుతున్నది ఏమంటే, మాకొచ్చిన కష్టమంతా నీకు తెలుసు.
15 how nossos pais desceram ao Egito, e nós vivemos no Egito por muito tempo. Os egípcios maltrataram a nós e a nossos pais.
౧౫మా పితరులు ఐగుప్తుకు వెళ్ళారు. మేము చాలా రోజులు ఐగుప్తులో ఉన్నాం. ఐగుప్తీయులు మమ్మల్ని, మా పితరులను బాధల పాలు చేశారు.
16 Quando choramos a Javé, ele ouviu nossa voz, enviou um anjo e nos tirou do Egito. Eis que estamos em Kadesh, uma cidade à beira de sua fronteira.
౧౬మేము యెహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన మా మొర విని, ఒక దూతను పంపించి ఐగుప్తులోనుంచి మమ్మల్ని రప్పించాడు. చూడు, మేము నీ సరిహద్దుల చివర ఉన్న కాదేషు పట్టణంలో ఉన్నాం.
17 “Por favor, deixe-nos passar por sua terra. Não passaremos pelo campo ou pela vinha, nem beberemos da água dos poços. Iremos pela rodovia do rei. Não nos desviaremos para a direita nem para a esquerda, até que tenhamos passado sua fronteira”.
౧౭మమ్మల్ని నీ దేశం గుండా దాటి వెళ్లనివ్వు. పొలాల్లోనుంచైనా, ద్రాక్షతోటల్లోనుంచైనా మేము వెళ్ళం. బావుల్లో నీళ్లు తాగం. రాజ మార్గంలో నడిచి వెళ్ళిపోతాం. నీ సరిహద్దులు దాటే వరకూ కుడివైపుకైనా. ఎడమవైపుకైనా తిరుగకుండా వెళ్ళిపోతాం” అని చెప్పించాడు.
18 Edom disse-lhe: “Você não passará por mim, para que eu não saia com a espada contra você”.
౧౮కాని ఎదోము రాజు “నువ్వు నా దేశంలోగుండా వెళ్లకూడదు. అలా వెళ్తే, నేను ఖడ్గంతో నీ మీద దాడి చేస్తాను” అని జవాబిచ్చాడు.
19 As crianças de Israel lhe disseram: “Subiremos pela estrada; e se bebermos sua água, eu e meu gado, então eu darei seu preço. Só me deixe, sem fazer mais nada, passar de pé”.
౧౯అప్పుడు ఇశ్రాయేలీయులు అతనితో “మేము రాజమార్గంలోనే వెళ్తాం. మేము గాని, మా పశువులుగాని నీ నీళ్లు తాగితే, దాని ఖర్చు చెల్లిస్తాం. కేవలం మమ్మల్ని కాలినడకతో వెళ్లనివ్వు అంతే” అన్నారు. అప్పుడు అతడు “నువ్వు రాకూడదు” అన్నాడు.
20 Ele disse: “Você não deve passar”. Edom saiu contra ele com muita gente, e com uma mão forte.
౨౦అప్పుడు ఎదోము రాజు అనేకమంది సైన్యంతో, మహా బలంతో బయలుదేరి, వారి మీదకు వచ్చాడు.
21 Thus Edom se recusou a dar passagem a Israel através de sua fronteira, então Israel se afastou dele.
౨౧ఎదోము రాజు ఇశ్రాయేలును తన సరిహద్దుల్లో గుండా దాటి వెళ్ళడానికి అనుమతించలేదు గనక ఇశ్రాయేలీయులు అతని దగ్గరనుంచి తిరిగి వెళ్ళిపోయారు.
22 Eles viajaram de Cades, e as crianças de Israel, até mesmo toda a congregação, vieram ao Monte Hor.
౨౨అప్పుడు ఇశ్రాయేలీయుల సమాజమంతా కాదేషులోనుంచి ప్రయాణం చేసి హోరు కొండకు వచ్చారు.
23 Javé falou com Moisés e Aarão no Monte Hor, junto à fronteira da terra de Edom, dizendo:
౨౩యెహోవా ఎదోము పొలిమేరల దగ్గరున్న హోరు కొండ దగ్గర మోషే అహరోనులతో మాట్లాడుతూ,
24 “Aarão será reunido ao seu povo, pois não entrará na terra que dei aos filhos de Israel, porque se rebelaram contra a minha palavra nas águas do Meribá.
౨౪“మీరిద్దరూ మెరీబా నీళ్ళ దగ్గర నా మాటలకు ఎదురు తిరిగారు గనక నేను ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేశంలో అహరోను ప్రవేశించకుండా, తన పితరులతో చేరిపోతాడు.
25 Leve Aarão e Eleazar, seu filho, e leve-os ao Monte Hor;
౨౫నువ్వు అహరోను, అతని కొడుకు ఎలియాజరును తీసుకుని హోరు కొండెక్కి,
26 e despoje Aarão de suas vestes, e coloque-os sobre Eleazar, seu filho. Arão será recolhido, e morrerá ali”.
౨౬అహరోను వస్త్రాలు తీసి అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించు. అహరోను తన పితరులతో చేరి అక్కడ చనిపోతాడు” అన్నాడు.
27 Moisés fez como ordenou Yahweh. Eles subiram ao Monte Hor, à vista de toda a congregação.
౨౭యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే చేశాడు. సమాజమంతా చూస్తూ ఉన్నప్పుడు వారు హోరు కొండ ఎక్కారు.
28 Moisés despiu Arão de suas vestes, e as colocou sobre Eleazar, seu filho. Aarão morreu lá no topo da montanha, e Moisés e Eleazar desceram da montanha.
౨౮మోషే అహరోను వస్త్రాలు తీసి, అతని కొడుకు ఎలియాజరుకు తొడిగించాడు. అహరోను కొండశిఖరం మీద చనిపోయాడు. తరువాత మోషే, ఎలియాజరు ఆ కొండ దిగి వచ్చారు.
29 Quando toda a congregação viu que Aarão estava morto, eles choraram por Aarão trinta dias, até mesmo por toda a casa de Israel.
౨౯అహరోను చనిపోయాడని సమాజమంతా గ్రహించినప్పుడు, ఇశ్రాయేలీయుల కుటుంబాలన్నీ అహరోను కోసం ముప్ఫై రోజులు శోకించారు.