< Neemias 3 >
1 Então Eliashib, o sumo sacerdote, levantou-se com seus irmãos, os sacerdotes, e eles construíram o portão das ovelhas. Eles a santificaram, e montaram suas portas. Santificaram-na até a torre de Hammeah, até a torre de Hananel.
౧ప్రధానయాజకుడు ఎల్యాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు నూరవ గోపురం, హనన్యేలు గోపురం వరకూ ప్రతిష్టించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు.
2 Ao seu lado, os homens de Jericó construíram. Ao lado deles Zaccur, o filho de Imri, construiu.
౨వారిని ఆనుకుని యెరికో పట్టణం వారు కట్టారు, వారిని ఆనుకుని ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు.
3 Os filhos de Hassenaah construíram o portão do peixe. Eles colocaram suas vigas e montaram suas portas, seus parafusos e suas barras.
౩హస్సెనాయా వంశం వారు చేప ద్వారం కట్టారు. వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
4 Ao lado deles, Meremoth, o filho de Uriah, o filho de Hakkoz, fez reparos. Ao lado deles, Meshullam, filho de Berechiah, o filho de Meshezabel, fez reparos. Junto a eles, Zadok, filho de Baana, fez reparos.
౪వారిని ఆనుకుని హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు బాగుచేశాడు. అతని పక్కన మెషేజబెయేలు మనవడు బెరెక్యా కొడుకు మెషుల్లాము, అతని పక్కన బయనా కొడుకు సాదోకు బాగు చేశారు.
5 Ao lado deles, os tecoítas fizeram reparos; mas seus nobres não colocaram seu pescoço na obra do Senhor.
౫వారిని ఆనుకుని తెకోవ ఊరివాళ్ళు బాగు చేశారు. అయితే తమ అధికారులు చెప్పిన పని చేయడానికి వారి నాయకులు నిరాకరించారు.
6 Joiada, filho de Paseah, e Meshullam, filho de Besodeiah, repararam o antigo portão. Eles colocaram suas vigas e montaram suas portas, seus parafusos e suas barras.
౬పాసెయ కొడుకు యెహోయాదా, బెసోద్యా కొడుకు మెషుల్లాము పాత ద్వారం బాగుచేసి దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు.
7 Ao lado deles, Melatiah o Gibeonita e Jadon o Meronothite, os homens de Gibeon e de Mizpah, consertaram a residência do governador além do rio.
౭వారి పక్కన గిబియోనీయుడు మెలట్యా, మేరోనీతీవాడు యాదోను బాగుచేశారు. వాళ్ళు గిబియోను, మిస్పా పట్టణాల ప్రముఖులు. నది అవతలి ప్రాంతం గవర్నరు నివసించే భవనం వరకూ ఉన్న గోడను వారు బాగు చేశారు.
8 Ao seu lado, Uzziel, o filho de Harhaiah, ourives, fez reparos. Ao seu lado, Hananias, um dos perfumistas, fez reparos, e eles fortificaram Jerusalém até o largo muro.
౮వారి పక్కనే కంసాలి పనివారి బంధువు హర్హయా కొడుకు ఉజ్జీయేలు బాగుచేయడానికి సిద్ధమయ్యాడు. అతని పక్కనే పరిమళ ద్రవ్యాలు చేసే హనన్యా పని జరిగిస్తున్నాడు. వాళ్ళు వెడల్పు గోడ వరకూన్న యెరూషలేమును తిరిగి కట్టారు.
9 Ao lado deles, Rephaiah, o filho de Hur, o governante de metade do distrito de Jerusalém, fez reparos.
౯వారి పక్కన యెరూషలేంలో సగ భాగానికి అధికారి హూరు కొడుకు రెఫాయా బాగు చేశాడు.
10 Ao lado deles, Jedaías, o filho de Harumaph, fez reparos em frente à sua casa. Ao lado dele, Hattush, o filho de Hasabneia, fez reparos.
౧౦అతని పక్కన హరూమపు కొడుకు యెదాయా తన యింటికి ఎదురుగా ఉన్న స్థలాన్ని బాగు చేశాడు. అతని పక్కన హషబ్నెయా కొడుకు హట్టూషు పని జరిగిస్తున్నాడు.
11 Malchijah, filho de Harim, e Hasshub, filho de Pahathmoab, consertaram outra porção e a torre dos fornos.
౧౧రెండవ భాగాన్ని, అగ్నిగుండాల గోపురాన్ని హారిము కొడుకు మల్కీయా, పహత్మోయాబు కొడుకు హష్షూబు బాగు చేశారు.
12 Ao lado dele, Salum o filho de Hallohesh, o governante de metade do distrito de Jerusalém, ele e suas filhas fizeram reparos.
౧౨వారి పక్కన యెరూషలేం నగరం సగభాగానికి అధికారి హల్లోహెషు కొడుకు షల్లూము, అతని కూతుళ్ళు బాగు చేశారు.
13 Hanun e os habitantes de Zanoah repararam o portão do vale. Eles o construíram e montaram suas portas, seus parafusos e suas barras e mil cúbitos da parede até o portão do esterco.
౧౩హానూను, జానోహ కాపురస్థులు లోయ ద్వారం బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు, తాళాలు, గడులు అమర్చారు. ఇది కాకుండా పెంట ద్వారం వరకూ వెయ్యి మూరల గోడ కట్టారు.
14 Malchijah o filho de Rechab, o governante do distrito de Beth Haccherem, reparou o portão do esterco. Ele o construiu e montou suas portas, seus ferrolhos e suas barras.
౧౪బేత్‌హక్కెరెం ప్రదేశానికి అధికారి రేకాబు కొడుకు మల్కీయా పెంట ద్వారం బాగుచేశాడు. దాన్ని కట్టి తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు.
15 Shallun o filho de Colhozeh, o governante do distrito de Mizpah, reparou o portão de mola. Ele o construiu, cobriu-o e montou suas portas, seus ferrolhos e suas barras; e reparou o muro da piscina de Selá junto ao jardim do rei, até as escadas que descem da cidade de Davi.
౧౫ఆ తరువాత మిస్పా ప్రదేశానికి అధికారియైన కొల్హోజె కొడుకు షల్లూము ఊట ద్వారాన్ని తిరిగి కట్టి, దానికి పైకప్పు పెట్టి, తలుపులు నిలబెట్టారు, తాళాలు, గడులు అమర్చాడు. ఇంతేకాక, దావీదు నగరు నుండి దిగువకు వెళ్ళే మెట్ల దాకా రాజు తోటలో ఉన్న సిలోయము వాగు గోడ కూడా కట్టాడు.
16 Depois dele, Neemias, filho de Azbuk, o governante de metade do distrito de Bet Zur, fez reparos no lugar em frente aos túmulos de Davi, e na piscina que foi feita, e na casa dos homens poderosos.
౧౬దాని పక్కన ఉన్న బేత్సూరులో సగ భాగాన్ని అధికారి అజ్బూకు కొడుకు నెహెమ్యా బాగు చేశాడు. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకూ కట్టి ఉన్న కోనేరు వరకూ, యుద్ధవీరుల ఇళ్ళ వరకూ కట్టాడు.
17 Depois dele, os Levitas-Rehum, o filho de Bani, fizeram reparos. Ao seu lado, Hashabiah, o governante de metade do distrito de Keilah, fez reparos em seu distrito.
౧౭దాని పక్కన లేవీయులు బాగుచేశారు. వారిలో బానీ కొడుకు రెహూము ఉన్నాడు. దాన్ని ఆనుకుని అధికారి హషబ్యా తన భాగం నుండి కెయిలాకు చెందిన సగభాగం దాకా బాగు చేశాడు.
18 Depois dele, seus irmãos, Bavvai, filho de Henadad, o governante da metade do distrito de Keilah, fizeram reparos.
౧౮కెయీలాలో సగభాగానికి అధికారిగా ఉన్న వారి సహోదరుడు, హేనాదాదు కొడుకు బవ్వై బాగు చేశాడు.
19 Ao seu lado, Ezer, filho de Jeshua, o governante de Mizpah, reparou outra porção, desde a subida até a armaria, no virar do muro.
౧౯దాని పక్కన మిస్పాకు అధిపతి అయిన యేషూవ కొడుకు ఏజెరు ఆయుధాగారం దారికి ఎదురుగా ఉన్న గోడ మలుపు ప్రక్కన, మరో భాగం బాగు చేశాడు.
20 Depois dele, Baruch, o filho de Zabbai, consertou com seriedade outra porção, desde o virar do muro até a porta da casa de Eliashib, o sumo sacerdote.
౨౦ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడు ఎల్యాషీబు ఇంటి ద్వారం దాకా ఉన్న మరొక భాగాన్ని జబ్బయి కొడుకు బారూకు శ్రద్ధగా బాగు చేశాడు.
21 Depois dele, Meremoth, filho de Uriah, filho de Hakkoz, reparou outra porção, desde a porta da casa de Eliashib até o final da casa de Eliashib.
౨౧హక్కోజు మనవడు, ఊరియా కొడుకు మెరేమోతు మరొక భాగాన్ని అంటే ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి చివరి వరకూ బాగు చేశాడు.
22 Depois dele, os sacerdotes, os homens das redondezas, fizeram reparos.
౨౨దాన్ని అనుకుని యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే యాజకులు బాగు చేశారు.
23 Depois deles, Benjamin e Hasshub fizeram reparos do outro lado de sua casa. Depois deles, Azarias, filho de Maaséias, filho de Ananias, fez reparos ao lado de sua própria casa.
౨౩దాని పక్కన తమ యింటికి ఎదురుగా బెన్యామీను, హష్షూబు అనేవారు బాగు చేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు, మయశేయా కొడుకు అజర్యా తన యింటి దగ్గర బాగు చేశాడు.
24 Depois dele, Binnui, filho de Henadad, reparou outra porção, da casa de Azarias até o virar do muro, e até a esquina.
౨౪అజర్యా ఇంటి దగ్గర నుంచి గోడ మలుపు మూల వరకూ మరో భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి బాగు చేశాడు.
25 Palal o filho de Uzai fez reparos em frente ao virar do muro, e a torre que se destaca da casa superior do rei, que fica ao lado da corte da guarda. Depois dele, Pedaiah, o filho de Parosh, fez reparos.
౨౫ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజు భవనం ఉండే మహా గోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగు చేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగు చేశాడు.
26 (Agora os servos do templo viviam em Ophel, para o lugar em frente ao portão de água em direção ao leste, e a torre que se destaca).
౨౬ఓపెలులో నివసించే దేవాలయ సేవకులు తూర్పున నీటి ద్వారం పక్కన, గోపురం దగ్గర బాగు చేశారు.
27 Depois dele os tecoítas repararam outra porção, em frente à grande torre que se destaca, e para a parede de Ofel.
౨౭తెకోవీయులు ఓపెలు గోడ వరకూ గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న మరో భాగాన్ని బాగు చేశారు.
28 Acima do portão do cavalo, os padres fizeram reparos, todos do outro lado de sua própria casa.
౨౮గుర్రం ద్వారం దాటుకుని ఉన్న యాజకులంతా తమ తమ ఇళ్ళకు ఎదురుగా బాగు చేశారు.
29 Depois deles, Zadok, o filho de Immer, fez reparos do outro lado de sua própria casa. Depois dele, Shemaiah, o filho de Shecaniah, o guardião do portão leste, fez reparos.
౨౯వారి పక్కన ఇమ్మేరు కొడుకు సాదోకు తన ఇంటికి ఎదురుగా బాగు చేశాడు. తూర్పు ద్వారాన్ని కాపలా కాసే షెకన్యా కొడుకు షెమయా దాని పక్కన బాగు చేశాడు.
30 Depois dele, Hananiah, filho de Selemias, e Hanun, o sexto filho de Zalaf, repararam outra porção. Depois dele, Meshullam, o filho de Berequias, fez reparos do outro lado de seu quarto.
౩౦దాని పక్కన షెలెమ్యా కొడుకు హనన్యా, జాలాపు ఆరవ కొడుకు హానూను మరో భాగాన్ని బాగు చేశారు. బెరెక్యా కొడుకు మెషుల్లాము తన గదికి ఎదురుగా ఉన్న స్థలం బాగు చేశాడు.
31 Depois dele, Malchijah, um dos ourives da casa dos criados do templo, e dos comerciantes, fez reparos em frente ao portão de Hammiphkad e à subida da esquina.
౩౧ఆలయ సేవకుల స్థలానికి, పరిశీలన ద్వారానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకూ కంసాలి మల్కీయా బాగు చేశాడు.
32 Entre a subida da esquina e o portão das ovelhas, os ourives e os mercadores fizeram reparos.
౩౨మూలనున్న పై గది నుండి గొర్రెల ద్వారం మధ్య వరకూ కంసాలులు, వర్తకులు బాగు చేశారు.