< Eclesiastes 8 >
1 Quem é como o homem sábio? E quem sabe a interpretação de uma coisa? A sabedoria de um homem faz seu rosto brilhar, e a dureza de seu rosto é mudada.
౧జ్ఞానులంటే ఎవరు? జీవితంలో జరిగేవి ఏమిటి, ఎలా అనే విషయాలు ఎరిగినవారు. మనుషుల జ్ఞానం వారి ముఖానికి తేజస్సు నిస్తుంది. దాని వలన వారి కఠినత్వం మారుతుంది.
2 Eu digo: “Mantenha a ordem do rei!” por causa do juramento a Deus.
౨నువ్వు దేవుని ఎదుట ఒట్టు పెట్టుకున్నట్టుగా రాజు ఆజ్ఞలకు లోబడి నడుచుకో.
3 Não se apressem a sair de sua presença. Não persista em uma coisa má, pois ele faz o que lhe agrada,
౩రాజు సన్నిధి నుండి హడావుడిగా బయటికి వెళ్లకు. అతడు అనుకున్న దానంతటినీ జరిగించగలడు కాబట్టి చెడు కార్యాల్లో పాలు పుచ్చుకోకు.
4 pois a palavra do rei é suprema. Quem pode dizer a ele: “O que você está fazendo?”.
౪రాజుల ఆజ్ఞ అధికారంతో కూడినది. “నువ్వు చేసేది ఏమిటి?” అని రాజును అడిగే వాడెవడు?
5 Quem guardar o mandamento não fará mal, e seu sábio coração saberá o tempo e o procedimento.
౫రాజుకు లోబడేవాడికి ఏ కీడూ జరగదు. ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో జ్ఞానుల హృదయాలకు తెలుసు.
6 Pois há um tempo e um procedimento para cada propósito, embora a miséria do homem seja pesada sobre ele.
౬ప్రతి దానికీ ఒక స్పందన, ఒక సమయం నియామకమై ఉంది. అలా లేకపోతే మనుష్యులకు జరిగే కీడు అధికమైపోతుంది.
7 Pois ele não sabe o que será; pois quem poderá dizer-lhe como será?
౭జరగబోయేది మనుషులకి తెలియదు. రాబోయే దాని గురించి ఎవరు చెప్పగలరు?
8 Não há homem que tenha poder sobre o espírito para conter o espírito; nem ele tem poder sobre o dia da morte. Na guerra não há descarga; nem a impiedade libertará aqueles que a praticam.
౮ఊపిరి విడవకుండా ఆపుచేయగల అధికారం ఎవరికీ లేదు. తన చావు రోజుపై ఎవరికీ అధికారం లేదు. యుద్దం జరిగే సమయంలో ఎవరికీ విడుదల దొరకదు. దుష్టత్వం దాన్ని వెంబడించే వారిని తప్పించలేదు.
9 Tudo isso eu tenho visto e aplicado minha mente a todo trabalho que é feito sob o sol. Há um tempo em que um homem tem poder sobre outro para sua dor.
౯సూర్యుని కింద జరిగే ప్రతి పని గురించి నేను తీవ్రంగా ఆలోచించినప్పుడు ఇదంతా నాకు తెలిసింది. ఒకడు మరొకడిపై ఉన్న అధికారంతో వాడికి కీడు జరిగిస్తాడు.
10 Então eu vi os malvados enterrados. De fato, eles vieram também da santidade. Eles foram e foram esquecidos na cidade onde fizeram isso. Isto também é vaidade.
౧౦దుష్టులను సక్రమంగా పాతిపెట్టడం, పరిశుద్ధ స్థలం నుండి తీసుకుపోవడం, వారు ఎక్కడ చెడ్డ పనులు చేశారో అదే పట్టణస్థులు వారిని పొగడడం నేను చూశాను. ఇది కూడా నిష్ప్రయోజనమే.
11 Porque a sentença contra uma obra maligna não é executada rapidamente, portanto, o coração dos filhos dos homens está totalmente estabelecido neles para fazer o mal.
౧౧చెడు పనికి తగిన శిక్ష వెంటనే కలగకపోవడం చూసి మనుషులు భయం లేకుండా చెడ్డ పనులు చేస్తారు.
12 Embora um pecador cometa crimes cem vezes, e viva por muito tempo, sei certamente que será melhor com aqueles que temem a Deus, que são reverentes diante dele.
౧౨ఒక దుర్మార్గుడు వంద సార్లు పాపం చేసి దీర్ఘకాలం జీవించినా, దేవునిలో భయభక్తులు కలిగి ఆయన సన్నిధిని గౌరవించేవారు క్షేమంగా ఉంటారని నాకు తెలుసు.
13 Mas não será bom com os ímpios, nem prolongará os dias como uma sombra, porque não teme a Deus.
౧౩దుర్మార్గులు దేవుని సన్నిధికి భయపడరు కాబట్టి వారికి క్షేమం ఉండదు. వారి జీవితకాలం అశాశ్వతమైన నీడలాగా ఉంటుంది.
14 Há uma vaidade que é feita na terra, que há homens justos a quem isso acontece de acordo com o trabalho dos ímpios. Novamente, há homens maus a quem isso acontece de acordo com a obra dos justos. Eu disse que isso também é vaidade.
౧౪సూర్యుని కింద మరొక నిష్ప్రయోజనమైంది జరుగుతూ ఉంది. అదేమంటే భక్తిహీనులకు జరిగినట్టు నీతిమంతుల్లో కొందరికీ నీతిమంతులకు జరిగినట్టు భక్తిహీనుల్లో కొందరికీ జరుగుతున్నది. ఇది కూడా నిష్ప్రయోజనమే అని నేను అనుకున్నాను.
15 Então eu elogiei a alegria, porque um homem não tem coisa melhor sob o sol do que comer, beber, e alegrar-se: pois isso o acompanhará em seu trabalho todos os dias de sua vida que Deus lhe deu sob o sol.
౧౫అన్నపానాలు పుచ్చుకుని సంతోషించడం కంటే మనుషులకు మంచి విషయమేమీ లేదు. మనిషి పని చేసి కష్టపడాలని దేవుడు వారికి నియమించిన అతని జీవిత కాలమంతా వారికి తోడుగా ఉండేది వారి సంతోషమే.
16 Quando eu apliquei meu coração para conhecer a sabedoria, e para ver o negócio que é feito na terra (mesmo que os olhos não vejam sono dia ou noite),
౧౬జ్ఞానాన్ని అభ్యసించడానికీ మనుషులు దివారాత్రులు నిద్ర లేకుండా చేసే వ్యాపారాలను పరిశీలించి చూశాను.
17 então eu vi todo o trabalho de Deus, que o homem não pode descobrir o trabalho que é feito sob o sol, porque por mais que um homem trabalhe para buscá-lo, ele não vai encontrá-lo. Sim, mesmo que um homem sábio pense que pode compreendê-lo, ele não será capaz de encontrá-lo.
౧౭దేవుని పనులన్నిటినీ నేను గమనించాను. సూర్యుని కింద జరిగే సంగతులను మనుషులు ఎంత ప్రయత్నించినా గ్రహించలేరనీ, దాన్ని తెలుసుకోవాలని చివరికి జ్ఞానులు పూనుకున్నప్పటికీ వారు సైతం గ్రహించలేరనీ నేను తెలుసుకున్నాను.