< Apocalipse 8 >
1 Quando o Cordeiro abriu o sétimo selo, houve um longo silêncio no céu, que durou quase meia hora.
౧ఆయన ఏడవ సీలు తెరిచినప్పుడు పరలోకంలో దాదాపు అరగంట సేపు నిశ్శబ్దం అలుముకుంది.
2 Eu vi os sete anjos que estavam em pé diante do trono. Eles receberam sete trombetas.
౨అప్పుడు నేను దేవుని సమక్షంలో నిలబడే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బాకాలు ఇచ్చారు.
3 E depois, outro anjo veio e ficou ao lado do altar. Ele tinha um incensário de ouro e recebeu uma grande quantidade de incenso para acrescentar às orações de todos os santos no altar dourado, que está diante do trono.
౩మరో దూత ధూపం వేసే బంగారు పాత్ర చేత్తో పట్టుకుని వచ్చి బలిపీఠం ముందు నిలుచున్నాడు. సింహాసనం ఎదుట ఉన్న బంగారు బలిపీఠంపై పరిశుద్ధుల ప్రార్థనలతో కలపడానికి చాలా పరిమళ సాంబ్రాణి అతనికి ఇచ్చారు.
4 E da mão do anjo que estava diante de Deus subiu a fumaça do incenso juntamente com as orações dos santos.
౪అప్పుడు ఆ దూత చేతిలో నుండి పరిమళ వాసనలు, సాంబ్రాణి పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలసి పైకి లేచి దేవుని సమక్షంలోకి వెళ్ళాయి.
5 O anjo pegou o incensário e o encheu com o fogo do altar e, depois, jogou-o sobre a terra. Ouviu-se, então, o som de trovões, houve clarões dos relâmpagos e um terremoto.
౫ఆ దూత ధూపం వేసే పాత్రను తీసుకుని, బలిపీఠం పైన ఉన్న నిప్పు కణికలతో దాన్ని నింపి భూమి మీదికి విసిరి వేశాడు. అప్పుడు గర్జనలాంటి శబ్దాలూ, ఉరుములూ, మెరుపులూ, భూకంపమూ కలిగాయి.
6 Assim, os sete anjos que estavam com as trombetas se prepararam para tocá-las.
౬అప్పుడు ఏడు బాకాలు పట్టుకున్న ఆ ఏడుగురు దూతలు వాటిని ఊదడానికి సిద్ధం అయ్యారు.
7 O primeiro anjo tocou a sua trombeta. Pedras de gelo e fogo misturados com sangue caíram sobre a terra. Um terço da terra foi queimado, um terço das árvores se queimou, e toda a erva verde foi consumida pelas chamas.
౭మొదటి దూత బాకా ఊదినప్పుడు రక్తంతో కలసిన వడగళ్ళూ నిప్పూ భూమి మీద కురిశాయి. దాని మూలంగా భూమి మీద మూడవ భాగం, చెట్లలో మూడవ భాగం తగలబడి పోయాయి. పచ్చగడ్డి అంతా తగలబడిపోయింది.
8 O segundo anjo tocou a sua trombeta. Algo parecido com uma montanha imensa de fogo flamejante foi jogado no mar. Um terço do mar se transformou em sangue,
౮రెండవ దూత బాకా ఊదినప్పుడు భగభగ మండుతూ ఉన్న ఒక పెద్ద కొండ లాంటిది సముద్రంలో పడింది. దాని మూలంగా సముద్రంలో మూడవ భాగం రక్తం అయిపోయింది.
9 e um terço das criaturas que viviam no mar morreu. Além disso, um terço de todos os navios foi destruído.
౯సముద్రంలోని ప్రాణుల్లో మూడవ భాగం చచ్చిపోయాయి. ఓడల్లో మూడోభాగం నాశనం అయ్యాయి.
10 O terceiro anjo tocou a sua trombeta. Uma grande estrela caiu do céu, queimando brilhantemente. Ela caiu sobre um terço dos rios e das fontes de água.
౧౦మూడవ దూత బాకా ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం కాగడాలాగా మండిపోతూ ఆకాశం నుండి రాలిపోయింది. అది భూమి మీద ఉన్న నదుల్లో మూడవ భాగం పైనా, నీటి ఊటల పైనా పడింది.
11 O nome da estrela é Absinto, e um terço da água ficou amarga. E muitas pessoas morreram ao beber a água, porque ela havia se tornado venenosa.
౧౧ఆ నక్షత్రం పేరు “చేదు.” కాబట్టి నీళ్ళలో మూడవ భాగం చేదై పోయాయి. నీళ్ళు చేదై పోవడం వల్ల దాని మూలంగా చాలా మంది చచ్చిపోయారు.
12 O quarto anjo tocou a sua trombeta. Um terço do sol, da lua e das estrelas foi atingido, fazendo com que um terço deles perdesse o seu brilho. Assim, uma terça parte do dia perderia a sua luz, tornando-se como a noite.
౧౨నాలుగవ దూత బాకా ఊదినప్పుడు సూర్యుడిలో మూడవ భాగం, చంద్రుడిలో మూడోభాగం, నక్షత్రాల్లో మూడవభాగం దెబ్బ తిన్నాయి. కాబట్టి వాటిలో మూడోభాగం కాంతి విహీనం అయ్యాయి, చీకటిగా మారాయి. దాంతో పగలు మూడవ భాగం, రాత్రి మూడవ భాగం వెలుగు లేకుండా పోయింది.
13 Eu vi e ouvi uma águia voando no meio do céu, dizendo bem alto: “Ai de vocês! Ai de vocês! Ai de vocês que estiverem vivendo na terra, quando os três últimos anjos tocarem as suas trombetas!”
౧౩తరువాత ఆకాశంలో ఎగురుతున్న ఒక పెద్ద డేగను నేను చూశాను. అది ఎగురుతూ “ఇంకా బాకాలు ఊదబోతున్న మిగిలిన ముగ్గురు దేవదూతల బాకా శబ్దాలను బట్టి భూమిపై నివసించే వారికి అయ్యో, ఎంత యాతన, ఎంత యాతన, ఎంత యాతన!” అంటూ బిగ్గరగా అరుస్తుంటే విన్నాను.