< 1 Coríntios 16 >
1 Agora vou tratar da questão do “dinheiro para ajudar os irmãos na fé em necessidade.” Eu lhes darei as mesmas orientações que dei para as igrejas na província da Galácia.
౧పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
2 No primeiro dia da semana, todos vocês devem separar certa quantia do dinheiro que ganharam. Quando eu estiver aí com vocês, não quero que haja qualquer coleta de dinheiro.
౨నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
3 Quando eu chegar, escreverei cartas de recomendação para quem vocês escolherem, e eles levarão as suas doações para Jerusalém.
౩నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
4 Se eu conseguir ir também, eles poderão ir comigo.
౪నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
5 Depois que eu visitar a província da Macedônia, planejo ir vê-los. Eu viajarei pela Macedônia,
౫నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.
6 e pode ser que eu fique com vocês por algum tempo, talvez durante o inverno. E depois, vocês poderão me ajudar na minha viagem para onde eu estiver indo.
౬అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 Dessa vez, eu não quero ir para vê-los e apenas fazer uma visita breve. Eu espero que possa ficar por um tempo maior com vocês se, assim, o Senhor permitir.
౭ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
8 No entanto, ficarei aqui em Éfeso até o dia de Pentecostes,
౮కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.
9 pois surgiu uma grande oportunidade para mim aqui, embora muita gente esteja contra mim.
౯ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
10 Mas, se Timóteo chegar aí, garantam que ele não terá nada a temer ao estar com vocês, pois ele está trabalhando para o Senhor, exatamente como eu estou.
౧౦తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
11 Não deixem que ele seja desprezado. Peço que vocês o ajudem a continuar a sua viagem, para que ele venha me encontrar em paz, pois tanto eu quanto os outros irmãos e irmãs esperamos por ele.
౧౧కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12 Quanto ao nosso irmão Apolo, eu o incentivei a ir vê-los, juntamente com outros irmãos, mas ele não estava disposto a ir nesse momento. Ele irá visitá-los assim que possível.
౧౨సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13 Fiquem atentos. Permaneçam firmes em sua fé em Deus. Tomem coragem. Sejam fortes.
౧౩మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
14 Qualquer coisa que resolvam fazer, façam com amor.
౧౪మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15 Quero que saibam que Estéfanas e sua família foram os primeiros cristãos convertidos na província da Acaia. Eles se dedicaram a ajudar o povo de Deus. Peço a vocês
౧౫స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
16 que aceitem a liderança deles e que respeitem todas as pessoas que ajudam no trabalho com dedicação.
౧౬కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
17 Eu estou contente por Estéfanas, Fortunato e Acaico terem chegado aqui, pois eles fizeram o que vocês não puderam fazer, por estarem ausentes.
౧౭స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.
18 Eles têm sido uma grande fonte de incentivo para mim e para vocês. Pessoas assim merecem o devido reconhecimento.
౧౮నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
19 As igrejas da Ásia enviam saudações. Áquila e sua esposa, Priscila, juntamente com a igreja que se reúne na casa deles, também enviam saudações.
౧౯ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
20 Todos os irmãos e irmãs daqui desejam felicidades a vocês. Cumprimentem-se com um beijo de irmão.
౨౦ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
21 Sou eu mesmo, Paulo, que escrevo esta saudação.
౨౧పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.
22 Quem não ama o Senhor deveria ser excluído da igreja. Venha, Senhor!
౨౨ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
23 Que a graça do nosso Senhor Jesus Cristo esteja com vocês!
౨౩ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
24 Que meu amor esteja com vocês todos, em Cristo Jesus! Amém!
౨౪క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్.