< 1 Reis 10 >
1 E ouvindo a rainha de Sabá a fama de Salomão no nome do SENHOR, veio a provar-lhe com perguntas.
౧షేబదేశపు రాణి యెహోవా పేరును గురించీ సొలొమోను కీర్తిని గురించీ విని, కఠినమైన చిక్కు ప్రశ్నలతో అతణ్ణి పరీక్షించడానికి వచ్చింది.
2 E veio a Jerusalém com muito grande comitiva, com camelos carregados de especiarias, e ouro em grande abundância, e pedras preciosas: e quando veio a Salomão, propôs-lhe todo o que em seu coração tinha.
౨ఆమె గొప్ప పరివారంతో, సుగంధ ద్రవ్యాలు, విస్తారమైన బంగారం, రత్నాలు ఒంటెల మీద ఎక్కించుకుని యెరూషలేముకు వచ్చింది. సొలొమోనును కలిసి అతనితో తన మనసులో ఉన్న సంగతులన్నిటిని గురించి మాటలాడింది.
3 E Salomão lhe declarou todas suas palavras: nenhuma coisa se lhe escondeu ao rei, que não lhe declarasse.
౩ఆమె అడిగిన ప్రశ్నలన్నిటికి సొలొమోను జవాబు చెప్పాడు. రాజుకు తెలియని సంగతి ఏదీ లేదు కాబట్టి అతడు ఆమె అనుమానాలన్నిటినీ నివృత్తి చేశాడు.
4 E quando a rainha de Sabá viu toda a sabedoria de Salomão, e a casa que havia edificado,
౪షేబ రాణి సొలొమోను జ్ఞానాన్ని, అతడు కట్టించిన మందిరాన్ని,
5 Também a comida de sua mesa, o assento de seus servos, o estado e roupas dos que lhe serviam, seus mestres-salas, e seus holocaustos que sacrificava na casa do SENHOR, ficou pasma.
౫అతని భోజనం బల్ల మీద ఉన్న పదార్థాలను, అతని సేవకులు కూర్చునే ఆసనాలను అతని పరిచారకులు కనిపెట్టి చూసే విధానం, వారి వస్త్రాలను, అతనికి రస పాత్రలను అందించేవారిని, యెహోవా మందిరంలో అతడు అర్పించే దహనబలులను చూసింది. ఆమెకు కలిగిన ఆశ్చర్యం ఇంతింత కాదు.
6 E disse ao rei: Verdade é o que ouvi em minha terra de tuas coisas e de tua sabedoria;
౬ఆమె రాజుతో ఇలా అంది. “నీవు చేసిన పనుల గురించీ నీ జ్ఞానం గురించీ నా దేశంలో నేను విన్న మాట నిజమే.
7 Mas eu não o cria, até que vim, e meus olhos viram, que nem ainda a metade foi o que se me disse: é maior tua sabedoria e bem que a fama que eu havia ouvido.
౭కానీ నేను వచ్చి నా కళ్ళారా చూడకముందు ఆ మాటలు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ వాస్తవంగా ఉన్నదానిలో వారు సగం కూడా నాకు చెప్పలేదని నేను గ్రహించాను. నీ జ్ఞానం, నీ ఐశ్వర్యం నేను విన్నదానికంటే ఎంతో అధికంగా ఉన్నాయి.
8 Bem-aventurados teus homens, ditosos estes teus servos, que estão continuamente diante de ti, e ouvem tua sabedoria.
౮నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు! నీ ఎదుట ఎప్పుడూ నిలబడి నీ జ్ఞానవాక్కులు వింటూ ఉండే నీ సేవకులు ఎంత ధన్య జీవులు!
9 o SENHOR teu Deus seja bendito, que se agradou de ti para te pôr no trono de Israel; porque o SENHOR amou sempre a Israel, e te pôs por rei, para que faças direito e justiça.
౯నీలో ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడు యెహోవాకు స్తుతి కలుగు గాక. ఇశ్రాయేలీయులపై యెహోవా ప్రేమ శాశ్వతం కాబట్టి నీతి న్యాయాలకు కట్టుబడి రాచకార్యాలు జరిగించడానికి ఆయన నిన్ను నియమించాడు.”
10 E deu ela ao rei cento e vinte talentos de ouro, e muita especiaria, e pedras preciosas: nunca veio tão grande quantidade de especiarias, como a rainha de Sabá deu ao rei Salomão.
౧౦షేబ దేశపు రాణి సొలొమోనుకు సుమారు నాలుగున్నర వేల బంగారం, బహు విస్తారమైన సుగంధ ద్రవ్యాలు, రత్నాలు ఇచ్చింది. రాజైన సొలొమోనుకు ఆమె ఇచ్చినంత విస్తారమైన సుగంధ ద్రవ్యాలు ఇంకెప్పుడూ రాలేదు.
11 A frota de Hirão que havia trazido o ouro de Ofir, trazia também de Ofir muita madeira de sândalo, e pedras preciosas.
౧౧ఓఫీరు దేశం నుండి బంగారం తెచ్చిన హీరాము ఓడలు అక్కడి నుండి గంధం చెక్క, రత్నాలు, ఎంతో విస్తారంగా తెచ్చాయి.
12 E da madeira de sândalo fez o rei balaústres para a casa do SENHOR, e para as casas reais, harpas também e saltérios para os cantores: nunca veio tanta madeira de sândalo, nem se há visto até hoje.
౧౨ఈ గంధపు చెక్కతో రాజు యెహోవా మందిరానికి, రాజగృహానికి స్తంభాలూ, గాయకులకు సితారాలూ స్వరమండలాలూ చేయించాడు. ఇప్పుడు అలాంటి గంధం చెక్క దొరకదు. ఎక్కడా కనిపించదు కూడా.
13 E o rei Salomão deu à rainha de Sabá tudo o que quis, e tudo o que pediu, ademais do que Salomão lhe deu como da mão do rei Salomão. E ela se voltou, e se foi a sua terra com seus criados.
౧౩సొలొమోను తన వైభవానికి తగిన విధంగా షేబ దేశపు రాణికిచ్చింది కాకుండా, దానికి మించి ఆమె కోరిన వాటన్నిటినీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఆమె తన పరివారంతో కలిసి తన దేశానికి తిరిగి వెళ్ళింది.
14 O peso do ouro que Salomão tinha de renda cada um ano era seiscentos sessenta e seis talentos de ouro;
౧౪సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చే బంగారం బరువు 23 టన్నులు.
15 Sem o dos mercadores, e da contratação de especiarias, e de todos os reis de Arábia, e dos principais da terra.
౧౫ఇది గాక, వర్తకులూ, అరబి రాజులూ, దేశాధికారులూ అతనికి సుగంధ ద్రవ్యాలు మొదలైన వాటిని పెద్ద మొత్తంలో పంపేవారు.
16 Fez também o rei Salomão duzentos paveses de ouro estendido: seiscentos siclos de ouro gastou em cada pavês.
౧౬సొలొమోను రాజు బంగారాన్ని సుత్తెలతో రేకులుగా సాగగొట్టించి దానితో 200 పెద్ద డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలు మూడున్నర కిలోల బంగారంతో చేశారు.
17 Também trezentos escudos de ouro estendido, em cada um dos quais gastou três libras de ouro: e os pôs o rei na casa do bosque do Líbano.
౧౭రేకులుగా కొట్టిన బంగారంతో అతడు 300 చిన్న డాళ్ళు చేయించాడు. ఒక్కొక్క డాలుకు దగ్గరగా రొండు కిలోల బంగారం వాడారు. రాజు వీటిని లెబానోను అరణ్య రాజగృహంలో ఉంచాడు.
18 Fez também o rei um grande trono de marfim, o qual cobriu de ouro puríssimo.
౧౮రాజు ఒక పెద్ద దంతపు సింహాసనం చేయించి దాన్ని మేలిమి బంగారంతో పొదిగించాడు.
19 Seis degraus tinha o trono, e o alto dele era redondo pelo recosto: e da uma parte e da outra tinha apoios próximo do assento, junto aos quais estavam colocados dois leões.
౧౯ఈ సింహానానికి 6 మెట్లున్నాయి. సింహాసనం పైభాగం వెనక వైపు గుండ్రంగా ఉంది. ఆసనానికి ఇరుపక్కలా చేతి ఊతలున్నాయి. ఊతల దగ్గర రెండు సింహాలు నిలిచి ఉన్నాయి.
20 Estavam também doze leões postos ali sobre os seis degraus, da uma parte e da outra: em nenhum outro reino se havia feito trono semelhante.
౨౦ఆరు మెట్లకూ రెండు వైపులా పన్నెండు సింహాలు నిలిచి ఉన్నాయి. అలాటి సింహాసనాన్ని మరే రాజ్యంలో ఎవరూ చేసి ఉండలేదు.
21 E todos os vasos de beber do rei Salomão eram de ouro, e também toda a vasilha da casa do bosque do Líbano era de ouro fino: não havia prata; em tempo de Salomão não era de valor.
౨౧సొలొమోను రాజు పానపాత్రలు బంగారపువి. లెబానోను అరణ్య మందిరంలోని పాత్రలు అన్నీ బంగారంతో చేసినవే. వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను రోజుల్లో వెండికి విలువ లేదు.
22 Porque o rei tinha a frota que saía à mar, a Társis, com a frota de Hirão: uma vez em cada três anos vinha a frota de Társis, e trazia ouro, prata, marfim, macacos e pavões.
౨౨సముద్ర ప్రయాణానికి రాజుకు హీరాము ఓడలతోబాటు తర్షీషు ఓడలు కూడా ఉన్నాయి. ఈ తర్షీషు ఓడలు మూడు సంవత్సరాలకు ఒకసారి బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు తీసుకు వస్తుండేవి.
23 Assim excedia o rei Salomão a todos os reis da terra em riquezas e em sabedoria.
౨౩ఈ విధంగా సొలొమోను రాజు ఐశ్వర్యం, జ్ఞానం విషయాల్లో భూరాజులందరినీ అధిగమించాడు.
24 Toda a terra procurava ver a cara de Salomão, para ouvir sua sabedoria, a qual Deus havia posto em seu coração.
౨౪అతని హృదయంలో దేవుడు ఉంచిన జ్ఞానపు మాటలను వినడానికి లోకప్రజలంతా అతని చెంతకు రావాలని ఆశించారు.
25 E todos lhe levavam cada ano seus tributos: utensílios de ouro, utensílios de prata, roupas, armas, aromas, cavalos e mulas.
౨౫అతనిని కలిసిన ప్రతి వ్యక్తీ కానుకగా వెండి, బంగారు వస్తువులు, వస్త్రాలు, ఆయుధాలు, సుగంధ ద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు, ప్రతి సంవత్సరం తెచ్చేవాడు.
26 E juntou Salomão carros e cavaleiros; e tinha mil quatrocentos carros, e doze mil cavaleiros, os quais pôs nas cidades dos carros, e com o rei em Jerusalém.
౨౬సొలొమోను రథాలను రౌతులను సమకూర్చుకున్నాడు. అతనికి 1, 400 రథాలు ఉన్నాయి. 12,000 గుర్రపురౌతులు ఉన్నారు. అతడు వీటిని రథాల కోసం ఏర్పాటు చేసిన పట్టణాల్లోఉంచాడు. కొన్నింటిని యెరూషలేములో రాజు దగ్గర ఉంచాడు.
27 E pôs o rei em Jerusalém prata como pedras, e cedros como os sicômoros que estão pelos campos em abundância.
౨౭రాజు యెరూషలేములో వెండిని రాళ్లతో సమానంగా పరిగణించాడు. దేవదారు మానులను షెఫేలా ప్రదేశంలో ఉన్న మేడి చెట్లంత విరివిగా ఉండేలా చేశాడు.
28 E traziam cavalos a Salomão do Egito e de Coa: porque os mercadores do rei compravam cavalos de Coa.
౨౮ఐగుప్తు నుండి, కిలికియ నుండి తెచ్చిన గుర్రాలు సొలొమోనుకు ఉన్నాయి. రాజు వాణిజ్యాధికారులు గుర్రాల మందలను కొని తెప్పించారు. ఒక్కొక్క మందకు తగిన ధర చెల్లించారు.
29 E vinha e saía do Egito, o carro por seiscentas peças de prata, e o cavalo por cento e cinquenta; e assim os traziam por meio deles, todos os reis dos heteus, e da Síria.
౨౯వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన ఒక్కొక్క రథానికి 6 కిలోల వెండి, ఒక్కొక్క గుర్రానికి ఒకటిన్నర కిలోల వెండి చెల్లించారు. వాటిలో ఎక్కువ భాగం హిత్తీయుల రాజులందరికీ అరాము రాజులకూ తగిన ధరకు అమ్మారు.