< Salmos 76 >

1 Conhecido é Deus em Judá: grande é o seu nome em Israel.
ప్రధాన సంగీతకారుని కోసం, తీగ వాయిద్యాలతో పాడేది. ఆసాపు కీర్తన, ఒక పాట. యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది.
2 E em Salém está o seu tabernáculo, e a sua morada em Sião.
షాలేంలో ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది.
3 Ali quebrou as flechas do arco; o escudo, e a espada e a guerra (Selah)
అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. (సెలా)
4 Tu és mais ilustre, ó glorioso, do que os montes de preza.
నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు.
5 Os que são ousados de coração são despojados; dormiram o seu sono, e nenhum dos homens de força achou as suas mãos
గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు.
6 Á tua repreensão, ó Deus de Jacob, carros e cavalos são lançados num sono profundo.
యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు.
7 Tu, tu és terrível; e quem subsistirá à tua vista, uma vez que te irares?
నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు?
8 Desde os céus fizeste ouvir o teu juízo; a terra tremeu e se aquietou,
నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది.
9 Quando Deus se levantou para fazer juízo, para livrar a todos os mansos da terra (Selah)
దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. (సెలా)
10 Porque a colera do homem redundará em teu louvor; o restante da colera tu o restringirás.
౧౦కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు.
11 Fazei votos, e pagai ao Senhor, vosso Deus: tragam presentes, os que estão em redor dele, àquele que é tremendo.
౧౧మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి.
12 Ele ceifará o espírito dos príncipes: é tremendo para com os reis da terra.
౧౨అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు.

< Salmos 76 >