< Salmos 20 >

1 O Senhor te ouça no dia da angústia, o nome do Deus de Jacob te proteja.
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక.
2 Envie-te socorro desde o seu santuário, e te sustenha desde Sião.
పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక.
3 Lembre-se de todas as tuas ofertas, e aceite os teus holocaustos (Selah)
ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక.
4 Conceda-te conforme ao teu coração, e cumpra todo o teu conselho.
నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక.
5 Nós nos alegraremos pela tua salvação, e em nome do nosso Deus arvoraremos pendões; cumpra o Senhor todas as tuas petições.
అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక.
6 Agora sei que o Senhor salva ao seu ungido: ele o ouvirá desde o seu santo céu, com a força salvadora da sua mão direita.
యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు.
7 Uns confiam em carros e outros em cavalos, mas nós faremos menção do nome do Senhor nosso Deus.
కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము.
8 Uns encurvam-se e caem, mas nós nos levantamos e estamos de pé.
వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము!
9 Salva-nos, Senhor, ouça-nos o Rei quando clamarmos.
యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి.

< Salmos 20 >