< Salmos 119 >

1 Bem-aventurados os retos em seus caminhos, que andam na lei do Senhor.
ఆలెఫ్‌ ఎవరి మార్గాలు నిష్కల్మషంగా ఉంటాయో ఎవరు యెహోవా ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకుంటారో వారు ధన్యులు.
2 Bem-aventurados os que guardam os seus testemunhos, e que o buscam com todo o coração,
ఆయన పవిత్ర శాసనాలను పాటిస్తూ పూర్ణహృదయంతో ఆయన్ని వెదికేవారు ధన్యులు.
3 E não obram iniquidade: andam nos seus caminhos.
వారు ఆయన బాటలో నడుస్తూ ఏ తప్పూ చేయరు.
4 Tu ordenaste os teus mandamentos, para que diligentemente os observassemos.
మేము నీ ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించాలని, వాటికి కట్టుబడాలని నీవు మాకు ఆజ్ఞాపించావు.
5 Oxalá que os meus caminhos fossem dirigidos a observar os teus estatutos.
ఆహా, నేను నీ చట్టాల ప్రకారం ప్రవర్తించేలా నా ప్రవర్తన స్థిరం అయితే ఎంత మంచిది!
6 Então não serei envergonhado, quando tiver respeito a todos os teus mandamentos.
నీ ఆజ్ఞలన్నిటినీ నేను శిరసావహిస్తే నాకు అవమానం కలగదు.
7 Louvar-te-ei com retidão de coração, quando tiver aprendido os teus justos juízos.
నీ న్యాయచట్టాలను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను.
8 Observarei os teus estatutos: não me desampares totalmente.
నీ కట్టడలను నేను పాటిస్తాను. నన్ను ఒంటరిగా విడిచిపెట్టవద్దు. బేత్‌
9 Com que purificará o mancebo o seu caminho? observando-o conforme a tua palavra.
యువత దేనిమూలంగా తమ మార్గం పవిత్రంగా ఉంచుకోగలరు? నీ వాక్కుకు లోబడడం మూలంగానే గదా?
10 Com todo o meu coração te busquei: não me deixes desviar dos meus mandamentos.
౧౦నా పూర్ణహృదయంతో నిన్ను వెదికాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి ఎటో వెళ్ళిపోనియ్యకు.
11 A tua palavra tenho eu escondido no meu coração, para não pecar contra ti
౧౧నీకు వ్యతిరేకంగా నేను పాపం చేయకుండేలా నా హృదయంలో నీ వాక్కును పదిలపరచుకున్నాను.
12 Bendito és tu, ó Senhor; ensina-me os teus estatutos.
౧౨యెహోవా, నీవే ఆరాధ్య దైవం. నీ నియమాలను నాకు బోధించు.
13 Com os meus lábios declarei todos os juízos da tua boca.
౧౩నీవు వెల్లడి చేసిన న్యాయవిధులన్నిటినీ నా నోటితో వివరిస్తాను.
14 Folguei tanto no caminho dos teus testemunhos, como em todas as riquezas.
౧౪సంపదలన్నిటి కంటే పైగా నీ నిబంధన శాసనాల దారిని బట్టి నేను ఉప్పొంగిపోతున్నాను.
15 Meditarei nos teus preceitos, e terei respeito aos teus caminhos.
౧౫నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను. నీ మార్గాలపై మనస్సు ఉంచుతాను.
16 Recrear-me-ei nos teus estatutos: não me esquecerei da tua palavra.
౧౬నీ కట్టడలను బట్టి నేను హర్షిస్తాను. నీ వాక్కును విస్మరించను. గీమెల్‌
17 Faze bem ao teu servo, para que viva e observe a tua palavra.
౧౭నీ సేవకుణ్ణి దయ చూడు. అప్పుడు నేను సజీవంగా ఉండి నీ వాక్కు పాటిస్తాను.
18 Abre tu os meus olhos, para que veja as maravilhas da tua lei.
౧౮నేను నీ ధర్మశాస్త్రంలోని అద్భుతమైన విషయాలు చూడగలిగేలా నా కళ్ళు తెరువు.
19 Sou peregrino na terra: não escondas de mim os teus mandamentos.
౧౯నేను భూమి మీద పరదేశిని. నీ ఆజ్ఞలను నాకు కనిపించకుండా దాచకు.
20 A minha alma está quebrantada de desejar os teus juízos em todo o tempo.
౨౦అస్తమానం నీ న్యాయవిధులను తెలుసుకోవాలనే ఆశతో నా ప్రాణం నీరసించిపోతోంది.
21 Tu repreendeste asperamente os soberbos que são amaldiçoados, que se desviam dos teus mandamentos.
౨౧గర్విష్ఠులను నువ్వు గద్దిస్తున్నావు. వారు నీ ఆజ్ఞలను విడిచి తిరుగులాడే శాపగ్రస్తులు.
22 Tira de sobre mim o opróbrio e o desprezo, pois guardei os teus testemunhos.
౨౨నేను నీ నిబంధన శాసనాలకు లోబడిన వాణ్ణి. నన్ను అప్రదిష్ట, అవమానాల పాలు చెయ్య వద్దు.
23 Príncipes também se assentaram, e falaram contra mim, mas o teu servo meditou nos teus estatutos.
౨౩పాలకులు నాకు విరోధంగా కుట్ర పన్ని అపనిందలు వేసినా నీ సేవకుడు మాత్రం నీ కట్టడలను ధ్యానిస్తూనే ఉంటాడు.
24 Também os teus testemunhos são o meu prazer e os meus conselheiros.
౨౪నీ శాసనాలు నాకు సంతోషదాయకం. అవి నాకు ఆలోచనకర్తలు. దాలెత్‌
25 A minha alma está pegada ao pó: vivifica-me segundo a tua palavra.
౨౫నా ప్రాణం మట్టి కరిచింది. నీ వాక్కుతో నన్ను బతికించు.
26 Eu te contei os meus caminhos, e tu me ouviste: ensina-me os teus estatutos.
౨౬నా ప్రవర్తనంతా నీకు చెప్పుకున్నాను. నాకు జవాబిచ్చావు. నీ కట్టడలను నాకు బోధించు.
27 Faze-me entender os caminhos dos teus preceitos: assim falarei das tuas maravilhas.
౨౭నీ ఉపదేశమార్గం నాకు బోధపరచు. అప్పుడు నీ దివ్యోపదేశాన్ని నేను నెమరు వేసుకుంటాను.
28 A minha alma se derrete de tristeza: fortalece-me segundo a tua palavra.
౨౮విషాదంతో నా ప్రాణం కరిగి నీరైపోతోంది. నీ వాక్కుతో నన్ను లేపి నిలబెట్టు.
29 Desvia de mim o caminho da falsidade, e concede-me piedosamente a tua lei.
౨౯మోసపు మార్గం నా నుండి దూరం చెయ్యి. దయచేసి నాకు నీ ఉపదేశం వినిపించు.
30 Tenho escolhido o caminho da verdade: os teus juízos tenho posto diante de mim.
౩౦విశ్వసనీయత మార్గం ఎంచుకున్నాను. నీ న్యాయవిధులను నేను ఎప్పుడూ నా ఎదుట పెట్టుకుని ఉన్నాను.
31 Tenho-me apegado aos teus testemunhos: ó Senhor, não me confundas.
౩౧యెహోవా, నేను నీ శాసనాలను అంటి పెట్టుకుని ఉన్నాను. నన్ను సిగ్గుపాలు చెయ్యవద్దు.
32 Percorrerei o caminho dos teus mandamentos, quando dilatares o meu coração.
౩౨నా హృదయాన్ని నీవు విశాలం చేస్తే నేను నీ ఆజ్ఞల మార్గంలో పరిగెత్తుతాను. హే
33 Ensina-me, ó Senhor, o caminho dos teus estatutos, e guarda-lo-ei até ao fim.
౩౩యెహోవా, నీ శాసనాలను అనుసరించడం నాకు నేర్పు. అప్పుడు నేను కడదాకా వాటిని పాటిస్తాను.
34 Dá-me entendimento, e guardarei a tua lei, e observa-la-ei de todo o meu coração.
౩౪నీ ధర్మశాస్త్రం అనుసరించడానికి నాకు అవగాహన దయచెయ్యి. అప్పుడు నా పూర్ణహృదయంతో నేను దాని ప్రకారం నడుచుకుంటాను.
35 Faze-me andar na vereda dos teus mandamentos, porque nela tenho prazer.
౩౫నీ ఆజ్ఞల జాడల్లో నన్ను నడిపించు. వాటి ప్రకారం నడుచుకోవడం నాకెంతో ఆనందం.
36 Inclina o meu coração aos teus testemunhos, e não à cobiça.
౩౬నా హృదయాన్ని నీ శాసనాలవైపు తిప్పు. అక్రమ లాభం నుండి నన్ను విముఖుణ్ణి చెయ్యి.
37 Desvia os meus olhos de contemplarem a vaidade, e vivifica-me no teu caminho.
౩౭పనికిమాలిన వాటిని చూడకుండా నా కళ్ళు తిప్పివెయ్యి. నీ మార్గాల్లో నాకు ఊపిరి పొయ్యి.
38 Confirma a tua palavra ao teu servo, que é dedicado ao teu temor.
౩౮నిన్ను కొలిచే వారికి నీవిచ్చిన వాగ్దానం నీ సేవకుని పట్ల నెరవేర్చు.
39 Desvia de mim o opróbrio que temo, pois os teus juízos são bons.
౩౯నీ న్యాయవిధులు మంచివి. నాకు భయం గొలుపుతున్న నా అవమానాన్ని తీసివెయ్యి.
40 Eis que tenho desejado os teus preceitos; vivifica-me na tua justiça.
౪౦నీ ఉపదేశాల కోసం తహతహలాడుతున్నాను. న్యాయమైన నీ విమోచన మూలంగా నన్ను సజీవంగా ఉంచు. వావ్‌
41 Venham sobre mim também as tuas misericórdias, ó Senhor, e a tua salvação segundo a tua palavra.
౪౧యెహోవా, విఫలం కాని నీ ప్రేమను నాకు అనుగ్రహించు. నీ వాగ్దానం చొప్పున నీ రక్షణ కలిగించు.
42 Assim terei que responder ao que me afronta, pois confio na tua palavra.
౪౨అప్పుడు నన్ను హేళన చేసే వారికి నేను జవాబు చెప్పగలుగుతాను. ఎందుకంటే నీ మాటపై నమ్మకం ఉంచాను.
43 E não tires totalmente a palavra de verdade da minha boca, pois tenho esperado nos teus juízos.
౪౩నా నోటినుండి సత్య వాక్కును ఏమాత్రం తీసి వేయకు. ఎందుకంటే నేను నీ న్యాయవిధుల మీద నా ఆశ పెట్టుకున్నాను.
44 Assim observarei de contínuo a tua lei para sempre e eternamente.
౪౪ఎడతెగక నిరంతరం నీ ధర్మశాస్త్రం అనుసరిస్తాను.
45 E andarei em liberdade; pois busco os teus preceitos.
౪౫నేను నీ ఉపదేశాలను వెదికే వాణ్ణి గనక భద్రంగా నడుస్తాను.
46 Também falarei dos teus testemunhos perante os reis, e não me envergonharei.
౪౬సిగ్గుపడక రాజుల ఎదుట నీ పవిత్ర శాసనాలను గూర్చి నేను మాట్లాడతాను.
47 E recrear-me-ei em teus mandamentos, que tenho amado.
౪౭నీ ఆజ్ఞల్లో నేను హర్షిస్తాను. అవి నాకు అతి ప్రియం.
48 Também levantarei as minhas mãos para os teus mandamentos, que amei, e meditarei nos teus estatutos.
౪౮నాకు ఎంతో ఇష్టమైన నీ ఆజ్ఞలవైపు నా చేతులెత్తుతాను. నీ కట్టడలను నేను ధ్యానిస్తాను. జాయిన్‌.
49 Lembra-te da palavra dada ao teu servo, na qual me fizeste esperar.
౪౯నీ సేవకుడికి నీవు దయచేసిన మాట జ్ఞాపకం చేసుకో. దానివలన నీవు నాలో ఆశాభావం రేకెత్తించావు.
50 Isto é a minha consolação na minha aflição, porque a tua palavra me vivificou.
౫౦నీ వాక్కు నన్ను బ్రతికించింది. నా బాధలో ఇదే నాకు ఉపశమనం కలిగిస్తున్నది.
51 Os soberbos zombaram grandemente de mim; contudo não me desviei da tua lei.
౫౧గర్విష్ఠులు నన్ను ఇష్టం వచ్చినట్టు ఎగతాళి చేశారు. అయినా నీ ధర్మశాస్త్రాన్నుండి నేను తొలగలేదు.
52 Lembrei-me dos teus juízos antiquíssimos, ó Senhor, e assim me consolei.
౫౨యెహోవా, పూర్వకాలంనుండి ఉన్న నీ న్యాయ విధులను జ్ఞాపకం చేసుకుని నేను ఓదార్పు నొందాను.
53 Grande indignação se apoderou de mim por causa dos ímpios que desamparam a tua lei.
౫౩నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడుస్తున్న భక్తిహీనులను చూస్తే నాకు పట్టరాని కోపం పుడుతున్నది.
54 Os teus estatutos tem sido os meus cânticos, na casa da minha peregrinação.
౫౪యాత్రికుడినైన నా బసలో నీ శాసనాలే నా పాటలు.
55 Lembrei-me do teu nome, ó Senhor, de noite, e observei a tua lei.
౫౫యెహోవా, రాత్రివేళ నీ నామాన్ని స్మరణ చేస్తున్నాను నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను.
56 Isto fiz eu, porque guardei os teus mandamentos.
౫౬నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరంగా అనుగ్రహించావు. హేత్‌
57 O Senhor é a minha porção: eu disse que observaria as tuas palavras.
౫౭యెహోవా, నీవే నా భాగం. నీ వాక్కులననుసరించి నడుచుకుంటానని నేను నిశ్చయించుకున్నాను.
58 Roguei deveras o teu favor com todo o meu coração: tem piedade de mim, segundo a tua palavra.
౫౮కటాక్షం చూపమని నా పూర్ణహృదయంతో నిన్ను బతిమాలుకుంటున్నాను. నీవిచ్చిన మాట ప్రకారం నన్ను కరుణించు.
59 Considerei os meus caminhos, e voltei os meus pés para os teus testemunhos.
౫౯నా మార్గాలు నేను పరిశీలన చేశాను. నీ శాసనాలవైపు నా ముఖం తిప్పుకున్నాను.
60 Apressei-me, e não me detive, a observar os teus mandamentos.
౬౦నీ ఆజ్ఞలను పాటించడానికి నేను జాగుచేయక వేగిరపడ్డాను.
61 Bandos de ímpios me despojaram, mas eu não me esqueci da tua lei.
౬౧భక్తిహీనుల పాశాలు నన్ను చుట్టుకుని ఉన్నా నీ ధర్మశాస్త్రాన్ని నేను విస్మరించ లేదు.
62 Á meia noite me levantarei para te louvar, pelos teus justos juízos.
౬౨న్యాయమైన నీ విధులనుబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అర్థరాత్రివేళ నేను నిద్ర లేస్తున్నాను.
63 Companheiro sou de todos os que te temem e dos que guardam os teus preceitos.
౬౩నీపట్ల భయభక్తులు గలవారందరికీ, నీ ఉపదేశాలను అనుసరించే వారికీ నేను నెచ్చెలిని. తేత్
64 A terra, ó Senhor, está cheia da tua benignidade: ensina-me os teus estatutos.
౬౪యెహోవా, భూమి నీ నిబంధన విశ్వాస్యతతో నిండి ఉంది. నీ కట్టడలను నాకు బోధించు.
65 Fizeste bem ao teu servo, Senhor, segundo a tua palavra.
౬౫యెహోవా, నీ మాట చొప్పున నీ సేవకుడికి మేలు చేశావు.
66 Ensina-me bom juízo e ciência, pois cri nos teus mandamentos.
౬౬నేను నీ ఆజ్ఞలపై నమ్మిక ఉంచాను. మంచి వివేచన, మంచి జ్ఞానం నాకు నేర్చు.
67 Antes de ser aflito andava errado; mas agora tenho guardado a tua palavra.
౬౭బాధ కలగక మునుపు నేను దారి విడిచాను. ఇప్పుడు నీ వాక్కు ననుసరించి నడుచుకుంటున్నాను.
68 Tu és bom e fazes bem: ensina-me os teus estatutos.
౬౮నీవు దయాళుడివై మేలు చేస్తున్నావు. నీ కట్టడలను నాకు బోధించు.
69 Os soberbos forjaram mentiras contra mim; mas eu com todo o meu coração guardarei os teus preceitos.
౬౯గర్విష్ఠులు నా మీద అబద్ధాలు అల్లుతున్నారు. అయితే పూర్ణహృదయంతో నేను నీ ఉపదేశాలను అనుసరిస్తాను.
70 Engrossa-se-lhes o coração como gordura, mas eu me recrêio na tua lei.
౭౦వారి హృదయం కొవ్వెక్కి బండబారిపోయింది. నేను నీ ధర్మశాస్త్రాన్నిబట్టి ఆనందిస్తున్నాను.
71 Foi-me bom ter sido aflito, para que aprendesse os teus estatutos.
౭౧బాధల పాలు కావడం నాకు మంచిదయింది. ఎందుకంటే వాటి మూలంగా నేను నీ కట్టడలను నేర్చుకున్నాను.
72 Melhor é para mim a lei da tua boca do que milhares de ouro ou prata.
౭౨వేవేల వెండి బంగారు నాణాలకంటే నీ విచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. యోద్‌
73 As tuas mãos me fizeram e me formaram; dá-me inteligência para entender os teus mandamentos.
౭౩నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపం ఏర్పరచాయి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకునేలా నాకు బుద్ధి దయ చెయ్యి.
74 Os que te temem alegraram-se quando me viram, porque tenho esperado na tua palavra.
౭౪నీ వాక్కు మీద నేను ఆశపెట్టుకున్నాను. నీపట్ల భయభక్తులు గలవారు నన్ను చూసి సంతోషిస్తారు.
75 Bem sei eu, ó Senhor, que os teus juízos são justos, e que segundo a tua fidelidade me afligiste.
౭౫యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనీ నీవు నన్ను బాధపరచింది నీ నమ్మకత్వం వల్లనే అనీ నాకు తెలుసు.
76 Sirva pois a tua benignidade para me consolar, segundo a palavra que deste ao teu servo.
౭౬నీ సేవకుడికి నీవిచ్చిన మాట చొప్పున నీ నిబంధన విశ్వాస్యత నన్ను ఆదరించు గాక.
77 Venham sobre mim as tuas misericórdias, para que viva, pois a tua lei é as minhas delícias.
౭౭నీ ధర్మశాస్త్రం నాకు సంతోషదాయకం. నేను బ్రతికేలా నీ కరుణాకటాక్షాలు నాకు కలుగు గాక.
78 Confundam-se os soberbos, pois me trataram de uma maneira perversa, sem causa; mas eu meditarei nos teus preceitos.
౭౮నేను నీ ఉపదేశాలను ధ్యానిస్తున్నాను. గర్విష్ఠులు నామీద అబద్ధాలాడినందుకు వారు సిగ్గుపడతారు గాక.
79 Voltem-se para mim os que te temem, e aqueles que tem conhecido os teus testemunhos.
౭౯నీపట్ల భయభక్తులుగలవారూ నీ శాసనాలను తెలుసుకునే వారూ నా పక్షంగా ఉంటారు గాక.
80 Seja reto o meu coração nos teus estatutos, para que não seja confundido.
౮౦నేను సిగ్గుపడకుండేలా నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషంగా ఉండు గాక. కఫ్‌
81 Desfalece a minha alma pela tua salvação, mas espero na tua palavra.
౮౧నీ రక్షణ కోసం నా ప్రాణం సొమ్మసిల్లిపోతున్నది. నేను నీ వాక్కు మీద ఆశపెట్టుకున్నాను.
82 Os meus olhos desfalecem pela tua palavra; entretanto dizia: Quando me consolarás tu?
౮౨నన్ను ఎప్పుడు ఆదరిస్తావా అని నా కళ్ళు నీవిచ్చిన మాట కోసం కనిపెట్టి క్షీణించిపోతున్నాయి.
83 Pois estou como odre no fumo; contudo não me esqueço dos teus estatutos.
౮౩నేను పొగ పట్టిన ద్రాక్ష తిత్తిలాగా అయిపోయాను. అయినా నీ కట్టడలను నేను మరచిపోవడం లేదు.
84 Quantos serão os dias do teu servo? Quando me farás justiça contra os que me perseguem?
౮౪నీ సేవకుడి దినాలు ఎంత తగ్గిపోయాయి! నన్ను తరిమే వారికి నీవు తీర్పు తీర్చడం ఎప్పుడు?
85 Os soberbos me cavaram covas, o que não é conforme à tua lei.
౮౫నీ ధర్మశాస్త్రాన్ని లెక్క చెయ్యని గర్విష్ఠులు నన్ను చిక్కించుకోడానికి గుంటలు త్రవ్వారు.
86 Todos os teus mandamentos são verdade: com mentiras me perseguem; ajuda-me.
౮౬నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు అకారణంగా నన్ను తరుముతున్నారు. నాకు సహాయం చెయ్యి.
87 Quase que me tem consumido sobre a terra, mas eu não deixei os teus preceitos.
౮౭భూమి మీద ఉండకుండా వారు నన్ను దాదాపుగా నాశనం చేసేశారు. అయితే నీ ఉపదేశాలను నేను విడిచిపెట్టడం లేదు.
88 Vivifica-me segundo a tua benignidade; assim guardarei o testemunho da tua boca.
౮౮నీవు నియమించిన శాసనాన్ని నేను అనుసరించేలా నీ నిబంధన విశ్వాస్యత చేత నన్ను బ్రతికించు. లామెద్‌.
89 Para sempre, ó Senhor, a tua palavra permanece no céu.
౮౯యెహోవా, నీ వాక్కు శాశ్వతం. అది పరలోకంలో సుస్థిరంగా ఉంది.
90 A tua fidelidade dura de geração em geração: tu firmaste a terra, e ela permanece firme.
౯౦నీ విశ్వాస్యత తరతరాలు ఉంటుంది. నీవు భూమిని స్థాపించావు. అది స్థిరంగా ఉంది.
91 Eles continuam até ao dia de hoje, segundo as tuas ordenações; porque todos são teus servos.
౯౧అన్నీ నీ న్యాయ నిర్ణయం చొప్పున నేటికీ స్థిరంగా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ నీకు ఊడిగం చేస్తున్నాయి.
92 Se a tua lei não fôra toda a minha recreação, há muito que pereceria na minha aflição.
౯౨నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యక పొతే నా బాధలో నేను సమసిపోయేవాణ్ణి.
93 Nunca me esquecerei dos teus preceitos; pois por eles me tens vivificado.
౯౩నీ ఉపదేశాలను ఎన్నటికీ మరచిపోను. ఎందుకంటే వాటి వల్లనే నీవు నన్ను ప్రాణాలతో ఉంచావు.
94 Sou teu, salva-me; pois tenho buscado os teus preceitos.
౯౪నీ ఉపదేశాలను నేను వెతుకుతున్నాను. నేను నీవాణ్ణి. నన్ను రక్షించు.
95 Os ímpios me esperam para me destruírem, mas eu considerarei os teus testemunhos.
౯౫నన్ను సంహరించాలని భక్తిహీనులు నా కోసం పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనాలను తలపోసుకుంటున్నాను.
96 Tenho visto fim a toda a perfeição, mas o teu mandamento é amplicíssimo.
౯౬సంపూర్ణతకైనా పరిమితి ఉందని నాకు తెలుసు. కానీ నీ ధర్మోపదేశానికి ఎల్లలు లేవు. మేమ్‌
97 Oh! quanto amo a tua lei! é a minha meditação em todo o dia.
౯౭నీ ధర్మశాస్త్రం నాకెంతో ఇష్టంగా ఉంది. రోజంతా నేను దాన్ని ధ్యానిస్తున్నాను.
98 Tu pelos teus mandamentos me fazes mais sábio do que os meus inimigos, pois estão sempre comigo.
౯౮నీ ఆజ్ఞలు అనునిత్యం నాకు తోడుగా ఉన్నాయి. నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేస్తున్నాయి.
99 Tenho mais entendimento do que todos os meus mestres, porque os teus testemunhos são a minha meditação.
౯౯నీ శాసనాలను నేను ధ్యానిస్తున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు ఎక్కువ అవగాహన ఉంది.
100 Entendo mais do que os antigos; porque guardo os teus preceitos.
౧౦౦నీ ఉపదేశాలను నేను లక్ష్యపెడుతున్నాను గనక వయోవృద్ధుల కంటే నాకు విశేషజ్ఞానం ఉంది.
101 Desviei os meus pés de todo o caminho mau, para guardar a tua palavra.
౧౦౧నేను నీ వాక్కుననుసరించేలా దుష్టమార్గాలన్నిటిలోనుండి నా పాదాలు తొలగించుకుంటున్నాను.
102 Não me apartei dos teus juízos, pois tu me ensinaste.
౧౦౨నీవు నాకు బోధించావు గనక నీ న్యాయవిధులనుండి నేను తొలగక నిలిచాను.
103 Oh! quão doces são as tuas palavras ao meu paladar, mais doces do que o mel à minha boca.
౧౦౩నీ వాక్కులు నా జిహ్వకు ఎంతో మధురం. అవి నా నోటికి తేనెకంటే తియ్యగా ఉన్నాయి.
104 Pelos teus mandamentos alcancei entendimento; pelo que aborreço todo o falso caminho.
౧౦౪నీ ఉపదేశం మూలంగా నాకు వివేకం కలిగింది. తప్పుమార్గాలన్నీ నాకు అసహ్యమనిపించాయి. నూన్‌
105 A tua palavra é uma lâmpada para os meus pés e uma luz para o meu caminho.
౧౦౫నీ వాక్కు నా పాదాలకు దీపం, నా దారిలో వెలుగు.
106 Jurei, e o cumprirei, que guardarei os teus justos juízos.
౧౦౬నీ న్యాయవిధులను అనుసరిస్తానని నేను మాట ఇచ్చాను. దాన్ని నిలబెట్టుకుంటాను.
107 Estou aflitíssimo; vivifica-me, ó Senhor, segundo a tua palavra.
౧౦౭యెహోవా, నేను తీవ్ర బాధ అనుభవిస్తున్నాను. నీ మాట చొప్పున నన్ను బ్రతికించు.
108 Aceita, eu te rogo, as oferendas voluntárias da minha boca, ó Senhor; ensina-me os teus juízos.
౧౦౮యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు. నీ న్యాయవిధులను నాకు బోధించు
109 A minha alma está de contínuo nas minhas mãos; todavia não me esqueço da tua lei
౧౦౯నా ప్రాణం ఎప్పుడూ అపాయంలో ఉంది. అయినా నీ ధర్మశాస్త్రాన్ని నేను మరిచిపోను.
110 Os ímpios me armaram laço; contudo não me desviei dos teus preceitos.
౧౧౦నన్ను పట్టుకోడానికి భక్తిహీనులు ఉచ్చులు పన్నారు. అయినా నీ ఉపదేశాలనుండి నేను తొలగిపోవడం లేదు.
111 Os teus testemunhos tenho eu tomado por herança para sempre, pois são o gozo do meu coração.
౧౧౧నీ శాసనాలు నాకు ఆహ్లాదకరం. అవి నాకు నిత్య వారసత్వం అని ఎంచుకుంటున్నాను.
112 Inclinei o meu coração a guardar os teus estatutos, para sempre, até ao fim.
౧౧౨నీ కట్టడలను పాటించడానికి నా హృదయాన్ని నేను లోబరిచాను. ఇది తుదివరకూ నిలిచే నిత్యనిర్ణయం. సామెహ్‌
113 Aborreço a duplicidade, mas amo a tua lei.
౧౧౩రెండు ఆలోచనల మధ్య ఊగిసలాడే వారంటే నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
114 Tu és o meu refúgio e o meu escudo; espero na tua palavra.
౧౧౪నా ఆశ్రయ స్థానం, నా డాలు నువ్వే. నీ వాక్కుపై నేను ఆశపెట్టుకున్నాను.
115 Apartai-vos de mim, malfeitores, pois guardarei os mandamentos do meu Deus.
౧౧౫నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరిస్తాను. దుర్మార్గం జరిగించే వారంతా నా నుండి తొలిగిపొండి.
116 Sustenta-me conforme a tua palavra, para que viva, e não me deixes envergonhado da minha esperança.
౧౧౬నేను బ్రతికేలా నీ మాట చొప్పున నన్ను ఆదుకో. నా ఆశ భంగమై నేను సిగ్గుపడకుండా ఉంటాను గాక.
117 Sustenta-me, e serei salvo, e de contínuo terei respeito aos teus estatutos.
౧౧౭నాకు రక్షణ కలిగేలా నీవు నన్ను ఉద్ధరించు. అప్పుడు నీ కట్టడలను నిత్యం లక్ష్యపెడతాను.
118 Tu tens pisado aos pés todos os que se desviam dos teus estatutos, pois o engano deles é falsidade.
౧౧౮నీ కట్టడలను మీరిన వారినందరినీ నీవు త్రోసిపుచ్చుతావు. అలాటి వారంతా దగాకోరులే, నమ్మలేని వారే.
119 Tu tiraste da terra todos os ímpios, como a escória, pelo que amo os teus testemunhos.
౧౧౯భూమిమీదనున్న భక్తిహీనులనందరినీ నీవు తెట్టువలె నాశనం చేస్తావు. కాబట్టి నీ శాసనాలు నాకు ఇష్టం.
120 O meu corpo se arrepiou com temor de ti, e temi os teus juízos.
౧౨౦నీ భయం వలన నా శరీరం వణికిపోతోంది. నీ న్యాయవిధులకు నేను భయపడుతున్నాను. అయిన్‌
121 Fiz juízo e justiça: não me entregues aos meus opressores.
౧౨౧నేను నీతిన్యాయాలను అనుసరిస్తున్నాను. నన్ను బాధించేవారి వశంలో నన్ను విడిచిపెట్టవద్దు.
122 Fica por fiador do teu servo para o bem; não deixes que os soberbos me oprimam.
౧౨౨మేలు కోసం నీ సేవకుడికి హామీ ఉండు. గర్విష్ఠులు నన్ను బాధించకుందురు గాక.
123 Os meus olhos desfaleceram pela tua salvação e pela promessa da tua justiça.
౧౨౩నీ రక్షణ కోసం నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కళ్ళు క్షీణించి పోతున్నాయి.
124 Usa com o teu servo segundo a tua benignidade, e ensina-me os teus estatutos.
౧౨౪నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చెయ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
125 Sou teu servo: dá-me inteligência, para entender os teus testemunhos.
౧౨౫నేను నీ సేవకుణ్ణి. నీ శాసనాలను గ్రహించేలా నాకు జ్ఞానం కలగజెయ్యి
126 Já é tempo de operares ó Senhor, pois eles tem quebrantado a tua lei.
౧౨౬ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.
127 Pelo que amo os teus mandamentos mais do que o ouro, e ainda mais do que o ouro fino.
౧౨౭బంగారం కంటే మేలిమి బంగారం కంటే నీ ఆజ్ఞలు నాకు ఇష్టంగా ఉన్నాయి.
128 Por isso estimo todos os teus preceitos acerca de tudo, como retos, e aborreço toda a falsa vereda.
౧౨౮నీ ఉపదేశాలన్నీ యథార్థమని నేను వాటిని శిరసావహిస్తున్నాను. అబద్ధ మార్గాలన్నీ నాకు అసహ్యం. పే
129 Maravilhosos são os teus testemunhos; portanto a minha alma os guarda.
౧౨౯నీ శాసనాలు ఆశ్చర్యకరమైనవి. అందుకే నేను వాటిని పాటిస్తున్నాను.
130 A entrada das tuas palavras dá luz, dá entendimento aos símplices.
౧౩౦నీ వాక్కులు వెల్లడి కావడంతోనే వెలుగు ఉదయిస్తుంది. అవి తెలివిలేని వారికి తెలివినిస్తాయి.
131 Abri a minha boca, e respirei, pois que desejei os teus mandamentos.
౧౩౧నీ ఆజ్ఞలపట్ల తీవ్ర వాంఛ చేత నేను నోరు తెరచి వగరుస్తూ ఉన్నాను.
132 Olha para mim, e tem piedade de mim, conforme usas com os que amam o teu nome.
౧౩౨నీ నామాన్ని ప్రేమించేవారికి నీవు చేసే విధంగా నావైపు తిరిగి నన్ను కరుణించు.
133 Ordena os meus passos na tua palavra, e não se apodere de mim iniquidade alguma.
౧౩౩నీ వాక్కునుబట్టి నా అడుగులు స్థిరపరచు. ఏ పాపం నన్ను ఏలనియ్యకు.
134 Livra-me da opressão do homem; assim guardarei os teus preceitos.
౧౩౪నీ ఉపదేశాలను నేను అనుసరించేలా మనుష్యుల బలాత్కారం నుండి నన్ను విడిపించు.
135 Faze resplandecer o teu rosto sobre o teu servo, e ensina-me os teus estatutos.
౧౩౫నీ సేవకుడి పై నీ ముఖకాంతి ప్రకాశింపనియ్యి. నీ కట్టడలను నాకు బోధించు.
136 Rios de águas correm dos meus olhos, porque não guardam a tua lei.
౧౩౬ప్రజలు నీ ధర్మశాస్త్రం అనుసరించక పోవడం చూసి నేను కన్నీరుమున్నీరైపోతున్నాను. సాదె
137 Justo és, ó Senhor, e retos são os teus juízos.
౧౩౭యెహోవా, నీవు నీతిమంతుడివి. నీ న్యాయవిధులు యథార్థం.
138 Os teus testemunhos que ordenaste são retos e muito fieis.
౧౩౮నీతినిబట్టి, పూర్ణ విశ్వాస్యతనుబట్టి, నీ శాసనాలను నీవు నియమించావు.
139 O meu zelo me consumiu, porque os meus inimigos se esqueceram da tua palavra.
౧౩౯నా విరోధులు నీ వాక్కులు మరచిపోతారు. అందువలన నా ఆసక్తి నన్ను తినేస్తున్నది.
140 A tua palavra é muito pura; portanto o teu servo a ama.
౧౪౦నీ మాట ఎంతో స్వచ్ఛమైనది. అది నీ సేవకుడికి ప్రియమైనది.
141 Pequeno sou e desprezado, porém não me esqueço dos teus mandamentos.
౧౪౧నేను అల్పుణ్ణి. నిరాకరణకు గురి అయిన వాణ్ణి. అయినా నీ ఉపదేశాలను నేను మరువను.
142 A tua justiça é uma justiça eterna, e a tua lei é a verdade.
౧౪౨నీ నీతి శాశ్వతం. నీ ధర్మశాస్త్రం కేవలం సత్యం.
143 Aperto e angústia se apoderam de mim; contudo os teus mandamentos são o meu prazer.
౧౪౩బాధ, వేదన నన్ను పట్టుకున్నాయి. అయినా నీ ఆజ్ఞలు నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి.
144 A justiça dos teus testemunhos é eterna; dá-me inteligência, e viverei.
౧౪౪నీ శాసనాలు శాశ్వత నీతిగలవి. నేను బ్రతికేలా నాకు తెలివి దయచెయ్యి. ఖొఫ్‌
145 Clamei de todo o meu coração; escuta-me, Senhor, e guardarei os teus estatutos.
౧౪౫యెహోవా, హృదయపూర్వకంగా నేను మొర్ర పెడుతున్నాను. నీ కట్టడలను నేను పాటించేలా నాకు జవాబు ఇవ్వు.
146 A ti te invoquei; salva-me, e guardarei os teus testemunhos.
౧౪౬నేను నీకు మొర్ర పెడుతున్నాను. నీ శాసనాల ప్రకారం నేను నడుచుకునేలా నన్ను రక్షించు.
147 Preveni a alva da manhã, e clamei: esperei na tua palavra.
౧౪౭తెల్లవారకమునుపే మొర్రపెట్టాను. నీ మాటలపై నేను ఆశపెట్టుకున్నాను
148 Os meus olhos preveniram as vigílias da noite, para meditar na tua palavra.
౧౪౮నీవిచ్చిన వాక్కును నేను ధ్యానించడానికి నాకళ్ళు రాత్రిజాములు గడవక ముందే తెరుస్తాను.
149 Ouve a minha voz, segundo a tua benignidade: vivifica-me, ó Senhor, segundo o teu juízo.
౧౪౯నీ కృపను బట్టి నా మొర్ర ఆలకించు. యెహోవా, నీ వాక్యవిధులనుబట్టి నన్ను బ్రతికించు.
150 Aproximam-se os que se dão a maus tratos: afastam-se da tua lei.
౧౫౦దుష్కార్యాలు చేసే వారు, నీ ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు నన్ను సమీపిస్తున్నారు.
151 Tu estás perto ó Senhor, e todos os teus mandamentos são a verdade.
౧౫౧యెహోవా, నీవు దగ్గరగా ఉన్నావు. నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి.
152 Acerca dos teus testemunhos soube, desde a antiguidade, que tu os fundaste para sempre.
౧౫౨నీ శాసనాలను నీవు శాశ్వతంగా స్థిరపరిచావు అని నేను పూర్వం నుండి వాటిమూలంగానే తెలుసుకున్నాను. రేష్‌
153 Olha para a minha aflição, e livra-me, pois não me esqueci da tua lei.
౧౫౩నేను నీ ధర్మశాస్త్రాన్ని మరిచిపోయేవాణ్ణి కాదు. నా బాధను గమనించి నన్ను విడిపించు.
154 Pleiteia a minha causa, e livra-me: vivifica-me segundo a tua palavra.
౧౫౪నా పక్షంగా వ్యాజ్యెమాడి నన్ను విమోచించు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను బ్రతికించు.
155 A salvação está longe dos ímpios, pois não buscam os teus estatutos.
౧౫౫భక్తిహీనులు నీ కట్టడలను వెదకడం లేదు గనక రక్షణ వారికి దూరంగా ఉంది.
156 Muitas são, ó Senhor, as tuas misericórdias: vivifica-me segundo os teus juízos.
౧౫౬యెహోవా, నీ దయాదాక్షిణ్యాలు మితిలేనివి. నీ న్యాయవిధులను బట్టి నన్ను బ్రతికించు.
157 Muitos são os meus perseguidores e os meus inimigos; porém não me desvio dos teus testemunhos.
౧౫౭నన్ను తరిమేవారు, నా విరోధులు చాలా మంది. అయినా నీ న్యాయశాసనాలనుండి నేను తొలగకుండా ఉన్నాను.
158 Vi os transgressores, e me afligi, porque não observam a tua palavra.
౧౫౮ద్రోహులను చూసి నేను అసహ్యించుకున్నాను. నీవిచ్చిన మాటను వారు లక్ష్యపెట్టరు.
159 Considera como amo os teus preceitos: vivifica-me, ó Senhor, segundo a tua benignidade.
౧౫౯యెహోవా, చిత్తగించు. నీ ఉపదేశాలు నాకెంతో ప్రీతికరం. నీ కృపచొప్పున నన్ను బ్రతికించు.
160 A tua palavra é a verdade desde o princípio, e cada um dos teus juízos dura para sempre.
౧౬౦నీ వాక్య సారాంశం సత్యం. నీవు నియమించిన న్యాయవిధులన్నీ నిత్యం నిలిచే ఉంటాయి. షీన్‌
161 Príncipes me perseguiram sem causa, mas o meu coração temeu a tua palavra.
౧౬౧అధికారులు వట్టి పుణ్యానికి నన్ను తరుముతారు. అయినా నీ వాక్యభయం నా హృదయంలో నిలిచి ఉంది.
162 Folgo com a tua palavra, como aquele que acha um grande despojo.
౧౬౨పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.
163 Abomino e aborreço a falsidade, porém amo a tua lei.
౧౬౩అబద్ధం నాకు అసహ్యం. నీ ధర్మశాస్త్రం నాకు ప్రీతికరం.
164 Sete vezes no dia te louvo pelos juízos da tua justiça.
౧౬౪నీ న్యాయవిధులనుబట్టి రోజుకు ఏడు సార్లు నేను నిన్ను స్తుతిస్తున్నాను.
165 Muita paz tem os que amam a tua lei, e para eles não há tropeço.
౧౬౫నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారికి ఎంతో నెమ్మది ఉంది. వారు తూలి తొట్రిల్లే కారణం ఏమీ లేదు
166 Senhor, tenho esperado na tua salvação, e tenho cumprido os teus mandamentos.
౧౬౬యెహోవా, నీ రక్షణ కోసం నేను కనిపెడుతున్నాను. నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటున్నాను.
167 A minha alma tem observado os teus testemunhos; amo-os excessivamente.
౧౬౭నేను నీ శాసనాలనుబట్టి ప్రవర్తిస్తున్నాను. అవి నాకు ఎంతో ఇష్టం.
168 Tenho observado os teus preceitos e os teus testemunhos, porque todos os meus caminhos estão diante de ti.
౧౬౮నా మార్గాలన్నీ నీ ఎదురుగా ఉన్నాయి. నీ ఉపదేశాలను నీ శాసనాలను నేను అనుసరిస్తున్నాను. తౌ
169 Chegue a ti o meu clamor, ó Senhor: dá-me entendimento conforme a tua palavra.
౧౬౯యెహోవా, నా మొర్ర నీ సన్నిధికి వస్తుంది గాక. నీ మాట చొప్పున నాకు వివేకం దయచెయ్యి.
170 Chegue a minha súplica perante a tua face: livra-me segundo a tua palavra.
౧౭౦నా విన్నపం నీ సన్నిధిని చేరనియ్యి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను విడిపించు.
171 Os meus lábios proferiram o louvor, quando me ensinaste os teus estatutos.
౧౭౧నీవు నీ కట్టడలను నాకు బోధిస్తున్నావు. నా పెదాలు నీ స్తోత్రం పలుకుతాయి.
172 A minha língua falará da tua palavra, pois todos os teus mandamentos são justiça.
౧౭౨నీ ఆజ్ఞలన్నీ న్యాయం. నీ వాక్కును గూర్చి నా నాలుక గానం చేస్తుంది.
173 Venha a tua mão socorrer-me, pois elegi os teus preceitos.
౧౭౩నేను నీ ఉపదేశాలను కోరుకున్నాను. నీ చెయ్యి నాకు సహాయమగు గాక.
174 Tenho desejado a tua salvação, ó Senhor, a tua lei é todo o meu prazer.
౧౭౪యెహోవా, నీ రక్షణ కోసం నేను ఎంతో ఆశపడుతున్నాను. నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరం.
175 Viva a minha alma, e louvar-te-á: ajudem-me os teus juízos.
౧౭౫నీవు నన్ను బ్రతికించు. నేను నిన్ను స్తుతిస్తాను. నీ న్యాయవిధులు నాకు సహాయాలగు గాక
176 Desgarrei-me como a ovelha perdida; busca o teu servo, pois não me esqueci dos teus mandamentos.
౧౭౬తప్పిపోయిన గొర్రెలాగా నేను దారి తప్పి తిరిగాను. నీ సేవకుణ్ణి వెతికి పట్టుకో. ఎందుకంటే నేను నీ ఆజ్ఞలను విస్మరించేవాణ్ణి కాను.

< Salmos 119 >