< 1 Crônicas 27 >

1 Estes são os filhos de Israel segundo o seu número, os chefes dos pais, e os capitães dos milhares e das centenas, com os seus oficiais, que serviam ao rei em todos os negócios das turmas entrando e saindo de mês em mes, em todos os meses do ano: cada turma de vinte e quatro mil.
ప్రజాసంఖ్యను బట్టి ఇది ఇశ్రాయేలీయుల పూర్వీకుల కుటుంబ పెద్దలు, సహస్రాధిపతులు, శతాధిపతులు, వాళ్ళ లెక్క గురించినది. అంటే ఏర్పాటైన వంతుల విషయంలో ప్రతి సంవత్సరం, ప్రతి నెలా రాజుకు సేవ చేసిన వాళ్ళ గురించినది. వీళ్ళ సంఖ్య ఇరవై నాలుగు వేలు.
2 Sobre a primeira turma do mês primeiro estava Jasobeam, filho de Zabdiel: e em sua turma havia vinte e quatro mil.
మొదటి నెల మొదటి గుంపు మీద జబ్దీయేలు కొడుకు యాషాబాము అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో ఇరవై నాలుగు వేల మంది ఉన్నారు.
3 Era este dos filhos de Phares, chefe de todos os capitães dos exércitos, para o primeiro mês.
పెరెజు సంతానంలో ఒకడు మొదటి నెలలో సైన్యాధిపతులకందరికీ అధిపతిగా ఉన్నాడు.
4 E sobre a turma do segundo mês era Dodai, o ahohita, com a sua turma, cujo chefe era Mikloth: também em sua turma havia vinte e quatro mil.
రెండో నెల వంతు అహోహీయుడైన దోదై, అతని గుంపుదీ అయింది. అతని గుంపులో మిక్లోతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
5 O terceiro capitão do exército do terceiro mês era Benaias, filho de Joiada, oficial maior e chefe: também em sua turma havia vinte e quatro mil.
మూడో నెల యెహోయాదా కొడుకూ, సభాముఖ్యుడైన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరినవాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
6 Era este Benaias um varão entre os trinta, e sobre os trinta: e sobre a sua turma estava Ammizabad, seu filho.
ఈ బెనాయా ఆ ముప్ఫై మంది పరాక్రమశాలుల్లో ఒకడై ఆ ముప్ఫైమందికి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో అతని కొడుకు అమ్మీజాబాదు ఉన్నాడు.
7 O quarto do quarto mês Asael, irmão de Joab, e depois dele Zebadias, seu filho: também em sua turma havia vinte e quatro mil.
నాలుగో నెల యోవాబు సహోదరుడు అశాహేలు నాలుగో అధిపతిగా ఉన్నాడు. అతని కొడుకు జెబద్యా అతని తరువాత అధిపతి అయ్యాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
8 O quinto do quinto mês o maioral Samhuth, o israhita: também em sua turma havia vinte e quatro mil.
అయిదో నెల ఇశ్రాహేతీయుడైన షంహూతు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
9 O sexto do sexto mês Ira, filho de Ikkes, o tekoita: também em sua turma havia vinte e quatro mil.
ఆరో నెల తెకోవీయుడైన ఇక్కేషుకు పుట్టిన ఈరా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
10 O sétimo do sétimo mês Heles, o pelonita, dos filhos de Ephraim: também em sua turma havia vinte e quatro mil.
౧౦ఏడో నెల ఎఫ్రాయిము సంతతివాడూ, పెలోనీయుడు అయిన హేలెస్సు అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
11 O oitavo do oitavo mês Sibbechai, o husathita, dos zarithas: também em sua turma havia vinte e quatro mil.
౧౧ఎనిమిదో నెల జెరహీయుల బంధువూ, హుషాతీయుడు అయిన సిబ్బెకై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
12 O nono do nono mês Abiezer, o anathotita, dos benjaminitas: também em sua turma havia vinte e quatro mil.
౧౨తొమ్మిదో నెల బెన్యామీనీయుల బంధువూ, అనాతోతీయుడు అయిన అబీయెజెరు అధిపతిగా ఉన్నాడు, అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
13 O décimo do décimo mês Maharai, o netophatita, dos zarithas: também em sua turma havia vinte e quatro mil.
౧౩పదో నెల జెరహీయుల బంధువూ, నెటోపాతీయుడు అయిన మహరై అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
14 O undécimo do undécimo mês Benaia, o pirathonita, dos filhos de Ephraim: também em sua turma havia vinte e quatro mil.
౧౪పదకొండో నెల ఎఫ్రాయిము సంతానం వాడూ, పిరాతోనీయుడు అయిన బెనాయా అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
15 O duodécimo do duodécimo mês Heldia, o nethophatita, de Othniel: também em sua turma havia vinte e quatro mil.
౧౫పన్నెండో నెల ఒత్నీయేలు బంధువూ, నెటోపాతీయుడు అయిన హెల్దయి అధిపతిగా ఉన్నాడు. అతని గుంపులో చేరిన వాళ్ళు ఇరవై నాలుగు వేలమంది.
16 Porém sobre as tribos de Israel eram estes: sobre os rubenitas era chefe Eliezer, filho de Zichri; sobre os simeonitas Sephatias, filho de Maaca;
౧౬ఇంకా, ఇశ్రాయేలీయుల గోత్రాల మీద ఉన్నవాళ్ళ వివరం, జిఖ్రీ కొడుకు ఎలీయెజెరు రూబేనీయులకు అధిపతిగా ఉన్నాడు, మయకా కొడుకు షెపట్య షిమ్యోనీయులకు అధిపతిగా ఉన్నాడు,
17 Sobre os levitas Hasabias, filho de Kemuel; sobre os aaronitas Zadok;
౧౭కెమూయేలు కొడుకు హషబ్యా లేవీయులకు అధిపతిగా ఉన్నాడు, సాదోకు అహరోనీయులకు అధిపతిగా ఉన్నాడు.
18 Sobre Judá, Elihu, dos irmãos de David; sobre Issacar, Omri, filho de Michael;
౧౮దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు,
19 Sobre Zebulon, Irmaias, filho de Obadias; sobre Naphtali, Jerimoth, filho de Azriel;
౧౯ఓబద్యా కొడుకు ఇష్మయా జెబూలూనీయులకు అధిపతిగా ఉన్నాడు. అజ్రీయేలు కొడుకు యెరీమోతు నఫ్తాలీయులకు అధిపతిగా ఉన్నాడు.
20 Sobre os filhos de Ephraim, Hoseas, filho de Azazias; sobre a meia tribo de Manasseh Joel, filho de Pedaias;
౨౦అజజ్యాహు కొడుకు హోషేయ ఎఫ్రాయిమీయులకు అధిపతిగా ఉన్నాడు. మనష్షే అర్థగోత్రం వాళ్లకు పెదాయా కొడుకు యోవేలు అధిపతిగా ఉన్నాడు.
21 Sobre a outra meia tribo de Manasseh em Gilead, Iddo, filho de Zacarias; sobre Benjamin, Jaasiel, filho de Abner;
౨౧గిలాదులో ఉన్న మనష్షే అర్థగోత్రం వాళ్లకు జెకర్యా కొడుకు ఇద్దో అధిపతిగా ఉన్నాడు. బెన్యామీనీయులకు అబ్నేరు కొడుకు యహశీయేలు అధిపతిగా ఉన్నాడు.
22 Sobre Dan, Azarel, filho de Jeroham: estes eram os capitães das tribos de Israel.
౨౨దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు.
23 Não tomou porém David o número dos de vinte anos e daí para baixo, porquanto o Senhor tinha dito que havia de multiplicar a Israel como as estrelas do céu.
౨౩ఇశ్రాయేలీయులను ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా చేస్తానని యెహోవా చెప్పాడు గనుక ఇరవై సంవత్సరాలు మొదలుకుని, అంతకు తక్కువ వయస్సు ఉన్నవాళ్ళను దావీదు ప్రజాసంఖ్యలో చేర్చలేదు.
24 Joab, filho de Zeruia, tinha começado a numera-los, porém não acabou; porquanto viera por isso grande ira sobre Israel: pelo que o número se não pôs na conta das crônicas do rei David.
౨౪ప్రజాసంఖ్య చూసే విషయంలో ఇశ్రాయేలీయుల మీదికి ఉగ్రత వచ్చిన కారణంగా సెరూయా కొడుకు యోవాబు దాన్ని చెయ్యడం ఆరంభించాడు గాని దాన్ని ముగించలేదు. కాబట్టి ప్రజాసంఖ్య మొత్తం దావీదు రాజు వృత్తాంత గ్రంథాల్లో చేర్చలేదు.
25 E sobre os tesouros do rei estava Azmaveth, filho de Adiel; e sobre os tesouros da terra, das cidades, e das aldeias, e das torres, Jonathan, filho de Uzias.
౨౫రాజు గిడ్డంగుల మీద అదీయేలు కొడుకు అజ్మావెతు నియామకం జరిగింది. అయితే పొలాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో, దుర్గాల్లో ఉన్న ఆస్తి మీద ఉజ్జియా కొడుకు యెహోనాతాను నియామకం జరిగింది.
26 E sobre os que faziam a obra do campo, na lavoura da terra, Ezri, filho de Chelub.
౨౬పొలాల్లో పనిచేసే వాళ్ళ మీద, భూమి దున్నే వాళ్ళ మీద కెలూబు కొడుకు ఎజ్రీ నియామకం జరిగింది.
27 E sobre as vinhas Simei, o ramathita: porém sobre o que das vides entrava nos tesouros do vinho Zabdi, o siphmita.
౨౭ద్రాక్షతోటల మీద రామాతీయుడైన షిమీ, ద్రాక్షతోటల ఆదాయమైన ద్రాక్షామధురసం నిలువ చేసే కొట్ల మీద షిష్మీయుడైన జబ్ది నియామకం జరిగింది.
28 E sobre os olivais e figueiras bravas que havia nas campinas, Baal Hanan, o gederita: porém Joás sobre os tesouros do azeite.
౨౮షెఫేలా ప్రదేశంలో ఉన్న ఒలీవ చెట్ల మీద, మేడిచెట్ల మీద గెదేరీయుడైన బయల్‌ హనాను నియామకం జరిగింది. నూనె కొట్ల మీద యోవాషు నియామకం జరిగింది.
29 E sobre os gados que pasciam em Saron, Sitrai, o saronita: porém sobre os gados dos vales, Saphat, filho de Adlai.
౨౯షారోనులో మేసే పశువుల మీద షారోనీయుడైన షిట్రయి, లోయల్లో ఉన్న పశువుల మీద అద్లయి కొడుకు షాపాతు నియామకం జరిగింది.
30 E sobre os camelos, Obil, o ishmaelita: e sobre as jumentas, Jehdias, o meronothita.
౩౦ఒంటెల మీద ఇష్మాయేలీయుడైన ఓబీలు, గాడిదల మీద మేరోనోతీయుడైన యెహెద్యాహు నియామకం జరిగింది.
31 E sobre o gado miúdo, Jaziz, o hagarita: todos estes eram maiorais da fazenda que tinha o rei David.
౩౧గొర్రెల మీద హగ్రీయుడైన యాజీజు నియామకం జరిగింది. వీళ్ళందరూ దావీదు రాజు ఆస్తి మీద నియమించిన అధిపతులు.
32 E Jonathan, tio de David, era do conselho, homem entendido, e também escriba: e Jehiel, filho de Hacmoni, estava com os filhos do rei.
౩౨దావీదు పినతండ్రి యోనాతాను వివేకం కలిగిన ఆలోచనకర్తగా ఉన్నాడు గనుక అతన్ని ప్రధానమంత్రిగా నియమించారు. హక్మోనీ కొడుకు యెహీయేలు రాకుమారుల దగ్గర ఉండడానికి నియమించారు.
33 E Achitophel era do conselho do rei: e Husai, o archita, amigo do rei.
౩౩అహీతోపెలు రాజుకు మంత్రి. అర్కీయుడైన హూషై రాజుకు అంతరంగిక సలహాదారు.
34 E depois de Achitophel, Joiada, filho de Benaias, e Abiathar; porém Joab era chefe do exército do rei.
౩౪అహీతోపెలు చనిపోయిన తరువాత బెనాయా కొడుకు యెహోయాదా, అబ్యాతారు మంత్రులయ్యారు. రాజు సేనకు యోవాబు సర్వసైన్యాధ్యక్షుడు.

< 1 Crônicas 27 >