< Jeremias 21 >
1 A palavra que veiu a Jeremias da parte do Senhor, quando o rei Zedekias lhe enviou a Pashur, filho de Malchias, e a Zephanias filho de Maaseia, o sacerdote, dizendo:
౧సిద్కియా రాజు మల్కీయా కొడుకైన పషూరునూ, మయశేయా కొడుకూ, యాజకుడైన జెఫన్యానూ పిలిపించాడు.
2 Pergunta agora por nós ao Senhor; porque Nabucodonozor, rei de Babylonia, guerreia contra nós: bem pode ser que o Senhor obre comnosco segundo todas as suas maravilhas, e o faça subir de nós.
౨“బబులోను రాజు నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేస్తున్నాడు. అతడు మనలను విడిచి వెళ్లిపోయేలా యెహోవా తన అద్భుత క్రియలన్నిటిని మన పట్ల జరిగిస్తాడేమో దయచేసి మా కోసం యెహోవా దగ్గర విచారణ చేయండి” అని చెప్పడానికి యిర్మీయా దగ్గరికి వారిని పంపించాడు. అప్పుడు యెహోవా దగ్గరనుంచి యిర్మీయాకు వచ్చిన సందేశం.
3 Então Jeremias lhes disse: Assim direis a Zedekias:
౩యిర్మీయా వారితో ఇలా అన్నాడు. “మీరు సిద్కియాతో ఈ మాట చెప్పండి.
4 Assim diz o Senhor, o Deus d'Israel: Eis que virarei contra vós as armas de guerra, que estão nas vossas mãos, com que vós pelejaes contra o rei de Babylonia, e contra os chaldeos, que vos teem cercado de fóra do muro, e ajuntal-os-hei no meio d'esta cidade.
౪ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు, ప్రాకారం వెలుపల మిమ్మల్ని ముట్టడి వేసే బబులోను రాజు మీద, కల్దీయుల మీద, మీరు ప్రయోగిస్తున్న యుద్దాయుధాలను వెనక్కి పంపించేస్తాను. వాటిని ఈ పట్టణం మధ్యలో పోగుచేయిస్తాను.
5 E eu pelejarei contra vós com mão estendida, e com braço forte, e com ira, e com indignação e com grande furor.
౫నేనే నా బలమైన చెయ్యి చాపి తీవ్రమైన కోపంతో, రౌద్రంతో, ఆగ్రహంతో మీమీద యుద్ధం చేస్తాను.
6 E ferirei os habitantes d'esta cidade, assim os homens como as bestas: de grande pestilencia morrerão.
౬ఈ పట్టణంలోని మనుషులనూ పశువులనూ చంపేస్తాను. వాళ్ళు తీవ్రమైన అంటురోగంతో చస్తారు.”
7 E depois d'isto, diz o Senhor, entregarei Zedekias, rei de Judah, e seus servos, e o povo, e os que d'esta cidade restarem da pestilencia, e da espada, e da fome, na mão de Nabucodonozor, rei de Babylonia, e na mão de seus inimigos, e na mão dos que buscam a sua vida; e feril-os-ha ao fio da espada: não os poupará, nem se compadecerá, nem terá misericordia.
౭యెహోవా ఇలా చెబుతున్నాడు. “ఆ తరువాత యూదా దేశపు రాజు సిద్కియానూ అతని ఉద్యోగులనూ తెగులును, కత్తిని, కరువును తప్పించుకున్న మిగిలిన ప్రజలనూ బబులోను రాజు నెబుకద్నెజరు చేతికీ వారి ప్రాణాలను తీయాలని చూసేవాళ్ళ శత్రువుల చేతికీ అప్పగిస్తాను. అతడు వారి మీద కనికరం, జాలి ఏమీ చూపక వారిని కత్తితో చంపేస్తాడు.”
8 E a este povo dirás: Assim diz o Senhor: Eis que ponho diante de vós o caminho da vida e o caminho da morte.
౮ఈ ప్రజలతో ఇలా చెప్పు. “యెహోవా చెప్పేదేమిటంటే, జీవమార్గం, మరణ మార్గం, నేను మీ ఎదుట ఉంచుతున్నాను.
9 O que ficar n'esta cidade ha de morrer á espada, ou á fome, ou da pestilencia; porém o que sair, e se render aos chaldeos, que vos teem cercado, viverá, e terá a sua vida por despojo.
౯ఈ పట్టణంలో ఉండబోయే వాళ్ళు కత్తితో, కరువుతో, అంటురోగంతో చస్తారు. పట్టణం బయటకు వెళ్లి మిమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయులకు లోబడేవాళ్ళు బతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది.
10 Porque puz o meu rosto contra esta cidade para mal, e não para bem, diz o Senhor: na mão do rei de Babylonia se entregará, e queimal-a-ha a fogo.
౧౦నేను ఈ పట్టణంపై దయ చూపను. దానికి ఆపద కలిగిస్తాను. ఇది బబులోను రాజు వశమవుతుంది. అతడు దాన్ని కాల్చి వేస్తాడు.” ఇది యెహోవా వాక్కు.
11 E á casa do rei de Judah dirás: Ouvi a palavra do Senhor:
౧౧యూదా రాజవంశం వారికి ఇలా చెప్పు. “యెహోవా మాట వినండి.”
12 Ó casa de David, assim diz o Senhor: Julgae pela manhã justamente, e livrae o roubado da mão do oppressor; para que não saia o meu furor como fogo, e se accenda, sem que haja quem o apague, por causa da maldade de vossas acções.
౧౨దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.” ఇది యెహోవా వాక్కు.
13 Eis que eu sou contra ti, ó moradora do valle, ó rocha da campina, diz o Senhor: os que dizeis: Quem descerá contra nós? ou, Quem entrará nas nossas moradas?
౧౩“లోయలో నివసించేదానా, మైదానంలోని బండవంటిదానా, ‘మా మీదికి ఎవరు వస్తారు? మా ఇళ్ళల్లో ఎవరు అడుగుపెడతారు?’ అని నువ్వు అనుకుంటున్నావు.
14 Porém farei visitação sobre vós segundo o fructo das vossas acções, diz o Senhor; e accenderei o fogo no seu bosque, que consumirá a tudo o que está em redor d'ella.
౧౪మీ పనులకు తగినట్టు మిమ్మల్ని దండిస్తాను. అడవుల్లో నిప్పు పెడతాను. అది దాని చుట్టూ ఉన్నదాన్నంతా కాల్చివేస్తుంది.” ఇది యెహోవా వాక్కు.