< Gênesis 49 >
1 Depois chamou Jacob a seus filhos, e disse: Ajuntae-vos, e annunciar-vos-hei o que vos ha de acontecer nos derradeiros dias:
౧యాకోబు తన కొడుకులను పిలిపించి ఇలా అన్నాడు. “మీరు కలిసి రండి, రాబోయే రోజుల్లో మీకు ఏం జరుగుతుందో నేను చెబుతాను.
2 Ajuntae-vos, e ouvi, filhos de Jacob; e ouvi a Israel vosso pae:
౨యాకోబు కొడుకుల్లారా, కలిసి వచ్చి వినండి. మీ తండ్రి ఇశ్రాయేలు మాట వినండి.
3 Ruben, tu és meu primogenito, minha força, e o principio de meu vigor, o mais excellente em alteza, e o mais excellente em potencia.
౩రూబేనూ, నువ్వు నా పెద్ద కొడుకువి. నా బలానివి, నా శక్తి ప్రథమ ఫలానివి. ఘనతలోనూ బలంలోనూ ఆధిక్యం గలవాడివి.
4 Fervente como a agua, não serás o mais excellente; porquanto subiste ao leito de teu pae. Então o contaminaste; subiu á minha cama.
౪పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.
5 Simeão e Levi são irmãos: as suas espadas são instrumentos de violencia.
౫షిమ్యోను, లేవి అన్నదమ్ములే. వారి కత్తులు దౌర్జన్యం చేసే ఆయుధాలు.
6 No seu secreto conselho não entre minha alma, com a sua congregação minha gloria não se ajunte; porque no seu furor mataram varões, e na sua teima arrebataram bois
౬నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు, వారి సభలో చేరవద్దు. నా హృదయం వారితో కలవలేనంత ఉదాత్తమైనది. కోపంలో వారు మనుషులను చంపారు. సరదా కోసం ఎద్దుల కాళ్ళ నరాలు తెగ్గొట్టారు.
7 Maldito seja o seu furor, pois era forte, e a sua ira, pois era dura: eu os dividirei em Jacob, e os espalharei em Israel.
౭వారి కోపం చాలా తీవ్రమైనది. వారి ఆగ్రహం క్రూరమైంది. అవి శాపగ్రస్తమైనవి. నేను వారిని యాకోబు ప్రజల్లో విభాగిస్తాను. ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.
8 Judah, te louvarão os teus irmãos; a tua mão será sobre o pescoço de teus inimigos: os filhos de teu pae a ti se inclinarão.
౮యూదా, నీ సోదరులు నిన్ను స్తుతిస్తారు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటుంది. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు.
9 Judah é um leãosinho, da preza subiste, filho meu: encurva-se, e deita-se como um leão, e como um leão velho: quem o despertará?
౯యూదా సింహం పిల్ల. నా కుమారుడా, నువ్వు చీల్చిన దాని దగ్గరనుంచి వచ్చావు. అతడు కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. సింహం లాగా, ఆడ సింహం లాగా గర్జించాడు. అతన్ని లేపడానికి తెగించేవాడెవడు?
10 O sceptro não se arredará de Judah, nem o legislador d'entre seus pés, até que não venha Shiloh; e a elle congregarão os povos
౧౦షిలోహు వచ్చే వరకూ యూదా దగ్గరనుంచి రాజదండం తొలగదు. అతని కాళ్ళ మధ్య నుంచి అధికార రాజదండం తొలగదు. రాజ్యాలు అతనికి లోబడతాయి.
11 Elle amarrará o seu jumentinho á vide, e o filho da sua jumenta á cepa mais excellente: elle lavará o seu vestido no vinho, e a sua capa em sangue de uvas.
౧౧ద్రాక్షావల్లికి తన గాడిదనూ, మేలైన ద్రాక్ష తీగెకు తన గాడిద పిల్లనూ కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలనూ, ద్రాక్షల రక్తంలో తన అంగీనీ ఉతికాడు.
12 Os olhos serão vermelhos de vinho, e os dentes brancos de leite.
౧౨అతని కళ్ళు ద్రాక్షారసమంత ఎర్రగా, అతని పళ్ళు పాలవలే తెల్లగా ఉంటాయి.
13 Zabulon habitará no porto dos mares, e será porto dos navios, e o seu termo será para Sidon.
౧౩జెబూలూను సముద్రపు ఒడ్డున నివసిస్తాడు. అతడు ఓడలకు రేవుగా ఉంటాడు. అతని పొలిమేర సీదోను వరకూ ఉంటుంది.
14 Issacar é jumento de fortes ossos, deitado entre dois fardos.
౧౪ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్య పడుకున్న బలమైన గాడిద.
15 E viu elle que o descanço era bom, e seu hombro para acarretar, e serviu debaixo de tributo.
౧౫అతడు మంచి విశ్రాంతి స్థలాన్నీ రమ్యమైన భూమినీ చూశాడు. బరువులు మోయడానికి భుజం వంచి చాకిరీ చేసే దాసుడయ్యాడు.
16 Dan julgará o seu povo, como uma das tribus d'Israel.
౧౬దాను ఇశ్రాయేలు గోత్రాల్లో ఒక గోత్రంగా తన ప్రజలకు న్యాయం తీరుస్తాడు.
17 Dan será serpente junto ao caminho, uma vibora junto á vereda, que morde os calcanhares do cavallo, e faz cair o seu cavalleiro por detrás.
౧౭దాను, దారిలో పాము లాగా, గుర్రం మడిమె కరచి, రౌతు వెనక్కి పడిపోయేలా చేసే కట్లపాముగా దారిలో ఉంటాడు.
18 A tua salvação espero, ó Senhor!
౧౮యెహోవా, నీ రక్షణ కోసం కనిపెడుతున్నాను.
19 Quanto a Gad, uma tropa o accommetterá; mas elle a accommetterá por fim.
౧౯దోపిడీ గాళ్ళు గాదును కొడతారు. అయితే, అతడు వాళ్ళ మడిమెను కొడతాడు.
20 De Aser, o seu pão será gordo, e elle dará delicias reaes.
౨౦ఆషేరు ఆహారం శ్రేష్ఠమైనది. రాజులకు తగిన మధుర పదార్దాలు అతడు అందిస్తాడు.
21 Naphtali é uma cerva solta: elle dá palavras formosas.
౨౧నఫ్తాలి వదిలిపెట్టిన లేడి. అతనికి అందమైన పిల్లలుంటారు.
22 José é um ramo fructifero, ramo fructifero junto á fonte; seus ramos correm sobre o muro.
౨౨యోసేపు ఫలించే కొమ్మ. ఊట దగ్గర పండ్లు కాసే పెద్ద కొమ్మ. దాని కొమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపిస్తాయి.
23 Os frecheiros lhe deram amargura, e o frecharam e aborreceram.
౨౩విలుకాళ్ళు అతనీపై దాడి చేస్తారు. అతని మీద బాణాలు వేసి అతన్ని హింసిస్తారు.
24 O seu arco, porém, susteve-se no forte, e os braços de suas mãos foram fortalecidos pelas mãos do Valente de Jacob (d'onde é o pastor e a pedra d'Israel).
౨౪అయితే, అతని విల్లు స్థిరంగా ఉంటుంది. అతని చేతులు నైపుణ్యంతో ఉంటాయి. ఎందుకంటే, ఇది యాకోబు పరాక్రమశాలి చేతుల వలన, ఇశ్రాయేలు ఆధార శిల, కాపరి పేరున అయింది.
25 Pelo Deus de teu pae, o qual te ajudará, e pelo Todo-poderoso, o qual te abençoará com bençãos dos céus de cima, com bençãos do abysmo que está debaixo, com bençãos dos peitos e da madre
౨౫నీకు సహాయం చేసే నీ తండ్రి దేవుని వలన, నిన్ను దీవించే సర్వశక్తుని వలన, నీకు పైనుండి వచ్చే దీవెనలు, కింది అగాధపు దీవెనలు, స్తనాల, గర్భాల దీవెనలు వస్తాయి.
26 As bençãos de teu pae excederão as bençãos de meus paes, até á extremidade dos outeiros eternos: ellas estarão sobre a cabeça de José, e sobre o alto da cabeça do separado de seus irmãos.
౨౬నీ తండ్రి దీవెనలు, పురాతన పర్వతాలంత ఘనంగా, నిత్య గిరులంత ఉన్నతంగా ఉంటాయి. అవి యోసేపు తల మీద ఉంటాయి. తన సోదరుల్లో ఘనుడైన వాని నడినెత్తి మీద ఉంటాయి.
27 Benjamin é lobo que despedaça; pela manhã comerá a preza, e á tarde repartirá o despojo.
౨౭బెన్యామీను ఆకలిగొన్న తోడేలు. అతడు ఉదయాన ఎరను మింగి, దోచుకున్న దాన్ని, సాయంత్రం వేళ పంచుకుంటాడు.”
28 Todas estas são as doze tribus de Israel: e isto é o que lhes fallou seu pae quando os abençoou; a cada um d'elles abençoou segundo a sua benção.
౨౮ఇవన్నీ ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు. వారి తండ్రి వారిని దీవిస్తూ వారితో చెప్పింది యిదే. ఎవరి దీవెన వారికి తగినదే.
29 Depois ordenou-lhes, e disse-lhes: Eu me congrego ao meu povo; sepultae-me com meus paes, na cova que está no campo de Ephron, o hetheo,
౨౯తరువాత అతడు వారికి ఆజ్ఞాపిస్తూ ఇలా అన్నాడు. “నేను నా పూర్వీకుల దగ్గరికి వెళ్ళబోతున్నాను.
30 Na cova que está no campo de Machpela, que está em frente de Mamre, na terra de Canaan, a qual Abrahão comprou com aquelle campo de Ephron, o hetheo, por herança de sepultura:
౩౦హిత్తీయుడైన ఎఫ్రోను పొలంలోని గుహలో నా పూర్వీకుల దగ్గర నన్ను పాతిపెట్టండి. ఆ గుహ కనాను దేశంలోని మమ్రే దగ్గర ఉన్న మక్పేలా మైదానంలో ఉంది. అబ్రాహాము దానినీ ఆ పొలాన్నీ హిత్తీయుడైన ఎఫ్రోను దగ్గర శ్మశాన భూమి కోసం స్వాస్థ్యంగా కొన్నాడు.
31 Ali sepultaram a Abrahão, e a Sarah sua mulher: ali sepultaram a Isaac, e a Rebecca sua mulher: e ali eu sepultei a Leah.
౩౧అక్కడే వారు అబ్రాహామునూ అతని భార్య శారాను పాతిపెట్టారు. అక్కడే ఇస్సాకును అతని భార్య రిబ్కాను పాతి పెట్టారు. అక్కడే నేను లేయాను పాతిపెట్టాను.
32 O campo, e a cova que está n'elle, foi comprado aos filhos de Heth.
౩౨ఆ పొలాన్నీ అందులోని గుహనూ హేతు కొడుకుల దగ్గర కొన్నారు” అన్నాడు.
33 Acabando pois Jacob de dar mandamentos a seus filhos, encolheu os seu pés na cama, e espirou, e foi congregado ao seu povo.
౩౩యాకోబు తన కొడుకులకు ఆజ్ఞాపించడం ముగించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణం విడిచి తన వారి దగ్గరికి చేరాడు.