< Objawienie 1 >
1 Objawienie Jezusa Chrystusa, które dał mu Bóg, aby ukazać swoim sługom to, co ma się stać wkrótce, a [on to] ukazał i posłał przez swojego anioła swemu słudze Janowi;
౧ఇది త్వరలో జరగాల్సిన సంగతులను యేసుక్రీస్తు తన దాసులకు చూపించడం కోసం దేవుడు ఆయనకు ఇచ్చిన ప్రత్యక్షత. ఆయన తన దేవదూతను పంపి తన దాసుడైన యోహానుకు ఈ సంగతులను తెలియజేశాడు.
2 Który poświadczył słowo Boże i świadectwo Jezusa Chrystusa, i wszystko, co widział.
౨యోహాను దేవుని వాక్కును గురించీ యేసు క్రీస్తు సాక్షాన్ని గురించీ తాను చూసినదానంతటికీ సాక్షిగా ఉన్నాడు.
3 Błogosławiony ten, kto czyta, i [ci], którzy słuchają słów tego proroctwa i zachowują to, co w nim jest napisane, bo czas jest bliski.
౩ఈ ప్రవచన వాక్యాలను బిగ్గరగా చదివేవాడూ, వాటిని వినే వారూ, వాటి ప్రకారం నడుచుకునే వారూ ధన్య జీవులు. ఎందుకంటే సమయం దగ్గర పడింది.
4 Jan do siedmiu kościołów, które są w Azji. Łaska wam i pokój od tego, który jest i który był, i który ma przyjść, i od siedmiu Duchów, które są przed jego tronem;
౪ఆసియలో ఉన్న ఏడు సంఘాలకు శుభాకాంక్షలతో యోహాను రాస్తున్న సంగతులు. పూర్వం ఉండి, ప్రస్తుతం ఉంటూ, రానున్న వాడి నుండీ, ఆయన సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండీ,
5 I od Jezusa Chrystusa, [który jest] wiernym świadkiem i pierworodnym z umarłych, i władcą królów ziemi. Temu, który nas umiłował i obmył nas z naszych grzechów swoją krwią;
౫నమ్మకమైన సాక్షీ, చనిపోయిన వారిలో నుండి ప్రథముడిగా లేచిన వాడూ, భూరాజులందరి పరిపాలకుడూ అయిన యేసు క్రీస్తు నుండీ కృపా, శాంతీ మీకు కలుగు గాక. ఆయన మనలను ప్రేమిస్తూ తన రక్తం ద్వారా మనలను మన పాపాల నుండి విడిపించాడు.
6 I uczynił nas królami i kapłanami dla Boga, swego Ojca, jemu chwała i moc na wieki wieków. Amen. (aiōn )
౬మనలను తన తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యంగానూ, యాజకులుగానూ చేశాడు. ఆయనకు కీర్తి యశస్సులూ, అధికారమూ కలకాలం ఉంటాయి గాక! (aiōn )
7 Oto przychodzi z obłokami i ujrzy go wszelkie oko, także ci, którzy go przebili. I będą lamentować przed nim wszystkie plemiona ziemi. Tak, amen.
౭చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.
8 Ja jestem Alfa i Omega, początek i koniec, mówi Pan, który jest i który był, i który ma przyjść, Wszechmogący.
౮“ఆల్ఫా, ఒమేగా నేనే. ప్రస్తుతముంటూ, పూర్వం ఉండి, భవిష్యత్తులో వచ్చేవాణ్ణి. సర్వశక్తి గలవాణ్ణి” అని ప్రభువు అంటున్నాడు.
9 Ja, Jan, który też [jestem] waszym bratem i współuczestnikiem w ucisku i królestwie oraz w cierpliwości Jezusa Chrystusa, byłem na wyspie zwanej Patmos z powodu słowa Bożego i świadectwa Jezusa Chrystusa.
౯మీ సోదరుణ్నీ, యేసు కోసం కలిగే హింసలోనూ, రాజ్యంలోనూ, ఓర్పులోనూ మీలో ఒకడినీ అయిన యోహాను అనే నేను దేవుని వాక్కు కోసం, యేసు సాక్ష్యం కోసం పత్మసు ద్వీపంలో ఉన్నాను.
10 Znalazłem się w zachwyceniu Ducha w dniu Pańskim i usłyszałem za sobą głos potężny jakby trąby;
౧౦ప్రభువు దినాన నేను దేవుని ఆత్మ స్వాధీనంలో ఉన్నప్పుడు భేరీనాదం లాంటి ఒక పెద్ద స్వరం
11 Który mówił: Ja jestem Alfa i Omega, pierwszy i ostatni. Co widzisz, napisz w księdze i poślij do siedmiu kościołów, które są w Azji: do Efezu, Smyrny, Pergamonu, Tiatyry, Sardes, Filadelfii i Laodycei.
౧౧నా వెనక వినిపించింది. “నువ్వు చూస్తున్నది ఒక పుస్తకంలో రాయి. దాన్ని ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియ, లవొదికయలలో ఉన్న ఏడు సంఘాలకు పంపు” అని చెప్పడం విన్నాను.
12 I odwróciłem się, aby zobaczyć, co to za głos mówił do mnie. A gdy się odwróciłem, zobaczyłem siedem złotych świeczników;
౧౨అది వింటూనే “ఎవరిదీ స్వరం?” అని చూడడానికి వెనక్కి తిరిగాను. అక్కడ ఏడు బంగారు దీపస్తంభాలను చూశాను.
13 A pośród tych siedmiu świeczników [kogoś] podobnego do Syna Człowieczego, ubranego w długą szatę i przepasanego na piersi złotym pasem.
౧౩ఆ ఏడు బంగారు దీపస్తంభాల మధ్య మనుష్య కుమారుడిలాంటి వ్యక్తిని చూశాను. పాదాలను తాకుతున్న ఒక పొడవాటి అంగీని ఆయన ధరించాడు. రొమ్ముకు బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.
14 Jego głowa i włosy [były] białe jak biała wełna, jak śnieg, a jego oczy jak płomień ognia.
౧౪ఆయన తల, తల వెంట్రుకలూ ఉన్నిలాగా, మంచు అంత తెల్లగా ఉన్నాయి. ఆయన కళ్ళు అగ్ని జ్వాలల్లా ఉన్నాయి.
15 Jego stopy podobne do mosiądzu, jakby w piecu rozżarzonego, a jego głos jak szum wielu wód.
౧౫ఆయన పాదాలు కొలిమిలో కాలుతూ తళతళ మెరుస్తున్న కంచులా ఉన్నాయి. ఆయన కంఠ స్వరం వేగంగా పడుతున్న మహా జలపాతం ధ్వనిలా ఉంది.
16 W swej prawej ręce miał siedem gwiazd, a z jego ust wychodził ostry miecz obosieczny. Jego oblicze [było] jak słońce, [gdy] świeci w [pełni] swej mocy.
౧౬ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి. ఆయన నోటి నుండి పదునైన రెండు అంచుల కత్తి బయటకు వస్తూ ఉంది. ఆయన ముఖం తన పూర్ణ శక్తితో ప్రకాశిస్తున్న సూర్యుడిలా ఉంది.
17 Gdy go zobaczyłem, padłem do jego stóp jak martwy i położył na mnie swą prawą rękę, mówiąc mi: Nie bój się! Ja jestem pierwszy i ostatni;
౧౭నేను ఆయనను చూడగానే నిశ్చేష్టు డి నా ఆయన కాళ్ళ దగ్గర పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి నాతో ఇలా అన్నాడు, “భయపడకు, మొదటివాణ్ణీ చివరివాణ్ణీ నేనే.
18 I żyjący, a byłem umarły. A oto żyję na wieki wieków i mam klucze piekła i śmierci. (aiōn , Hadēs )
౧౮జీవిస్తున్నవాణ్ణీ నేనే. చనిపోయాను కానీ శాశ్వతకాలం జీవిస్తున్నాను. మరణానికీ, పాతాళ లోకానికీ తాళం చెవులు నా దగ్గరే ఉన్నాయి. (aiōn , Hadēs )
19 Napisz to, co widziałeś, i co jest, i co ma się stać potem.
౧౯ఇప్పుడు నువ్వు చూసిన సంగతులనూ ప్రస్తుతమున్న సంగతులనూ, వీటి తరువాత జరగబోయే సంగతులనూ రాయి.
20 Tajemnica siedmiu gwiazd, które widziałeś w mojej prawej ręce i siedmiu złotych świeczników [jest taka]: siedem gwiazd to aniołowie siedmiu kościołów, a siedem świeczników, które widziałeś, to siedem kościołów.
౨౦నా కుడి చేతిలో నువ్వు చూసిన ఏడు నక్షత్రాలు, ఆ ఏడు బంగారు దీపస్తంభాల రహస్యం ఇది, ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాల దూతలు. ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.