< Izajasza 66 >
1 Tak mówi PAN: Niebo jest moim tronem, a ziemia podnóżkiem moich stóp. Gdzie więc będzie ten dom, który mi zbudujecie? Gdzie będzie miejsce mego odpoczynku?
౧యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?
2 Bo to wszystko moja ręka uczyniła i dzięki niej powstało to wszystko, mówi PAN. Lecz ja patrzę na tego, który jest ubogi i skruszony w duchu i który drży na moje słowo.
౨వాటన్నిటినీ నేనే చేశాను. అవి అలా వచ్చాయి” అని యెహోవా తెలియజేస్తున్నాడు. “ఎవరైతే వినయం, నలిగిన హృదయం కలిగి నా మాట విని వణకుతారో వారిమీదే నా దృష్టి ఉంటుంది.
3 Ten, kto zabija wołu [na] ofiarę, to jakby zabił człowieka; kto zabija na ofiarę barana, to jakby ściął psu [głowę]; kto przynosi ofiarę, to jakby ofiarował krew świni; kto pali kadzidło, to jakby błogosławił bożkowi. Lecz jak oni wybrali sobie swoje drogi i ich dusza ma upodobanie w obrzydliwościach;
౩ఎద్దును వధించేవాడు మనిషిని కూడా చంపుతున్నాడు. గొర్రెపిల్లను బలిగా అర్పించే వాడు కుక్క మెడ కూడా విరుస్తున్నాడు. నైవేద్యం చేసేవాడు పందిరక్తం అర్పించే వాడి వంటివాడే. ధూపం వేసేవాడు విగ్రహాలను గొప్పగా చెప్పుకునే వాడివంటి వాడే. వాళ్ళు తమ సొంత విధానాలను ఏర్పరచుకున్నారు. తమ అసహ్యమైన పనుల్లో ఆనందిస్తున్నారు.
4 Tak i ja wybiorę ich zmyślenia i sprowadzę na nich to, czego się boją, ponieważ gdy wołałem, nikt się nie odezwał, gdy mówiłem, nie słuchali, ale czynili to, co złe w moich oczach, i wybrali to, co mi się nie podobało.
౪అలాగే, వారికి రావలసిన శిక్షను నేనే ఏర్పరుస్తాను. వాళ్ళు భయపడే వాటినే వారి మీదికి రప్పిస్తాను. ఎందుకంటే నేను పిలిచినప్పుడు ఎవరూ జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు ఎవరూ వినలేదు. నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు.”
5 Słuchajcie słowa PANA, wy, którzy drżycie na jego słowo. Wasi bracia, którzy was nienawidzą, którzy wypędzają was ze względu na moje imię, mówią: Niech PAN pokaże swoją chwałę. Ukaże się jednak dla waszej radości, a oni będą zawstydzeni.
౫యెహోవా వాక్కుకు భయపడే వారలారా, ఆయన మాట వినండి. “మీ సోదరులు మిమ్మల్ని ద్వేషిస్తూ నా పేరును బట్టి మిమ్మల్ని తోసేస్తూ ఇలా అన్నారు, ‘మీ సంతోషం మాకు కనిపించేలా యెహోవాకు ఘనత కలుగు గాక.’ అయితే వాళ్ళు సిగ్గు పాలవుతారు.
6 Odgłos zgiełku z miasta, głos ze świątyni, głos PANA oddającego zapłatę swoim wrogom.
౬పట్టణంలోనుంచి యుద్ధధ్వని వస్తూ ఉంది. దేవాలయం నుంచి శబ్దం వస్తూ ఉంది. తన శత్రువులకు ప్రతీకారం చేసే యెహోవా శబ్దం వినబడుతూ ఉంది.
7 Zanim odczuła bóle porodu, urodziła, zanim ogarnął ją ból, urodziła chłopca.
౭ప్రసవవేదన పడకముందే ఆమె పిల్లను కనింది. నొప్పులు రాకముందే కొడుకును కనింది.
8 Kto słyszał o czymś takim? Kto widział coś podobnego? Czy ziemia może urodzić w jednym dniu? Czy naród rodzi się od razu? Ale Syjon ledwie zaczął odczuwać bóle, a już urodził swoich synów.
౮అలాంటి సంగతి ఎవరైనా విన్నారా? అలాంటివి ఎవరైనా చూశారా? ఒక్క రోజులో దేశం పుడుతుందా? ఒక్క క్షణంలో ఒక రాజ్యాన్ని స్థాపించగలమా? అయినా సీయోనుకు ప్రసవవేదన కలగగానే ఆమె బిడ్డలను కనింది.
9 Czyżbym ja, który otwieram łono, nie doprowadził do rodzenia? – mówi PAN. Czyżbym ja, który doprowadzam do rodzenia, zamknął [łono]? – mówi twój Bóg.
౯నేను ప్రసవవేదన కలగజేసి కనకుండా చేస్తానా?” అని యెహోవా అడుగుతున్నాడు. “పుట్టించేవాడినైన నేను గర్భాన్ని మూస్తానా?” అని నీ దేవుడు అడుగుతున్నాడు.
10 Weselcie się z Jerozolimą i radujcie się z nią wszyscy, którzy ją miłujecie. Cieszcie się z nią wielce wszyscy, którzy nad nią płaczecie;
౧౦యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి.
11 Aby ssać do syta z piersi jej pociech; abyście ssali i rozkoszowali się pełnią jej chwały.
౧౧ఆదరణకరమైన ఆమె చనుపాలు మీరు కుడిచి తృప్తి పడతారు. ఆమె సమృద్ధిని అనుభవిస్తూ ఆనందిస్తారు.
12 Tak bowiem mówi PAN: Oto skieruję do niej pokój jak rzekę i chwałę narodów jak strumień wezbrany. Wtedy będziecie ssać, będziecie noszeni na rękach i pieszczeni na kolanach.
౧౨యెహోవా ఇలా చెబుతున్నాడు, “నదిలాగా శాంతిసమాధానాలు ఆమె దగ్గరికి ప్రవహించేలా చేస్తాను. రాజ్యాల ఐశ్వర్యం ఒడ్డు మీద పొర్లిపారే ప్రవాహంలాగా చేస్తాను. మిమ్మల్ని చంకలో ఎత్తుకుంటారు. మోకాళ్ల మీద ఆడిస్తారు.
13 Jak tego, którego pociesza matka, tak ja was będę pocieszał; i tak w Jerozolimie doznacie pociechy.
౧౩తల్లి తన బిడ్డను ఓదార్చినట్టు నేను మిమ్మల్ని ఓదారుస్తాను. యెరూషలేములోనే మిమ్మల్ని ఓదారుస్తాను.”
14 Ujrzycie to i rozraduje się wasze serce, a wasze kości zakwitną jak trawa. I będzie rozpoznana ręka PANA wobec jego sług, a jego gniew – wobec jego wrogów.
౧౪మీరు దీన్ని చూస్తారు. మీ హృదయం సంతోషిస్తుంది. మీ ఎముకలు లేతగడ్డిలాగా బలుస్తాయి. యెహోవా హస్తబలం ఆయన సేవకులకు వెల్లడి అవుతుంది. అయితే ఆయన తన శత్రువుల మీద కోపం చూపుతాడు.
15 Oto bowiem PAN przyjdzie w ogniu, a jego rydwany będą jak wicher, by wylać zapalczywość swego gniewu i [ukazać] swoją grozę w płomieniu ognia;
౧౫వినండి. మహా కోపంతో ప్రతీకారం చేయడానికి అగ్నిజ్వాలలతో గద్దించడానికి యెహోవా మంటలతో వస్తున్నాడు. ఆయన రథాలు తుఫానులాగా వస్తున్నాయి.
16 Gdyż PAN będzie sądził ogniem i mieczem wszelkie ciało, a wielu będzie pobitych przez PANA.
౧౬అగ్నితో తన కత్తితో మనుషులందరినీ యెహోవా శిక్షిస్తాడు. యెహోవా చేతుల్లో అనేకమంది చస్తారు.
17 I ci, którzy się uświęcają i oczyszczają w środku ogrodów, jeden za drugim, którzy jedzą mięso wieprzowe oraz inną obrzydliwość, a także myszy, wszyscy razem zginą – mówi PAN.
౧౭తోటల్లోకి వెళ్లడానికి వాళ్ళు తమను ప్రతిష్టించుకుని, పవిత్రపరచుకుంటారు. పందిమాంసాన్నీ అసహ్యమైన పందికొక్కులను తినే వారిని అనుసరిస్తారు. “వాళ్ళు తప్పకుండా నాశనం అవుతారు.” ఇదే యెహోవా వాక్కు.
18 Ja znam bowiem ich uczynki i myśli. I przyjdzie czas, że zgromadzę wszystkie narody i języki, a one przyjdą i ujrzą moją chwałę.
౧౮వాళ్ళ పనులూ వాళ్ళ ఆలోచనలూ నాకు తెలుసు. అన్ని తెగలనూ వివిధ భాషలు మాట్లాడే వారినీ ఒక చోట చేర్చే సమయం రాబోతుంది. వాళ్ళు వచ్చి నా ఘనత చూస్తారు.
19 I ustanowię wśród nich znak i wyślę ocalałych spośród nich do narodów do Tarszisz, Pul i Lud, a tych, którzy naciągają łuk – do Tubala i Jawan, do wysp dalekich, które nic o mnie nie słyszały i nie widziały mojej chwały; i będą głosić moją chwałę wśród narodów.
౧౯నేను వారిమధ్య ఒక గుర్తు ఉంచుతాను. వాళ్ళలో తప్పించుకున్నవాళ్ళను వేరే రాజ్యాలకు పంపిస్తాను. తర్షీషు, పూతు, లూదు అనే ప్రజల దగ్గరికీ, బాణాలు విసిరే వారి దగ్గరికీ, తుబాలు, యావాను నివాసుల దగ్గరికీ నేను పంపుతాను. నా గురించి వినకుండా నా ఘనత చూడకుండా ఉన్న దూరద్వీపవాసుల దగ్గరికీ వారిని పంపిస్తాను. వారు ప్రజల్లో నా ఘనత ప్రకటిస్తారు.
20 I przyprowadzą wszystkich waszych braci jako dar dla PANA ze wszystkich narodów, na koniach, na rydwanach, w lektykach, na mułach i na wielbłądach, na moją świętą górę, do Jerozolimy, mówi PAN, tak jak synowie Izraela przynoszą dar w czystym naczyniu do domu PANA.
౨౦అన్ని రాజ్యాల్లో నుంచి మీ సోదరులందరినీ యెహోవాకు అర్పణగా వాళ్ళు తీసుకు వస్తారు. వారిని గుర్రాల మీద రథాల మీద బండ్ల మీద కంచర గాడిదల మీద ఒంటెల మీద ఎక్కించి యెరూషలేములోని నా పవిత్ర పర్వతానికి వస్తారు. ఇశ్రాయేలీయులు పవిత్రమైన పాత్రలో నైవేద్యాన్ని యెహోవా మందిరంలోకి తెస్తారు.
21 I z nich także wezmę sobie kapłanów i Lewitów, mówi PAN.
౨౧“యాజకులుగా లేవీయులుగా ఉండడానికి నేను వారిలో కొందరిని ఏర్పరచుకుంటాను” అని యెహోవా చెబుతున్నాడు.
22 Jak bowiem to nowe niebo i ta nowa ziemia, które ja uczynię, będą trwać przede mną, mówi PAN, tak będzie trwać wasze potomstwo i wasze imię.
౨౨యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను సృజించబోయే కొత్త ఆకాశం, కొత్త భూమి నా ముందు ఎప్పటికీ ఉన్నట్టు మీ సంతానం, మీ పేరు నిలిచి ఉంటాయి.
23 I stanie się tak, że od nowiu do nowiu księżyca i od szabatu do szabatu przychodzić będzie wszelkie ciało, aby oddać pokłon przede mną, mówi PAN.
౨౩ప్రతి నెలా ప్రతి విశ్రాంతిరోజున నా ముందు సాష్టాంగ నమస్కారం చేయడానికి ప్రజలంతా వస్తారు” అని యెహోవా చెబుతున్నాడు
24 I gdy wyjdą, zobaczą trupy ludzi, którzy wystąpili przeciwko mnie. Ich robak bowiem nie zdechnie i ich ogień nie zgaśnie, i będą obrzydliwością dla wszelkiego ciała.
౨౪వాళ్ళు బయటికి వెళ్లి నామీద తిరుగుబాటు చేసినవారి శవాలను చూస్తారు. వాళ్ళను తినే పురుగులు చావవు. వాళ్ళను కాల్చే మంట ఆరిపోదు. వాళ్ళు మనుషులందరికీ అసహ్యంగా ఉంటారు.