< Wyjścia 9 >
1 Potem PAN powiedział do Mojżesza: Idź do faraona i powiedz mu: Tak mówi PAN, Bóg Hebrajczyków: Wypuść mój lud, aby mi służył;
౧అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’
2 Bo jeśli będziesz się wzbraniał go wypuścić i nadal będziesz go zatrzymywał;
౨నువ్వు గనక వాళ్ళను వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే,
3 Oto ręka PANA będzie na twoje stada, które [są] na polu, na koniach, na osłach, na wielbłądach, na wołach i na owcach. [Będzie] bardzo ciężka zaraza.
౩యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది.
4 PAN rozdzieli stada Izraela i stada Egiptu, aby nie zdechło nic ze wszystkiego, co należy do synów Izraela.
౪అయితే యెహోవా ఇశ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీయుల దేవుడు యెహోవా చెబుతున్నాడు.
5 I PAN wyznaczył czas, mówiąc: Jutro PAN to uczyni na [tej] ziemi.
౫దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు” అని చెప్పాడు.
6 Nazajutrz PAN tak uczynił. Pozdychały wszystkie stada Egiptu, lecz ze stad synów Izraela nie zdechło ani jedno.
౬తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తీయుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చావలేదు.
7 Faraon posłał więc [na zwiady], a oto z bydła Izraela nie zdechło ani jedno. Ale serce faraona pozostało zatwardziałe i nie wypuścił ludu.
౭ఇశ్రాయేలు ప్రజల పశువుల్లో ఒక్కటి కూడా చనిపోలేదనే విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు.
8 Potem PAN powiedział do Mojżesza i Aarona: Weźcie pełne garści popiołu z pieca i niech Mojżesz rozrzuci go ku niebu na oczach faraona.
౮అప్పుడు యెహోవా “మీరు మీ పిడికిళ్ల నిండా బూడిద తీసుకోండి. మోషే ఫరో చూస్తూ ఉండగా దాన్ని ఆకాశం వైపు చల్లండి.
9 Zamieni się w pył na całej ziemi Egiptu, który spowoduje wrzody pęczniejące ropą na ludziach i na zwierzętach na całej ziemi Egiptu.
౯అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలోని మనుష్యుల మీదా, జంతువుల మీదా చీము పట్టే కురుపులు కలగజేస్తుంది” అని మోషే అహరోనులతో చెప్పాడు.
10 Wzięli więc popiół z pieca i stanęli przed faraonem, a Mojżesz rozrzucił popiół ku niebu i powstały wrzody pęczniejące ropą na ludziach i na zwierzętach.
౧౦మోషే అహరోనులు బూడిద తీసుకుని ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుష్యులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి.
11 Czarownicy zaś nie mogli stanąć przed Mojżeszem z powodu wrzodów, bo wrzody były na nich i na wszystkich Egipcjanach.
౧౧ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి.
12 I PAN zatwardził serce faraona, i [ten] nie posłuchał ich, jak PAN zapowiedział Mojżeszowi.
౧౨అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం చేయడం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు.
13 PAN powiedział do Mojżesza: Wstań rano, stań przed faraonem i powiedz mu: Tak mówi PAN, Bóg Hebrajczyków: Wypuść mój lud, aby mi służył;
౧౩తరువాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్లి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.
14 Tym razem bowiem ześlę wszystkie moje plagi na twoje serce, na twoje sługi i na twój lud, abyś wiedział, że nie ma równego mi na całej ziemi.
౧౪భూమి అంతటిలో నాలాంటివాడు ఎవరూ లేరని నీవు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ సేవకుల పైకి, నీ దేశ ప్రజల పైకి పంపుతాను.
15 Bo teraz wyciągnę rękę i uderzę ciebie i twój lud zarazą, i będziesz wytracony z ziemi.
౧౫ఇంతకు ముందే నేను నా చెయ్యి చాపి నిన్నూ నీ ప్రజలనూ విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాణ్ణి.
16 Lecz dlatego cię postawiłem, aby okazać na tobie moją moc i żeby rozgłaszano moje imię na całej ziemi.
౧౬నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్ధ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి.
17 A ty jeszcze się wynosisz [i stajesz] przeciw memu ludowi, nie chcąc go wypuścić?
౧౭నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు.
18 Jutro o tej porze spuszczę bardzo ciężki grad, jakiego nie było w Egipcie od dnia jego założenia aż do tego czasu.
౧౮ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలు ఇప్పటి వరకూ అలాంటి వడగళ్ళు కురియలేదు.
19 Poślij więc teraz i zgromadź swoje bydło i wszystko, co masz na polu; [bo] każdy człowiek i każde zwierzę, które znajdzie się na polu, a nie zostanie zegnane do domu, zginie, gdy na nich spadnie grad.
౧౯అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలనూ త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తీ ప్రతి జంతువూ వడగళ్ళ బారిన పడి చనిపోతారు.”
20 Kto więc ze sług faraona uląkł się słowa PANA, kazał uciekać swym sługom wraz z bydłem do domu;
౨౦యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు.
21 Ale kto nie wziął do serca słowa PANA, ten zostawił swe sługi i bydło na polu.
౨౧యెహోవా మాట లక్ష్యపెట్టనివారు తమ పనివాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు.
22 PAN powiedział do Mojżesza: Wyciągnij rękę ku niebu, by spadł grad na całej ziemi Egiptu, na ludzi, na bydło i na wszelkie rośliny polne w ziemi Egiptu.
౨౨యెహోవా “నీ చెయ్యి ఆకాశం వైపు చాపు. ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీదా, జంతువుల మీదా పంటలన్నిటి మీదా వడగళ్లు కురుస్తాయి” అని మోషేతో చెప్పాడు.
23 I Mojżesz wyciągnął swą laskę ku niebu, a PAN zesłał grzmoty i grad i na ziemię zstąpił ogień. PAN spuścił grad na ziemię Egiptu.
౨౩మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగళ్ళు కురిపించాడు.
24 I był grad i ogień zmieszany z bardzo ciężkim gradem, jakiego nie było w całej ziemi Egiptu, odkąd stał się narodem.
౨౪ఆ విధంగా వడగళ్ళు, వడగళ్ళతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించ లేదు.
25 Grad poraził na całej ziemi Egiptu cokolwiek było na polu, od człowieka aż do zwierzęcia. Poraził też wszelkie rośliny polne i połamał wszystkie drzewa na polu;
౨౫ఐగుప్తు దేశమంతటా కురిసిన ఆ వడగళ్ళు మనుష్యులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్నీ నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి.
26 Tylko w ziemi Goszen, gdzie mieszkali synowie Izraela, nie było gradu.
౨౬అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషెను దేశంలో మాత్రం వడగళ్ళు పడలేదు.
27 Faraon kazał więc wezwać Mojżesza i Aarona i powiedział do nich: Tym razem zgrzeszyłem. PAN jest sprawiedliwy, a ja i mój lud jesteśmy niegodziwi.
౨౭ఇది చూసిన ఫరో మోషే అహరోనులను పిలిపించాడు. “ఈసారి నేను తప్పు చేశాను. యెహోవా న్యాయవంతుడు, నేనూ నా ప్రజలూ దుర్మార్గులం.
28 Wstawcie się u PANA, aby ustały Boże grzmoty i grad, bo [już] dość. Wypuszczę was i nie będziecie [tu] dłużej mieszkać.
౨౮ఇంతవరకూ జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగళ్ళు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను” అని వాళ్ళతో చెప్పాడు.
29 Mojżesz powiedział do niego: Gdy wyjdę z miasta, wyciągnę ręce do PANA, a grzmoty ustaną i nie będzie więcej gradu, abyś wiedział, że ziemia należy do PANA.
౨౯మోషే అతనితో “నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను. ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురియవు. దీన్నిబట్టి ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకొంటావు.
30 Ale wiem, że ty i twoi słudzy jeszcze nie boicie się PANA Boga.
౩౦అయినప్పటికీ నీకూ, నీ సేవకులకూ దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు” అన్నాడు.
31 Len i jęczmień zostały zbite, bo jęczmień miał już kłosy, a len zakwitł.
౩౧ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గ తొడిగాయి. బార్లీ చేలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనం అయ్యాయి.
32 Pszenica jednak i żyto nie zostały zbite, bo były późniejsze.
౩౨గోదుమలు, మిరప మొక్కలు మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు.
33 Mojżesz wyszedł więc od faraona za miasto i wyciągnął ręce do PANA. Ustały wtedy grzmoty i grad, a deszcz nie padał na ziemię.
౩౩మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వెళ్లి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది. ఉరుములు, వడగళ్ళు నిలిచిపోయాయి.
34 Kiedy faraon zobaczył, że deszcz, grad i grzmoty ustały, jeszcze bardziej zgrzeszył i zatwardził serce, on i jego słudzy.
౩౪అయితే వర్షం, వడగళ్ళు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో, అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు.
35 I serce faraona pozostało zatwardziałe i nie wypuścił synów Izraela, jak PAN zapowiedział przez Mojżesza.
౩౫యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారింది, అతడు ఇశ్రాయేలు ప్రజలను వెళ్ళనియ్యలేదు.