< Dzieje 28 >

1 Po ocaleniu dowiedzieli się, że ta wyspa nazywa się Malta.
మేము తప్పించుకొన్న తరువాత ఆ ద్వీపం మెలితే అని మాకు తెలిసింది.
2 A barbarzyńcy okazali nam niezwykłą życzliwość. Rozpalili bowiem ognisko i przyjęli nas, bo padał deszcz i było zimno.
అనాగరికులైన అక్కడి ప్రజలు మాకు చేసిన సపర్య అంతా ఇంతా కాదు. అప్పుడు వర్షం కురుస్తూ చలిగా ఉండడంతో వారు నిప్పు రాజబెట్టి మా అందరినీ చేర్చుకున్నారు.
3 A gdy Paweł nazbierał naręcze chrustu i nałożył na ogień, na skutek gorąca wypełzła żmija i uczepiła się jego ręki.
అప్పుడు పౌలు కొన్ని పుల్లలేరి నిప్పుల మీద వేస్తుండగా ఒక పాము ఆ వేడికి బయటికి వచ్చి అతని చెయ్యి పట్టుకుంది.
4 Kiedy barbarzyńcy zobaczyli gada wiszącego u jego ręki, mówili między sobą: Ten człowiek na pewno jest mordercą, bo choć wyszedł cało z morza, zemsta nie pozwala mu żyć.
ఆ ప్రజలు ఆ పాము అతని చేతిని పట్టుకుని వేలాడడం చూసి “ఈ మనిషి తప్పకుండా హంతకుడై ఉంటాడు. ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నప్పటికీ న్యాయం ఇతణ్ణి వదిలిపెట్ట లేదు” అని తమలో తాము చెప్పుకున్నారు.
5 Lecz on strząsnął gada w ogień i nie doznał nic złego.
కానీ పౌలు మాత్రం ఆ విష జంతువును మంటలో జాడించివేసి, ఏ హానీ పొందలేదు.
6 A oni oczekiwali, że spuchnie albo nagle padnie martwy. Lecz gdy długo czekali i widzieli, że nic złego mu się nie stało, zmienili zdanie i mówili, że jest bogiem.
వారైతే అతనికి హటాత్తుగా జ్వరం వంటిది రావటమో, అతడు అకస్మాత్తుగా పడి చనిపోవడమో జరుగుతుందని కనిపెడుతున్నారు. చాలాసేపు కనిపెట్టిన తరువాత అతనికి ఏ హానీ కలగకపోవడం చూసి తమ అభిప్రాయం మార్చుకుని, “ఇతడొక దేవుడు” అని చెప్పసాగారు.
7 W pobliżu tego miejsca znajdowały się posiadłości naczelnika wyspy, imieniem Publiusz, który nas przyjął i przez trzy dni po przyjacielsku gościł.
పొప్లి అనేవాడు ఆ ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు.
8 A ojciec Publiusza leżał, bo miał gorączkę i czerwonkę. Paweł poszedł do niego i modlił się, a położywszy na nim ręce, uzdrowił go.
ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరం, రక్త విరేచనాల చేత బాధపడుతూ పండుకుని ఉన్నాడు. పౌలు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి, అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు.
9 Po tym wydarzeniu przychodzili również inni chorzy z wyspy i byli uzdrawiani.
ఇది చూసి ఆ దీవిలో ఉన్న మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారు.
10 Okazali nam oni wielki szacunek, a gdy mieliśmy odpływać, dali wszystko, co [nam] było potrzebne.
౧౦వారు అనేక సత్కారాలతో మాకు మర్యాద చేసి, మేము ఓడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు.
11 Po trzech miesiącach odpłynęliśmy na statku aleksandryjskim z godłem Kastora i Polluksa, który przezimował na tej wyspie.
౧౧కవల దేవుళ్ళ చిహ్నంతో ఉన్న అలెగ్జాండ్రియ పట్టణపు ఓడ ఒకటి ఆ ద్వీపంలో చలికాలమంతా నిలిచి ఉంది. మూడు నెలలు అక్కడున్న తరువాత ఆ ఓడ ఎక్కి బయలుదేరి
12 Przybywszy do Syrakuz, pozostaliśmy [tam] trzy dni.
౧౨సురకూసై నగరానికి వచ్చి అక్కడ మూడు రోజులున్నాం.
13 Stamtąd, płynąc łukiem, dotarliśmy do Regium. Po upływie jednego dnia, gdy powiał wiatr południowy, nazajutrz przypłynęliśmy do Puteoli.
౧౩అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగియు పట్టణం వచ్చి ఒక రోజు తరువాత దక్షిణపు గాలి విసరడంతో మరునాడు పొతియొలీ పట్టణం వచ్చాం.
14 Tam spotkaliśmy braci, którzy nas uprosili, żebyśmy pozostali u nich siedem dni. I tak udaliśmy się do Rzymu.
౧౪అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. ఆ తరువాత రోమ్ నగరానికి వచ్చాం.
15 Tamtejsi bracia, gdy usłyszeli o nas, wyszli nam naprzeciw aż do Forum Appiusza i do Trzech Gospód. Kiedy Paweł ich zobaczył, podziękował Bogu i nabrał otuchy.
౧౫అక్కడ నుండి సోదరులు మా సంగతి విని అప్పీయా సంతపేట వరకూ, మూడు సత్రాల పేట వరకూ ఎదురు వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. పౌలు వారిని చూసి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు.
16 A gdy przybyliśmy do Rzymu, setnik oddał więźniów dowódcy wojska, ale Pawłowi pozwolono mieszkać osobno z żołnierzem, który go pilnował.
౧౬మేము రోమ్ కు వచ్చినప్పుడు పౌలు తనకు కాపలాగా ఉన్న సైనికులతో కలిసి ప్రత్యేకంగా ఉండడానికి అనుమతి పొందాడు.
17 Po trzech dniach Paweł zaprosił przywódców żydowskich. Kiedy się zeszli, powiedział do nich: Mężowie bracia, nic nie uczyniłem przeciwko ludowi i zwyczajom ojczystym, a jednak zostałem wydany w Jerozolimie jako więzień w ręce Rzymian;
౧౭మూడు రోజుల తరువాత అతడు ప్రముఖ యూదులను తన దగ్గరికి పిలిపించాడు. వారు వచ్చినప్పుడు అతడు, “సోదరులారా, నేను మన ప్రజలకూ, పూర్వీకుల ఆచారాలకూ వ్యతిరేకంగా ఏదీ చేయకపోయినా, యెరూషలేములో నన్ను రోమీయుల చేతికి అప్పగించారు.
18 Którzy po przesłuchaniu chcieli mnie wypuścić, bo nie było we mnie nic [zasługującego] na śmierć.
౧౮వారు నన్ను విచారించి నాలో మరణానికి తగిన కారణం ఏదీ లేకపోవడంతో నన్ను విడిచిపెట్టాలి అనుకున్నారు గాని
19 Lecz gdy Żydzi się [temu] sprzeciwiali, musiałem odwołać się do cesarza, nie chcąc jednak w czymkolwiek oskarżać mego narodu.
౧౯యూదులు అభ్యంతరం చెప్పడం వలన నేను ‘సీజరు ఎదుట చెప్పుకొంటాను’ అనవలసి వచ్చింది. నా స్వజనం మీద నేరం మోపాలని నా అభిప్రాయం కాదు.
20 Dlatego też zaprosiłem was, aby się z wami zobaczyć i porozmawiać, bo z powodu nadziei Izraela jestem związany tym łańcuchem.
౨౦ఈ కారణం చేతనే మీతో మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు నిరీక్షణ నిమిత్తం ఈ గొలుసులతో నన్ను బంధించి ఉంచారు” అని వారితో చెప్పాడు.
21 Lecz oni powiedzieli do niego: Nie otrzymaliśmy z Judei [żadnych] listów o tobie ani żaden z przybyłych braci nie oznajmił, ani nie mówił o tobie nic złego.
౨౧అందుకు వారు, “యూదయ నుండి మీ గురించి మాకేమీ ఉత్తరాలు రాలేదు, ఇక్కడికి వచ్చిన యూదు సోదరుల్లో ఒక్కడైనా మీ గురించి చెడ్డ సంగతి ఏదీ మాకు తెలుపలేదు. ఎవరూ చెప్పుకోలేదు కూడా.
22 Pragniemy jednak od ciebie usłyszeć, co myślisz, bo wiemy o tym stronnictwie, że wszędzie mówią przeciwko niemu.
౨౨అయినా ఈ విషయంలో మీ అభిప్రాయం మీ నోటనే వినగోరుతున్నాం. ఈ మతభేదం గూర్చి అన్ని చోట్లా అభ్యంతరాలు ఉన్నాయని మాత్రం మాకు తెలుసు” అని జవాబిచ్చారు.
23 Wyznaczyli mu dzień i przyszło wielu do niego do kwatery, a on od rana do wieczora przytaczał im świadectwa o królestwie Bożym i przekonywał o Jezusie na podstawie Prawa Mojżesza i Proroków.
౨౩అతనికి ఒక రోజు ఏర్పాటు చేసి, అతడున్న చోటికి చాలా మంది వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకూ అతడు దేవుని రాజ్యం గూర్చి పూర్తిగా సాక్షమిస్తూ, మోషే ధర్మశాస్త్రంలో నుండీ, ప్రవక్తల్లో నుండీ సంగతులను వారికి ఎత్తి చూపుతూ, యేసుని గూర్చి వివరంగా బోధిస్తూ వారిని ఒప్పిస్తూ ఉన్నాడు.
24 I niektórzy uwierzyli temu, co mówił, a inni nie uwierzyli.
౨౪అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు.
25 Poróżnieni ze sobą rozeszli się, gdy Paweł powiedział [to] jedno: Słusznie Duch Święty powiedział przez proroka Izajasza do naszych ojców:
౨౫వారిలో భేదాభిప్రాయాలు కలిగాయి. పౌలు చివరిగా వారితో ఒక మాట చెప్పాడు. అదేమంటే
26 Idź do tego ludu i mów: Słuchając, będziecie słyszeć, ale nie zrozumiecie, i patrząc, będziecie widzieć, ale nie zobaczycie.
౨౬వారు వింటారు గాని అర్థం చేసుకోరు. చూస్తారు కానీ గ్రహించుకోరు’ అని ఈ ప్రజలతో చెప్పండి.
27 Utyło bowiem serce tego ludu, stępiały ich uszy i zamknęli swe oczy, żeby oczami nie widzieli ani uszami nie słyszeli, a sercem nie zrozumieli i nie nawrócili się, i żebym ich nie uzdrowił.
౨౭ఈ ప్రజలు కన్నులారా చూసి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండా వారి హృదయాలు బండబారి పోయాయి. వారు ఏదీ వినిపించుకోరు, వారు కళ్ళు మూసుకుని ఉన్నారు’ అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరైందే.
28 Niech wam więc będzie wiadome, że poganom zostało posłane to zbawienie Boże, a oni będą słuchać.
౨౮కాబట్టి దేవుని వలన కలిగిన ఈ రక్షణ యూదేతరుల దగ్గరికి తరలి పోతున్నదని మీరు తెలుసుకుంటారు.
29 A gdy to powiedział, Żydzi odeszli, wiodąc ze sobą zacięty spór.
౨౯వారు దాన్ని అంగీకరిస్తారు.” ఈ మాటలు విని వారంతా వెళ్ళిపోయారు.
30 Przez całe dwa lata Paweł mieszkał w wynajętym mieszkaniu i przyjmował wszystkich, którzy przychodzili do niego;
౩౦పౌలు రెండు సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట్లో నివసించి, తన దగ్గరికి వచ్చే వారినందరినీ ఆదరిస్తూ
31 Głosząc królestwo Boże i nauczając tego, co dotyczy Pana Jezusa Chrystusa, ze wszelką odwagą i bez przeszkód.
౩౧ఏ ఆటంకమూ లేకుండా పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యం గూర్చి ప్రకటిస్తూ, ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు.

< Dzieje 28 >