< Dzieje 22 >
1 Mężowie bracia i ojcowie, słuchajcie mojej obrony, jaką teraz do was kieruję.
౧“సోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పుకొనే జవాబు వినండి.”
2 Gdy usłyszeli, że mówił do nich po hebrajsku, jeszcze bardziej się uciszyli. A on powiedział:
౨అతడు హెబ్రీ భాషలో మాటలాడడం విన్నప్పుడు వారు నిశ్శబ్దమై పోయారు. అతడు ఈ విధంగా చెప్పాడు,
3 Jestem Żydem, urodzonym w Tarsie w Cylicji, lecz wychowanym w tym mieście, u stóp Gamaliela, starannie wykształconym w prawie ojczystym i byłem gorliwym względem Boga jak i wy wszyscy dzisiaj.
౩“నేను కిలికియలోని తార్సు పట్టణంలో పుట్టిన యూదుణ్ణి. అయితే ఈ పట్టణంలో గమలీయేలు పాదాల దగ్గర పెరిగి, మన పూర్వీకుల ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞల్లో శిక్షణ పొందాను. మీరంతా ఈ రోజు ఉన్న విధంగా దేవుని విషయంలో ఆసక్తి కలిగి,
4 Prześladowałem tę drogę aż na śmierć, wiążąc i wtrącając do więzienia zarówno mężczyzn, jak i kobiety;
౪ఈ విశ్వాస మార్గాన్ని అనుసరిస్తున్న స్త్రీ పురుషులను బంధించి చెరసాలలో వేయిస్తూ, చనిపోయేదాకా హింసించాను.
5 Czego mi świadkiem jest najwyższy kapłan oraz wszyscy starsi. Od nich też otrzymałem listy do braci i pojechałem do Damaszku, aby tych, którzy tam byli, przyprowadzić związanych do Jerozolimy, żeby zostali ukarani.
౫ఈ విషయంలో ప్రధాన యాజకుడూ పెద్దలందరూ సాక్షులు. నేను వారి నుండి దమస్కులోని మన సోదరులకు లేఖలు తీసుకుని, అక్కడి విశ్వాసులను కూడా బంధించి శిక్ష వేయడానికి యెరూషలేముకు తీసుకు రావాలని అక్కడికి వెళ్ళాను.
6 A gdy byłem w drodze i zbliżałem się do Damaszku około południa, nagle ogarnęła mnie wielka światłość z nieba.
౬నేను ప్రయాణం చేస్తూ దమస్కును సమీపించినప్పుడు మధ్యాహ్నం ఆకాశం నుండి ఒక గొప్ప వెలుగు హఠాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది.
7 I upadłem na ziemię, i usłyszałem głos, który mówił do mnie: Saulu, Saulu, dlaczego mnie prześladujesz?
౭నేను నేల మీద పడి ‘సౌలూ సౌలూ, నీవు నన్నెందుకు హింసిస్తున్నావని’ నాతో ఒక స్వరం పలకడం విన్నాను.
8 A ja odpowiedziałem: Kim jesteś, Panie? I powiedział do mnie: Ja jestem Jezus z Nazaretu, którego ty prześladujesz.
౮అందుకు నేను ‘ప్రభూ! నీవెవరివి?’ అని అడగగా ఆయన, ‘నేను నీవు హింసిస్తున్న నజరేయుడైన యేసుని’ అని నాతో చెప్పాడు.
9 A ci, którzy byli ze mną, wprawdzie widzieli światłość i przestraszyli się, ale głosu tego, który do mnie mówił, nie słyszeli.
౯నాతో ఉన్నవారు ఆ వెలుగును చూశారుగానీ నాతో మాటలాడిన స్వరాన్ని వినలేదు.
10 Zapytałem: Co mam robić, Panie? A Pan powiedział do mnie: Wstań i idź do Damaszku, a tam ci powiedzą o wszystkim, co postanowiono, abyś uczynił.
౧౦అప్పుడు నేను ‘ప్రభూ, నన్నేం చేయమంటావు?’ అని అడిగాను. అప్పుడు ప్రభువు, ‘నువ్వు లేచి దమస్కులోకి వెళ్ళు, అక్కడ నువ్వేం చేయాలని నేను నిర్ణయించానో అవన్నీ నీకు తెలుస్తాయి’ అని నాతో అన్నాడు.
11 A ponieważ zaniewidziałem z powodu blasku tej światłości, przyszedłem do Damaszku prowadzony za rękę przez tych, którzy byli ze mną.
౧౧ఆ వెలుగు ప్రభావం వలన నేను చూడలేకపోయాను. దాంతో నాతో ఉన్నవారు నన్ను నడిపిస్తూ దమస్కు పట్టణంలోకి తీసుకెళ్ళారు.
12 Tam niejaki Ananiasz, człowiek pobożny według prawa, mający [dobre] świadectwo u wszystkich Żydów, którzy [tam] mieszkali;
౧౨“అక్కడ ధర్మశాస్త్రం విషయంలో భక్తిపరుడూ, అక్కడ నివసించే యూదులందరి చేతా మంచి పేరు పొందిన అననీయ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి
13 Przyszedł, podszedł do mnie i powiedział: Bracie Saulu, przejrzyj! I w tej chwili spojrzałem na niego.
౧౩‘సోదరా సౌలూ, చూపు పొందు’ అని నాతో చెప్పగానే అదే గడియలో నేను చూపు పొంది అతణ్ణి చూశాను.
14 A on powiedział: Bóg naszych ojców wybrał cię, żebyś poznał jego wolę, oglądał Sprawiedliwego i słuchał głosu z jego ust.
౧౪అప్పుడు అతడు ‘మన పూర్వీకుల దేవుని సంకల్పాన్ని తెలుసుకోడానికీ, ఆ నీతిమంతుణ్ణి చూడటానికీ, ఆయన నోటి మాట వినడానికీ నిన్ను నియమించాడు.
15 Będziesz mu bowiem wobec wszystkich ludzi świadkiem tego, co widziałeś i słyszałeś.
౧౫నీవు చూసిన వాటిని గురించీ, విన్న వాటిని గురించీ ప్రజలందరి ముందూ ఆయనకు సాక్షివై ఉంటావు.
16 Dlaczego teraz zwlekasz? Wstań, ochrzcij się i obmyj swoje grzechy, wzywając imienia Pana.
౧౬కాబట్టి ఆలస్యమెందుకు? లేచి బాప్తిసం పొంది, ఆయన నామంలో ప్రార్థన చేసి నీ పాపాలను కడిగి వేసుకో’ అన్నాడు.
17 A gdy wróciłem do Jerozolimy i modliłem się w świątyni, wpadłem w zachwycenie.
౧౭ఆ వెంటనే నేను యెరూషలేముకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేస్తుండగా పరవశానికి లోనై ప్రభువుని చూశాను.
18 I widziałem go, jak mówił do mnie: Pospiesz się i wyjdź szybko z Jerozolimy, ponieważ nie przyjmą twego świadectwa o mnie.
౧౮ఆయన నాతో, ‘నీవు వెంటనే యెరూషలేము విడిచి వెళ్ళు. నన్ను గూర్చి నీవిచ్చే సాక్ష్యం ఇక్కడి వారు అంగీకరించరు’ అని చెప్పాడు.
19 A ja odpowiedziałem: Panie, oni wiedzą, że wtrącałem do więzienia i biczowałem w synagogach tych, którzy w ciebie wierzyli.
౧౯అందుకు నేను, ‘ప్రభూ, ప్రతి సమాజ మందిరంలో నీపై నమ్మకముంచిన వారిని నేను చెరసాలలో వేయించి కొట్టించానని వారికి తెలుసు.
20 A kiedy przelewano krew Szczepana, twojego świadka, ja też byłem przy tym i zgodziłem się na jego zabicie, i pilnowałem szat tych, którzy go zabili.
౨౦అంతేగాక నీ సాక్షి అయిన స్తెఫను రక్తం ఒలికించినప్పుడు నేను కూడా అక్కడ నిలబడి అందుకు సమ్మతించి అతణ్ణి చంపినవారి వస్త్రాలకు కాపలా ఉన్నాను’ అని చెప్పాను.
21 I powiedział mi: Idź, bo ja cię poślę daleko, do pogan.
౨౧అందుకు ఆయన ‘వెళ్ళు, ఎందుకంటే నేను నిన్ను దూరంగా యూదేతరుల దగ్గరికి పంపుతాను’ అని నాతో చెప్పాడు.”
22 Słuchali go aż do tego słowa, [potem] podnieśli swój głos, mówiąc: Zgładź z ziemi takiego [człowieka], bo nie godzi się, żeby żył!
౨౨ఇంతవరకూ అతడు చెప్పింది వారు చక్కగా విన్నారు. కానీ ఆ వెంటనే వారు, “ఇలాటివాడు బతకడానికి అర్హుడు కాదు. భూమి మీద ఉండకుండా వాణ్ణి చంపివేయండి” అని కేకలు వేశారు.
23 A gdy oni krzyczeli, rozrzucali szaty i ciskali proch w powietrze;
౨౩వారు కేకలు వేస్తూ తమ పై వస్త్రాలు విదిలించుకుంటూ ఆకాశం వైపు దుమ్మెత్తి పోశారు.
24 Dowódca rozkazał go zaprowadzić do twierdzy i polecił przesłuchać go z [zastosowaniem] biczowania, żeby się dowiedzieć, dlaczego tak przeciwko niemu krzyczano.
౨౪ఈ విధంగా వారు అతనికి వ్యతిరేకంగా కేకలు వేయడానికి కారణమేమిటో తెలుసుకోవడం కోసం సహస్రాధిపతి అతనిని కొరడాలతో కొట్టి, విచారణ కోసం కోటలోకి తీసుకుని పొండని ఆజ్ఞాపించాడు.
25 A gdy go związano, aby go ubiczować, Paweł powiedział do setnika, który stał obok: Czy wolno wam biczować Rzymianina i to bez sądu?
౨౫వారు పౌలును తాళ్ళతో కట్టేటప్పుడు అతడు తన దగ్గర నిలబడిన శతాధిపతిని, “శిక్ష విధించకుండానే ఒక రోమా పౌరుణ్ణి కొరడాలతో కొట్టడానికి మీకు అధికారం ఉందా?” అని అడిగాడు.
26 Kiedy setnik to usłyszał, podszedł do dowódcy i powiedział mu: Uważaj, co robisz, bo ten człowiek jest Rzymianinem.
౨౬శతాధిపతి ఆ మాట విని సైనికాధికారి దగ్గరికి వెళ్ళి, “నీవేం చేస్తున్నావు? ఈ వ్యక్తి రోమీయుడు, తెలుసా?” అన్నాడు.
27 Dowódca podszedł i zapytał go: Powiedz mi, czy ty jesteś Rzymianinem? A on odpowiedział: Tak.
౨౭అప్పుడు సహస్రాధిపతి వచ్చి పౌలుతో, “నీవు రోమ్ పౌరుడివా? అది నాతో చెప్పు” అన్నాడు.
28 I powiedział dowódca: Ja kupiłem to obywatelstwo za wielką sumę. Paweł zaś rzekł: A ja mam [je] od urodzenia.
౨౮పౌలు “అవును” అన్నాడు. అప్పుడు ఆ సైనికాధికారి, “నేను చాలా వెల చెల్లించి ఈ పౌరసత్వం సంపాదించుకున్నాను” అన్నాడు. అందుకు పౌలు, “నేనైతే పుట్టుకతోనే రోమా పౌరుణ్ణి” అని చెప్పాడు.
29 I natychmiast odstąpili od niego ci, którzy mieli go przesłuchać. Nawet i dowódca przestraszył się, kiedy się dowiedział, że jest Rzymianinem, a on kazał go związać.
౨౯కాబట్టి వారు వెంటనే పౌలుని విడిచిపెట్టారు. పైగా అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతణ్ణి బంధించినందుకు సైనికాధికారి కూడా భయపడ్డాడు.
30 A nazajutrz, chcąc się dokładnie dowiedzieć, o co Żydzi go oskarżali, uwolnił go z więzów i rozkazał zebrać się naczelnym kapłanom i całej Radzie, przyprowadził Pawła i stawił go przed nimi.
౩౦మరునాడు, యూదులు అతని మీద మోపిన నేరాన్ని కచ్చితంగా తెలుసుకోవడం కోసం, సైనికాధికారి అతని సంకెళ్ళు విడిపించి, ప్రధాన యాజకులూ, మహా సభవారంతా సమావేశం కావాలని ఆజ్ఞాపించి, పౌలును తీసుకొచ్చి వారి ముందు నిలబెట్టాడు.