< II Tymoteusza 4 >
1 Zaklinam [cię] więc przed Bogiem i Panem Jezusem Chrystusem, który będzie sądził żywych i umarłych w [czasie] swego przyjścia i swego królestwa;
౧దేవుని సమక్షంలో, తన ప్రత్యక్షత, తన రాజ్యం వచ్చేటప్పుడు బతికి ఉన్నవారికీ, చనిపోయినవారికీ తీర్పు తీర్చబోయే క్రీస్తు యేసు సమక్షంలో, నేను నిన్ను ఆదేశిస్తున్నాను.
2 Głoś słowo [Boże], nalegaj w porę [i] nie w porę, upominaj, strofuj i zachęcaj ze wszelką cierpliwością i nauką.
౨వాక్యాన్ని బోధించు, అనుకూలమైనా, కాకపోయినా సిద్ధంగా ఉండు. ఖండించినా, గద్దించినా, బుద్ధి చెప్పినా సంపూర్ణమైన సహనంతో ఉపదేశించు.
3 Przyjdzie bowiem czas, gdy zdrowej nauki nie zniosą, ale zgromadzą sobie nauczycieli według swoich pożądliwości, ponieważ ich uszy świerzbią.
౩ఎందుకంటే మనుషులు మంచి బోధను సహించలేని సమయం రాబోతోంది. దురద చెవులతో తమ స్వంత దురాశలకు అనుగుణంగా బోధించే వారిని పోగుచేసుకుని,
4 I odwrócą uszy od prawdy, a zwrócą się ku baśniom.
౪సత్యం నుండి తొలిగిపోయి కట్టు కథల వైపు మళ్ళుతారు.
5 Lecz ty bądź czujny we wszystkim, znoś cierpienia, wykonuj dzieło ewangelisty, w pełni dowódź swojej służby.
౫నీవు మాత్రం అన్ని విషయాల్లో సంయమనంతో ఉండి, కష్టాలు భరించు. సువార్త ప్రచారకుని పనిచెయ్యి, నీ పరిచర్యను సంపూర్తి చెయ్యి.
6 Ja bowiem już mam być złożony w ofierze, a czas mojego odejścia nadchodzi.
౬ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది.
7 Dobrą walkę stoczyłem, bieg ukończyłem, wiarę zachowałem.
౭మంచి పోరాటం సాగించాను, నా పరుగు ముగించాను. నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను.
8 Odtąd odłożona jest dla mnie korona sprawiedliwości, którą mi w owym dniu da Pan, sędzia sprawiedliwy, a nie tylko mnie, ale i wszystkim, którzy umiłowali jego przyjście.
౮ఇప్పుడు నా కోసం నీతికిరీటం సిద్ధంగా ఉంది. నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు దాన్ని ఆ రోజున నాకు అనుగ్రహిస్తాడు. నాకు మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షానికై ప్రేమతో ఎదురుచూసే వారందరికీ అనుగ్రహిస్తాడు.
9 Postaraj się przybyć do mnie szybko.
౯నా దగ్గరికి త్వరగా రావడానికి ప్రయత్నించు.
10 Demas bowiem mnie opuścił, umiłowawszy ten świat, i udał się do Tesaloniki, Krescens do Galacji, Tytus do Dalmacji; (aiōn )
౧౦దేమా ఇహలోకాన్ని ప్రేమించి నన్ను విడిచిపెట్టి తెస్సలోనిక వెళ్ళిపోయాడు. క్రేస్కే గలతీయకీ, తీతు దల్మతియకీ వెళ్ళారు. (aiōn )
11 Tylko Łukasz jest ze mną. Weź Marka i przyprowadź ze sobą, bo jest mi bardzo przydatny do służby.
౧౧లూకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు. మార్కును తీసుకురా. అతడు పరిచారం కోసం నాకు ఉపయోగంగా ఉంటాడు.
12 Tychika zaś posłałem do Efezu.
౧౨తుకికును ఎఫెసుకు పంపాను.
13 Płaszcz, który zostawiłem w Troadzie u Karposa, przynieś ze sobą, gdy przyjdziesz, a także księgi, zwłaszcza pergaminy.
౧౩నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పు దగ్గర ఉంచి వచ్చిన అంగీనీ, పుస్తకాలనూ, ముఖ్యంగా చర్మపు కాగితాలను తీసుకు రా.
14 Aleksander, ludwisarz, wyrządził mi wiele zła; niech mu Pan odda według jego uczynków.
౧౪అలెగ్జాండర్ అనే కంసాలి నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలకు తగిన ప్రతిఫలం ప్రభువే ఇస్తాడు.
15 I ty się go strzeż, bo bardzo sprzeciwiał się naszym słowom.
౧౫అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు.
16 Podczas pierwszej mojej obrony nikt przy mnie nie stanął, lecz wszyscy mnie opuścili. Niech im to nie będzie policzone.
౧౬నేను మొదట న్యాయస్థానం ఎదుట వాదించుకున్నపుడు నా పక్షంగా ఎవరూ నిలబడలేదు, అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం కాకుండా ఉండు గాక.
17 Lecz Pan stanął przy mnie i umocnił mnie, aby głoszenie było przeze mnie całkowicie utwierdzone, [aby] usłyszeli je wszyscy poganie; i zostałem wyrwany z paszczy lwa.
౧౭అయితే నేను సువార్త సంపూర్ణంగా ప్రకటించేందుకూ యూదులు కాని వారంతా దాన్ని వినేందుకూ ప్రభువు నా పక్షాన ఉండి నన్ను బలపరిచాడు కాబట్టి సింహం నోటి నుండి ప్రభువు నన్ను తప్పించాడు.
18 Wyrwie mnie też Pan ze wszelkiego złego uczynku i zachowa dla swojego królestwa niebieskiego. Jemu chwała na wieki wieków. Amen. (aiōn )
౧౮ప్రభువు అన్ని చెడుపనుల నుండీ నన్ను తప్పించి సురక్షితంగా తన పరలోక రాజ్యం చేరుస్తాడు. యుగయుగాలకు ఆయనకు మహిమ కలుగు గాక, ఆమేన్. (aiōn )
19 Pozdrów Pryskę i Akwilę oraz dom Onezyfora.
౧౯ప్రిస్కకూ అకులకూ ఒనేసిఫోరు కుటుంబానికీ నా అభివందనాలు.
20 Erast pozostał w Koryncie, a Trofima zostawiłem chorego w Milecie.
౨౦ఎరస్తు కొరింథులో ఆగిపోయాడు. త్రోఫిముకు జబ్బు చేసింది. అందుకే అతణ్ణి మిలేతులో విడిచి వచ్చాను.
21 Postaraj się przybyć przed zimą. Pozdrawia cię Eubulos, Pudens, Linus, Klaudia i wszyscy bracia.
౨౧నీవు చలికాలం రాకముందే రావడానికి ప్రయత్నం చెయ్యి. యుబూలు, పుదే, లీను, క్లౌదియ, ఇతర సోదరులంతా నీకు వందనాలు చెబుతున్నారు.
22 Pan Jezus Chrystus [niech będzie] z twoim duchem. Łaska [niech będzie] z wami. Amen.
౨౨ప్రభువు నీ ఆత్మకు తోడై ఉండు గాక. కృప మీకు తోడై ఉండు గాక.