< II Samuela 4 >
1 Gdy syn Saula [Iszboszet] usłyszał, że Abner poległ w Hebronie, opadły mu ręce i cały Izrael był przerażony.
౧హెబ్రోనులో అబ్నేరు చనిపోయాడన్న సంగతి విన్న సౌలు కుమారుడు భయపడ్డాడు. ఇశ్రాయేలు వారందరికీ ఏమీ పాలు పోలేదు.
2 Syn Saula miał też dwóch ludzi, dowódców oddziałów: jeden miał na imię Baana, a drugi – Rekab. [Byli oni] synami Rimmona Beerotczyka, z synów Beniamina. Beerot był bowiem także zaliczany do Beniamina;
౨అయితే సౌలు కుమారుడి దగ్గర ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు. ఒకడి పేరు బయనా, రెండవవాడి పేరు రేకాబు. వీరిద్దరూ బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతు నివాసి అయిన రిమ్మోను కొడుకులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశంలో చేరిన ప్రాంతం.
3 Bo Beerotczycy uciekli do Gittaim i byli tam przybyszami, i [są nimi] aż do dziś.
౩అయితే బెయేరోతీయులు గిత్తయీముకు పారిపోయి ఇప్పటి వరకూ అక్కడే కాపురం ఉన్నారు.
4 A Jonatan, syn Saula, miał jednego syna chromego na [obie] nogi. Gdy miał on [bowiem] pięć lat, a nadeszła wieść z Jizreel [o śmierci] Saula i Jonatana, jego piastunka pochwyciła go i uciekła. Ale w pośpiechu tej ucieczki upadł i został kaleką. Miał na imię Mefiboszet.
౪సౌలు కుమారుడు యోనాతానుకు కుంటివాడైన ఒక కొడుకు ఉన్నాడు. యెజ్రెయేలు నుండి సౌలు గురించీ యోనాతాను గురించీ సమాచారం వచ్చినప్పుడు అతడు ఐదేళ్ళ బాలుడు. అతని ఆయా అతణ్ణి ఎత్తుకుని వేగంగా పరుగెత్తినప్పుడు అతడు కింద పడిపోయి కుంటివాడయ్యాడు. అతడి పేరు మెఫీబోషెతు.
5 Synowie Rimmona Beerotczyka, Rekab i Baana, wyruszyli więc i przyszli do domu Iszboszeta w najgorętszej porze dnia, w południe, gdy spał on w łożu.
౫రిమ్మోను కొడుకులు రేకాబు, బయనా ఇద్దరూ మధ్యాహ్న సమయంలో బాగా ఎండగా ఉన్నప్పుడు బయలుదేరి ఇష్బోషెతు మంచంపై పడుకుని నిద్రపోతున్నప్పుడు అతని ఇంటికి వెళ్లారు.
6 Weszli oni do jego domu pod pretekstem zakupu pszenicy i tam przebili go pod piątym żebrem. Potem Rekab i jego brat Baana uciekli.
౬గోదుమలు తీసుకువచ్చేవారి వేషం వేసుకుని ఇంట్లోకి వెళ్లి, ఇష్బోషెతు పడక గదిలో మంచంపై నిద్రపోతూ ఉన్నప్పుడు అతణ్ణి కడుపులో పొడిచి చంపివేసి, అతని తల నరికి దాన్ని తీసుకుని తప్పించుకుని పారిపోయారు.
7 Gdy bowiem weszli do domu, on spał na swoim łożu w sypialni. Wtedy przebili go, uśmiercili i ucięli mu głowę. Potem zabrali ją i szli drogą pustynną przez całą noc.
౭రాత్రి అంతా ఎడారి గుండా పరుగెత్తి హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి ఇష్బోషెతు తల తీసుకువచ్చారు. వారు “దయచేసి విను.
8 I przynieśli głowę Iszboszeta do Dawida do Hebronu, i powiedzieli do króla: Oto głowa Iszboszeta, syna Saula, twojego wroga, który czyhał na twoją duszę. PAN dzisiaj dokonał za mojego pana, króla, zemsty na Saulu i jego potomstwie.
౮నీ ప్రాణం తీయాలని చూసిన సౌలు కొడుకు ఇష్బోషెతు తలను మేము తీసుకువచ్చాం. మా యజమాని, రాజువైన నీ తరపున సౌలుకు, అతని సంతానానికి ఈ రోజున యెహోవా ప్రతీకారం చేశాడు” అని చెప్పారు.
9 Lecz Dawid odpowiedział Rekabowi i jego bratu Baanie, synom Rimmona Beerotczyka: Jak żyje PAN, który wybawił moją duszę z wszelkiego ucisku;
౯అప్పుడు దావీదు బెయేరోతీ నివాసి అయిన రిమ్మోను కొడుకులు రేకాబు, బయనాలతో ఇలా చెప్పాడు,
10 Jeśli tego, który mi powiedział: Oto umarł Saul, sądząc, że przynosi dobrą nowinę, pojmałem i zabiłem w Siklag, chociaż [myślał], że wynagrodzę go za [jego] wieści;
౧౦“మంచి కబురు తెస్తున్నానని భావించి ఒకడు వచ్చి సౌలు చనిపోయాడని తెలియజేశాడు.
11 Tym bardziej, gdy niegodziwi ludzie zabili sprawiedliwego człowieka w jego domu, na własnym łożu. Czy teraz nie powinienem zażądać jego krwi z waszych rąk i zgładzić was z ziemi?
౧౧వాడు తెచ్చిన కబురుకు బహుమానం ఏమిటంటే నేను వాణ్ణి పట్టుకుని సిక్లగులో చంపించాను. దుర్మార్గులైన మీరు ఇష్బోషెతు ఇంట్లోకి దూరి, ఏ దోషమూ లేని అతణ్ణి మంచంపైనే చంపినప్పుడు మీరు జరిపిన రక్తపాతానికి ప్రతిగా నేను మీకు శిక్ష విధించకుండా ఉంటానా? మిమ్మల్ని లోకంలో లేకుండా తుడిచి పెట్టకుండా ఉంటానా?
12 Dawid rozkazał więc sługom, a oni zabili ich, obcięli im ręce i nogi i powiesili ich nad stawem w Hebronie. Głowę zaś Iszboszeta wzięli i pochowali w grobie Abnera w Hebronie.
౧౨అన్ని విధాలైన ఆపదల నుండి నన్ను రక్షించిన యెహోవాపై ఒట్టు, తప్పకుండా శిక్షిస్తాను” అని చెప్పి, దావీదు తన మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడు. వారు ఆ ఇద్దరినీ చంపి వారి చేతులు, కాళ్లను నరికివేసి, వారి శవాలను హెబ్రోను కొలను దగ్గర వేలాడదీశారు. తరువాత వారు ఇష్బోషెతు తలను తీసుకువెళ్లి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాతిపెట్టారు.