< II Koryntian 6 >
1 Jako [jego] współpracownicy napominamy was, abyście nie przyjmowali łaski Bożej na próżno.
౧అందుచేత మేము దేవునితో కలిసి పని చేస్తూ దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొంటున్నాము.
2 (Mówi bowiem [Bóg]: W czasie pomyślnym wysłuchałem cię, a w dniu zbawienia przyszedłem ci z pomocą. Oto teraz czas pomyślny, oto teraz dzień zbawienia.)
౨“అనుకూల సమయంలో మీ ప్రార్థన విన్నాను. రక్షణ దినాన మీకు సాయం చేశాను,” అని ఆయన చెబుతున్నాడు. ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.
3 Nie dając nikomu żadnego [powodu] do zgorszenia, aby [nasza] posługa nie była zhańbiona;
౩మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం.
4 Ale we wszystkim okazujemy się sługami Boga, w wielkiej cierpliwości, w uciskach, w niedostatkach, w utrapieniach;
౪దానికి బదులు మేము అన్ని విషయాల్లో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో
5 W chłostach, w więzieniach, podczas rozruchów, w trudach, w nocnych czuwaniach, w postach;
౫దెబ్బల్లో చెరసాలల్లో అల్లర్లలో కాయకష్టంలో నిద్ర లేని రాత్రుల్లో ఆకలిలో-ఎంతో సహనం చూపాం.
6 Przez czystość i poznanie, przez wytrwałość i życzliwość, przez Ducha Świętego i nieobłudną miłość;
౬పవిత్రతలో జ్ఞానంలో దీర్ఘశాంతంలో దయలో పరిశుద్ధాత్మలో నిష్కపటమైన ప్రేమలో
7 Przez słowo prawdy i moc Boga, przez oręż sprawiedliwości na prawo i na lewo;
౭సత్యవాక్యంలో దేవుని శక్తిలో-కుడి ఎడమ చేతుల్లో నీతి ఆయుధాలతో
8 Przez chwałę i pohańbienie, przez złą i dobrą sławę; jakby zwodziciele, a jednak prawdomówni;
౮ఘనతలో ఘనహీనతలో అపవాదుల్లో ప్రశంసల్లో మేము పని చేస్తున్నాం. మోసం చేస్తున్నామనే నింద మా మీద ఉంది, అయినా మేము యథార్థవంతులమే.
9 Jakby nieznani, jednak [dobrze] znani, jakby umierający, a oto żyjemy, jakby karani, ale nie zabici;
౯అనామకులంగా మేము పని చేస్తున్నా, సుప్రసిద్ధులమే. చచ్చిపోతున్నట్టు ఉన్నాం, అయినా చూడండి, ఇంకా బతికే ఉన్నాం. మేము చేసే దాని వల్ల శిక్ష కలిగినా మరణ శిక్ష పడడం లేదు.
10 Jakby smutni, jednak zawsze radośni, jakby ubodzy, jednak wielu ubogacający, jakby nic nie mający, jednak wszystko posiadający.
౧౦ఏడుస్తున్నాము కానీ ఎప్పుడూ ఆనందిస్తూనే ఉన్నాం. దరిద్రులంగా కనబడుతున్నా, అనేకమందిని ఐశ్వర్యవంతులుగా చేస్తున్నాం. ఏమీ లేని వాళ్ళంగా కనబడుతున్నా, అన్నీ ఉన్నవాళ్ళమే.
11 Nasze usta otworzyły się przed wami, Koryntianie, nasze serce się rozszerzyło.
౧౧కొరింతీయులారా, పూర్తి సత్యం మేము మీకు చెప్పాం, మా హృదయం విశాలంగా తెరిచి ఉంది.
12 Nie jest wam ciasno w nas, lecz w waszym wnętrzu jest ciasno;
౧౨మీ విషయంలో మా అంతరంగం సంకుచితంగా లేదు, మీ అంతరంగమే సంకుచితంగా ఉంది.
13 Odwzajemniając się więc [nam] – jak do moich dzieci mówię – rozszerzcie się i wy.
౧౩మేము చేసినట్టే మీరూ చేయండి. మీరూ మీ హృదయాలను విశాలంగా తెరవండి. నా పిల్లలకు చెప్పినట్టు చెబుతున్నాను.
14 Nie wprzęgajcie się w nierówne jarzmo z niewierzącymi. Cóż bowiem wspólnego ma sprawiedliwość z niesprawiedliwością? Albo jaka jest wspólnota między światłem a ciemnością?
౧౪అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసమేమిటి?
15 Albo jaka zgoda Chrystusa z Belialem, albo co za dział wierzącego z niewierzącym?
౧౫క్రీస్తుకు సాతానుతో ఒప్పందమేమిటి? అవిశ్వాసితో విశ్వాసికి భాగమేమిటి?
16 A co za porozumienie między świątynią Boga a bożkami? Wy bowiem jesteście świątynią Boga żywego, tak jak mówi Bóg: Będę w nich mieszkał i będę się przechadzał w nich, i będę ich Bogiem, a oni będą moim ludem.
౧౬దేవుని ఆలయానికి విగ్రహాలతో సంబంధం ఏమిటి? మనం జీవం గల దేవుని ఆలయం. అందుకు దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. “నేను వారిలో నివసించి సంచరిస్తాను, నేను వారి దేవుడుగా ఉంటాను, వారు నా ప్రజలుగా ఉంటారు.”
17 Dlatego wyjdźcie spośród nich i odłączcie się, mówi Pan, i nieczystego nie dotykajcie, a ja was przyjmę.
౧౭కాబట్టి, “మీరు వారిలో నుండి బయటికి వచ్చి ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టవద్దు” అని ప్రభువు చెబుతున్నాడు.
18 I będę wam Ojcem, a wy będziecie mi synami i córkami – mówi Pan Wszechmogący.
౧౮“నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, మీకు తండ్రిగా ఉంటాను. మీరు నాకు కొడుకులుగా కూతురులుగా ఉంటారు” అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు.