< Objawienie 21 >
1 Potemem widział niebo nowe i ziemię nową; albowiem pierwsze niebo i pierwsza ziemia przeminęła, a morza już więcej nie było.
౧అప్పుడు నేను కొత్త ఆకాశాన్నీ, కొత్త భూమినీ చూశాను. మొదటి ఆకాశం, మొదటి భూమీ గతించి పోయాయి. సముద్రం అనేది ఇక లేదు.
2 A ja Jan widziałem ono święte miasto, Jeruzalem nowe, zstępujące z nieba od Boga zgotowane, jako oblubienicę ubraną mężowi swemu.
౨అప్పుడు నేను కొత్త యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం తన భర్త కోసం అలంకరించుకున్న పెళ్ళికూతురిలా తయారై పరలోకంలో ఉన్న దేవుని దగ్గర నుండి దిగి రావడం చూశాను.
3 I słyszałem głos wielki z nieba mówiący: Oto przybytek Boży z ludźmi, i będzie mieszkał z nimi; a oni będą ludem jego, a sam Bóg będzie z nimi, będąc Bogiem ich.
౩అప్పుడు పరలోకంలో నుండి ఒక గొప్ప స్వరం, “చూడండి, దేవుని నివాసం మనుషులతో ఉంది. ఆయన వారితో కలసి జీవిస్తాడు. వారు ఆయన ప్రజలై ఉంటారు. దేవుడు తానే వారితో ఉంటాడు. వారికి దేవుడై ఉంటాడు.
4 I otrze Bóg wszelką łzę z oczów ich; a śmierci więcej nie będzie, ani smutku, ani krzyku, ani boleści nie będzie; albowiem pierwsze rzeczy pominęły.
౪ఆయన వారి కన్నుల నుండి ప్రతి కన్నీటి బొట్టునూ తుడుస్తాడు. ఇక మరణం గానీ, వేదన పడడం గానీ, ఏడుపు గానీ బాధ గానీ ఉండవు. మొదటి సంగతులు గతించి పోయాయి” అని చెబుతుండగా విన్నాను.
5 I rzekł ten, który siedział na stolicy: Oto wszystko nowe czynię. I rzekł mi: Napisz: bo te słowa są wierne i prawdziwe.
౫అప్పుడు సింహాసనంపై కూర్చున్న ఆయన, “చూడండి, అన్నిటినీ కొత్తవిగా చేస్తున్నాను” అన్నాడు, “ఈ మాటలు సత్యమైనవీ, నమ్మదగినవీ కాబట్టి రాయి” అని నాతో అన్నాడు.
6 I rzekł mi: Stało się. Jam jest Alfa i Omega, początek i koniec. Ja pragnącemu dam darmo ze źródła wody żywej.
౬ఆయన ఇంకా నాతో ఇలా అన్నాడు, “ఈ విషయాలన్నీ సమాప్తం అయ్యాయి. ఆల్ఫా, ఒమేగా నేనే. అంటే ఆదీ అంతమూ నేనే. దాహం వేసిన వాడికి జీవ జలాల ఊట నుండి నీరు ఉచితంగా ఇస్తాను.
7 Kto zwycięży, odziedziczy wszystko i będę mu Bogiem, a on mi będzie synem.
౭జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనికి దేవుడిగా ఉంటాను. అతడు నాకు కుమారుడిగా ఉంటాడు.
8 Lecz bojaźliwym i niewiernym, i obmierzłym, i mężobójcom, i wszetecznikom, i czarownikom, i bałwochwalcom, i wszystkim kłamcom część ich dana będzie w jeziorze gorejącem ogniem i siarką: Tać jest śmierć wtóra. (Limnē Pyr )
౮పిరికివారూ, అవిశ్వాసులూ, అసహ్యులూ, నరహంతకులూ, వ్యభిచారులూ, మాంత్రికులూ, విగ్రహారాధకులూ, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండే సరస్సులో పడతారు. ఇది రెండవ మరణం. (Limnē Pyr )
9 Tedy przyszedł do mnie jeden z onych siedmiu Aniołów, którzy mieli siedm czasz napełnionych siedmioma plagami ostatecznemi, i mówił ze mną, i rzekł: Chodź sam, okażę ci oblubienicę, małżonkę Barankową.
౯అప్పుడు ఆ చివరి ఏడు కీడులతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు నా దగ్గరికి వచ్చాడు. “ఇలా రా, పెళ్ళి కూతురిని అంటే గొర్రె పిల్ల భార్యను నీకు చూపిస్తాను” అన్నాడు.
10 I zaniósł mię w duchu na górę wielką i wysoką, i okazał mi miasto wielkie, ono święte Jeruzalem, zstępujące z nieba od Boga,
౧౦ఆత్మ స్వాధీనంలో ఉన్న నన్ను ఎత్తయిన గొప్ప పర్వతం పైకి తీసుకు వెళ్ళాడు. అక్కడ యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణం పరలోకంలోని దేవుని దగ్గర నుండి రావడం నాకు చూపించాడు.
11 Mające chwałę Bożą, którego światłość podobna była kamieniowi najkosztowniejszemu, jako kamieniowi jaspisowi, na kształt kryształu przezroczystemu;
౧౧యెరూషలేము దేవుని మహిమ కలిగి ఉంది. అది ప్రశస్తమైన సూర్యకాంతం రాయిలా స్ఫటికంలా ధగ ధగా మెరుస్తూ ఉంది.
12 I mające mur wielki i wysoki, mające bram dwanaście, a na onych bramach dwanaście Aniołów i imiona napisane, które są dwanaście pokoleń synów Izraelskich.
౧౨ఆ పట్టణానికి ఎత్తయిన ప్రహరీ గోడా, ఆ ప్రహరీ గోడకు పన్నెండు ద్వారాలూ ఉన్నాయి. ఆ ద్వారాల దగ్గర పన్నెండు మంది దేవదూతలున్నారు. ఇశ్రాయేలు వారి పన్నెండు గోత్రాల పేర్లూ ఆ ద్వారాలపై రాసి ఉన్నాయి.
13 Od wschodu bramy trzy, od północy bramy trzy, od południa bramy trzy, od zachodu bramy trzy.
౧౩తూర్పున మూడు ద్వారాలూ, ఉత్తరాన మూడు ద్వారాలూ, దక్షిణాన మూడు ద్వారాలూ, పశ్చిమాన మూడు ద్వారాలూ ఉన్నాయి.
14 A mur miasta miał gruntów dwanaście, a na nich dwanaście imion dwunastu Apostołów Barankowych.
౧౪ఆ పట్టణపు ప్రహరీ గోడకు పన్నెండు పునాదులున్నాయి. ఆ పునాదులపై పన్నెండు మంది గొర్రెపిల్ల అపొస్తలుల పేర్లు కనిపిస్తున్నాయి.
15 A ten, co mówił ze mną, miał trzcinę złotą, a zmierzył miasto i bramy jego, i mur jego.
౧౫నాతో మాట్లాడే దూత దగ్గర ఆ పట్టణాన్నీ, దాని ద్వారాలనూ, ప్రహరీ గోడనూ కొలవడానికి ఒక బంగారు కొలబద్ద ఉంది.
16 A położenie miasta onego jest czworograniaste, a długość jego taka jest, jako i szerokość. I pomierzył miasto ono trzciną na dwanaście tysięcy stajan; a długość i szerokość i wysokość jego równe są.
౧౬ఆ పట్టణం చతురస్రాకారంగా ఉంది. దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలబద్దతో పట్టణాన్ని కొలిస్తే దాని కొలత సుమారు రెండు వేల రెండు వందల కిలో మీటర్లు ఉంది. దాని పొడుగూ, వెడల్పూ, ఎత్తూ అన్నీ సమానమే.
17 I zmierzył mur jego na sto czterdzieści cztery łokcie miary człowieczej, która jest miara Aniołowa.
౧౭తరువాత అతడు ప్రహరీ గోడను కొలిచాడు. అది మనుషుల లెక్క ప్రకారం నూట నలభై నాలుగు మూరలుంది. ఆ కొలత దూత వేసిన కొలతే.
18 A było budowanie muru jego z jaspisu; a samo miasto było złoto czyste, podobne szkłu czystemu.
౧౮ఆ పట్టణపు ప్రహరీ గోడను సూర్యకాంత మణులతో కట్టారు. పట్టణం చూస్తే నిర్మలమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారంతో కట్టి ఉంది.
19 A grunty muru miasta ozdobione były wszelkim kamieniem drogim. Pierwszy grunt był jaspis, wtóry szafir, trzeci chalcedon, czwarty szmaragd.
౧౯ఆ పట్టణపు ప్రహరీ గోడ పునాదులు ప్రశస్తమైన రకరకాల విలువైన రాళ్ళతో అలంకరించారు. మొదటి పునాది సూర్యకాంతం, రెండవది ఇంద్ర నీలం, మూడోది యమునారాయి, నాలుగోది పచ్చ,
20 Piąty sardoniks, szósty sardyjusz, siódmy chrysolit, ósmy beryllus, dziewiąty topazyjusz, dziesiąty chrysopras, jedenasty hijacynt, dwunasty ametyst.
౨౦అయిదోది వైఢూర్యం, ఆరోది కెంపు, ఏడోది సువర్ణ రత్నం, ఎనిమిదోది గోమేధికం, తొమ్మిదోది పుష్యరాగం, పదోది సువర్ణలశునీయం, పదకొండోది పద్మరాగం, పన్నెండోది పద్మరాగం.
21 A dwanaście bram jest dwanaście pereł: a każda brama była z jednej perły, a rynek miasta złoto czyste jako szkło przezroczyste.
౨౧దాని పన్నెండు ద్వారాలూ పన్నెండు ముత్యాలు. ఒక్కో ద్వారాన్నీ ఒక్కో ముత్యంతో కట్టారు. పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన స్ఫటికం లాంటి మేలిమి బంగారం.
22 Alem kościoła nie widział w niem; albowiem Pan, Bóg wszechmogący, jest kościołem jego, i Baranek.
౨౨అక్కడ ఎలాంటి దేవాలయమూ నాకు కనిపించలేదు. ఎందుకంటే సర్వశక్తిశాలి, ప్రభువు అయిన దేవుడూ, గొర్రెపిల్లా దానికి దేవాలయంగా ఉన్నారు.
23 A nie potrzebuje to miasto słońca ani księżyca, aby świeciły w niem; albowiem chwała Boża oświeciła je, a świecą jego jest Baranek.
౨౩ఆ పట్టణంలో వెలుగివ్వడానికి సూర్యుడూ చంద్రుడూ అక్కరలేదు. దేవుని యశస్సు అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల దాని దీపం.
24 A narody, które będą zbawione, będą chodziły w świetle jego, a królowie ziemscy chwałę i cześć swoję do niego przyniosą.
౨౪వివిధ జాతి ప్రజలు ఆ వెలుగులో తిరుగుతారు. భూరాజులు తమ వైభవాన్ని దానిలోకి తెస్తారు.
25 A bramy jego nie będą zamknięte we dnie; albowiem tam nocy nie będzie.
౨౫రోజంతా దాని ద్వారాలు మూయరు. ఎందుకంటే అక్కడ రాత్రి లేదు.
26 I wniosą do niego chwałę i cześć narodów.
౨౬వివిధ జాతి ప్రజలు తమ వైభవాన్నీ గౌరవాన్నీ దానిలోకి తెస్తారు.
27 I nie wnijdzie do niego nic nieczystego i czyniącego obrzydliwość i kłamstwo, tylko ci, którzy są napisani w księgach żywota Barankowych.
౨౭పవిత్రం కానిదేదీ దానిలో ప్రవేశించదు. అవమానకరమైన దానినీ, మోసకరమైన దానినీ చేసినవారు దానిలో కచ్చితంగా ప్రవేశించరు. గొర్రెపిల్ల జీవ గ్రంథంలో పేర్లున్నవారు మాత్రమే దానిలో ప్రవేశిస్తారు.