< Objawienie 20 >

1 I widziałem Anioła zstępującego z nieba, mającego klucz od przepaści i łańcuch wielki w ręce swojej. (Abyssos g12)
తరువాత ఒక దేవదూత పరలోకం నుండి దిగి రావడం నేను చూశాను. అతని చేతిలో ఒక పెద్ద గొలుసూ లోతైన అగాధం తాళం చెవీ ఉన్నాయి. (Abyssos g12)
2 I uchwycił smoka, węża onego starego, który jest dyjabeł i szatan, i związał go na tysiąc lat;
అతడు అపవాది, సాతాను అనే పేర్లున్న ఆది సర్పం అయిన మహా సర్పాన్ని పట్టుకుని వెయ్యి సంవత్సరాల వరకూ అగాధంలో పడవేశాడు.
3 I wrzucił go w przepaść i zamknął go, i zapieczętował z wierzchu nad nim, aby nie zwodził więcej narodów, ażeby się wypełniło tysiąc lat; a potem musi być rozwiązany na mały czas. (Abyssos g12)
వాణ్ణి అగాధంలో పడవేసి, దాన్ని మూసివేసి దానికి ముద్ర వేశాడు. ఆ వెయ్యి సంవత్సరాలయ్యే వరకూ ప్రజలను మోసం చేయకుండా వాడు అగాధంలోనే బందీగా ఉండాలి. ఆ తరువాత కొద్ది సమయం వాణ్ణి వదిలిపెట్టాలి. (Abyssos g12)
4 I widziałem stolice, a usiedli na nich i dany im jest sąd i dusze pościnanych dla świadectwa Jezusowego i dla słowa Bożego, i którzy się nie kłaniali bestyi ani obrazowi jej, i nie przyjęli piętna jej na czoło swoje i na rękę swoję; i ożyli, i królowali z Chrystusem tysiąc lat.
అప్పుడు సింహాసనాలు చూశాను. వాటిపై కూర్చున్న వారికి తీర్పు చెప్పే అధికారం ఇచ్చారు. యేసును గురించి తాము చెప్పిన సాక్ష్యం కోసమూ, దేవుని వాక్కును ప్రకటన చేసినందుకూ తల నరికించుకున్న భక్తుల ఆత్మలు చూశాను. వారు క్రూర మృగాన్ని గానీ, వాడి విగ్రహాన్ని గానీ పూజించలేదు. వారి నుదుటి మీద గానీ చేతి మీద గానీ ముద్ర వేయనీయలేదు. వారిప్పుడు సజీవులై క్రీస్తుతో కలిసి వెయ్యేళ్ళు పరిపాలించారు.
5 A insi z umarłych nie ożyli, ażby się skończyło tysiąc lat. Toć jest pierwsze zmartwychwstanie.
ఆ వెయ్యి సంవత్సరాలు ముగిసే వరకూ చనిపోయిన మిగిలిన వారు సజీవులు కాలేదు. ఇదే మొదటి పునరుత్థానం.
6 Błogosławiony i święty, który ma część w pierwszem zmartwychwstaniu; albowiem nad tymi wtóra śmierć mocy nie ma; ale będą kapłanami Bożymi i Chrystusowymi, i będą z nim królować tysiąc lat.
ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొన్నవారు పరిశుద్ధులు, దీవెన పొందిన వారు. వీళ్ళపై రెండవ మరణానికి అధికారం లేదు. వీరు దేవునికీ, క్రీస్తుకీ యాజకులై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు పరిపాలన చేస్తారు.
7 A gdy się skończy tysiąc lat, będzie rozwiązany szatan z ciemnicy swojej,
వెయ్యి సంవత్సరాలు ముగిశాక సాతాను తన చెరలో నుండి విడుదల అవుతాడు.
8 I wynijdzie, aby zwodził narody, które są na czterech węgłach ziemi, Goga, i Magoga, aby je zgromadził do bitwy; których liczba jest jako piasek morski.
వాడు బయల్దేరి భూమి నాలుగు దిక్కుల్లో ఉన్న గోగు, మాగోగులను మోసం చేసి లెక్కకు సముద్రపు ఇసుకలాగా ఉన్న వారిని యుద్ధానికై సమకూరుస్తాడు.
9 I wstąpili na szerokość ziemi i otoczyli obóz świętych i miasto umiłowane. Ale zstąpił ogień od Boga z nieba i pożarł je.
వారు బయలు దేరి పరిశుద్ధుల శిబిరమైన ప్రియ పట్టణాన్ని ముట్టడి వేస్తారు. అప్పుడు పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించి వేస్తుంది.
10 A dyjabeł, który je zwodził, wrzucony jest w jezioro ognia i siarki, gdzie jest ona bestyja i fałszywy prorok; i będą męczeni we dnie i w nocy, na wieki wieków. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
౧౦వారిని మోసం చేసిన అపవాదిని మండుతున్న గంధకం సరస్సులో పడవేస్తారు. అక్కడే క్రూర మృగమూ, అబద్ధ ప్రవక్తా ఉన్నారు. వారు రాత్రీ పగలూ కలకాలం బాధల పాలవుతారు. (aiōn g165, Limnē Pyr g3041 g4442)
11 I widziałem stolicę wielką białą, i siedzącego na niej, przed którego obliczem uciekła ziemia i niebo, a miejsce im nie jest znalezione.
౧౧తరవాత తెల్లని సింహాసనాన్నీ దానిపై కూర్చున్న ఒకాయననూ చూశాను. ఆయన సన్నిధి నుండి భూమీ ఆకాశాలూ పారిపోయాయి. కానీ అవి వెళ్ళడానికి చోటు కనపడలేదు.
12 I widziałem umarłych, wielkich i małych, stojących przed oblicznością Bożą, a księgi otworzone są; i druga księga także otworzona jest, to jest księga żywota; i sądzeni są umarli według tego, jako napisano było w onych księgach, to jest według uczynków ich.
౧౨చనిపోయిన వారు గొప్పవారైనా అల్పులైనా ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడం చూశాను. అప్పుడు గ్రంథాలు తెరిచారు. మరో గ్రంథాన్ని కూడా తెరిచారు. అది జీవ గ్రంథం. ఆ గ్రంథాల్లో తమ కార్యాలను గురించి రాసి ఉన్న దాన్ని బట్టి వారు తీర్పు పొందారు.
13 I wydało morze umarłych, którzy w niem byli, także śmierć i piekło wydały umarłych, którzy w nich byli; i byli sądzeni każdy według uczynków swoich. (Hadēs g86)
౧౩సముద్రం తనలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించింది. మరణమూ, పాతాళ లోకమూ వాటి వశంలో ఉన్న చనిపోయిన వారిని అప్పగించాయి. వారంతా తమ కార్యాలను బట్టి తీర్పు పొందారు. (Hadēs g86)
14 A śmierć i piekło wrzucone są w jezioro ogniste. Tać jest wtóra śmierć. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
౧౪మరణాన్నీ పాతాళాన్నీ అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది. ఈ అగ్ని సరస్సే రెండవ మరణం. (Hadēs g86, Limnē Pyr g3041 g4442)
15 A jeśli się kto nie znalazł napisany w księgach żywota, wrzucony jest w jezioro ogniste. (Limnē Pyr g3041 g4442)
౧౫జీవ గ్రంథంలో పేరు లేని వాణ్ణి అగ్ని సరస్సులో పడవేశారు. (Limnē Pyr g3041 g4442)

< Objawienie 20 >