< Psalmów 150 >

1 Halleluja. Chwalcie Boga w świątnicy jego; chwalcie go na rozpostarciu mocy jego.
యెహోవాను కీర్తించండి. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుణ్ణి స్తుతించండి. ఆయన ప్రభావాన్ని గొప్పచేసే ఆకాశవిశాలాల్లో ఆయనను స్తుతించండి.
2 Chwalcie go ze wszelkiej mocy jego; chwalcie go według wielkiej dostojności jego.
ఆయన బలమైన కార్యాలను బట్టి ఆయనను స్తుతించండి. ఆయనకున్న గొప్ప బలప్రభావాలను బట్టి ఆయనను స్తుతించండి.
3 Chwalcie go na głośnych trąbach; chwalcie go na lutni i na harfie.
బాకాలు ఊదుతూ ఆయనను స్తుతించండి. సితారాతో, శ్రావ్యమైన స్వరాలతో ఆయనను స్తుతించండి.
4 Chwalcie go na bębnie, i na piszczałce; chwalcie go stronach i na organach.
తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ ఆయనను స్తుతించండి. తంతివాద్యం మీటుతూ, వేణువు మోగిస్తూ ఆయనను స్తుతించండి.
5 Chwalcie go na cymbałach głośnych; chwalcie go cymbałach krzykliwych.
తాళాలు మోగిస్తూ ఆయనను స్తుతించండి. గంభీరమైన ధ్వనులు చేసే తాళాలు వాయిస్తూ ఆయనను స్తుతించండి.
6 Niech wszelki duch chwali Pana! Halleluja.
ప్రాణం ఉన్న ప్రతి జీవీ యెహోవాను స్తుతిస్తుంది గాక. యెహోవాను కీర్తించండి.

< Psalmów 150 >