< Psalmów 101 >
1 Psalm samego Dawida. O miłosierdziu i o sądzie śpiewać będę; tobie, o Panie! śpiewać będę.
౧దావీదు కీర్తన యెహోవా, నేను నిన్ను కీర్తిస్తాను. నీ నిబంధన విశ్వసనీయత, న్యాయాలను గూర్చి గానం చేస్తాను.
2 Ostrożnym będę na drodze uprzejmej, kiedy przyjdziesz do mnie; będę chodził ustawicznie w szczerości serca mego, w domu moim.
౨ఎలాంటి దోషమూ లేకుండా వివేకంతో నడుచుకుంటాను. నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు? నేను నా ఇల్లంతటిలో యథార్థమైన ప్రవర్తనతో నడుచుకుంటాను.
3 Nie położę przed oczy moje złej rzeczy; każdą sprawę występników mam w nienawiści, a nie chwyci się mnie.
౩వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను.
4 Serce przewrotne odstąpi odemnie, a o złe nie będę dbał.
౪మూర్ఖంగా ఆలోచించేవాడు నాకు దూరంగా ఉండాలి. దుష్టకార్యాలంటే నాకు అసహ్యం.
5 Tego, który potajemnie obmawia bliźniego swego, wytnę; oczów wyniosłych, i serca nadętego nie będę mógł cierpieć.
౫తమ పొరుగువాణ్ణి చాటుగా ఎగతాళి చేసే వాళ్ళను నేను హతం చేస్తాను. అహంకారంతో ప్రవర్తించే వాళ్ళను, గర్విష్టులను నేను దూరంగా ఉంచుతాను.
6 Oczy moje obrócone będą na prawdomównych w ziemi, aby siadali zemną; kto chodzi drogą uprzejmą, ten mi służyć będzie.
౬దేశంలో నమ్మకంగా ఉండే వాళ్ళు నా చుట్టూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. సన్మార్గంలో నడుచుకునే వాళ్ళు మాత్రమే నాకు సేవకులుగా ఉంటారు.
7 Nie będzie mieszkał w domu moim zdrajca, ten, który mówi kłamstwo, nie ostoi się przed oczyma memi.
౭మోసంతో బతికేవాడు నా ఇంట్లో ఉండకూడదు. అబద్ధాలు పలికేవాడు నా కళ్ళ ఎదుట నిలబడకూడదు.
8 Co poranek tracić będę wszystkich niezbożnych na ziemi, abym tak wykorzenił z miasta Pańskiego wszystkich, którzy czynią nieprawość.
౮ప్రతిరోజూ ఉదయాన్నే దేశంలో దుర్మార్గులందరినీ నేను సంహరిస్తాను. యెహోవా పట్టణంలో పాపం చేసేవాళ్ళు లేకుండా చేస్తాను.