< Nehemiasza 4 >
1 A gdy usłyszał Sanballat, iż budujemy mury, rozgniewał się, a rozgniewawszy się bardzo, szydził z Żydów.
౧మేము గోడలు నిలబెట్టడం మొదలు పెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు.
2 I mówił przed braćmi swymi i przed rycerstwem Samaryjskiem, i rzekł: Cóż wżdy ci Żydowie niedołężni czynią? Także ich zaniechamy? I będąż ofiarować? Izali tego za dzień dokończą? Izali wskrzeszą kamienie z gromad gruzu, które spalono?
౨షోమ్రోను సైన్యం వారితో, తన స్నేహితులతో ఇలా అన్నాడు. “అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్ళను పునాదులుగా వాడతారా?”
3 Ale Tobijasz Ammonitczyk będąc przy nim, rzekł: Niech budują; jednak kiedy przyjdzie liszka, przebije mur ich kamienny.
౩అమ్మోనీయుడు టోబీయా అతని దగ్గరుండి “వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది” అన్నాడు.
4 Wysłuchajże, o Boże nasz! bośmy wzgardzeni, a obróć pohańbienie ich na głowę ich, a daj ich na łup w ziemi niewoli.
౪“మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదికే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి.
5 Nie pokrywajże nieprawości ich, a grzech ich od twarzy twej niech nie będzie zgładzony; bo cię do gniewu pobudzili dla tych, co budują.
౫వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయ వద్దు.”
6 Lecześmy my budowali ten mur, i spojony jest wszystek mur aż do połowy swej, a lud miał serce do roboty.
౬అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాం. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయింది.
7 A gdy usłyszeli Sanballat i Tobijasz, i Arabczycy, i Ammonitowie, i Azodczycy, że przybywało wzdłuż murów Jeruzalemskich, a iż się poczęli rozerwania murów zawierać, bardzo się rozgniewali.
౭యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని, సన్బల్లటు, టోబీయా, అరబ్బులు, అమ్మోను వారు, అష్డోదు వారు తెలుసుకుని మండిపడ్డారు.
8 Przetoż zbuntowali się wszyscy wespół, aby szli walczyć przeciw Jeruzalemowi, i uczynić wstręt robocie.
౮జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురి చేశారు.
9 Myśmy się jednak modlili Bogu naszemu, i postawiliśmy straż przeciwko nim we dnie i w nocy, bojąc się ich.
౯మేము మా దేవునికి ప్రార్థన చేసి, వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్లు కాపలా ఉంచాము.
10 Bo rzekli Żydowie: Zwątlała siła noszącego, a gruzu jeszcze wiele; a my nie będziemy mogli budować muru.
౧౦అప్పుడు యూదా వాళ్ళు “బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది, శిథిలాల కుప్పలు ఎక్కువై పోయాయి. గోడ కట్టడం కుదరదు” అన్నారు.
11 Nadto rzekli nieprzyjaciele nasi: Niech nie wzwiedzą ani obaczą, aż przyjdziemy między nich, i pomordujemy ich, a tak zastanowimy tę robotę.
౧౧మా విరోధులు “వాళ్ళకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి, పని జరగకుండా చేద్దాం” అనుకున్నారు.
12 A gdy przyszli Żydowie, którzy mieszkali około nich, i powiedzieli nam na dziesięć kroć: Pilnujcie ze wszystkich miejsc, z którychby przyjść mogli do nas;
౧౨మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు, నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు.
13 Tedym postawił na dolnych miejscach za murem i na miejscach wysokich, postawiłem mówię lud według domów z mieczami ich, z włóczniami, i z łukami ich.
౧౩అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో, గోడ పైనా మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరసలో నిలబెట్టాను.
14 A gdym to oglądał, wstawszy rzekłem do starszych, i do przełożonych, i do innego ludu: Nie bójcie się ich; na Pana wielkiego i straszliwego pamiętajcie, a walczcie za braci waszych, za synów waszych, i za córki wasze, za żony wasze, i za domy was ze.
౧౪నేను లేచి, ప్రధానులను, అధికారులను సమకూర్చి “మీరు వాళ్లకు భయపడకండి. అత్యంత ప్రభావశాలి, భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి. మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి” అన్నాను.
15 A gdy usłyszeli nieprzyjaciele nasi, iż nam to oznajmiono, tedy rozproszył Bóg radę ich, a myśmy się wszyscy wrócili do murów, każdy do roboty swojej.
౧౫వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందనీ, దేవుడు దాన్ని వమ్ము చేశాడనీ మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారు గోడ దగ్గరికి చేరుకొన్నాం.
16 A wszakże od onego czasu połowa sług moich robiła, a połowa ich trzymała włócznie, i tarcze, i łuki, i pancerze, a przedniejsi stali za wszystkim domem Judzkim.
౧౬అప్పటినుండి పనివాళ్ళలో సగం మంది పనిచేస్తుండగా, మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు.
17 Ci też, którzy budowali mury, i którzy nosili brzemiona, i co nakładali, jedną ręką swoją robili, a drugą trzymali broń.
౧౭గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పని చేస్తున్నారు.
18 A z onych, którzy budowali, miał każdy miecz swój przypasany do biódr swych, i tak budowali; a ten co w trąbę trąbił, był przy mnie.
౧౮కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పని చేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు.
19 Bom rzekł do starszych i przełożonych, i do innego ludu: Robota wielka i szeroka; a myśmy się rozstrzelali po murze daleko jeden od drugiego.
౧౯అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను. “మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పని చేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం.
20 A przetoż na któremkolwiek byście miejscu usłyszeli głos trąby, tam się zbierajcie do nas; Bóg nasz będzie walczył za nas.
౨౦కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి. మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు.”
21 Pilnowaliśmy tedy roboty, a połowa ich trzymała włócznie, od wejścia zorzy, aż gwiazdy wschodziły.
౨౧ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయం నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకూ ఈటెలు పట్టుకుని నిలబడ్డారు.
22 Na tenże czas rzekłem do ludu: Każdy z sługą swym niech nocuje w Jeruzalemie, aby nam byli w nocy dla straży, a we dnie dla roboty.
౨౨ఆ సమయంలో నేను ప్రజలతో “ప్రతి వ్యక్తీ తన పనివాళ్ళతో కలసి యెరూషలేంలోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పని చేస్తారు” అని చెప్పాను.
23 Przetoż i ja, i bracia moi, i słudzy moi, i straż, która jest ze mną, nie zewleczemy szat naszych, a każdy niech ma broń swą i wodę.
౨౩ఈ విధంగా నేను గానీ, నా బంధువులు గానీ, నా సేవకులు గానీ, నా వెంట ఉన్న కాపలావాళ్ళు గానీ బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే, ఆయుధం వదిలి పెట్టలేదు.