< Mateusza 14 >
1 W on czas usłyszał Herod Tetrarcha, wieść o Jezusie.
౧ఆ సమయాన రాష్ట్రాధికారి హేరోదు యేసు గురించిన వార్త విని,
2 I rzekł sługom swoim: Tenci jest Jan Chrzciciel; on to zmartwychwstał, i dlatego się cuda przez niego dzieją.
౨“ఇతడు బాప్తిసమిచ్చే యోహాను, చనిపోయి తిరిగి లేచాడు. అందుకే అతని ద్వారా అద్భుతాలు జరుగుతున్నాయి” అని తన సేవకులతో చెప్పాడు.
3 Albowiem Herod pojmawszy Jana, związał go był i wsadził do więzienia dla Herodyjady, żony Filipa, brata swego.
౩అంతకు పూర్వం, “నీవు నీ సోదరుడు ఫిలిప్పు భార్య హేరోదియను ఉంచుకోవడం న్యాయం కాదు” అని యోహాను చెప్పినందుకు
4 Bo mu Jan mówił: Nie godzi ci się jej mieć.
౪హేరోదు ఆమె కోసం యోహానును బంధించి ఖైదులో వేయించాడు.
5 Ale gdy go on chciał zabić, bał się ludu: albowiem go za proroka mieli.
౫హేరోదు అతన్ని చంపాలనుకున్నాడు గాని ప్రజలు అతన్ని ప్రవక్తగా భావించారు కాబట్టి వారికి భయపడ్డాడు.
6 Gdy tedy obchodzono dzień narodzenia Herodowego, tańcowała córka Herodyjady w pośrodku gości, i podobała się Herodowi.
౬హేరోదు పుట్టిన రోజున హేరోదియ కూతురు వారి ఎదుట నాట్యం చేసి హేరోదును మెప్పించింది.
7 Skąd pod przysięgą obiecał jej dać, czegobykolwiek żądała.
౭కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తానని అతడు ఒట్టు పెట్టి మాట ఇచ్చాడు.
8 A ona przedtem będąc naprawiona od matki swojej, rzekła: Daj mi tu na misie głowę Jana Chrzciciela.
౮తన తల్లి ఆమెకిచ్చిన సూచన ప్రకారం, “బాప్తిసమిచ్చే యోహాను తల ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది.
9 I zasmucił się król; ale dla przysięgi i dla spółsiedzących kazał jej dać.
౯ఆమె అభ్యర్ధనకు రాజు ఎంతో కలత చెందినా తాను ఇచ్చిన మాట కోసం, తనతో బాటు విందులో కూర్చున్న వారి కోసం అలా జరగాలని ఆజ్ఞాపించాడు.
10 A posławszy kata, ściął Jana w więzieniu.
౧౦భటులను పంపి ఖైదులో ఉన్న యోహాను తల నరికించాడు.
11 I przyniesiono głowę jego na misie, i oddano dzieweczce, i odniosła ją matce swojej.
౧౧వారు అతని తల ఒక పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆమె తన తల్లికి ఇచ్చింది.
12 A przyszedłszy uczniowie jego wzięli ciało i pogrzebli je, a szedłszy powiedzieli Jezusowi.
౧౨యోహాను శిష్యులు వచ్చి శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టారు. ఆ తరువాత యేసు దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తెలియజేశారు.
13 To usłyszawszy Jezus, ustąpił stamtąd w łodzi na miejsce puste osobno; a usłyszawszy lud, szli za nim z miast pieszo.
౧౩యేసు పడవ ఎక్కి, అక్కడనుంచి నిర్జన ప్రదేశానికి ఏకాంతంగా వెళ్ళిపోయాడు. ప్రజలు ఆ సంగతి విని, పట్టణాల నుంచి కాలి నడకన ఆయన వెంట వెళ్ళారు.
14 Wyszedłszy tedy Jezus ujrzał wielki lud, i użalił się ich, a uzdrawiał chore ich.
౧౪యేసు పడవ దిగి ఆ పెద్ద గుంపును చూశాడు. ఆయన వారిమీద జాలిపడి వారి రోగాలను బాగు చేశాడు.
15 A gdy nadchodził wieczór, przystąpili do niego uczniowie jego, mówiąc: Puste jest to miejsce, a czas już przeminął; rozpuść ten lud, aby odszedłszy do miasteczek, kupili sobie żywności.
౧౫సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “ఇది నిర్జన ప్రదేశం. ఇప్పటికే పొద్దుపోయింది. ఈ ప్రజలు గ్రామాల్లోకి వెళ్ళి ఆహారం కొనుక్కోడానికి వారిని పంపి వెయ్యి” అన్నారు.
16 A Jezus im rzekł: Nie potrzeba im odchodzić, dajcie wy im co jeść.
౧౬యేసు వారితో, “వారు వెళ్ళనక్కర లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అన్నాడు.
17 Ale mu oni rzekli: Nie mamy tu, tylko pięć chlebów i dwie ryby.
౧౭వారు, “ఇక్కడ మన దగ్గర ఐదు రొట్టెలూ రెండు చేపలూ తప్ప ఇంకేమీ లేవు” అని ఆయనతో అన్నారు.
18 A on rzekł: Przynieście mi je tu.
౧౮అందుకు ఆయన, “వాటిని నా దగ్గరికి తీసుకు రండి” అన్నాడు.
19 I rozkazawszy ludowi usiąść na trawie, wziął onych pięć chlebów i dwie ryby, a wejrzawszy w niebo, błogosławił, a łamiąc dawał uczniom chleby, a uczniowie ludowi.
౧౯ప్రజలు పచ్చిక మీద కూర్చోవాలని ఆదేశించాడు. అప్పుడు ఆ ఐదు రొట్టెలు, రెండు చేపలు చేతిలో తీసుకుని ఆకాశం వైపు చూసి దీవించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు ప్రజలకు వడ్డించారు.
20 I jedli wszyscy, a nasyceni byli; i zebrali, co zbywało ułomków, dwanaście koszów pełnych.
౨౦వారంతా తిని సంతృప్తి చెందిన తరువాత మిగిలిపోయిన ముక్కలు పోగుచేస్తే మొత్తం పన్నెండు గంపలు నిండాయి.
21 A tych, którzy jedli, było około pięciu tysięcy mężów, oprócz niewiast i dziatek.
౨౧స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు.
22 A wnetże przymusił Jezus uczniów swoich, aby wstąpili w łódź, i uprzedzili go na drugą stronę, ażby rozpuścił lud.
౨౨యేసు వెంటనే శిష్యులను తనకంటే ముందుగా ఆవలి తీరానికి వెళ్ళమని పడవ ఎక్కించాడు.
23 A rozpuściwszy lud, wstąpił na górę z osobna, aby się modlił; a gdy był wieczór, sam tam był.
౨౩ఆయన ఆ ప్రజలను పంపివేసిన తరువాత, ప్రార్థన చేయడానికి ఏకాంతంగా కొండ ఎక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నాడు.
24 A łódź już w pośrodku morza będąc, miotana była od wałów; albowiem był wiatr przeciwny.
౨౪అప్పటికి ఆ పడవ సముద్రం మధ్యలో ఉంది. ఎదురు గాలితో అలలు పడవను కొడుతూ ఉంటే ఆ తాకిడికి అది వారి అదుపు తప్పి కొట్టుకుపోతూ ఉంది.
25 Lecz o czwartej straży nocnej szedł do nich Jezus, chodząc po morzu.
౨౫రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుస్తూ వారి దగ్గరికి వచ్చాడు.
26 A ujrzawszy go uczniowie po morzu chodzącego, zatrwożyli się, mówiąc: Obłuda to jest! i od bojaźni krzyknęli.
౨౬ఆయన సముద్రం మీద నడవడం చూసి శిష్యులు భయపడిపోయి, దయ్యం అనుకుని గాబరాగా కేకలు వేశారు.
27 Lecz wnet rzekł do nich Jezus, mówiąc: Ufajcie! Jam ci to jest; nie bójcie się.
౨౭వెంటనే యేసు, “ధైర్యం తెచ్చుకోండి. నేనే, భయపడవద్దు” అన్నాడు.
28 A odpowiadając mu Piotr rzekł: Panie! Jeźliżeś ty jest, każ mi przyjść do ciebie po wodzie.
౨౮పేతురు, “ప్రభూ, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ దగ్గరికి రావడానికి నాకు అనుమతినివ్వు” అని ఆయనతో అన్నాడు.
29 A on rzekł: Pójdź! A Piotr, wystąpiwszy z łodzi, szedł po wodzie, aby przyszedł do Jezusa;
౨౯యేసు “రా” అన్నాడు. పేతురు పడవ దిగి యేసు దగ్గరికి వెళ్ళడానికి నీళ్ళ మీద నడిచాడు గాని
30 Ale widząc wiatr gwałtowny, zląkł się; a gdy począł tonąć, zakrzyknął, mówiąc: Panie, ratuj mię!
౩౦గాలిని చూసి భయపడి మునిగిపోతూ, “ప్రభూ, నన్ను రక్షించు” అని కేకలు వేశాడు.
31 A Jezus zaraz wyciągnąwszy rękę, uchwycił go i rzekł mu: O małowierny! przeczżeś wątpił?
౩౧వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకుని, “అల్పవిశ్వాసీ, ఎందుకు సందేహపడ్డావు?” అన్నాడు.
32 A gdy oni wstąpili w łódź, uciszył się wiatr.
౩౨యేసు, పేతురు పడవలో ప్రవేశించగానే ఆ గాలి ఆగిపోయింది.
33 A ci, którzy byli w łodzi, przystąpiwszy pokłonili mu się, mówiąc: Prawdziwie jesteś Synem Bożym.
౩౩అప్పుడు పడవలో ఉన్న శిష్యులు వచ్చి, “నువ్వు నిజంగా దేవుని కుమారుడివి” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
34 I przeprawiwszy się, przyszli do ziemi Gienezaret.
౩౪వారు అవతలి ఒడ్డుకు వెళ్ళి గెన్నేసరెతు ప్రాంతానికి చేరుకున్నారు.
35 A poznawszy go mężowie miejsca onego, posłali do wszystkiej onej okolicznej krainy; i przyniesiono do niego wszystkie, którzy się źle mieli.
౩౫అక్కడి ప్రజలు ఆయనను గుర్తుపట్టి, చుట్టుపక్కల ఉన్న ఆ ప్రాంతమంతటికీ కబురు పంపి రోగులందరినీ ఆయన దగ్గరికి రప్పించారు.
36 I prosili go, aby się tylko podołku szaty jego dotykali; a którzykolwiek się dotknęli, uzdrowieni są.
౩౬“వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రమే ముట్టనివ్వు” అని ఆయనను బతిమాలారు. ముట్టిన వారంతా బాగయ్యారు.