< Jana 5 >

1 Było potem święto żydowskie, i wstąpił Jezus do Jeruzalemu.
ఇది అయిన తరువాత యూదుల పండగ ఒకటి వచ్చింది. యేసు దానికోసం యెరూషలేముకు వెళ్ళాడు.
2 A była w Jeruzalemie przy owczej bramie sadzawka, którą zowią po żydowsku Betesda, mająca pięć ganków.
యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉంది. హీబ్రూ భాషలో దాని పేరు బేతెస్ద. దానికి ఐదు మంటపాలున్నాయి.
3 W tych leżało mnóstwo wielkie niedołężnych, ślepych, chromych, wyschłych, którzy czekali poruszenia wody.
(కొన్ని సమయాల్లో ప్రభువు దూత నీటిలోకి దిగి ఆ నీటిని కదిలిస్తూ ఉండేవాడు. అలా నీరు కదలగానే మొదటగా ఎవరైతే నీటిలోకి దిగుతారో అతనికి వ్యాధి నివారణ జరిగేది). రకరకాల రోగాలున్నవారూ, గుడ్డివారూ, కుంటివారూ చచ్చుబడిన కాళ్ళూ చేతులున్నవారూ గుంపులుగా ఆ మంటపాల్లో పడి ఉన్నారు.
4 Albowiem Anioł czasu pewnego zstępował w sadzawkę i poruszał wodę; a tak, kto pierwszy wstąpił po wzruszeniu wody, stawał się zdrowym, jakąbykolwiek chorobą zdjęty był.
5 A był tam niektóry człowiek trzydzieści i ośm lat chorobą złożony.
అక్కడ ముప్ఫై ఎనిమిది సంవత్సరాల నుండి ఒక వ్యక్తి అంగ వైకల్యంతో పడి ఉన్నాడు.
6 Tego gdy Jezus ujrzał leżącego, a poznawszy, że już przez długi czas chorował, rzekł mu: Chcesz być zdrów?
యేసు అతనిని చూసి అతడు అక్కడ చాలా కాలం నుండి పడి ఉన్నాడని గ్రహించాడు. అతనిని చూసి, “బాగవ్వాలని కోరిక ఉందా?” అని అడిగాడు.
7 Odpowiedział mu on chory: Panie! nie ma człowieka, który by mię, gdy bywa poruszona woda, wrzucił do sadzawki; ale gdy ja idę, inszy przede mną wstępuje.
అప్పుడు ఆ రోగి, “అయ్యా, దేవదూత నీటిని కదిలించినప్పుడు నన్ను కోనేటిలో దించడానికి ఎవరూ లేరు. నేను సర్దుకుని దిగేంతలో నాకంటే ముందు మరొకడు దిగుతాడు” అని జవాబిచ్చాడు.
8 Rzekł mu Jezus: Wstań, weźmij łoże twoje, a chodź.
యేసు, “నువ్వు లేచి నీ చాప తీసుకుని నడిచి వెళ్ళు” అని అతనితో చెప్పాడు.
9 A zarazem stał się zdrowym on człowiek, i wziął łoże swoje, i chodził. A był sabat onego dnia.
వెంటనే ఆ వ్యక్తి బాగుపడి తన పడక తీసుకుని నడవడం మొదలు పెట్టాడు. ఆ రోజు విశ్రాంతి దినం.
10 Tedy rzekli Żydowie onemu uzdrowionemu: Sabat jest, nie godzi ci się łoża nosić.
౧౦అందుకని యూదా మత నాయకులు ఆ వ్యక్తితో, “ఈ రోజు విశ్రాంతి దినం. నువ్వు పరుపును మోయకూడదు కదా!” అన్నారు.
11 Odpowiedział im: Ten, który mię uzdrowił, tenże mi rzekł: Weźmij łoże twoje, a chodź.
౧౧అందుకు ఆ వ్యక్తి, “నన్ను బాగుచేసిన వాడు ‘నీ చాప ఎత్తుకుని నడువు’ అని నాకు చెప్పాడు” అన్నాడు.
12 I pytali go: Któryż jest ten człowiek, co ci powiedział: Weźmij łoże twoje, a chodź?
౧౨అప్పుడు వారు, “నీకసలు నీ పరుపెత్తుకుని నడవమని చెప్పిందెవరు?” అని అతణ్ణి అడిగారు.
13 A on uzdrowiony nie wiedział, kto by był; albowiem był Jezus ustąpił, ponieważ wiele ludu było na onem miejscu.
౧౩అయితే తనని బాగు చేసినదెవరో అతనికి తెలియదు. ఎందుకంటే అక్కడ ప్రజలంతా గుంపు కూడి ఉండడం వలన యేసు నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
14 Potem go Jezus znalazł w kościele i rzekł mu: Otoś się stał zdrowym, nie grzesz więcej, aby co gorszego na cię nie przyszło.
౧౪ఆ తరువాత యేసు దేవాలయంలో అతణ్ణి చూశాడు. “చూడు, నీవు స్వస్థత పొందావు. ఇప్పుడు పాపం చేస్తే నీకు ఎక్కువ కీడు కలుగుతుంది. అందుకని ఇక పాపం చేయవద్దు.” అని అతడితో చెప్పాడు.
15 A odszedłszy on człowiek, powiedział Żydom, iż to był Jezus, który go uzdrowił.
౧౫వాడు యూదా నాయకుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసు అని చెప్పేశాడు.
16 A przetoż Żydowie prześladowali Jezusa i szukali, jakoby go zabili, że to uczynił w sabat.
౧౬ఈ పనులను యేసు విశ్రాంతి దినాన చేశాడు కాబట్టి యూదులు ఆయనను బాధించారు.
17 A Jezus im odpowiedział: Ojciec mój aż dotąd pracuje, i ja pracuję;
౧౭యేసు వారితో, “నా తండ్రి ఇప్పుడు కూడా పని చేస్తున్నాడు. నేను కూడా చేస్తున్నాను” అన్నాడు.
18 Dlatego tedy tem więcej szukali Żydowie, jakoby go zabili, nie tylko, iż gwałcił sabat, ale że i Ojca swego powiadał być Bogiem, czyniąc się równym Bogu.
౧౮ఆయన విశ్రాంతి దినాచారాన్ని భంగం చేయడం మాత్రమే కాక దేవుణ్ణి తండ్రి అని సంబోధించి తనను దేవునికి సమానుడిగా చేసుకున్నందుకు వారు ఆయనను చంపాలని మరింత గట్టి ప్రయత్నం చేశారు.
19 Odpowiedział tedy Jezus i rzekł im: Zaprawdę, zaprawdę powiadam wam, nie może Syn sam od siebie nic czynić, jedno co widzi, że Ojciec czyni; albowiem cokolwiek on czyni, to także i Syn czyni.
౧౯కాబట్టి యేసు వారికి ఇలా జవాబిచ్చాడు, “మీకు కచ్చితంగా చెబుతున్నాను. కుమారుడు తనంతట తానుగా ఏదీ చేయడు. తండ్రి దేనిని చేయడం చూస్తాడో దానినే కుమారుడు కూడా చేస్తాడు. ఎందుకంటే తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు కూడా చేస్తాడు.
20 Boć Ojciec miłuje Syna i ukazuje mu wszystko, co sam czyni, i większe mu nad te sprawy pokaże, abyście się wy dziwowali.
౨౦తండ్రి కుమారుణ్ణి ప్రేమిస్తాడు కాబట్టి తాను చేసే పనులన్నిటినీ కుమారుడికి చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాదు. ఆయన మీకందరికీ విభ్రాంతి కలిగేలా ఇంతకంటే గొప్ప సంగతులను కుమారుడికి చూపిస్తాడు.
21 Albowiem jako Ojciec wzbudza umarłe i ożywia, tak i Syn, które chce, ożywia.
౨౧“తండ్రి చనిపోయిన వారిని లేపి ఎలా ప్రాణం ఇస్తాడో అలాగే కుమారుడు కూడా తనకు ఇష్టం అయిన వారిని బతికిస్తాడు.
22 Bo Ojciec nikogo nie sądzi, lecz wszystek sąd dał Synowi,
౨౨తండ్రి ఎవరికీ తీర్పు తీర్చడు కానీ అందరికీ తీర్పు తీర్చే సమస్త అధికారాన్ని ఆయన కుమారుడికి ఇచ్చాడు.
23 Aby wszyscy czcili Syna, tak jako czczą Ojca; kto nie czci Syna, nie czci i Ojca, który go posłał.
౨౩దీని వల్ల తండ్రిని గౌరవించే అందరూ అదే విధంగా కుమారుణ్ణి కూడా గౌరవించాలి. కుమారుణ్ణి గౌరవించని వాడు ఆయనను పంపిన తండ్రిని కూడా గౌరవించడు.
24 Zaprawdę, zaprawdę powiadam wam: Kto słowa mego słucha i wierzy onemu, który mię posłał, ma żywot wieczny i nie przyjdzie na sąd, ale przeszedł z śmierci do żywota. (aiōnios g166)
౨౪కచ్చితంగా చెబుతున్నాను. నా మాట విని నన్ను పంపించిన వానిలో విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి ఇక శిక్ష ఉండదు. అతడు మరణం నుండి జీవంలోకి దాటి వెళ్ళాడు. (aiōnios g166)
25 Zaprawdę, zaprawdę powiadam wam: Że idzie godzina i teraz jest, gdy umarli usłyszą głos Syna Bożego, a którzy usłyszą, żyć będą.
౨౫మీకు కచ్చితంగా చెబుతున్నాను. చనిపోయిన వారు దేవుని కుమారుడి స్వరం వినే సమయం రాబోతుంది. ఇప్పుడు వచ్చేసింది. ఆ స్వరాన్ని వినే వారు బతుకుతారు.
26 Albowiem jako Ojciec ma żywot sam w sobie, tak dał i Synowi, aby miał żywot w samym sobie.
౨౬తండ్రి ఎలా స్వయంగా జీవం కలిగి ఉన్నాడో అలాగే కుమారుడు కూడా స్వయంగా తనలో జీవం కలిగి ఉండడానికి కుమారుడికి అధికారం ఇచ్చాడు.
27 I dał mu moc i sąd czynić; bo jest Synem człowieczym.
౨౭అలాగే ఆయన కుమారుడికి తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడు. ఆయన మనుష్య కుమారుడు కాబట్టి ఈ అధికారం ఇచ్చాడు.
28 Nie dziwujcież się temu; boć przyjdzie godzina, w którą wszyscy, co są w grobach, usłyszą głos jego;
౨౮“దీనికి మీరు ఆశ్చర్యపడవద్దు. సమాధుల్లో ఉన్నవారు ఆయన స్వరాన్ని వినే కాలం వస్తుంది.
29 I pójdą ci, którzy dobrze czynili, na powstanie żywota; ale ci, którzy źle czynili, na powstanie sądu.
౨౯అలా విన్నవారు బయటికి వస్తారు. మంచి చేసిన వారు జీవపు పునరుత్థానానికీ చెడు చేసిన వారు తీర్పు పునరుత్థానానికీ బయటకు వస్తారు.
30 Nie mogęć ja sam od siebie nic czynić; jako słyszę, tak sądzę, a sąd mój jest sprawiedliwy; bo nie szukam woli mojej, ale woli tego, który mię posłał, Ojca.
౩౦“నా అంతట నేనే దేనినీ చేయలేను. నేను విన్న దాని ప్రకారం తీర్పు తీరుస్తాను. నా స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని నేను చూడను గానీ నన్ను పంపిన వాని ఇష్టం నెరవేరాలని చూస్తాను. కాబట్టి నా తీర్పు న్యాయవంతంగా ఉంటుంది.
31 Jeźliżeć ja sam o sobie świadczę, świadectwo moje nie jest prawdziwe.
౩౧నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే అది సత్యం కాదు.
32 Inszy jest, co o mnie świadczy, i wiem, że prawdziwe jest świadectwo, które wydaje o mnie.
౩౨నా గురించి సాక్షమిచ్చేవాడు మరొకడున్నాడు. నా గురించి ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యమని నాకు తెలుసు.
33 Wyście słali do Jana, a on dał świadectwo prawdzie.
౩౩“మీరు యోహాను దగ్గరికి కొందరిని పంపారు. అతడు సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పాడు.
34 Ale ja nie od człowieka świadectwo biorę, ale to mówię, abyście wy byli zbawieni.
౩౪కానీ నేను పొందిన సాక్ష్యం మనుషులు ఇచ్చినది కాదు. మీ రక్షణ కోసం ఈ మాటలు చెబుతున్నాను.
35 Onci był świecą gorejącą i świecącą, a wyście się chcieli do czasu poradować w światłości jego.
౩౫యోహాను మండుతూ ప్రకాశించే దీపంలా ఉండే వాడు. మీరు అతని వెలుగులో కొంతకాలం సంతోషించడానికి ఇష్టపడ్డారు.
36 Ale ja mam świadectwo większe niż Janowe; albowiem sprawy, które mi dał Ojciec, abym je wykonał, te same sprawy, które ja czynię, świadczą o mnie, iż mię Ojciec posłał.
౩౬అయితే యోహాను నా గురించి చెప్పిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం నాకుంది. నేను చేయడానికి నా తండ్రి నాకిచ్చిన పనులే ఆ సాక్ష్యం. ప్రస్తుతం నేను చేస్తున్న ఈ కార్యాలే తండ్రి నన్ను పంపాడని నా గురించి సాక్ష్యం చెబుతున్నాయి.
37 A Ojciec, który mię posłał, onże świadczył o mnie, któregoście wy głosu nigdy nie słyszeli, aniście osoby jego widzieli;
౩౭నన్ను పంపిన తండ్రి తానే నాగురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన స్వరాన్ని మీరు ఏనాడూ వినలేదు. ఆయన స్వరూపాన్నీ ఏనాడూ చూడలేదు.
38 I słowa jego nie macie w sobie mieszkającego; albowiem, którego on posłał, temu nie wierzycie.
౩౮ఆయన పంపించిన వ్యక్తిని మీరు నమ్మలేదు కాబట్టి ఆయన వాక్కు మీలో నిలిచి లేదు.
39 Badajcież się Pism; boć się wam zda, że w nich żywot wieczny macie, a one są, które świadectwo wydawają o mnie. (aiōnios g166)
౩౯లేఖనాల్లో మీకు నిత్య జీవం ఉందనుకుని మీరు వాటిని పరిశోధిస్తున్నారు. కానీ అవే నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. (aiōnios g166)
40 A wżdy do mnie przyjść nie chcecie, abyście żywot mieli.
౪౦అయితే మీకు జీవం కలిగేలా నా దగ్గరికి రావడానికి మీరు ఇష్టపడడం లేదు.
41 Chwały od ludzi nie przyjmuję.
౪౧మనుషులు ఇచ్చే గౌరవాన్ని నేను స్వీకరించను.
42 Alem was poznał, że miłości Bożej nie macie w sobie.
౪౨ఎందుకంటే దేవుని ప్రేమ మీలో లేదని నాకు తెలుసు.
43 Jam przyszedł w imieniu Ojca mego, a nie przyjmujecie mnie: jeźliżby przyszedł inny w imieniu swojem, onego przyjmiecie.
౪౩“నేను నా తండ్రి పేరిట వచ్చాను. మీరు నన్ను అంగీకరించలేదు. మరొకడు తన స్వంత పేరు ప్రతిష్టలతో మీ దగ్గరికి వస్తే మీరు వాణ్ణి అంగీకరిస్తారు.
44 Jakoż wy możecie wierzyć, chwałę jedni od drugich przyjmując, ponieważ chwały, która jest od samego Boga, nie szukacie?
౪౪ఇతరుల నుండి కలిగే మెప్పును అంగీకరిస్తూ ఏకైక దేవుని నుండి కలిగే మెప్పును వెదకని మీరు ఎలా విశ్వసిస్తారు?
45 Nie mniemajcie, abym ja was miał oskarżać przed Ojcem; jestci, który skarży na was, Mojżesz, w którym wy nadzieję macie.
౪౫నేను తండ్రి ముందు మీమీద నేరం మోపుతానని అనుకోవద్దు. మీ మీద నేరం మోపడానికి మరో వ్యక్తీ ఉన్నాడు. మీరు మీ ఆశలన్నీ పెట్టుకున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు.
46 Bo gdybyście wierzyli Mojżeszowi, wierzylibyście i mnie; gdyż on o mnie pisał.
౪౬మీరు మోషేను నమ్మినట్టయితే నన్ను కూడా నమ్ముతారు. ఎందుకంటే మోషే నా గురించే రాశాడు.
47 Ale ponieważ pismom jego nie wierzycie, i jakoż słowom moim uwierzycie?
౪౭మీరు అతడు రాసిందే నమ్మకపోతే ఇక నా మాటలు ఎలా నమ్ముతారు?”

< Jana 5 >