< Jeremiasza 43 >
1 A gdy przestał Jeremijasz mówić do wszystkiego ludu wszystkich słów Pana, Boga ich, z któremi go był posłał Pan, Bóg ich, do nich, wszystkich mówię tych słów,
౧వాళ్ళ దేవుడైన యెహోవా వాళ్ళతో చెప్పమని తనకి ఆదేశించిన మాటలన్నిటినీ యిర్మీయా వాళ్లకు చెప్పి ముగించాడు.
2 Rzekł Azaryjasz syn Hosajaszowy i Johanan, syn Karejaszowy, i wszyscy mężowie pyszni, mówiąc do Jeremijasza: Kłamstwo ty powiadasz; nie posłał cię Pan, Bóg nasz, mówiąc: Nie chodźcie do Egiptu, abyście tam mieszkali;
౨అప్పుడు హోషేయా కొడుకు అజర్యా, కారేహ కొడుకు యోహానానూ ఇంకా అక్కడ ఆహంకారులందరూ యిర్మీయాతో “నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. ‘మీరు నివసించడానికి ఐగుప్తుకు వెళ్ళవద్దు’ అని మా దేవుడు యెహోవా నీతో చెప్పి పంపలేదు.
3 Ale Baruch, syn Neryjaszowy, podszczuwa cię przeciwko nam, aby nas wydał w ręce Chaldejczyków, żeby nas pobili, albo nas zabrali do Babilonu.
౩మేం చావడానికీ, బబులోనుకు బందీలుగా పోవడానికీ కల్దీయుల చేతిలో చిక్కాలని నేరీయా కొడుకు బారూకు మాకు వ్యతిరేకంగా నిన్ను రెచ్చగొడుతున్నాడు” అన్నారు.
4 I nie usłuchał Johanan, syn Karejaszowy, i wszyscy książęta wojsk, także i wszystek lud głosu Pańskiego, żeby zostali w ziemi Judzkiej.
౪ఈ విధంగా కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ, ఇంకా ప్రజలందరూ యూదా దేశంలో నివసించమన్న దేవుని మాట వినలేదు.
5 Ale Johanan, syn Karejaszowy, i wszyscy książęta wojsk wzięli wszystek ostatek z Judy, którzy się byli wrócili ze wszystkich narodów, do których byli wygnani, aby, mieszkali w ziemi Judzkiej:
౫కారేహ కొడుకు యోహానానూ, సైన్యాధిపతులందరూ చెరలో నుండి యూదా దేశంలో నివసించడానికి అనేక ప్రాంతాల నుండి తిరిగి వచ్చిన వాళ్ళనందరినీ తీసుకు వెళ్ళారు.
6 Mężów, i niewiasty, i dzieci, i córki królewskie, i każdą duszę, którą Nabuzardan, hetman żołnierski, z Godolijaszem, synem Ahikamowym, syna Safanowego, zostawił, i z Jeremijaszem prorokiem, i z Baruchem, synem Neryjaszowym;
౬స్త్రీ పురుషులనందరినీ, పిల్లలనూ, రాజ కుమార్తెలనూ, రాజు అంగరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను షాఫాను కొడుకైన అహీకాము కొడుకు గెదల్యా ఆధీనంలో ఉంచిన వాళ్ళనందరినీ తీసుకుని వెళ్ళారు. వాళ్ళు ప్రవక్త అయిన యిర్మీయానూ, నేరీయా కొడుకు బారూకును కూడా తీసుకు వెళ్ళారు.
7 I weszli do ziemi Egipskiej, bo nie byli posłuszni głosowi Pańskiemu, i przyszli do Tachpanches.
౭వాళ్ళు దేవుని మాట వినకుండా ఐగుప్తుదేశంలో ఉన్న తహపనేసుకు వచ్చారు.
8 I stało się słowo Pańskie do Jeremijasza w Tachpanchos, mówiąc:
౮కాబట్టి యెహోవా వాక్కు తహపనేసులో ఉన్న యిర్మీయా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు.
9 Nabierz w ręce swe kamieni wielkich, a skryj je w glinę w cegielnicy, która jest przed bramą domu Faraonowego w Tachpanches, przed oczyma mężów Judzkich;
౯యూదులు చూస్తూ ఉండగా నువ్వు కొన్ని పెద్ద రాళ్ళను చేతిలో పట్టుకుని తహపనేసులో ఉన్న ఫరో భవన ద్వారం దగ్గరికి వెళ్ళు. అక్కడ ఇటుకలు పేర్చిన దారిలో సున్నం కింద వాటిని దాచి పెట్టు.
10 A rzecz im: Tak mówi Pan zastępów, Bóg Izraelski: Oto Ja poślę i przywiodę Nabuchodonozora, króla Babilońskiego, sługę mego i postawię stolicę jego na tych kamieniach, którem skrył: i rozbije majestat swój na nich.
౧౦తర్వాత వాళ్లకిలా ప్రకటించు. “సేనల ప్రభువూ, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ‘చూడండి, నేను నా సేవకుడూ, బబులోను రాజూ అయిన నెబుకద్నెజరును పిలవడానికి వార్తాహరులను పంపిస్తున్నాను. యిర్మీయా పాతిన ఈ రాళ్ళ పైన అతని సింహాసనాన్ని నిలబెడతాను. వాటిపైనే అతడు తన కంబళి పరుస్తాడు.
11 Bo przyciągnąwszy wytraci ziemię Egipską; którzy na śmierć oddani, na śmierć pójdą, a którzy do więzienia, do więzienia, a którzy pod miecz, pod miecz.
౧౧అతడు వచ్చి ఐగుప్తు పై దాడి చేస్తాడు. చావుకు నిర్ణయమైన వాళ్ళు చనిపోతారు. బందీలుగా వెళ్ళడానికి నిర్ణయమైన వాళ్ళు బందీలుగా వెళ్తారు. కత్తి మూలంగా చావడానికి నిర్ణయమైన వాళ్ళు కత్తి మూలంగానే చనిపోతారు.
12 I zapalę ogień w domach bogów Egipskich, i popali je, a one pobierze do więzienia: i odzieje się ziemią Egipską jako się odziewa pasterz szatą swoją, i wynijdzie stamtąd w pokoju,
౧౨అప్పుడు నేను ఐగుప్తు దేవుళ్ళ గుళ్లలో అగ్ని రాజేస్తాను. నెబుకద్నెజరు వాటిని కాల్చి వేస్తాడు. లేదా ఆ దేవుళ్ళను పట్టుకుపోతాడు. గొర్రెల కాపరి తన బట్టలపై ఉన్న పురుగులను తుడిచి పెట్టినట్టుగా అతడు ఐగుప్తు దేశాన్ని తుడిచి పెట్టేస్తాడు. విజయం సాధించి అక్కడ నుండి వెళ్తాడు.
13 Gdy pokruszy słupy w Betsemes, które jest w ziemi Egipskiej, i domy bogów Egipskich popali ogniem.
౧౩అతడు ఐగుప్తులో సూర్య మందిరాలలో ఉన్న రాతి స్తంభాలను కూల్చి వేస్తాడు. ఐగుప్తు దేవుళ్ళ ఆలయాలను కాల్చివేస్తాడు.’”