< Izajasza 44 >
1 A teraz słuchaj Jakóbie sługo mój! i ty, Izraelu! któregom wybrał.
౧అయినా నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న ఇశ్రాయేలూ, విను.
2 Tak mówi Pan, który cię uczynił, i który cię ukształtował zaraz z żywota matki, i który cię wspomaga: Nie bój się Jakóbie, sługo mój! i uprzejmy, któregom wybrał.
౨నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేసే యెహోవా ఇలా చెబుతున్నాడు, “నా సేవకుడవైన యాకోబూ, నేను ఏర్పరచుకొన్న యెషూరూనూ, భయపడకు.
3 Bo wyleję wody na pragnącego, a potoki na suchą ziemię; wyleję Ducha mego na nasienie twoje, i błogosławieństwo moje na potomki twoje.
౩నేను దాహం గొన్నవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద జల ప్రవాహాలను కుమ్మరిస్తాను. నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను.
4 I rozkrzewią się jako między trawą, i jako wierzby przy ciekących wodach.
౪నీటి కాలవల దగ్గర నాటిన నిరవంజి చెట్లు గడ్డిలో పెరిగినట్టు వారు పెరుగుతారు.
5 Ten rzecze: Jam jest Pański, a ów się ozowie do imienia Jakóbowego, a inny się zapisze ręką swą Panu, i imieniem Izraelskim będzie się nazywał.
౫ఒకడు, ‘నేను యెహోవా వాణ్ణి’ అంటాడు, ఇంకొకడు యాకోబు పేరు చెబుతాడు. మరొకడు అయితే ‘యెహోవా వాణ్ణి’ అని తన చేతిపై రాసుకుని ఇశ్రాయేలు అనే మారు పేరు పెట్టుకుంటాడు.”
6 Tak mówi Pan, król Izraelski, i odkupiciel jego, Pan zastępów: oprócz mnie niemasz Boga.
౬ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడు, సైన్యాల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు, “నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి. నేను తప్ప ఏ దేవుడు లేడు.
7 Bo któż jako Ja ogłasza i opowiada to, i sporządza mi to, zaraz od onego czasu, jakom rozsądził lud na świecie? a kto przyszłe rzeczy, i to, co ma być, oznajmi im?
౭ఆదిలో నా ప్రజలను నియమించినప్పటి నుండి నాలాగా విషయాలను వెల్లడి చేస్తూ వచ్చిన వాడెవడు? అలాంటివాడు ఉంటే నాకు చెప్పండి. వారు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలియజెప్ప గలిగేవారై ఉండాలి.
8 Nie bójcież się, ani sobą trwożcie. Izalim wam tego z dawna nie oznajmił, i nie opowiedział? Tegoście wy mnie sami świadkami. Izali jest Bóg oprócz mnie? Niemasz zaiste skały; Ja o żadnej nie wiem.
౮మీరు బెదరవద్దు, భయపడవద్దు. పూర్వకాలం నుండి నేను మీకు ఆ సంగతి వినిపిస్తూ ఉండలేదా? మీరే నాకు సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడున్నాడా? నేను తప్ప వేరొక ఆశ్రయదుర్గం లేదు. ఉన్నట్టు నేనెరుగను.
9 Tworzyciele bałwanów wszyscy nic nie są, i te najmilsze rzeczy ich nic im nie pomogą; czego oni sobie sami świadkami będąc, nic nie widzą, ani rozumieją, żeby się wstydzić mogli.
౯విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు.
10 Kto tworzy boga, i bałwana leje, do niczego się to nie przygodzi.
౧౦ఎందుకూ పనికిరాని విగ్రహాన్ని పోత పోసి దాన్ని ఒక దేవుడిగా నిరూపించేవాడెవడు?
11 Oto wszyscy, i uczestnicy ich będą pohańbieni; owszem, rzemieślnicy ich, ci nad innych ludzi, choćby się wszyscy zebrali i stanęli, lękać się muszą, i społem pohańbieni będą.
౧౧ఇదిగో, దాన్ని పూజించే వారంతా సిగ్గుపడతారు. ఆ శిల్పకారులు మానవ మాత్రులే గదా? వారందరినీ పోగు చేసి నిలబెడితే వారు తప్పకుండా భయపడతారు, సిగ్గుపడతారు.
12 Kowal kleszczami robi przy węglu, a młotami kształtuje bałwana; gdy go robi mocą ramienia swego, aż od głodu w nim i siły ustają, ani pije wody, aż i omdlewa.
౧౨కమ్మరి ఇనుప గొడ్డలిని పదును చేస్తూ నిప్పుల మీద పని చేస్తాడు. తన బలమైన చేతితో దాన్ని తయారుచేస్తాడు. అతనికి ఆకలి వేస్తుంది, అతని బలం తగ్గిపోతుంది. నీళ్లు తాగకపోవడం చేత సొమ్మసిల్లి పడిపోతాడు.
13 Cieśla zaś rozcięga sznur, znaczy sznurem farbowanym, i ociosuje toporem, i cyrklem rozmierza go, i czyni go na podobieństwo męża, i na podobieństwo pięknego człowieka, aby mieszkał w domu.
౧౩వడ్లవాడు చెక్క మీద నూలు తాడు వేసి గీత గీస్తాడు. దాన్ని చిత్రిక పట్టి నునుపుగా చేస్తాడు. ఎండ్రకాయ గుర్తు పెట్టి దాన్ని తయారు చేస్తాడు. మందిరంలో నిలబెట్టడం కోసం ఒక మానవ రూపాన్ని ఆకర్షణీయంగా ఉండేలా చేస్తాడు.
14 Narąbie sobie cedrów, i bierze cyprys i dąb, albo to, co jest najmocniejszego między drzewem leśnem, albo wsadzi jawór, który za deszczem odrasta;
౧౪ఒకడు దేవదారు చెట్లను నరకడానికి పూనుకుంటాడు. లేక సరళ వృక్షాన్నో సింధూర వృక్షాన్నో ఏదొక అడవి వృక్షాన్ని ఎన్నుకుంటాడు. ఒకడు ఒక చెట్టును నాటినప్పుడు అది వర్షం సాయంతో పెరుగుతుంది.
15 I używa tego człowiek do palenia, albo wziąwszy z niego, ogrzewa się przy nim, także roznieca ogień, aby napiekł chleba, nadto z tegoż drzewa robi sobie boga, i kłania mu się; czyni z niego bałwana, i klęka przed nim.
౧౫అప్పుడు ఒక మనిషి ఆ చెట్టుని కాల్చి వాటిలో కొంత తీసుకుని చలి కాచుకోడానికి, కొంత నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకోడానికి ఉపయోగిస్తాడు. మిగిలినదాన్ని తీసుకుని దానితో ఒక దేవతను చేసుకుని దానికి నమస్కారం చేస్తాడు. దానితో ఒక విగ్రహం చేసి దానికి సాగిలపడతాడు.
16 Część jego pali ogniem, przy drugiej części jego mięso je, piecze pieczeń i nasycony bywa; także rozgrzewa się, i mówi: Ehej! rozgrzałem się, widziałem ogień.
౧౬కొంత చెక్కను నిప్పుతో కాల్చి, దానిపై మాంసం వండుకుని తిని తృప్తి పొందుతాడు. ‘ఆహా, చలి కాచుకున్నాను, వెచ్చగా ఉంది’ అనుకున్నాడు.
17 A z ostatku jego czyni boga, bałwana swego; klęka przed nim, kłania się, i modli mu się, mówiąc: Wybaw mię, boś ty bóg mój.
౧౭మిగిలిన భాగాన్ని తాను దేవుడుగా భావించే విగ్రహాన్ని చేసుకుంటాడు. దాని ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తూ ‘నా దేవుడివి నువ్వే, నన్ను రక్షించు’ అని ప్రార్థిస్తాడు.
18 Nie wiedzą, ani rozumieją, przeto, że Bóg zaślepił oczy ich, aby nie widzieli, i serca ich, aby nie rozumieli.
౧౮వారికి తెలియదు, అర్థం చేసుకోరు. వారు చూడకుండేలా వారి కళ్ళు, అర్థం చేసుకోకుండేలా వారి హృదయాలు మూసుకుపోయాయి.
19 I nie uważają tego w sercu swojem, nie mająż to umiejętności ani baczenia, aby rzekli: Część z niego spaliłem ogniem, a przy węglu jego napiekłem chleba, upiekłem mięso, i najadłem się; i mamże ja z ostatku jego obrzydliwość uczynić, a przed kloc em drewnianym klękać?
౧౯ఎవరూ ఆలోచించడం లేదు. ‘నేను సగం చెక్కను అగ్నిలో కాల్చాను, ఆ నిప్పుల మీద రొట్టె కాల్చుకుని, మాంసం వండుకుని భోజనం చేశాను. మిగిలిన చెక్కను తీసుకుని దానితో అసహ్యమైన దాన్ని చేయాలా? ఒక చెట్టు మొద్దుకు సాగిలపడి నమస్కరించాలా?’ అని ఆలోచించడానికి ఎవరికీ తెలివి, వివేచన లేదు.
20 Taki się karmi popiołem, serce jego zwiedzione unosi go, aby nie mógł wybawić duszy swojej, ani rzec: Izali to nie jest oszukanie, co jest w prawicy mojej?
౨౦వాడు బూడిద తిన్నట్టుగా ఉంది. వాడి మోసపోయిన మనస్సు వాణ్ణి దారి తప్పేలా చేసింది. వాడు తన ఆత్మను రక్షించుకోలేడు. ‘నా కుడి చేతిలో ఉన్న బొమ్మ నకిలీ దేవుడు కదా’ అనుకోడానికి వాడికి బుద్ధి సరిపోదు.
21 Pomnijże na to, Jakóbie i Izraelu! przeto, żeś ty jest sługą moim. Stworzyłem cię, sługaś ty mój; o Izraelu! nie zapomnę na cię.
౨౧యాకోబూ, ఇశ్రాయేలూ, వీటిని గురించి ఆలోచించు. నువ్వు నా సేవకుడివి. నేనే నిన్ను నిర్మించాను. ఇశ్రాయేలూ, నువ్వు నాకు సేవకుడివి. నేను నిన్ను మరచిపోను.
22 Gładzę nieprawości twoje jako obłok, a grzechy twoje jako mgłę; nawróć się do mnie, bom cię odkupił.
౨౨మంచు విడిపోయేలా నేను నీ అతిక్రమాలను, మేఘాలు తొలగిపోయేలా నీ పాపాలను తుడిచివేశాను. నేను నిన్ను విమోచించాను. నా దగ్గరికి తిరిగి రా.
23 Śpiewajcie niebiosa, bo to Pan uczynił; wykrzykajcie niskości ziemi, zabrzmijcie chwałę góry, las, i wszystkie drzewa w nim; albowiem Pan odkupił Jakóba, a w Izraelu sławnym się uczynił.
౨౩యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”
24 Tak mówi Pan, odkupiciel twój, i który cię utworzył wnet z żywota matki: Ja Pan wszystko czynię, sam rozciągam niebiosa, rozpościeram ziemię mocą swoją.
౨౪గర్భంలో నిన్ను నిర్మించినవాడు, నీ విమోచకుడు అయిన యెహోవా ఈ విధంగా చెబుతున్నాడు, “యెహోవా అనే నేనే సమస్తాన్నీ జరిగించేవాణ్ణి. నేనొక్కడినే ఆకాశాలను విశాలపరచాను. నేనే భూమిని చక్కబరచిన వాణ్ణి.
25 Wniwecz obracam znamiona praktykarzów, i wieszczków do szaleństwa przywodzę; i mędrców na wstecz obracam, a umiejętność ich głupią czynię.
౨౫నేనే ప్రగల్భాలు పలికేవారి ప్రవచనాలను వ్యర్ధం చేసేవాణ్ణి. సోదె చెప్పేవాళ్ళను వెర్రివాళ్ళుగా, జ్ఞానులను వెనక్కి మళ్ళించి వారి తెలివిని బుద్ధిహీనతగా చేసేవాణ్ణి నేనే.
26 Potwierdzam słowa sługi swego, a radę posłów swych wykonywam. Który mówię o Jeruzalemie: Mieszkać w niem będę; a o miastach Judzkich: Pobudowane będą; bo spustoszenia ich pobuduję;
౨౬నా సేవకుని మాటలను స్థిరపరిచే వాణ్ణీ, నా సందేశకుల ఆలోచనలు నెరవేర్చే వాణ్ణీ నేనే. యెరూషలేములో ప్రజలు నివసిస్తారనీ యూదా పట్టణాలను తిరిగి కడతారనీ నేను ఆజ్ఞాపించాను. దాని పాడైన స్థలాలను బాగు చేసేవాణ్ణి నేనే.
27 Który mówię głębinie: Wyschnij, Ja potoki twe wysuszę;
౨౭నీ లోతైన సముద్రాలను ‘ఎండిపో’ అని చెప్పి వాటిని ఇంకిపోయేలా చేసేది నేనే.
28 Który mówię o Cyrusie: On pasterz mój, bo wszystkę wolę moję wykona; i rzecze Jeruzalemowi: Będziesz zbudowane; a kościołowi: Będziesz założony.
౨౮కోరెషుతో, ‘నా మందకాపరీ, నా ఇష్టాన్ని నెరవేర్చేవాడా’ అని చెప్పేవాణ్ణి నేనే. అతడు ‘యెరూషలేమును తిరిగి కట్టండి’ అనీ ‘దేవాలయం పునాది వేయండి’ అనీ ఆజ్ఞాపిస్తాడని నేను చెబుతున్నాను.”