< Rodzaju 25 >
1 Potem Abraham pojął drugą żonę, której imię było Ketura.
౧అబ్రాహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా.
2 Która mu urodziła Zamrama, i Joksana, i Madana, i Midyjana, i Jesobaka, i Suacha.
౨ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు అనేవాళ్ళు పుట్టారు.
3 A Joksan spłodził Sabę, i Dedana; a synowie Dedanowi byli Asurymowie i Letusymowie, i Leumymowie.
౩యొక్షాను షేబ, దెదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లెతూషీయులు, లెయుమీయులు అనే జాతులు ఈ దెదాను సంతానమే.
4 Synowie zaś Midyjanowi byli Hefa, i Hefer, i Henoch, i Abyda, i Eldaa; wszyscy ci byli synowie Ketury.
౪మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా అనేవాళ్ళు.
5 I dał Abraham wszystko, co miał, Izaakowi.
౫వీళ్ళందరూ కెతురా సంతానం. అబ్రాహాము తన సంపదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు.
6 A synom założnic, które miał Abraham, dał upominki; i wyprawił je od Izaaka syna swego, jeszcze za żywota swego, ku wschodowi do krainy wschodniej.
౬అబ్రాహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపి వేశాడు.
7 Teć są dni lat żywota Abrahamowego, które przeżył, sto i siedemdziesiąt, i pięć lat.
౭అబ్రాహాము మొత్తం నూట డెబ్భై ఐదు సంవత్సరాలు జీవించాడు.
8 I ustawając umarł Abraham w starości dobrej, zeszły w leciech, i syty dni; i przyłączon jest do ludu swego.
౮అబ్రాహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు.
9 I pogrzebli go Izaak i Ismael, synowie jego, w jaskini Machpela, na polu Efrona, syna Socharowego, Hetejczyka, które było przeciwko Mamre;
౯అతని కొడుకులు ఇస్సాకూ, ఇష్మాయేలూ కలసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతణ్ణి పాతి పెట్టారు. అది హిత్తీయుడైన సోహరు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది.
10 Na polu, które był kupił Abraham u synów Hetowych; tam pogrzebiony jest Abraham, i Sara, żona jego.
౧౦అబ్రాహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రాహామునూ అతని భార్య శారానూ పాతిపెట్టారు.
11 A po śmierci Abrahamowej błogosławił Bóg Izaakowi, synowi jego, a Izaak mieszkał u studni Żywiącego i Widzącego mię.
౧౧అబ్రాహాము చనిపోయిన తరువాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బెయేర్ లహాయి రోయి దగ్గర నివాసమున్నాడు.
12 A teć są rodzaje Ismaela, syna Abrahamowego, którego urodziła Hagar, Egipczanka, służebnica Sary, Abrahamowi.
౧౨ఐగుప్తీయురాలూ శారా దాసీ అయిన హాగరు ద్వారా అబ్రాహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది.
13 I te są imiona synów Ismaelowych w nazwiskach ich, według rodzajów ich: pierworodny Ismaelów, Nebajot; po nim Kedar, i Abdeel, i Mabsan.
౧౩ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నేబాయోతూ, కేదారు, అద్బయేలూ, మిబ్శామూ,
14 I Masma, i Duma, i Masa.
౧౪మిష్మా, దూమానమశ్శా,
15 Hadar, i Tema, Jetur, Nafis i Kedma.
౧౫హదరూ, తేమా, యెతూరూ, నాపీషూ, కెదెమా.
16 Ci są synowie Ismaelowi, i te imiona ich, według miasteczek ich, i zamków ich, dwanaście książąt w familijach ich.
౧౬ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి వారి గ్రామాల ప్రకారమూ, కోటల ప్రకారమూ వంశావళుల ప్రకారమూ వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం పన్నెండు మంది రాజులు.
17 A było lat żywota Ismaelowego, sto lat, i trzydzieści lat i siedem lat, i zszedł a umarł, i przyłączon jest do ludu swego.
౧౭ఇష్మాయేలు నూట ముప్ఫై ఏడు సంవత్సరాలు జీవించాడు. ఆ తరువాత అతడు ప్రాణం విడిచాడు. తన పితరులను చేరుకున్నాడు.
18 I mieszkali od Hewila aż do Sur, która leży na przeciwko Egiptowi, idąc do Asyryi; przed obliczem wszystkich braci swych umarł.
౧౮వీళ్ళు అష్షూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకూ నివసిస్తుండే వాళ్ళు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు.
19 Te zaś są rodzaje Izaaka syna Abrahamowego: Abraham spłodził Izaaka.
౧౯అబ్రాహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రాహాము ఇస్సాకుకు తండ్రి.
20 A Izaak miał czterdzieści lat, gdy sobie pojął Rebekę, córkę Batuela Syryjczyka, z krainy Syryjskiej, siostrę Labana, Syryjczyka, za żonę.
౨౦ఇస్సాకు పద్దనరాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురూ సిరియావాడైన లాబాను సోదరీ అయిన రిబ్కాను పెళ్ళి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు నలభై సంవత్సరాలు.
21 Tedy się modlił Izaak Panu za żonę swą, iż była niepłodna; i wysłuchał go Pan, i poczęła Rebeka, żona jego.
౨౧ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది.
22 A gdy się dziatki trącały w żywocie jej, rzekła: Jeźliż tak miało być, dlaczegożem poczęła? Szła tedy, aby się pytała Pana.
౨౨ఆమె గర్భంలో ఇద్దరు పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె “నాకెందుకిలా జరుగుతోంది. ఇలా అయితే నేను బతకడం ఎందుకు?” అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది.
23 I rzekł jej Pan: dwa narody są w żywocie twoim, i dwojaki lud z żywota twego rozdzieli się, a jeden lud nad drugi lud możniejszy będzie, i większy będzie służył mniejszemu.
౨౩అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు. “రెండు జాతులు నీ గర్భంలో ఉన్నాయి. రెండు గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు.”
24 A gdy się wypełniły dni jej, aby porodziła, oto bliźnięta były w żywocie jej.
౨౪ఆమెకు నెలలు నిండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు.
25 I wyszedł pierwszy syn lisowaty, i wszystek jako szata kosmaty; i nazwali imię jego Ezaw.
౨౫మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏశావు అనే పేరు పెట్టారు.
26 A potem wyszedł brat jego, ręką swą trzymając za piętę, Ezawa i nazwano imię jego Jakób; a Izaakowi było sześćdziesiąt lat, gdy mu się oni narodzili.
౨౬తరువాత అతని తమ్ముడు బయటకు వచ్చాడు. ఇతడు ఏశావు మడిమను చేత్తో పట్టుకుని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు అరవై ఏళ్ళు.
27 A gdy urosły one dzieci, Ezaw był mężem w myślistwie biegłym i rolnikiem, a Jakób był mąż prosty mieszkający w namieciech.
౨౭ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు. గుడారంలోనే ఉండేవాడు.
28 I miłował Izaak Ezawa, iż jadał z łowu jego; Rebeka zaś miłowała Jakóba.
౨౮ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం.
29 I uwarzył sobie Jakób potrawę, a na ten czas przyszedł Ezaw z pola spracowany.
౨౯యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు.
30 Tedy rzekł Ezaw do Jakóba: Daj mi jeść, proszę cię z tej czerwonej potrawy, bom się spracował: a przetoż nazwano imię jego Edom.
౩౦ఏశావు యాకోబును “దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినడానికివ్వు. నేను చాలా అలసి పోయాను” అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది.
31 Któremu rzekł Jakób: Przedajże mi dziś pierworodztwo twoje.
౩౧అందుకు యాకోబు “ముందు పెద్దవాడుగా నీ జన్మ హక్కుని నాకు ఇచ్చెయ్యి” అన్నాడు.
32 I rzekł Ezaw: Otom ja bliski śmierci, cóż mi po pierworodztwie?
౩౨అప్పుడు ఏశావు “చూడు, నేను ఆకలితో చావబోతున్నాను. ఈ జన్మహక్కు నాకెందుకు?” అన్నాడు.
33 I rzekł Jakób: Przysiążże mi dziś, i przysiągł mu. I sprzedał pierworodztwo swoje Jakóbowi.
౩౩యాకోబు “ముందు ప్రమాణం చెయ్యి” అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మి వేశాడు.
34 Tedy Jakób dał Ezawowi chleba, i potrawę z soczewicy, a on jadł i pił, a potem powstawszy odszedł; i pogardził Ezaw pierworodztwem swojem.
౩౪యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడు కాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టే, కూరా తిని, తాగి అక్కడ నుండి తన దారిన వెళ్లి పోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.