< Ezechiela 14 >

1 Potem przyszedłszy do mnie mężowie z starszych Izraelskich, usiedli przedemną.
తరువాత ఇశ్రాయేలు ప్రజల పెద్దల్లో కొందరు నా దగ్గరకి వచ్చి నా ఎదుట కూర్చున్నారు.
2 I stało sie słowo Pańskie do mnie, mówiąc:
యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
3 Synu człowieczy! ci mężowie złożyli plugawe bałwany swoje do serca swego, a nieprawość, która im jest ku obrażeniu. położyli przed twarzą swoją; mniemaszże, iż mię uprzejmie pytają o radę?
“నరపుత్రుడా, ఈ మనుషులు విగ్రహాలను తమ హృదయాల్లో ప్రతిష్టించుకున్నారు. తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్నారు. వీళ్ళని నా దగ్గర విచారణ చేయనియ్యాలా?
4 Dlategoż powiedz im, i mów do nich: Tak mówi panujący Pan: Ktokolwiek z domu Izraelsiego położył plugawe bałwany swoje w sercu swojem, a nieprawość, która mu jest ku obrażeniu, położył przed twarzą swoją, a przyszedłby do proroka, Ja Pan odpowiem temu, który przyjdzie, o mnóstwie plugawych bałwanów jego.
కాబట్టి నువ్వు ప్రకటన చేసి వాళ్లకి ఈ సంగతి చెప్పు. కాబట్టి నీవు వాళ్లకి సంగతి తెలియజేసి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్లో విగ్రహాలను హృదయంలో ప్రతిష్టించుకున్న వారెవరైనా, లేదా తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకున్న ఎవరైనా, ఆ తరువాత ప్రవక్త దగ్గరికి వస్తే యెహోవానైన నేను వాడు పెట్టుకున్న విగ్రహాల సంఖ్యను బట్టి వాడికి జవాబిస్తాను.
5 Abym ułapał dom Izraelski w sercu ich, że się odwrócili odemnie od plugawych bałwanów swoich wszyscy zgoła.
వాళ్ళు పెట్టుకున్న విగ్రహాల కారణంగా నాకు దూరమయ్యారు కాబట్టి తిరిగి వాళ్ళ హృదయాలను వశం చేసుకోడానికి నేనలా చేస్తాను.
6 Przetoż rzecz do domu Izraelskiego: Tak mówi panujący Pan: Nawróćcie się, a cofnijcie się od plugawych bałwanów waszych, i od wszystkich obrzydliwości waszych odwróćcie twarz swoję.
కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఈ మాట చెప్పు. ‘పశ్చాత్తాప పడండి. విగ్రహాలను విడిచిపెట్టండి. మీరు చేస్తున్న అసహ్యమైన పనులు మాని వేయండి.’
7 Bo ktobykolwiek z domu Izraelskiego i z przychodniów, którzy mieszkają w Izraelu, odwrócił się od naśladowania mnie, a położyłby plugawe bałwany swoje w sercu swem, i nieprawość, która mu jest ku obrażeniu, położyłby przed twarz swoją, i przyszedł by do proroka, aby mię przezeń pytał, Ja Pan odpowiem mu sam przez się,
ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా, వాళ్ళ మధ్య నివసించే విదేశీయుల్లో ఎవరైనా నన్ను విడిచి తమ హృదయాల్లో విగ్రహాలను ప్రతిష్టించుకుని, తమకు అడ్డుబండగా తమ అతిక్రమాలను నిలుపుకుని ప్రవక్త దగ్గరికి వస్తే నేనే సూటిగా వాళ్ళకి జవాబిస్తాను.
8 I postawię oblicze moje przeciw temu mężowi, i dam go na znak, i na przysłowie, a wytracę go z pośrodku ludu mojego; i dowiecie się, żem Ja Pan.
అలాంటి వ్యక్తికి నేను విరోధంగా ఉండి అతణ్ణి సూచనగానో, సామెతగానో మారుస్తాను. ఎందుకంటే నేను అతణ్ణి నా ప్రజల్లో నుండి కొట్టివేస్తాను. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
9 A gdyby się prorok dał zwieść, aby mówił słowo, Ja Pan zwiodłem proroka onego, i wyciągnę nań rękę swoję, i wygładzę go z pośrodku ludu mego Izraelskiego.
ఒకవేళ ఎవరన్నా ఒక ప్రవక్త మోసపోయి ఒక సందేశం పలికితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి విరోధంగా నా చెయ్యి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలు నుండి అతణ్ణి నాశనం చేస్తాను.
10 I tak poniosą nieprawość swoję; jaka jest kaźń na tego, któryby się pytał, taka też kaźń na proroka będzie,
౧౦ఇశ్రాయేలు ప్రజలు తమ అతిక్రమాల్లో కొనసాగుతారు. ఎందుకంటే ప్రవక్త దోషం ఎంతో అతడి దగ్గర ఆలోచన కోసం వచ్చేవాడిదీ అంతే దోషం అవుతుంది.
11 Aby więcej nie błądził dom Izraelski odemnie, a nie mazali się więcej żadnemi przestępstwami swojemi, aby byli ludem moim, a Ja abym był Bogiem ich, mówi panujący Pan.
౧౧దీని కారణంగా ఇశ్రాయేలు ప్రజలు ఇక మీదట నాకు దూరంగా వెళ్ళరు. తమ అతిక్రమాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వాళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను వాళ్ళ దేవుడినై ఉంటాను.” ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
12 Znowu stało się słowo Pańskie do mnie, mówiąc:
౧౨యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
13 Synu człowieczy! gdyby ziemia zgrzeszyła przeciwko mnie, dopuszczając się przestępstwa, tedy jeźlibym wyciągnął rękę moję na nią, a złamałbym jej łaskę chleba, i posłałbym na nią głód, i wytraciłbym z niej ludzi i zwierzęta;
౧౩“నరపుత్రుడా, ఒక దేశం నాకు విరోధంగా పాపం చేసినప్పుడు నేను దాన్ని శిక్షించడానికి నా హస్తం చాపి దాని ఆహార వనరులను నాశనం చేసి, దానిపై కరువు పంపి, దేశంలో మనుషులనూ పశువులనూ నిర్మూలం చేస్తాను.
14 Choćby byli w pośrodku niej ci trzej mężowie, Noe, Danijel i Ijob, oni w sprawiedliwości swojej wybawiliby dusze swe, mówi panujący Pan.
౧౪అప్పుడు ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు-ఈ ముగ్గురూ ఉన్నప్పటికీ వాళ్ళు తమ నీతి చేత తమను తాము మాత్రమే రక్షించుకోగలుగుతారు. ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన ఇది.
15 Także jeźlibym zły zwierz przepuścił na ziemię, a osierociłby ją, i byłaby spustoszona, żeby jej nikt przechodzić nie mógł dla zwierza,
౧౫బాటసారులెవ్వరూ దానిగుండా ప్రయాణం చేయలేకుండా దేశాన్ని బంజరుగానూ నిర్జనం గానూ చేయడానికి అడవి మృగాలను నేను రప్పిస్తే
16 Jako żyję Ja, mówi panujący Pan, że choćby ci trzej mężowie byli w pośrodku jej, żadną miarąby nie wybawili synów ani córek: oniby tylko sami wybawieni byli, leczby ziemia spustoszona była.
౧౬నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులనూ కూతుళ్ళనూ కూడా రక్షించుకోలేరు. వాళ్ళ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. దేశం వ్యర్ధమై పోతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
17 Albo jeźlibym przywiódł miecz na tę ziemię, a rzekłbym mieczowi: Przejdź przez tę ziemię, abym wytracił z niej ludzi i zwierzęta,
౧౭నేను దేశానికి విరోధంగా ఖడ్గాన్ని పంపి ‘ఖడ్గమా, దేశమంతా సంచరించి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చెయ్యి’ అని ఆజ్ఞ ఇస్తే
18 Jako żyję Ja, mówi panujący Pan, że choćby ci trzej mężowie byli w pośrodku jej, żadną miarąby nie wybawili synów ani córek, aleby oni tylko sami byli wybawieni.
౧౮నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.
19 Albo posłałlibym mór na tę ziemię, i wylałbym popędliwość swoję na nią ku wytraceniu, aby z niej ludzie i zwierzęta byli wytraceni.
౧౯రక్తపాతం జరిగించడం ద్వారా నేను నా క్రోధాన్ని దేశంపై కుమ్మరించడానికి తెగులు పంపి మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయాలని చూస్తే
20 Że choćby Noe, Danijel i Ijob byli w pośrodku jej, jako żyję Ja, mówi panujący Pan, żadną miarąby ani syna ani córki nie wybawili, oniby tylko w sprawiedliwości swojej wybawili dusze swe.
౨౦అప్పుడు నోవహు, దానియేలు, యోబు అనే ఆ ముగ్గురూ అక్కడే ఉన్నా నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. వాళ్ళు తమ నీతి వల్ల తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు.
21 Owszem, tak mówi panujący Pan: Choćbym cztery kaźni moje ciężkie, miecz, i głód, i zły zwierz, i mór posłał na Jeruzalem, abym wytracił z niego ludzi i zwierzęta,
౨౧ఎందుకంటే ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. యెరూషలేముకు విరోధంగా దానిలోని మనుషులనూ, పశువులనూ నిర్మూలం చేయడానికి నేను కరువు, ఖడ్గం, క్రూర మృగాలు, తెగులు అనే నాలుగు శిక్షలను కచ్చితంగా పంపుతాను. మరింత గడ్డు పరిస్థితి కలిగిస్తాను.
22 A oto jeźliby zostali w nim, którzyby tego uszli, a wywiedzeni byli synowie albo córki, oto i oni muszą iść do was; i oglądacie drogę ich, i sprawy ich, i ucieszycie się nad tem złem, które przywiodę na Jeruzalem, nad wszystkiem, co przywiodę na nie.
౨౨అయినా, వినండి! తమ కొడుకులతో కూతుళ్ళతో బయటకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ విధంగా దానిలో కొంత ‘శేషం’ మిగిలిపోతుంది. చూడండి! వాళ్ళ కొడుకులూ కూతుళ్ళూ తిరిగి నీ దగ్గరికి వస్తారు. నువ్వు వాళ్ళ ప్రవర్తననూ, పనులనూ చూస్తావు. అప్పుడు యెరూషలేముకు వ్యతిరేకంగా నేను పంపిన శిక్షల విషయంలోనూ, దేశానికి విరోధంగా నేను పంపిన వాటన్నిటి విషయంలోనూ నీకు ఆదరణ కలుగుతుంది.
23 A tak ucieszą was, gdy ujrzycie drogę ich i sprawy ich; i zrozumiecie, żem to wszystko nie darmo uczynił, com uczynił w nim, mówi panujący Pan.
౨౩మిగిలి ఉన్న వాళ్ళ ప్రవర్తన, పనులు చూసినప్పుడు నీకు ఆదరణ కలుగుతుంది. వాళ్ళు నిన్ను ఆదరిస్తారు. నేను ఆమెకి వ్యతిరేకంగా చేసినదేదీ నిష్కారణంగా చేయలేదని మీరు తెలుసుకుంటారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”

< Ezechiela 14 >