< Dzieje 12 >
1 A pod onże czas, udał się na to Herod król, aby trapił niektóre ze zboru.
౧ఆ కాలంలో హేరోదు రాజు విశ్వాస సమాజంలోని కొంతమందిని హింసించడం కోసం పట్టుకున్నాడు.
2 I zabił Jakóba, brata Janowego, mieczem.
౨యోహాను సోదరుడైన యాకోబును కత్తితో చంపించాడు.
3 A widząc, że się to podobało Żydom, umyślił pojmać i Piotra: (a były dni przaśników).
౩ఇది యూదులకు ఇష్టంగా ఉండడం చూసి, పేతురును కూడా బంధించాడు. అవి పొంగని రొట్టెల పండగ రోజులు.
4 Którego pojmawszy, podał do więzienia, poruczywszy go szesnastu żołnierzom, aby go strzegli, chcąc go po wielkanocy wywieść ludowi.
౪అతనిని బంధించి చెరసాలలో వేసి, పస్కా పండగైన తరువాత ప్రజల ఎదుటికి అతనిని తీసుకురావాలని ఉద్దేశించి, అతనికి కాపలాగా జట్టుకు నలుగురు చొప్పున నాలుగు సైనిక దళాలను నియమించాడు.
5 Tedy strzeżono Piotra w więzieniu, a modlitwa ustawiczna działa się od zboru do Boga za nim.
౫పేతురును చెరసాలలో ఉంచారు, అయితే సంఘం అతని కోసం తీవ్రమైన ఆసక్తితో దేవునికి ప్రార్థన చేశారు.
6 A gdy go już miał wywieść Herod, onejże nocy spał Piotr między dwoma żołnierzami, związany dwoma łańcuchami, a stróże przed drzwiami strzegli więzienia.
౬హేరోదు అతనిని విచారణకు తీసుకుని రావాలని అనుకుంటూ ఉండగా, ఆ రాత్రి పేతురు రెండు సంకెళ్ల బంధకాల్లో ఇద్దరు సైనికుల మధ్య నిద్రపోతూ ఉన్నాడు. కాపలా వారు చెరసాల తలుపు ముందు కావలి కాస్తున్నారు.
7 A oto Anioł Pański przystąpił, a światłość się rozświeciła w gmachu; a trąciwszy w bok Piotra, obudził go, mówiąc: Wstań rychło! I opadły łańcuchy z rąk jego.
౭ఇదుగో, అకస్మాత్తుగా ప్రభువు దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. దూత పేతురును తట్టి, త్వరగా లెమ్మని చెప్పాడు. అప్పుడు అతని చేతుల నుంచి సంకెళ్ళు ఊడి పడ్డాయి.
8 I rzekł Anioł do niego: Opasz się, a powiąż obuwie twoje. I uczynił tak. I rzekł mu: Odziej się w płaszcz twój, a pójdź za mną.
౮దూత అతనితో, “నీ నడుం కట్టుకుని, చెప్పులు తోడుక్కో” అని చెప్పాడు. పేతురు అలానే చేశాడు. ఆ పైన, “పై బట్ట వేసుకుని నాతో రా” అన్నాడు.
9 Tedy wyszedłszy Piotr, szedł za nim, a nie wiedział, że się to działo po prawdzie, co się działo przez Anioła; lecz mniemał, że widzenie widział.
౯అతడు బయటికి వచ్చి దూత వెంట వెళ్ళి, దూత వలన జరిగింది వాస్తవమేనని తెలియక, తాను దర్శనం చూస్తున్నానేమో అనుకున్నాడు.
10 A gdy minęli pierwszą i wtórą straż, przyszli do bramy żelaznej, która wiedzie do miasta; a ta się im sama przez się otworzyła. A wyszedłszy, przeszli jednę ulicę, a zarazem odstąpił Anioł od niego.
౧౦మొదటి కావలినీ రెండవ కావలినీ దాటి పట్టణంలోకి వెళ్ళే ఇనుప తలుపు దగ్గరికి వచ్చినప్పుడు అది దానంతట అదే తెరుచుకుంది. వారు బయటికి వెళ్ళి ఒక వీధి దాటిన తరువాత దూత అతని దగ్గర నుండి వెళ్ళిపోయాడు.
11 Tedy Piotr przyszedłszy do siebie rzekł: Teraz znam prawdziwie, iż posłał Pan Anioła swego i wyrwał mię z ręki Herodowej i ze wszystkiego oczekiwania ludu żydowskiego.
౧౧పేతురు తెలివి తెచ్చుకుని, “ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి, యూదులు తలపెట్టిన వాటన్నిటి నుండీ నన్ను తప్పించాడని ఇప్పుడు నాకు నిజంగా తెలిసింది” అనుకున్నాడు.
12 A obaczywszy się, przyszedł do domu Maryi, matki Janowej, którego nazywano Markiem, gdzie się ich było wiele zgromadziło i modlili się.
౧౨దీన్ని గ్రహించిన తరువాత అతడు మార్కు అనే పేరున్న యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. చాలామంది విశ్వాసులు అక్కడ చేరి ప్రార్థన చేస్తున్నారు.
13 A gdy Piotr kołatał we drzwi u przysionka, wyszła dzieweczka, imieniem Rode, aby posłuchała:
౧౩అతడు తలుపు తట్టినప్పుడు, రొదే అనే ఒక పని పిల్ల తలుపు తీయడానికి వచ్చింది.
14 A poznawszy głos Piotrowy, od radości nie otworzyła drzwi, ale wbieżawszy oznajmiła, iż Piotr stoi u drzwi.
౧౪ఆమె పేతురు గొంతు గుర్తుపట్టి, సంతోషంలో తలుపు తీయకుండానే లోపలికి పరుగెత్తుకు పోయి, పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపింది.
15 A oni rzekli do niej: Szalejesz! Wszakże ona twierdziła, iż się tak rzecz ma. A oni rzekli: Anioł jego jest.
౧౫అందుకు వారు ఆమెను “నువ్వు పిచ్చిదానివి” అన్నారు. అయితే తాను చెప్పింది ముమ్మాటికీ నిజమని ఆమె చెప్పినప్పుడు వారు, “అతని దూత అయి ఉండవచ్చు” అన్నారు.
16 Ale Piotr nie przestał kołatać; a gdy otworzyli, ujrzeli go i zdumieli się.
౧౬పేతురు ఇంకా తలుపు కొడుతూ ఉంటే వారు తలుపు తీసి చూసి ఆశ్చర్యపోయారు.
17 A skinąwszy na nie ręką, aby umilknęli, rozpowiedział im, jako go Pan wywiódł z więzienia i rzekł: Oznajmijcie to Jakóbowi i braciom. A wyszedłszy, szedł na inne miejsce.
౧౭అతడు నెమ్మదిగా ఉండమని వారికి చేతితో సైగ చేసి, ప్రభువు తనను చెరసాల నుండి ఎలా బయటికి తెచ్చాడో వారికి చెప్పి యాకోబుకూ సోదరులకూ ఈ విషయాలు తెలియజేయమని చెప్పి బయలుదేరి వేరొక చోటికి వెళ్ళాడు.
18 A gdy był dzień, stał się rozruch niemały między żołnierzami o to, co by się z Piotrem stało.
౧౮తెల్లవారగానే పేతురు ఏమయ్యాడో అని సైనికులు ఎంతో గాభరాపడ్డారు.
19 Lecz Herod, gdy się o nim wywiadywał, a nie znalazł go, uczyniwszy sąd o stróżach, kazał je na stracenie wywieść; a wyjechawszy z Judzkiej ziemi do Cezaryi, mieszkał tam.
౧౯హేరోదు అతని కోసం వెతికి కనబడక పోయేసరికి కావలి వారిని ప్రశ్నించి వారికి మరణ శిక్ష విధించాడు. ఆ తరువాత హేరోదు యూదయ నుండి కైసరయ వెళ్ళి అక్కడ నివసించాడు.
20 A natenczas Herod myślił o wojnie przeciwko Tyryjczykom i Sydończykom; ale oni jednomyślnie przyszli do niego, a namówiwszy Blasta, podkomorzego królewskiego, prosili o pokój, dlatego iż kraina ich miała żywność z dzierżawy królewskiej.
౨౦అప్పట్లో తూరు, సీదోను వాసులపై హేరోదుకు చాలా కోపం వచ్చింది. వారంతా కలిసి, రాజు దగ్గరకి వెళ్ళారు. రాజుకు నచ్చజెప్పి సహాయం చేయాలని వారు రాజభవన పర్యవేక్షకుడైన బ్లాస్తును వేడుకున్నారు. ఎందుకంటే రాజు దేశం నుండి వారి దేశానికి ఆహారం వస్తూ ఉంది.
21 A dnia pewnego Herod oblekłszy się w szatę królewską i siadłszy na stolicy, uczynił rzecz do nich.
౨౧నిర్ణయించిన ఒక రోజు హేరోదు రాజవస్త్రాలు ధరించి సింహాసనం మీద కూర్చుని వారికి ఉపన్యాసమిచ్చాడు.
22 A lud wołał: Głos Boży a nie człowieczy.
౨౨ప్రజలు, “ఇది దేవుని స్వరమే గానీ మానవునిది కాదు” అని పెద్దగా కేకలు వేశారు.
23 A zarazem uderzył go Anioł Pański, przeto, że nie dał chwały Bogu, a będąc roztoczony od robactwa, zdechł.
౨౩అయితే అతడు దేవునికి మహిమను ఆపాదించనందుకు వెంటనే ప్రభువు దూత అతనిని ఘోర వ్యాధికి గురిచేశాడు. అతడు పురుగులు పడి చచ్చాడు.
24 A słowo Pańskie rozrastało się i rozmnażało.
౨౪దేవుని వాక్కు అంతకంతకూ వ్యాపించింది.
25 A Barnabasz i Saul wrócili się z Jeruzalemu, wykonawszy posługę, wziąwszy z sobą Jana, którego nazywano Markiem.
౨౫బర్నబా, సౌలు యెరూషలేములో తమ సేవ నెరవేర్చిన తరువాత మార్కు అనే పేరున్న యోహానును వెంటబెట్టుకుని తిరిగి వచ్చారు.